418 (The Movie)
418 Trailer : ఆ బిల్డింగ్ లోకి వెళ్లిన ఏ అమ్మాయి ప్రాణాలతో తిరిగి రాదు..! దాని వెనుకుంది ఎవరు? త్వరలో మన ముందుకు..!
About This Movie
ఈ ఇయర్ టాలీవుడ్ లో హారర్ మూవీస్ కి గిరాకీ పెరిగింది. రాకాస వంటి హారర్ సినిమాలు మంచి సక్సెస్ కావడంతో ఇతర భాషల సినిమాలు కూడా తెలుగులో డబ్ అవుతున్నాయి. రీసెంట్ గా మయూఖ కూడా డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. ఈ క్రమంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పణలో తెరకెక్కిన లేటెస్ట్ హారర్ మూవీ ఆడియన్స్ ని పలకరించడానికి వచ్చేస్తుంది. "418 The Movie" పేరిట తెరకెక్కిన ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రీసెంట్ గా విడుదల చేయగా, నెట్టింట అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంటుంది.
డెబ్యూట్ డైరెక్టర్ కీర్తన్ నడగౌడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, చైత్ర జె ఆచార్, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటించగా, ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే హారర్ మూవీ లవర్స్ కు విపరీతంగా నచ్చేలా కనిపిస్తుంది. ట్రైలర్ ని గమనిస్తే... గత 15 ఏళ్ళుగా తాళం వేసి పడేసిన ఒక పాత భవనాన్ని తిరిగి తెరవడంతో మొదలయ్యే పారా నార్మల్ సమస్యలు, ముఖ్యంగా అందులోని 'రూమ్ నంబర్ 418' లో ఉండే భయంకరమైన అమానుష శక్తి చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఇక ట్రైలర్ పొడవునా వచ్చే గ్రిప్పింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, షార్ప్ విజువల్స్ అండ్ "దెయ్యాల కంటే మన ఊహలే చాలా ప్రమాదకరమైనవి" అనే ఇంటెన్స్ డైలాగ్స్ ఉత్కంటను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి.
ఇక కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్టైల్ లో సాగే ఎడిటింగ్ షాట్స్, ముఖ్యంగా చివరి నిమిషంలో వచ్చే విజువల్స్ అదిరిపోయాయి. ఓవరాల్ గా ఈ సినిమా రొటీన్ కామెడీ హారర్లకు భిన్నంగా ఉండబోతుందని తెలుస్తూనే ఉంది. ఈ మధ్య ఇలాంటి హారర్ సినిమా రాలేదని ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. కానీ ఈ సినిమా ఏ స్థాయిలో ఆడియన్స్ ని భయపెడుతుందో అక్టోబర్ 23న విడుదలయ్యాక తెలుస్తుంది.
You Might Also Like
మయూఖ (Mayookha)
2026
సిగ్మా (Sigma)
2026