జనవరి 12 విడుదల (JANUARY 12 VIDUDALA)
JANUARY 12 VIDUDALA - Title Reveal Glimpse : పక్కా అనిల్ మార్క్ తోనే పండక్కి వచ్చేస్తున్న బావా బామ్మర్దులు...
Available in:
About This Movie
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ - కళ్యాణ్ రామ్ లతో కలిసి ఓ మల్టి స్టారర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. వెంకటేష్ తో 5 వ సారి కలిసి పని చేస్తున్న అనిల్ ఈసారి కూడా కామెడీనే అస్త్రంగా ఎంచుకుని పండక్కి మరోసారి సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమాకి సంబంధించి తాజాగా టైటిల్ అనౌన్స్ మెంట్ ని ప్రకటిచారు మేకర్స్. హీరో హీరోయిన్లతో డైరెక్టర్ ఓ క్రేజీ స్పెషల్ వీడియో చేసి టైటిల్ అనౌన్స్ చేయడం విశేషం.
ఇక రిలీజ్ చేసిన వీడియోలో అనిల్ రావిపూడి తన పాత సినిమాల మీమ్స్ స్టైల్ లో కామెడీ చేస్తూ టైటిల్ ప్రకటించారు. ఆ వీడియోలో హీరోహీరోయిన్ల బలవంతం మీద టైటిల్ ని "జనవరి 12 విడుదల" అంటూ ప్రకటించడం జరిగింది. "బావ బామ్మర్ది సౌజన్యంతో" అంటూ ఉపశీర్షికను కూడా ఉంచారు. అలాగే ఈ సినిమాను రాబోయే సంక్రాంతి 2027 జనవరి 12న విడుదల చేయనున్నట్లు అనిల్ రావిపూడి ప్రకటించారు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ - కళ్యాణ్ రామ్ లకు జోడిగా కీర్తి సురేష్ - కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇక పక్కా అనిల్ రావిపూడి స్టయిల్ లోనే ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు టైటిల్ అనౌన్స్ మెంట్ విడియోతోనే తెలిసిపోతుంది. అలాగే తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాకు కూడా వెరైటీగా సింపుల్ గా జనవరి 12 విడుదల అంటూ టైటిల్ అనౌన్స్ చేసాడు. ఇక సినిమా ట్యాగ్ లైన్ టైటిల్ ని బట్టి ఈ మూవీలో వెంకీ - కళ్యాణ్ రామ్ బావా బామ్మర్దులుగా నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, షైన్ క్రియేషన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.