ది ఇండియా స్టోరీ (The India Story Teaser)
The India Story Teaser : కార్పొరేట్ కంపెనీలపై హరిత విప్లవం... అడ్వకేట్ గా అర్చనగా కాజల్ పోరాటం...
Available in:
About This Movie
టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ గేర్ లో చక్రం తిప్పిన స్టార్ హీరొయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Agarwal). అయితే పెళ్లి తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈమె మూడేళ్ళ కిందట భగవంత్ కేసరితో రీ ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అని అందుకోగా, ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయలేకపోయింది. లాస్ట్ ఇయర్ సత్యభామ మూవీతో ప్లాప్ అందుకోగా, ఇప్పుడు మళ్ళీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అయింది. చేతన్ డీకే (Chettan DK) దర్శకత్వం వహించిన "ది ఇండియా స్టోరీ" (The India Story) అనే మూవీలో కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ లో నటించగా, తాజాగా మేకర్స్ టీజర్ విడుదల చేసారు.
ఇక హిందీలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగులోనూ విడుదల కానుండగా, సోషల్ మీడియాలో ది ఇండియా స్టోరీ టీజర్ కి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. కాజల్, బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే (Shreyas Tapladey) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీలో కాజల్ ఒక అడ్వకేట్ గా కనిపించనుండడం విశేషం. టీజర్ ని గమనిస్తే... ఇండియాలో పంట పొలాల్లో వాడే కెమికల్స్ వల్ల, ఆ పంటతో వచ్చిన ఆహారం తినడం వల్ల, జరిగే నష్టాలకు, ప్రజలు చేసే హరిత విప్లవం నేపథ్యంలో కోర్ట్ రూమ్ డ్రామాగా సినిమా ఉండనుందని తెలుస్తుంది. ఇక ఈ మూవీలో అడ్వకేట్ అర్చనగా కనిపించబోతున్న కాజల్. ఈ కేసును కోర్టులో వాదించే అర్చన మరియు ఆమె పోరాటాన్ని అడ్డుకున్న రైతులు, వ్యాపారస్తుల్లో ఎవరు గెలిచారు? చివరకు సినిమాలో ఆ కెమికల్ కలిసిన ఫుడ్ తినడం వల్ల చనిపోయిన పాప కుటుంబానికి న్యాయం జరిగిందా లేదా అనేదే సినిమా కథ.
ఇక ఏ మధ్య కాలంలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్, అలాగే డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీస్ కి ఆదరణ పెరిగిన నేపథ్యంలో ఈ ది ఇండియా స్టోరీ మూవీ ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుందని కాన్ఫిడెన్స్ లో ఉన్నారు మేకర్స్. ఇక ఈ సినిమా మనసుని కదిలించే భావోద్వేగాలతో పాటు, సామాజిక బాధ్యతను ప్రతిబింబించే కథతో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక చేతన్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ది ఇండియా స్టోరీ జులై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.