ఐ నోబడీ (I Nobody Trailer)
I Nobody Trailer : బ్యాంకు దోపిడీ నేపథ్యంలో పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీ... ఈ జూలైలోనే వస్తున్నాడు...
About This Movie
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఐ నోబడీ' (I,Nobody). హైస్ట్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా యూట్యూబ్ లో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. నిషమ్ బషీర్ (Nisam Basheer) డైరెక్ట్ చేసిన ఈ మూవీలో పార్వతి తిరుమోతు (Parvathy Thiruvothu), హకీం షాజహాన్, అశోకన్, విజయ రాఘవన్ తదితరులు కీ రోల్స్ లో నటించారు.
ఇక విడుదలైన ట్రైలర్ ని గమనిస్తే... హీరో ఓ బ్యాంకు ఉద్యోగిగా కనిపించనున్నాడని, ఆ బ్యాంకులో కొన్ని కోట్ల రూపాయలను రాబరీ చేసినట్లుగా ట్రైలర్ లో చూపించారు మేకర్స్. ఇక సినిమా నేపథ్యం మొత్తం ఈ దోపిడీ నేపథ్యం కేసులోనే సాగుతుందని తెలుస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే... బ్యాంకులలో ఉండే లొసుగులను అధారంగా చేసుకుని ఓ వ్యక్తి తన తెలివితో చేసే దోపిడీలు, అతడ్ని పట్టుకునేందుకు పోలీసులు మరియు ఇతర వ్యవస్థలు చేసే పనుల చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. ట్రైలర్ ని చూస్తే.. ఓ సీరియస్ థ్రిల్లర్ మూవీను చూడబోతున్నాం అన్నట్టు ప్రామిసింగ్ గా కనిపిస్తుంది.
ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్స్ జోరుగా జరుగుతుండగా, తెలుగులో ఈ సినిమాను స్రవంతి మూవీస్, మైత్రి మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించాడు. ఇక ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ మినహా ఇతర ఏ ఆర్టిస్టులు, తెలుగు ఆడియన్స్ కి తెలియకపోయినా, సినిమాపై టాలీవుడ్ లో మంచి బజ్ ఏర్పడింది. ఇక 'ఐ నోబడీ' సినిమా జూలై 9న మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల కానుంది.