మైసా (MYSAA)
MYSAA : "మైసా" గా నెవర్ బిఫోర్ అవతార్ లో నేషనల్ క్రష్... త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
About This Movie
టాలీవుడ్ లో నేషనల్ క్రష్ గా పాపులర్ అయిన "రష్మిక మందన్న" బడా పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తూనే ఇటు ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ లో కూడా సత్తా చాటుతుంది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ "ది గర్ల్ ఫ్రెండ్" మూవీతో సక్సెస్ కొట్టిన ఈ భామ ఇప్పుడు లీడ్ రోల్ లో మరో యాక్షన్ డ్రామాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. రష్మిక మెయిన్ లీడ్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ "మైసా". రూరల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ టీజర్ తాజాగా విడుదలై, సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.
ఇక టీజర్ ని గమనిస్తే... ఇప్పటిదాకా గ్లామరస్ అండ్ ఫీల్ గుడ్ రోల్స్ లో ఎక్కువగా కనిపించిన రష్మిక.. ఈసారి 'రా అండ్ రస్టిక్, రోల్ లో కనిపించబోతుంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో రష్మిక ఒక గిరిజన తెగకు చెందిన అమ్మాయిగా కనిపించబోతుంది. టీజర్ లో "అలసిపోయాను.. ఆగిపోయాను.. ఓడిపోయాను.." అంటూ రష్మిక చెప్పే డైలాగ్ లో ఎంతో డెప్త్ ఉన్న ఎమోషన్ కనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్స్ ని చూస్తుంటే రష్మిక ని పవర్ఫుల్ రోల్ లో మేకర్స్ ప్రెసెంట్ చేయనున్నారని తెలుస్తుంది. ఇక టీజర్ లో రావు రమేష్ డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఇక టీజర్ లో మూవీ విజువల్ పరంగా కూడా బాగుండబోతుందని తెలుస్తుంది.
ఇక 'మైసా' టీజర్ లో కథ గురించి పెద్దగా హింట్ అయితే ఇవ్వలేదు. అలాగే టీజర్ కి జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్ ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసింది. రవీంద్ర పుల్లె డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను అన్ ఫార్ములా బ్యానర్ లో అజయ్ సాయిపురెడ్డి, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోపా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను నవంబర్ 27న థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో రష్మిక పాన్ ఇండియా వైడ్ గా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.