Register as a Reviewer
కింగ్100 (#KING100 GLIMPSE)

కింగ్100 (#KING100 GLIMPSE)

Upcoming Expected Release: 24 Dec 2026

#KING100 GLIMPSE : అదిరిపోయిన బర్త్ డే గ్లింప్స్... ఐడెంటిటీ కోసం "ది కింగ్ ఈజ్ బ్యాక్"...

Director: Ra Karthik
Cast: Ngarjuna, Tabu

Available in:

About This Movie

టాలీవుడ్ లో కింగ్ గా నాలుగు దశాబ్దాలుగా అభిమానులని అలరిస్తున్న అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన కెరీర్ బెంచ్ మార్క్ మూవీ అయిన 100వ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌ పై స్వయంగా అక్కినేని నాగార్జున ప్రతిష్టాత్మకంగా సినిమాను నిర్మిస్తున్నారు. ఇక అక్కేనని ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలున్న నేపథ్యంలో తాజాగా నాగార్జున బర్త్ డే ట్రీట్ గా ఈ సినిమా టైటిల్ అండ్ టీజర్ ని రిలీజ్ చేసారు మేకర్స్.

 

ఇక ఈ సినిమాకు "కింగ్100" అంటూ టైటిల్ ఫిక్స్ చేయగా, విడుదలైన కాసేపటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. అయితే సినిమాకి ఇదే టైటిల్ ఫిక్స్ అవుతుందా, లేదా రిలీజ్ టైం కి ఇంకేమైనా ఛేంజ్ చేస్తారా అనేది చూడాలి. ఇక గ్లింప్స్ వీడియో అక్కినేని ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా స్టన్నింగ్ గా అదిరిపోయిందని చెప్పాలి. వీడియో మొత్తం నాగార్జున రీసెంట్ మూవీ కి అలాగే, రొటీన్ కి భిన్నంగా చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. నాగార్జున స్టైలిష్ మేకోవర్ టీజర్ లో హైలెట్ గా నిలుస్తుంది. ఇక టీజర్ లో... "మనుషులు రెండు రకాలు అంటూ డబ్బున్నోళ్ళు, డబ్బు లేనోళ్ళు".... అంటూ నాగ్ చెప్పే డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. డైరెక్టర్ రా కార్తీక్ నాగ్ ని చాలా స్టైలిష్ గా,  సినిమాని రిచ్ విజువల్స్ అండ్ టేకింగ్ తో చూపిస్తున్నాడు.

 

ఇక గ్లింప్స్ లో నాగ్ స్టైలిష్ మేకోవర్ కి తోడు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన అద్భుతమైన బీజీఎమ్ స్కోర్ బాగా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ నాగార్జున వందవ చిత్రంగా వస్తున్న ఈ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో నాగార్జున టాలీవుడ్ లో తన కింగ్ ట్యాగ్ ను నిలబెడుతూ సీనియర్ స్టార్స్ లో మరోసారి హవా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

Why MRO?