సమవర్తి (Samavarthi)
Samavarthi : పులివేటకు బయలు దేరిన "సమవర్తి".. త్వరలోనే వచ్చేస్తున్నాడు..
Available in:
About This Movie
టాలీవుడ్ టాలెంటెడ్ ఆక్టర్స్ లో ఒకరైన "సత్యదేవ్" వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఇయర్ ఆల్రెడీ "రావు బహదూర్" మూవీతో నటుడిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన సత్యదేవ్ ఇప్పుడు మరో క్రేజీ మూవీతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "సమవర్తి" (Samavarthi). అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫారెస్ట్ నేపథ్యంలో ఒక యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కుతుంది. తాజాగా సమవర్తి సినిమాకి సంబంధించి మేకర్స్ అఫిషియల్ టీజర్ ని రిలీజ్ చేయగా, సోషల్ మీడియాలో దీనికి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.
టీజర్ ని గమనిస్తే.. అడవి నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది. మంచి యాక్షన్ సీన్స్ తో ప్రారంభమై... అడవిలో స్మగ్లింగ్, జింకలను వేటాడే పులి కథలా ఈ మూవీ స్టోరీ ఉంటుందని హీరో రోల్ ని ఇంట్రడ్యూస్ చేసారు. అడవిలో వారిని కాపాడే పవర్ ఫుల్ రోల్ మహాదేవ్ గా సత్యదేవ్ ఇందులో కనిపించబోతున్నారు. ఈ మూవీలో అడవిలో మనుషుల్ని, జంతువుల్ని చంపింది పులులేనా? లేక దాని వెనకాల ఏమైనా కుట్ర దాగి ఉందా? అనేది ఛేదించే మనిషిగా సత్యదేవ్ కనిపించబోతున్నాడు. ఇక టీజర్ లో "అడవిలో పులి 20 ఏళ్లు బలంగా జీవిస్తది. జింక ఎనిమిదేళ్లే.", "పులికి జింక కనిపిస్తది. కానీ జింకకు పులి కనిపించదు. అడవిలో పులులు తక్కువుంటాయి. జింకలు ఎక్కువుంటాయి" అంటూ టీజర్ లో ఉన్న డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఇక ఈ మూవీలో శ్రీకాంత్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ ప్లే చేస్తున్నట్టు టీజర్ ద్వారా తెలుస్తుంది. ఈ మూవీలో సత్యదేవ్ సరసన గానవి లక్ష్మణ్ హీరోయిన్ గా నటించగా, దిలీష్ పోతన్, రాజీవ్ కనకాల, రవీంద్ర విజయ్, మోహన్ భగత్ తదితరులు కీ రోల్స్ లో నటించారు. సింజిత్ యర్రమిల్లి మ్యూజిక్ అందించిన ఈ సినిమాను రుద్ర పిక్చర్స్, పంచభూత ప్రొడక్షన్స్ బ్యానర్స్ లో శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పటమట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక పాన్ ఇండియా భాషల్లో తెరెక్కుతున్న సమవర్తి సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.