సత్యవాన్ సావిత్రి (Sathyavan Savithiri)
Sathyavan Savithiri : లేడీ వకీల్ సాబ్ గా 'మహానటి'.. మరి నవ్విస్తూ మెప్పిస్తుందా..? త్వరలో వచ్చేస్తుంది..!
About This Movie
టాలీవుడ్ లో మహానటిగా పాపులర్ అయిన కీర్తి సురేష్ వరుస సినిమాలతో బిజీ అయింది. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేకపోయినా, సినిమాల పరంగా పెళ్లి తర్వాత కూడా బిజీగానే ఉంది. ఈ ఇయర్ డోరతీ సినిమా ద్వారా డీసెంట్ సక్సెస్ ను అందుకోగా, లేటెస్ట్ గా "అక్క" వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ని పలకరించింది. ఈ సిరీస్ ఓటిటి లో మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. ఇక తాజాగా కీర్తి సురేష్ ఈసారి లాయర్ గా ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అవుతుంది. వివరాల్లోకి వెళితే కీర్తి సురేష్ మరియు మైస్కిన్ ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ మూవీ "సత్యవాన్ సావిత్రి". ప్రవీణ్ ఎస్. విజయ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ టీజర్ ను లేటెస్ట్ గా విడుదల చేయగా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.
ఇక విడుదలైన టీజర్ ని గమనిస్తే... ఇదొక సందేశంతో కూడిన వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కెరీర్ లో ఏదైనా సాధించాలన్న కల ఉన్న అమ్మాయిగా, ఒక లాయర్ గా కీర్తి సురేష్ కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. టీజర్ లో ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా చూపించారు. అలాగే హీరోయిన్ పర్సనల్ లైఫ్ లో కెరీర్ గురించి ఎదుర్కుంటున్న ఇబ్బందులను, ఆమె వైవాహిక జీవితం చుట్టూ అల్లుకున్న సంక్లిష్టతలను టీజర్ లో ఎక్కువగా చూపించారు. మరి సినిమాలో కీర్తిని లేడీ వకీల్ సాబ్ గా పవర్ ఫుల్ గా చూపిస్తారా? లేక ఎంటర్టైనింగ్ వే లో చిన్న మెసేజ్ ఇస్తారా చూడాలి.
ఇక ఈ సినిమాలో చారుకేష్, బాల శరవణన్, శిల్పా మంజునాథ్, దీపా శంకర్, మధుసూదనన్, ఆర్. సుందరరాజన్, మాలా పార్వతి కీ రోల్స్ లో నటిస్తున్నారు. వేదిక్కరన్‌పట్టి ఎస్. శక్తివేల్ నిర్మించిన ఈ సినిమాకి సామ్ సిఎస్ సంగీతం అందించగా, ఈ సినిమాను నవంబర్ 20 2026 న థియేటర్లలో మేకర్స్ విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమాతో కీర్తి సురేష్ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
You Might Also Like
సీన్ (SCENE)
2026
రామాయణ (Ramayana)
2026