Register as a Reviewer
హృదయం మురళి (Hrudhayam Murali Trailer)

హృదయం మురళి (Hrudhayam Murali Trailer)

Upcoming Expected Release: 10 Jul 2026

Hrudhayam Murali Trailer : అథర్వ మురళి.. హృదయకేళి ఈ మురళి.. మూగ ప్రేమతో త్వరలో ప్రేక్షకుల ముందుకు...

Director: Akash Bhaskaran
Cast: Atharvaa, Preity Mukundhan, Kayadu Lohar, Natty, Thaman S, Niharika, Rakshan, Dravid Selvam, Angeline, Anju Kurian, Sudhakar, Yashashree, Jonita Gandhi.

Available in:

About This Movie

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో అథర్వ మురళి (Atharvaa Murali) హీరోగా ప్రీతి ముకుందన్ (Preethi Mukundan), కయదూ లోహర్ (Kayadu Lohar) హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ "హృదయం మురళి" (Hrudhayam Murali). లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీని ఆకాష్ బాస్కరన్ (Akash Bhaskaran) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ (Fahad Fazil) కీలక పాత్రలో నటించారు. అంతే కాదు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman S) ఈ మూవీకి మ్యూజిక్ అందించడమే కాకుండా, కీలక పాత్రలో నటించడం విశేషం. కాగా తాజాగా ట్రైలర్ విడుదలయి యూట్యూబ్ లో మంచి రెస్సాన్స్ అందుకుంటుంది. 

 

ఇక ట్రైలర్ ని గమనిస్తే... ఈ మూవీ ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిందని అనిపిస్తుంది. కాని ఇద్దరు హీరోయిన్లను ఒకే ఫ్రేమ్ లో చూపించలేదు. అలాగే హీరో తన ప్రేమను హీరోయిన్ కి వ్యక్తపరచడానికే ఇందులో కష్టాలు పడుతున్నాడని కొన్ని డైలాగ్స్ తో తెలుస్తుంది. ఇక థమన్ కూడా ఇందులో కీ రోల్ లో మంచి ఎంటర్టైనింగ్ రోల్ లో నటించినట్టు తెలుస్తుంది. అలాగే ఇంస్టాగ్రామ్ స్టార్ నిహారిక కూడా మంచి రోల్ ప్లే చేసింది. ట్రైలర్ కూడా డీసెంట్ గా క్లాసిక్ గా ఉండి ఆకట్టుకుంటుంది. అలాగే రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో తెరకెక్కించినట్టు తెలుస్తుంది.

 

ఇక తెలుగులో హృదయం మురళి సినిమాను మైత్రి మూవీ మేకర్స్ (Mythri movie makers) రిలీజ్ చేస్తున్నారు. కాగా జూలై 10న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాతో అధర్వ మంచి సక్సెస్ అందుకుని తెలుగులోనూ మంచి బ్రేక్ తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నాడు. 

Why MRO?