Register as a Reviewer
డ్రాగన్ (Dragon Glimpse)

డ్రాగన్ (Dragon Glimpse)

Upcoming Expected Release: 11 Jun 2027

Dragon Glimpse Review : యూట్యూబ్ లో "డ్రాగన్" విధ్వంసం... త్వరలోనే బాక్స్ ఆఫీస్ ముందుకు...

Director: Prashanth Neel
Cast: NTR, Anil Kapoor, Biju Menon, Rukmini Vasanth, Khushbu Sundar, Guru Somasundaram, Rajeev Kanakala, Ashutosh Rana, Anshuman Pushkar, Sidhant Gupta, Prabhas Srinu, Shatru, Shiva, bhimal Jeet Oberoi, Ntuthuzelo prince Grootboom, Aleksandr Mizev, Benedict Paul Garrett

Available in:

About This Movie

 

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ పాన్ ఇండియా మూవీస్ లో డ్రాగన్ ఒకటి. మూవీ మొదలై రెండేళ్లయినా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేకపోగా ఫైనల్ గా ఎట్టకేలకు ఫస్ట్ లుక్ గ్లింప్స్ వీడియో ని రిలీజ్ చేసారు మేకర్స్. ఇక మొన్నటివరకు #NTRNEEL వర్కింగ్ టైటిల్ తో ట్రెండ్ అయిన ఈ మూవీకి అఫిషియల్ గా "డ్రాగన్" అనే పేరుని ఫిక్స్ చేసారు మేకర్స్. ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా విడుదలైన ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. 

 

ఇక ఈ గ్లింప్స్ వీడియో ఏకంగా నాలుగు నిమిషాల నిడివితో ఉండడం విశేషం. వీడియోలో స్టోరీ ఆఫ్గనిస్తాన్ నల్లమందు దందా నేపథ్యంలో కథ నడుస్తుందని, నేరేట్ చేస్తూ... మెల్లిగా ఒక్కో క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ... డ్రాగన్ నేర ప్రపంచాన్ని చూపించారు. ఇక నీల్ స్టైల్ లో హీరోయిన్ రుక్మిణి వసంత్ నేరేట్ చేస్తుంటే అలా శత్రువుల శవాల మధ్యలోంచి ఎన్టీఆర్ షాట్ ఉంటుంది. పూర్తిగా ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ అండ్ ఎలివేషన్లతో ఏమాత్రం తగ్గకుండా టీజర్ ను సాలిడ్ గా కట్ చేశారు మేకర్స్. ఇక గ్లింప్స్ చూస్తుంటే సినిమాలో నీల్ మార్క్ విధ్వంసం మరోసారి బాక్స్ ఆఫీస్ పై ఉండనుందని తెలుస్తూనే ఉంది. 

 

ఇక కాంబో హైప్ తోనే పాన్ ఇండియా హైప్ క్రియేట్ చేసిన ఎన్టీఆర్ - నీల్, ఈ వీడియోతో సినిమాపై స్కై లెవెల్లో అంచనాలు క్రియేట్ చేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా వీడియోలో  "దేవుడు నాకో గొప్ప వరం ఇచ్చాడు. ట్రిగ్గర్ నొక్కగానే మార్చిపోవడం. నిద్రపోయినప్పుడు నేను చంపినవాళ్ల ముఖాలు నా కలలోకి రావు. మిగిలున్న శత్రువుల ముఖాలే కనబడతాయి. పొరపాటున కూడా నువ్వు నా కలలోకి రావొద్దు'' అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్... దానికి తగ్గట్టు రవిబసుర్ ఇచ్చిన బీజీఎమ్ వీడియోకే హైలెట్ గా నిలిచింది.. ఇక అనిల్ కపూర్ ఈ మూవీలో ప్రత్యేకపాత్రలో నటించనున్నాడు. 

 

ఓవరాల్ గా ఈ  గ్లింప్స్ తో సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే శాంపిల్ ఆడియన్స్ కి చూపించేసాడు. ఇక డ్రాగన్ లో ఎన్టీఆర్ "లూగర్" అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు. హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ - ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక డ్రాగన్ ను నెక్స్ట్ ఇయర్ అనగా, 2027 జూన్ 11న థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. 

 

Why MRO?