NBK111 Glimpse
NBK111 Glimpse : బర్త్ డే గ్లింప్స్ తో ట్రీట్ ఇచ్చిన బాలయ్య.. మరోసారి బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్...
Available in:
About This Movie
నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీర సింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఇక లేటెస్ట్ గా బాలకృష్ణ బర్త్ డే సందర్బంగా ఈ సినిమాకి సంబంధించి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
NBK 111- Entry Of An Era పేరుతో రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ నెట్టింట ట్రెండ్ అవుతుంది. నిమిషంన్నర నిడివి ఉన్న ఈ వీడియో బాలయ్య ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇస్తుండగా, పూర్తిగా ఆక్షన్ సీక్వెన్స్ తో కూడిన ఈ గ్లింప్స్ లో బాలయ్య తో ఒక్క డైలాగ్ చెప్పించలేకపోయినా, సరికొత్త లుక్స్, ఆయన బాడీ లాంగ్వేజ్ అదిరిపోయాయి. ఇక ఈ మూవీలో బాలకృష్ణ రెండు షేడ్స్ ఉన్న రోల్స్ ప్లే చేస్తున్నట్టు సమాచారం. ఇక నైట్ విజన్ లో తీసిన అద్భుతమైన యాక్షన్ సీన్స్ కి తగ్గట్టు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన బీజీఎమ్ స్కోర్ సాలిడ్ గా ఉంది.
ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మంచు మనోజ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నట్టు సమాచారం. ఇక వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని ఈ ఇయర్ దసరాకి రిలీజ్ చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు.
You Might Also Like
పెద్ది (Peddi Movie)
2026
మరీచిక (Mareechika)
2026