Register as a Reviewer
డాన్ బాస్కో (Don Bosko)

డాన్ బాస్కో (Don Bosko)

Upcoming Expected Release: 2026

Don Bosko : స్కూల్ ఫ్రెండ్స్ రీ యూనియన్ కి వచ్చిన ఫ్రెండ్ రౌడీ అయితే..? త్వరలోనే వస్తున్నాడు..

Director: Shankar Gowri
Cast: Rajkumar Kasireddy, Mirnaa Menon, Mounika, Murali Sharma, Principal Viswanath, Vishnu Oi, Uttej, Vinay Nallakadi

Available in:

About This Movie

రాధా కృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై వెంకట్ ఉప్పుటూరి నిర్మాణంలో 'రుష్య ద‌త్తా' హీరోగా ప‌రిచ‌యం అవుతున్న కొత్త చిత్రం "డాన్ బాస్కో". గౌరీ శంకర్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రాజ్‌కుమార్ కసిరెడ్డి, మిర్నా మీనన్, మౌనిక, మురళీ శర్మ, ప్రిన్సిపాల్ విశ్వనాథ్, విష్ణు ఓఐ, ఉత్తేజ్, వినయ్ నల్లకడి, మోహన శ్రీ సురాగా తదితరులు కీ రోల్స్ లో నటించారు. ఇక ఈ సినిమా టీజర్ ను తాజాగా మేకర్స్ అఫిషియల్ గా రిలీజ్ చేయగా, సోషల్ మీడియా లో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. 

 

 

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ టీజర్ ను లాంఛ్ చేయగా, టీజర్ ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా ఉండి పెంచేస్తుంది. ఇక టీజర్ ని గమనిస్తే.. ఓ స్కూల్ ప్రిన్సిపల్ తన పాత స్టూడెంట్స్ ని రీ యూనియన్ చేసే కార్యక్రమం అమలు చేసే ప్రయత్నంలో తన ఓల్డ్ స్టూడెంట్స్ కి ఈ బాధ్యతను అప్పగిస్తాడు. అయితే వాళ్లలో అందరూ బాగా డిఫరెంట్ డిఫరెంట్ వ్యాపారాల్లో, వృత్తుల్లో, జాబ్స్ లు చేస్తుంటారు. కానీ ఒక్కడు మాత్రం రౌడీగా మారి బతుకుతుంటాడు. అలాంటి వాడు రీ యూనియన్ కి వస్తే ఎలా ఉంటుంది.. అన్న కాన్సెప్ట్ తో ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించారు. 

 

 

ఇక ఈ సినిమాలో ఫస్ట్ మూవీ అయినా హీరో రుష్యా దత్తా బాగానే ఆకట్టుకునేలా కనిపిస్తున్నాడు టీజర్ చూస్తుంటే... కాన్సెప్ట్ బాగుంటే ఖచ్చితంగా మంచి డెబ్యూ మూవీ అయ్యేలా ఉంది. ఇక శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను అతి త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

Why MRO?