పొలిమేర 3 (Polimera 3)
Polimera 3 : పొలిమేరలోకి 'విరావి' ఆగమనం.. ఇక వార్ వన్ సైడ్ అయిపోద్దా..? త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
Available in:
About This Movie
సత్యం రాజేష్, బాలాదిత్య, సాయి కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన "మా ఊరి పొలిమేర" సినిమా ఎంత సక్సెస్ సాధించిందో తెలిసిందే. హాట్ స్టార్ ఓటిటి లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోగా, ఆ తర్వాత "మా ఊరి పొలిమేర 2" పేరుతో సీక్వెల్ కూడా తెరకెక్కి థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చేతబడులు, క్షుద్ర పూజల నేపథ్యంలో ఒక హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ "మా ఊరి పొలిమేర" ఆడియెన్స్ ను బాగా భయపెట్టింది. ఇక ఇప్పుడు ఈ మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంఛైజీలో భాగంగా మూడో పార్ట్ కూడా రాబోతుంది. చాలా రోజుల కిందటే మొదలైన ఈ ప్రాజెక్ట్ నుండి తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చేసింది. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాను ఈ ప్రాజెక్ట్ లోకి దించుతూ ఆయనకీ సంబంధించి స్పెషల్ టీజర్ ని రిలీజ్ చేసారు.
ఇక అర్జున్ ఈ మూడో పార్ట్ లో ఓ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుండగా, "వీరావి" అనే పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్నట్టు టీజర్ ద్వారా తెలుస్తుంది. మాంత్రికుడైన సత్యం రాజేష్ ని ఎదిరించే పాత్రలో వీరావిగా అర్జున్ రోల్ ఉండనుందని తెలుస్తుంది. "ఫ్రమ్ రేజ్ టు రోర్" అంటూ సాగే ఈ గ్లింప్స్ వీడియోలో అమావాస్య వాతావరణం చూపిస్తూ, పాడుబడిన ఆలయంలోని చీకటి ప్రదేశాలు, విష్ణుమూర్తి నుంచి పరమశివుడికి మారే దృశ్యాలతో పాటు అనంత పద్మనాభస్వామి దర్శనంతో సాగే గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తూ అంచనాలు పెంచేస్తుంది. ఈ క్రమంలో చేతిలో కత్తి పట్టుకుని, ఒక పవర్ఫుల్ యోధుడి వేషధారణలో అర్జున్ సర్జా "విరావి" గా ఎంట్రీ ఇచ్చాడు.
ఇక డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ మూడో భాగాన్ని మరింత భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండగా, ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో సినిమాని రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, భరత్ నారంగ్ సంయుక్తంగా "పొలిమేర 3" సినిమాను నిర్మిస్తున్నారు. గత రెండు పార్ట్స్ లో ఉన్న సత్యం రాజేష్, బాలాదిత్య, సాయి కామాక్షి భాస్కర్ల తదితరులు ఈ మూడో పార్ట్స్ లోనూ కనిపించనుండగా, పలువురు ఈ పార్ట్ 3 లో కూడా ఉండనున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు మేకర్స్.
You Might Also Like
సీన్ (SCENE)
2026
రామాయణ (Ramayana)
2026