గోట్ (Goat)
జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ ఆనంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "గోట్" (GOAT). దివ్యభారతి హీరోయిన్ గా నటించిన ఈ మూవీని వేదవ్యాస్ ఆకుల డైరెక్ట్ చేయగా తాజాగా థియేటర్లలో విడుదలై బిలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది.
Available in:
About This Movie
Story :
కథ విషయానికి వస్తే... కోనసీమలోని రుద్రవరం గ్రామాన్ని మొద్దు బాబ్జీ (నితిన్ ప్రసన్న) జూదం, కోడిపందాలు, బెట్టింగ్ లకు అడ్డాగా మారుస్తాడు. ఆ ఊరి పెద్ద వెంకట కృష్ణంరాజు (సర్వదమన్ బెనర్జీ) ఈ బెట్టింగ్ లాంటి పనులను తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. పైగా ఆటల పోటీలు జరిపే 'గోట్' కు ఛైర్మెన్ గా ఉన్న కృష్ణంరాజును కుట్రపన్ని పదవినుంచి తొలగిస్తాడు మొద్దు బాబ్జీ. అంతేకాదు... ఆ ఊరి జనాన్ని బెట్టింగ్ వ్యవసనానికి గురిచేస్తాడు. మరోవైపు వైజాగ్ లో జులాయిగా తిరుగుతూ, జనాలను బెదిరించి డబ్బులు సంపాదించే రౌడీ సర్ (సుధీర్ ఆనంద్), వేరొకరు అనుకుని పొరపాటున సుభాషిణి (దివ్యభారతి)ని కిడ్నాప్ చేస్తాడు. సుభాషిణి పరిచయంతో సర్ ఆలోచనా విధానం మారుతుంది. ఆమె ద్వారా రుద్రవరం ప్రజల కష్టాలను తెలుసుకుంటాడు. ఈ క్రమంలో కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రుద్రవరం గ్రామ ప్రజలకోసం ఆ ఊరొచ్చి మొద్దు బాబ్జి కి ఎదురెళ్తాడు. అసలు రౌడీ సర్ గా పిలవబడే గణ రుద్రావరానికి ఎందుకెళ్తాడు. ఆ ఊరికి గణ కి ఏంటి సంబంధం? ఇంతకీ ఆ ఊరి సమస్యలను గణ పరిష్కరించాడా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Plus Points :
ఈ సినిమాకి ముందు నుండి అన్ని తానై నడిపించి ప్లస్ గా నిలిచింది సుధీర్. జబర్దస్త్ నుండి ఫేమ్ సంపాదించి స్టార్ యాంకర్ గా మారి ఇప్పుడు హీరోగానూ అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ఇక కథ పరంగా సింపుల్ కాన్సెప్ట్ ని అందుకున్నా, దాన్ని ఎంటర్టైనింగ్ గా చూపించడానికి దర్శకుడు ట్రై చేసిన విధానం బాగుంది. ఇక గోట్ లో సుధీర్ ఆనంద్ కామెడీ టైమింగ్ బాగుంది. అలాగే హీరోగా తన పాత్రలో బాగా పెర్ఫార్మ్ చేయడమే కాకుండా, పలు యాక్షన్ సీన్స్ లో కూడా మెప్పించాడు. కథ పరంగా రొటీన్ గా ఉన్నా, సుధీర్ ఇంకా తన గ్యాంగ్ చేసే కామెడీ మంచి రిలీఫ్ ఇస్తాయి. అలాగే హీరోయిన్ గా నటించిన దివ్యభారతి డీసెంట్ గా కనిపిస్తూ, తన రోల్ కి న్యాయం చేసింది. తన స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా ఉన్నంతలో బాగా చేసింది. పలు ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి. అలాగే మొట్టా రాజేంద్రన్, బ్రహ్మాజీ పాత్ర, సర్వదమన్ బెనర్జీ, ఆనంద్ రామరాజు, నితిన్ ప్రసన్న వాళ్ళ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
Minus Points :
అయితే ఈ సినిమాకు కథే పెద్ద మైనస్ అయింది. రొటీన్ రెగ్యులర్ టెంప్లేట్ లోనే కథ సాగుతుంది. పోనీ స్క్రీన్ ప్లే అయినా ఎంగేజింగ్ గా ఉందనుకుంటే.. కొన్ని కామెడీ సీన్లు తప్ప అన్ని లాజిక్ లేని సీన్స్ తోనే నిండిపోయాయి. కొన్ని సీన్లకు కథకు సంబంధమే ఉండదు. అసలు మెయిన్ కాన్సెప్టే రొటీన్ గా ఉంటుందంటే... హీరోయిన్ ని కిడ్నాప్ చేసి దాని చుట్టూ డ్రామా బిల్డ్ చేయడం మరో మైనస్ అయింది. ఇక సుధీర్ ఆనంద్ హీరోగా నిలదొక్కుకోవడానికి చేసిన ప్రయత్నం మరోసారి విఫలమైందని అనిపిస్తుంది. ఇక సినిమాలో వచ్చే ట్విస్ట్ లు కూడా ఆశించిన రేంజ్ లో కొత్తగా ఏమి లేవు. అవి ఈజీగా గెస్ చేయొచ్చు. అలాగే హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ పెద్దగా ఆకట్టుకోదు. ఏ సినిమా అయినా కథ రొటీన్ గా ఉన్నా, కథనం ఆసక్తికరంగా ఉంటె సినిమా కొంచెమైనా చూడ్డానికి ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ ఇందులో ఒక్క కారణం కూడా కనిపించదు. కొన్ని సినిమాల రిఫరెన్స్ లు వాడుకుందామన్నా పనిచేయలేదు.
Technical Values :
టెక్నికల్ పరంగా సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. డైరెక్టర్ వేదవ్యాస్ ఆకుల మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అందించాలని బాగానే ట్రై చేసారు. కానీ పసలేని కథ కథనాలతో బోర్ కొట్టించారు. స్టోరీ పై ఫోకస్ చేయకున్నా స్క్రీన్ ప్లే అయినా బాగా రాయాల్సింది. సినిమాటోగ్రఫీ పర్లేదు. ఎడిటింగ్ పరంగా సాగదీత సీన్లను కట్ చేయాల్సింది. మణిశర్మ బీజీఎమ్ వర్క్ యావరేజ్ గా ఉంది. సినిమాలో కొన్ని చోట్ల లిప్ సింక్ సరిగా కుదరలేదు.
Final Review :
ఓవరాల్ గా "గోట్" అంటూ ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ కామెడీ యాక్షన్ డ్రామా ఒక రొటీన్ కాన్సెప్ట్ తో జబర్దస్త్ పంచ్ లతో ఆడియన్స్ ని పూర్తిగా మెప్పించలేకపోతుంది. సుధీర్ ఆనంద్ బాగానే పెర్ఫార్మ్ చేసినా, కథ కథనాల్లో పస లేకపోవడం వల్ల సినిమా ఆకట్టుకోలేకపోతుంది. కామెడీ మూవీస్ ఇష్టపడే రెగ్యులర్ ఆడియన్స్ ఎలాంటి అంచనాలు లేకుండా ఓ సారి ట్రై చేయొచ్చు.