666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ (666 Operation Dream Theatre Teaser)
666 Operation Dream Theatre Telugu Teaser : 80స్ బ్యాక్ డ్రాప్ లో రా అండ్ రస్టిక్ గా శివన్న సినిమా... త్వరలోనే వస్తున్నాడు..
About This Movie
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో కరునాడ చక్రవర్తిగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ శివరాజ్ కుమార్ (Shivaraj kumar). రీసెంట్ గా "పెద్ది" మూవీలో గౌర్నాయుడు పాత్రలో పవర్ ఫుల్ గా అదరగొట్టిన శివన్న లేటెస్ట్ గా ఓ పీరియాడిక్ ఆక్షన్ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. కన్నడ లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ మూవీస్ తో గుర్తింపు తెచ్చుకున్న క్రేజీ డైరెక్టర్ హేమంత్ ఎమ్ రావు (Hemanth Rao) దర్శకత్వంలో తెరకెక్కిన హై-వోల్టేజ్ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ "666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్" (666 Operation Dream Theatre). తాజాగా ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో విడుదల కాగా మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.
ఇక తెలుగులో ఈ సినిమా టీజర్ ని నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేసాడు. టీజర్ ని గమనిస్తే... 1980స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా రా అండ్ రస్టిక్ ఎలిమెంట్స్ తో కేజ్రీగా కనిపిస్తుంది. ఒక రెట్రో స్టైల్ లోనే మ్యూజిక్ కూడా 80స్ మూవీస్ ని గుర్తు చేసే విధంగా ఉండడంతో చాలా కేజ్రీగా అనిపిస్తుంది . ఇక ఈ 666 ఆపరేషన్ డ్రీం థియేటర్ మూవీలో "ఏజెంట్ ప్రకాష్" అనే ఒక పవర్ ఫుల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా శివన్న కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ అనే మిషన్ చుట్టూ ఈ సినిమా కథ తిరగబోతున్నట్లు టీజర్ ద్వారా తెలిసిపోతుంది.
ఇక ఈ మూవీని వైశాఖ్ జె ఫిల్మ్స్ (Vaishakh J. Films) బ్యానర్ పై వైశాఖ్ జె గౌడ (Vaishakh J. Films) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. చరణ్ రాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో శివరాజ్ కుమార్ తో పాటు టాలెంటెడ్ నటుడు డాలీ ధనంజయ్, ప్రియాంకా అరుళ్ మోహన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తుండగా అతి త్వరలోనే మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.