Register as a Reviewer
మహాకాళి (MAHAKALI: Shukracharya's War Cry)

మహాకాళి (MAHAKALI: Shukracharya's War Cry)

Upcoming Expected Release: 08 Jan 2027

MAHAKALI: Shukracharya's War Cry : "హనుమాన్" సినిమాటిక్ యూనివర్స్ లో మరో ప్రపంచం ఈ "మహాకాళి". పెద్దమ్మ అన్నీ చూస్తోంది..!

Director: Puja Aparna Kolluru
Cast: Akshaye Khanna, Sriya Reddy, Bhoomi Shetty, Rohit Saraf, Khushboo Sundar, Rakesh Bedi, Samuthirakani, Rajat Kapoor, Jitin Gulati, Murali Sharma, Nassar, Babloo Prithiveeraj, Purvansh

About This Movie

MAHAKALI: Shukracharya's War Cry : 

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రెండేళ్ల కిందట తెరకెక్కించిన "హనుమాన్" ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. కేవలం 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి, మీడియం రేంజ్ చిన్న సినిమాగా విడుదలై పాన్ ఇండియా వైడ్ గా 300 కోట్ల వసూళ్లు అందుకుంది. ఈ సినిమా నుండి డైరెక్టర్ "హనుమాన్ సినిమాటిక్ యూనివర్స్" లో భాగంగా పలు అప్ కమింగ్ ప్రాజెక్ట్ లను ప్రకటించాడు. గతంలో అనౌన్స్ అయిన "అధిరా", జై "హనుమాన్" అందులో భాగమే.. కాగా ఇదే హనుమాన్ యూనివర్స్ లో పార్ట్ గా "మహాకాళి" పేరిట మరో సినిమా అనౌన్స్ కాగా... దానికి సంబంధించి లేటెస్ట్ గా టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్... 

 

"మహాకాళి : శుక్రాచార్య వార్ క్రై" (MAHAKALI: Shukracharya's War Cry) పేరుతో విడుదలైన ఈ టీజర్ యూట్యూబ్ లో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇది కూడా సూపర్ హీరో తరహాలో... "సూపర్ వుమెన్" లాగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ కాగా, ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ స్టోరీ అందిస్తుండగా, పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. హనుమాన్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఈ మహాకాళి టీజర్ కి కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది సోషల్ మీడియాలో. 

 

గతంలో సోషల్ మీడియాలో కొన్ని AI వాడుతున్నారని ట్రోల్స్ వచ్చినా.. ఇప్పుడు టీజర్ చూసాక యానానిమస్ గా  పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.  విజువల్స్ పరంగా గ్రాండియర్ గా కనిపిస్తున్న ఈ టీజర్ లో శుక్రాచార్యుడిగా బాలీవుడ్ స్టార్  అక్షయ్ ఖన్నా  నటిస్తుండగా, మహాకాళిగా శ్రీయారెడ్డి కనిపించనున్నారు. మరో కీ  రోల్స్ లో సముద్రఖని, భూమిశెట్టి, ఖుష్బూ సుందర్, నాజర్, మురళీశర్మ నటిస్తున్నారు. 

 

ఇక టీజర్ లో శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా పర్ఫెక్ట్ గా రౌద్రంతో కనిపిస్తూ థ్రిల్ చేసాడు. హనుమాన్ లో కనిపించిన విభూషణుడిగా సముద్రఖని ఈ మహాకాళి టీజర్ లోనూ  కనిపించడం విశేషం. ఇక టీజర్ ఎండ్ లో మహాకాళిగా నటి శ్రేయ రెడ్డి కనిపించిన ఆ లాస్ట్ ఫ్రేమ్ అయితే గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ సారి హనుమాన్ ని మించిన భీభత్సం ఉంటుందని టీజర్ ని చూస్తే అర్ధమైపోతుంది. అయితే ఈ సినిమాను జనవరి 8న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. మరి వచ్చే సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద హనుమాన్ నాటి మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందేమో చూడాలి. 

Why MRO?