Register as a Reviewer
రియాలిటి (Reality)

రియాలిటి (Reality)

Upcoming Expected Release: 25 Dec 2026

Reality : కంటెంట్ ముఖ్యం బిగిలు అంటున్న అబ్బవరం.. త్వరలో దర్శకుడిగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీతో వస్తున్నాడు..!

Director: Kiran Abbavaraam
Cast: Kiran Abbavaram, Devika Bhatt, Sharath Kumar, Sai Kumar, Ramesh Indira, Annapurnamma

Available in:

About This Movie

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకరైన కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతూ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఆల్రెడీ చెన్నై లవ్ స్టోరీతో హిట్ కొట్టిన ఈ హీరో ఈసారి దర్శకుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబుతున్నాడు. ఇక కిరణ్ అబ్బవరం ఇంతకు ముందు రచయితగా కూడా కొన్ని సినిమాలకు  పనిచేసాడు. బిగినింగ్ డేస్ లో తాను నటించిన SR కల్యాణ మండపం లాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే కూడా అందించాడు. ఇప్పుడు తాను హీరోగా నటిస్తున్న రియాలిటి (Reality) అనే సినిమాతో దర్శకుడిగా కూడా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. తాజాగా రియాలిటీ మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తూ టీజర్ రిలీజ్ చేయగా, దానికి నెట్టింట మంచి రెస్పాన్స్ లభిస్తుంది. 

 

ఇక టీజర్ ని గమనిస్తే.. టీజర్ లో "ఆనందం" పేరుతో ఒక హోటల్ ని చూపిస్తూ.. ఆ హోటల్ లో భోజనం వడ్డిస్తున్న కిరణ్ అబ్బవరం స్లో మోషన్ లో కనిపిస్తాడు. చాలా క్లాస్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తూనే ఉంది. ఇక టీజర్ లో "నా జీవితంలో నా పేరు మీద ఇంట్లో వాళ్ళ పేరు మీద ఒక రూపాయి అప్పు కూడా లేదు... నా జీవితంలో ఇంతకు మించిన అచివ్మెంట్ ఏముంటుంది" అంటూ కిరణ్ అబ్బవరం చెప్పే డైలాగ్ టీజర్ కే హైలెట్ గా నిలిచింది. ఇక టైటిల్ కి తగ్గట్టే సినిమా రియాలిటీలో ఒక సగటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టసుఖాలను ఇందులో చూపించబోతున్నారని తెలుస్తుంది. 

 

ఇక దేవికా భట్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్, సాయి కుమార్, రమేష్ ఇందిరా, అన్నపూర్ణమ్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జాయ్ ఫిల్మ్స్  LLP బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను సుధాకర్ చాగంటి నిర్మిస్తుండగా, కిరణ్ అబ్బవరం డైరెక్ట్ చేస్తున్నాడు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్లాన్ లో ఉన్నారు. 

Why MRO?