Register as a Reviewer
KAAKA (కాకా)

KAAKA (కాకా)

Upcoming Expected Release: 13 Jan 2027

KAAKA Glimpse Review : అదిరిపోయిన "కాకా" ఎంట్రీ.. "పండక్కి" మళ్ళీ పూనకాలే... మెగా సంభవం లోడింగ్..

Director: Bobby Kolli
Cast: Megastar Chiranjeevi, Anaswara Rajan, Nivetha Pethuraj, Sunil, Getup Srinu

Available in:

About This Movie

KAAKA : 

 

ఈ ఇయర్ సంక్రాంతికి "మన శంకర వర ప్రసాద్ గారు"తో  బిగ్గెస్ట్ రీజనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టి జోష్ మీదున్న మెగాస్టార్ చిరంజీవి... మళ్ళీ వచ్చే సంక్రాంతికి మరోసారి రచ్చ చేయడానికి రాబోతున్నాడు. వివరాల్లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి - డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ కి సంబంధించి తాజాగా గ్లింప్స్ విడుదల చేసారు మేకర్స్. మూడేళ్ళ కిందట వీళ్ళ కాంబోలో వచ్చిన "వాల్తేరు వీరయ్య" బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ చిరు - బాబీ కాంబోలో మూవీ వస్తుండడంతో ఇప్పట్నుంచే క్రేజీ బజ్ ఏర్పడింది. ఇక తాజాగా చిరంజీవి బర్త్ డే ట్రీట్ గా ఆగష్టు 22న #MEGA158 మూవీ టైటిల్ రివీల్ చేస్తూ గ్లింప్స్ విడుదల చేసారు మేకర్స్. విడుదలైన కాసేపటికే ఈ గ్లింప్స్ నెట్టింట టాప్ లో ట్రెండ్ అవుతుంది. 

 

ఇక ఈ సినిమాకు "కాకా" అంటూ పవర్ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేసారు మేకర్స్. చాలా క్యాచీగా ఉన్న టైటిల్ చిరుకి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేలా ఉంది. గ్లింప్స్ లో చిరు సత్యం అనే పాత్రలో రొయ్యల ఎక్స్పోర్ట్ కంపెనీలో ఉద్యోగిగా కనిపిస్తున్నట్టు చూపించారు. మిడిల్ ఏజ్ లుక్ లో చిరంజీవి లుక్స్ చాలా సింపుల్ గా అదిరిపోయిందని చెప్పాలి. టీజర్ లో కొన్ని పవర్‌ ఫుల్ షాట్స్ ఐ ఫీస్ట్ ఇచ్చేలా ఉన్నాయి. నీళ్లలో పడిన బైక్ కీస్ ని తీస్తుంటే... గన్స్ తో పాటు వచ్చే ఆ సీన్ ని చూపించిన విధానం గూస్బంప్స్ తెప్పిస్తుంది. ఆ సీన్ ని బట్టి సినిమాలో చిరుకి ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ తో ఫ్లాష్ బ్యాక్ ఉండనుందని తెలుస్తుంది. దానికి తగ్గట్టు థమన్ ఎస్ ఇచ్చిన మ్యూజిక్ కూడా అదిరిపోయింది.

 

ఇక "కాకా" (Kaaka) సినిమాను KVN ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తుండగా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు మేకర్స్ గ్లింప్స్ లో ప్రకటించడం జరిగింది. ఇక ఈ సినిమాతో చిరు ఏకంగా 400 కోట్ల వసూళ్లు అందుకుని మరోసారి రీజనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టే ఛాన్స్ ఉందని, ఫ్యాన్స్ తో పాటు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Why MRO?