రాజా ది రాజా (Raja The Raja Teaser)
Raja The Raja : ఇదేదో జూనియర్ మగధీరలా ఉన్నట్టుందే..! మరెలా ఉంటదో...
Available in:
About This Movie
రుత్విక్ (Ruthwik), విశాఖ ధిమాన్ (Vishakha Dhiman) హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ "రాజా ది రాజా" (Raja The Raja). పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ లవ్ స్టోరీ ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. అనిల్ బోయిడపు (Anil Boyidapu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని కె.నిహారిక దాసరి (K.Niharika Dasari) ప్రొడ్యూస్ చేయగా, జూలై 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో సాయికుమార్ (Sai Kumar) ప్రత్యేక పాత్రలో నటించారు.
ట్రైలర్ ని గమనిస్తే... స్టార్టింగ్ లోనే ఒక రాచరిక సామ్రాజ్యం బ్యాక్ డ్రాప్ లో మూవీ తెరకెక్కినట్టు చూపిస్తూ... రాజా విరాట వర్మ దేవరాయగా సాయికుమార్ ని చూపిస్తారు. ఆయన కొడుకు యువరాజుగా హీరో రుత్విక్ కనిపిస్తాడు. అయితే ఆద్య అనే రాజకుమారిని యువరాజు ప్రేమిస్తే... ఆ ప్రేమ వలనే రాజ్యంలో కరువు వచ్చిందని భావించిన రాజు.. యువరాజుకు మరణ శిక్ష విధిస్తాడు. అయితే మళ్ళి పుట్టిన ఆ యువరాజు ఈ జన్మలో కూడా తన ప్రేమను దక్కించుకోవడానికి ఏం చేసాడు? ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు అనేదే సినిమా నేపథ్యం ఉండబోతుందని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది.
ఇక ట్రైలర్ ని గమనిస్తుంటే ఆల్మోస్ట్ మగధీర (Magadheera) సినిమా కాన్సెప్ట్ కి మ్యాచ్ అయ్యేలా ఉందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి రవికిరణ్ బోయిడపు సినిమాటోగ్రఫీ అందించగా, మార్క్ కె రాబిన్ మ్యూజిక్ అందించాడు. ఇక రాజా ది రాజా సినిమాను జూలై 17న వరల్డ్ వైడ్ గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.