Register as a Reviewer
ఇడుపు కాయితం (Idupu Kayitham)

ఇడుపు కాయితం (Idupu Kayitham)

Upcoming Expected Release: 11 Dec 2026

Idupu Kayitham : పెళ్లి పీటల నుండి 'ఇడుపు కాయితం' వరకు... అచ్చమైన పల్లెటూరి సినిమా.. త్వరలో మన ముందుకు

Director: Vamsi Reddy Dondapati
Cast: Priyadarshi Pulikonda, Naga Durga Gutha, Abhinav Gomatam, Vinod Bala, Surabhi Prabhavathi, Mime Madhu, Sujatha Deekshit, Geetha Bhascker, Bithiri Satti, Shiva Jyothi, Mounika Reddy, Abhay and Others.

Available in:

About This Movie

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కం కమెడియన్ ప్రియదర్శి హీరోగా, యూట్యూబ్ స్టార్ నాగ దుర్గ హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ "ఇడుపు కాయితం". సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్  బ్యానర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వం వహించగా తాజాగా ఇడుపు కాయితం టీజర్ ను సోషల్ మీడియాలో విడుదల చేయగా యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. వివాహబంధం కాన్సెప్ట్ తో పెళ్లి వేడుకలతో మొదలై, విడాకుల పత్రం ప్రస్తావనతో ఫ్యామిలీ అండ్ కామెడీ ఎమోషనల్ ఫీల్ గుడ్ డ్రామాగా తెరకెక్కిన ఈ 'ఇడుపు కాయితం' (Idupu Kayitham) టీజర్ ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది. 

 

 

ఇక ఇలాంటి కాన్సెప్ట్ తో ఇంతకు ముందు కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో చాలా ఎంటర్టైనింగ్ గా అలాగే పల్లెటూరి సంప్రదాయాలు, కుటుంబ బంధాల చుట్టూ సాగుతూ ఆకట్టుకుంటుంది. బలగం లాంటి సినిమాల కోవలో ఈ సినిమా కూడా తెలంగాణ ప్రాంత సంప్రదాయాల్ని చాటి చెప్పే విధంగా అనిపిస్తుంది. పెళ్లి తర్వాత మనస్పర్థలు, కుటుంబ కలహాలతో విడాకుల వరకు వెళ్లే జంట గ్రామ పెద్దల సమక్షంలో రాసుకునే విడాకుల పత్రాన్నే తెలంగాణ గ్రామీణ భాషలో "ఇడుపు కాయితం" అంటారు. మరి సినిమాలో శ్రీనివాస్ - శ్రీలత విడిపోతారా? కలుస్తారా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

 

 

ఇక టీజర్ లో ఇరు కుటుంబాల్లో 'మా దాంట్లో ఈ సంప్రదాయం లేదు.. మా దాంట్లో ఉంది' అంటూ వచ్చే సంభాషణలు గ్రామీణ ప్రాంత ప్రజల ఇంటి ఆచారాల గురించి చెప్పే విధంగా ఆసక్తిగా ఉంది. దీన్ని వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఇక అభినవ్ గోమఠం, గీతా భాస్కర్, బిత్తిరి సత్తి, శివజ్యోతి, మైమ్ మధు తదితరులు కీ రోల్స్ లో నటించిన ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించనుండగా, టీజర్ కి అందించిన బీజీఎమ్ కూడా బాగుంది. ఇక ఈ సినిమాను ఈ డిసెంబర్ 11న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. 

Why MRO?