రావు బహదూర్ (Rao Bahadur Trailer)
Rao Bahadur Teaser : రావు బహదూర్ గా సత్య దేవ్... ఈయన కథేంటో ఊహకు కూడా అందేట్టు లేదే!
Available in:
About This Movie
టాలీవుడ్ యంగ్ వర్సటైల్ హీరోల్లో ఒకరైన "సత్య దేవ్" (Satyadev) కొంత గ్యాప్ తర్వాత "రావు బహదూర్" గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. చేసే ప్రతి మూవీలో తన రోల్ వరకు ప్రత్యేకంగా ఎంచుకునే సత్య దేవ్ ఆ మధ్య కృష్ణమ్మ అనే మూవీలో హీరోగా నటించగా, ఆ మూవీ ప్లాప్ అయింది. ఇప్పుడు మళ్ళీ మెయిన్ లీడ్ గా రావు బహదూర్ అంటూ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.
కేరాఫ్ కంచరపాలెంతో డైరెక్టర్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ మహా (Venkatesh Maha) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాను GMB ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో చింతా గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించడం జరిగింది. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్స్ ఆకట్టుకోగా, తాజాగా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ స్టార్ట్ రావడంతోనే మహేష్ బాబు వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవుతుంది. "అనుమానం అనేది చాలా ప్రమాదకరమైనది, అది చనిపోతున్న మనిషిని కూడా బతికిస్తుంది. అదే అనుమానం మనిషి మైండ్ తో ఆడుకుంటూ ఒక వింత లోకంలోకి తీసుకెళ్తుంది" అంటూ మహేష్ బాబు సినిమా నేపథ్యాన్ని తనదైన శైలిలో వివరించాడు.
ట్రైలర్ చూసాక ఈ సినిమాలో సత్యదేవ్ ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉన్న వ్యక్తిగా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇందులో రావు బహదూర్ రామప్పగా, లివర్ క్యాన్సర్ సమస్య ఉన్న మనిషిగా కనిపించగా, అయితే అసలు రామప్పకి ఏమైంది..? అతని జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి? మధ్యలో రేణుక ఎవరు? చివరికి రావు బహదూర్ జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందో సినిమా చూసి తెలుగుకోవాలి. సినిమాలో డైలాగ్స్ కూడా ఆలోచింపచేసే విధంగా ఉంటాయని తెలుస్తుంది. బహుశా సినిమాలో రావు బహదూర్ అనే యువరాజు ఎందుకు పిచ్చివాడిలా మారాడు అనే విషయాన్నీ సెన్సిటివ్ గా చూపించబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాతో సత్య దేవ్ హీరోగా మరో మంచి సక్సెస్ అందుకుని ట్రాక్ లోకి రావడం ఖాయమని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.
ఇక దీపా థామస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వికాస్ ముప్పాల, బాల పరాశర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్ కీ రోల్స్ లో నటించారు. శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, A+S మూవీస్ మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ జులై 3న సినిమాను థియేటర్ లో విడుదల చేయబోతున్నారు మేకర్స్.