లెనిన్ (LENIN Trailer)
Lenin Trailer : భారతంలో అభిమన్యుడు కాదు... అర్జునిడిలా లెనిన్..!
Available in:
About This Movie
అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ లెనిన్ ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి అన్ని రకాలుగా సిద్ధమయ్యాడు. ఏజెంట్ ప్లాప్ తర్వాత గ్యాప్ తీసుకున్న ఈ అక్కినేని హీరో ఇప్పుడు లెనిన్ అంటూ ఊర మాస్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. ఆ మధ్య రిలీజ్ చేసిన టీజర్స్ మంచి రెస్పాన్స్ ను అందుకోగా, లేటెస్ట్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసి మరీ లెనిన్ థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసారు మేకర్స్. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దూసుకుపోతున్న లెనిన్ ట్రైలర్ మూవీపై అంచనాలను రెట్టింపు చేస్తుంది.
మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తో అక్కినేని అఖిల్ మంచి కం బ్యాక్ హిట్ ను సొంతం చేసుకుంటాడని కామెంట్స్ వస్తున్నాయి. అదే రేంజ్ లో ట్రైలర్ కూడా ఫ్యాన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచుతుంది. ఇక ట్రైలర్ మొత్తం క్రేజీ డైలాగ్స్ తో, సూపర్ యాక్షన్ సీక్వెన్స్ తో నిండి అట్రాక్ట్ చేస్తుంది. నాగార్జున వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన ట్రైలర్ లో చూపించిన టెంపుల్ జాతర కి సంబంధించిన సీన్స్ కూడా బాగున్నాయి. ట్రైలర్ చూసి పక్కా మాస్ మూవీ అనుకున్నా, ఈ మూవీలో ప్రేమ కోసం కూడా తగినంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని తెలుస్తుంది. ఆ ప్రేమ కోసం లెనిన్ చేసే పోరాటం ఎలా ఉండబోతుందనే పాయింట్ ను దర్శకుడు చాలా గ్రిప్పింగ్ గా చూపించబోతునట్లు ట్రైలర్ తో తెలుస్తుంది. ఇక ట్రైలర్ లో మహాభారత యుద్ధం అంటూ నాగార్జున చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. అందుకే పద్మవ్యూహంలో మరణించే అభిమన్యుడిలా కాకుండా, దాన్ని ఛేదించే అర్జునుడిలా లెనిన్ ఉండబోతున్నాడంటూ మేకర్స్ హింట్ ఇచ్చారు.
అఖిల్ మాస్ అవతార్ లో కనిపించబోతున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. శివాజీ, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, రంగస్థలం మహేశ్ తదితరులు కీ రోల్స్ లో నటిస్తున్న ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణ లో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పీ, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ లో నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూలై 10న లెనిన్ సినిమాను వరల్డ్‌వైడ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.