అంతా రాములోరు చూస్కుంటారు (Antha Ramuloru Chuskuntaru)
Antha Ramuloru Chuskuntaru : క్లాసిక్ టైటిల్ తో వస్తున్నారు.. క్లాసిక్ ప్రేమ కథ మూవీ అవుతుందా? త్వరలో వచ్చేస్తుంది..
Available in:
About This Movie
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ వరుస సినిమాలతో హీరోగా దూసుకుపోతున్నాడు. ఈ ఇయర్ "రాకాస" తో ఆల్రెడీ మంచి సక్సెస్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం ఓ బ్యూటీఫుల్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సంగీత్ శోభన్, అనశ్వర రాజన్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "అంతా రాములోరు చూస్కుంటారు". తాజాగా ఈ మూవీ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేయగా, సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన తెచ్చుకుంటుంది.
ఇక టీజర్ ని గమనిస్తే... అందులో "వెన్నెల్లో గోదావరి... పడవలో అందమైన ప్రేమ జంట".. ఫస్ట్ ఫ్రేమ్ లోనే ఆడియన్స్ ని విపరీతంగా అట్రాక్ట్ చేసేలా టీజర్ కనిపిస్తుంది. ప్రకృతి అందాల నడుమ పచ్చని పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తూనే ఉంది. తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తున్న ఈ "అంతా రాములోరు చూస్కుంటారు" మూవీ టైటిల్ తోనే సగం సక్సెస్ అయిపోయిన ఫీల్ వస్తుంది. అలాగే టీజర్ కి మిక్కీ జె మేయర్ ఇచ్చిన ఫీల్ గుడ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇక ఈ మూవీలో మారుతి అనే పాత్రలో సంగీత్ శోభన్ కనిపించనుండగా, శిరీష పాత్రలో అనస్వర నటిస్తుంది.
ఇక ఈ మూవీలో హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ ప్యూర్ గా ఉండబోతుందని టీజర్ ద్వారా తెలుస్తుంది. వీళ్ల పెయిర్ ఆడియన్స్ ని మోటివేట్ చేసేలా ఉంటుందని మేకర్స్ తెలియచేసారు. ఇక ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్, వి.జి.బి. ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.