జాంబిరెడ్డి 2 (Zombie Reddy 2 NXT LVL)
Zombie Reddy 2 NXT LVL : మళ్ళీ వచ్చేస్తున్న "జాంబిరెడ్డి"... ఈసారి నెక్స్ట్ లెవెల్...! త్వరలో ప్రేక్షకుల ముందుకు..
Available in:
About This Movie
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ - తేజ సజ్జా కాంబినేషన్ లో గతంలో వచ్చిన జాంబి రెడ్డి ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఆ సినిమా కామెడీ అండ్ థ్రిలర్ మూవీగా చిన్న సినిమాల్లో పెద్ద సక్సెస్ అయింది. ఊళ్ళో జనాలకు జాంబీస్ ఎటాక్ చేస్తే వాటిని హీరో అండ్ టీం ఎలా ఎదుర్కొని వాళ్ళని కాపాడారు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది ఈ మూవీ. అయితే ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా జాంబి రెడ్డి 2 రాబోతుంది. తాజాగా తేజ సజ్జ బర్త్ డే సందర్బంగా ఈ సీక్వెల్ ని అనౌన్స్ చేసారు మేకర్స్.
"జాంబీ రెడ్డి 2: నెక్ట్స్ లెవల్" పేరిట రాబోతున్న ఈ మూవీని ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అంతే కాదు ఈ మూవీలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీ రోల్ లో నటించనున్నారు. అయితే ఫస్ట్ పార్ట్ డైరెక్ట్ చేసిన ప్రశాంత్ వర్మ ఈ సీక్వెల్ కి క్రియేటర్ గా వ్యవహరిస్తుండగా, ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ ఫేమ్ "సుపర్ణ్ ఎస్ వర్మ" డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఇక తేజ సజ్జ పూర్తి స్థాయి హీరోగా ఇంట్రడ్యూస్ అయిన తొలి చిత్రం 'జాంబీ రెడ్డి'. అప్పట్లోనే దీనికి సీక్వెల్ వస్తుందని వార్తలు రాగా, ఫైనల్ గా ఇప్పుడు ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. ఇక టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోను ఆనిమేటెడ్ మోషన్ వీడియోలాగా డిజైన్ చేయగా, అందులో జాంబీలు తిరిగొచ్చాయంటూ... టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోని రిలీజ్ చేశారు. ఈసారి ఇది మరింత భారీగా, భయంకరంగా మరియు రక్తపాతంతో కూడినదిగా ఉండబోతోంది'' మేకర్స్ అనౌన్స్ చేసారు. ఇక ఈ జాంబిరెడ్డి 2 లో బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ కూతురు "శనాయా కపూర్" హీరోయిన్ గా నటిస్తుంది. గౌర హరి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ (2027) సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు.