డార్క్ చాక్లెట్ (Dark Chocolate)
35 చిన్న కథ కాదు సినిమాతో ఫేమ్ సాధించిన విశ్వదేవ్ రాచకొండ హీరోగా నటించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ మూవీ "డార్క్ చాక్లెట్". బిందు మాధవి, రాకేష్ రాచకొండ, రమేష్ కోనంభొట్ల, ఆది పెద్దిరెడ్డి కీ రోల్స్ లో నటించిన ఈ సినిమాకు శశాంక్ శ్రీవాత్సవయ దర్శకత్వం వహించాడు. తాజాగా నవంబర్ 13న థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది.
Available in:
About This Movie
Story :
కథ విషయానికి వస్తే... ఫైర్ స్టార్ యజ్ఞ (విశ్వదేవ్ రాచకొండ) ఒకప్పుడు మంచి గుర్తింపు ఉన్న సినీ నటుడు. కానీ వరుస పరాజయాలతో కృంగిపోయి సినిమాలకు దూరమవుతున్న టైం లో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతాడు. ఈ సమయంలోనే అతని గతంలోని సంఘటనలు, వైఫల్యాలు కలలో వెంటాడుతుంటాయి. ఈ క్రమంలో తన కలలోకి తరచుగా వచ్చే ముగ్గురు వ్యక్తులు హంస (బిందు మాధవి), గోపి (రాకేష్ రాచకొండ), మరియు బాబాయ్ (రమేష్ కోనంభట్ల) లను ఒక దగ్గరకి తీసుకొచ్చి, తన కలలోకి వచ్చి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నిస్తాడు. పైగా వాళ్ళను కలలో మాత్రమే వస్తున్నారని అనుకుంటాడు. ఈ క్రమంలో వాళ్ళను అంతం చేయాలని కూడా అనుకుంటాడు. అసలు యజ్ఞలో ఈ ప్రవర్తనకి కారణమేంటి? యజ్ఞ ప్రశ్నలకు సమాధానాలు దొరికాయా? యజ్ఞ తనకి ఎదురైన మానసిక ఆందోళనల పరిస్థితుల నుండి ఎలా బయటపడ్డాడు. అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Plus Points :
సినిమా కథ పరంగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కడం వల్ల ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేసింది. ట్రైలర్ కూడా ఆసక్తికరంగా కట్ చేసి అంచనాలు పెంచేశారు. ఇక మెయిన్ లీడ్ లో నటించిన విశ్వదేవ్ రాచకొండ సినిమా మొత్తాన్ని తన వన్ మ్యాన్ షో పెర్ఫార్మన్స్ తో నడిపించాడు. నటుడిగా విభిన్న కోణాల్ని తన రోల్ లో చూపించారు. అలాగే బిందు మాధవి, రాకేష్ రాచకొండ, రమేష్ కోనంభట్ల కూడా బాగా నటించారు. కొన్ని సీన్స్ పరంగా సరికొత్తగా అనిపించి సప్రైజ్ చేస్తాయి. ఇక సినిమాలో విశ్వదేవ్ కలలోకి వెళ్లిన ప్రతిసారీ స్క్రీన్ షేక్ అవ్వడం ద్వారా రియాలిటీ కి, ఊహకి డిఫరెన్స్ ని ఆడియన్స్ కి అర్ధమయ్యేట్టు చూపించిన విధానం బాగుంది. అలాగే వాటికి తగ్గ బీజీఎమ్ స్కోర్ బాగా మ్యాచ్ అయింది.
Minus Points :
అయితే ఇలాంటి కాన్సెప్ట్స్ తో తెరకెక్కే మూవీస్ ని ఆడియన్స్ ఆదరించడం తక్కువ. ఎందుకంటే ఈ తరహా మూవీస్ ఆడియన్స్ ని ఎక్కువగా కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. మరి దర్శకుడు ఆడియన్స్ కి అర్ధమేయ్యేలా పూర్తిగా కంటెంట్ చెప్పాడా అంటే అంత క్లియర్ గా చెప్పలేదనే అనాలి. ఇలాంటి కథల్లో చిన్న డీటెయిల్ మిస్ అయినా కన్ఫ్యుజింగ్ గా మారే ఛాన్స్ ఉంటుంది. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే ని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయాలనీ ట్రై చేసినా కొన్ని సీన్స్ టైం లూప్ కాన్సెప్ట్ లా రిపీటెడ్ లా అనిపించి బోర్ కొట్టిస్తాయి. క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నా, మరీ ఎక్సయిటింగ్ గా అనిపించదు. పైగా సినిమాలో అనవసరమైన గందరగోళం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. టాలీవుడ్ లో ఇదొక డిఫరెంట్ అట్టెంప్ట్ అనిపించినప్పటికీ కాన్సెప్ట్ లో క్లారిటీ లేకపోవడం వల్ల ఆడియన్స్ కి అంతగా రుచించకపోవచ్చు.
Technical Values :
టెక్నికల్ గా చూస్తే... ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. వివేక్ సాగర్ అందించిన సంగీతం అండ్ బీజీఎమ్ కూడా బాగున్నాయి. సతీష్ సాకర్ సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే ఎడిటింగ్ వర్క్ కూడా పర్లేదు. కాకపోతే కొన్ని రిపీటెడ్ సీన్స్ ని ట్రిమ్ చేయాల్సింది. శశాంక్ శ్రీవత్సవాయ డైరెక్షన్ పరంగా ఒక మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఆడియన్స్ కి అందించడానికి బాగానే కష్టపడ్డాడు. కానీ ఆడియన్స్ కి అర్ధమయ్యేలా పూర్తిగా ఎంగేజింగ్ గా ఇంట్రెస్టింగ్ గా చెప్పడంలో విఫలమయ్యారు. మరింత సింపుల్ గా చెప్పాల్సింది అనిపిస్తుంది.
Final Review :
ఇక ఓవరాల్ గా "డార్క్ చాక్లెట్" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఒక డిఫరెంట్ అటెంప్ట్ గా కొత్తదనం కోరుకునే ఆడియన్స్ ని మెప్పించే అవకాశం ఉంది. విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి పెర్ఫార్మన్స్ తో పాటు, కొన్ని విజువల్స్ క్లైమాక్స్ బాగున్నాయి. కానీ కన్ఫ్యూజ్ చేసే స్క్రీన్ ప్లే అండ్ రిపీటెడ్ సీన్స్ వల్ల, రొటీన్ సీన్స్ వల్ల అంతగా ఆకట్టుకోలేదు. రెగ్యులర్ ఆడియన్స్ అస్సలు కనెక్ట్ కాకపోవచ్చు. కొత్తదనంతో ఉన్న డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ చూసే ఆడియన్స్ తక్కువ అంచనాలతో ఈ మూవీని ఓసారి ట్రై చేయొచ్చు.