Register as a Reviewer
LIK (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ)

LIK (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ)

10 Apr 2026
Overall Rating
4.6/10
17 Reviews

తమిళ టాలెంటెడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ LIK (Love Insurance Kompany) (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ). కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీని విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేసాడు. అనిరుధ్ సంగీతం అందించాడు.

Director: Vignesh Shivan
Cast: Pradeep Ranganathan, S J Suryah, Krithi Shetty, Yogi Babu, Seeman, Gouri Kishan, Shah Rah, Malavika

Available in:

Reviews

What critics and the public are saying about LIK (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ)

Media Reviews

17 Avg: 4.6/10
Cinema Picha
Cinema Picha Youtube Channel
6

Above Average

LIK (Love Insurance Movie Review)

లైక్ (LIK) సినిమా అంటే… ట్రైలర్ చూసినప్పుడు “ఏదో కొత్తగా ఉంటుందేమో!” అనిపిస్తుంది. కానీ సినిమా చూసాక మాత్రం “అదే పాత ఫీలింగ్!” అనిపిస్తుంది. ఫ్యూచర్ జెనరేషన్ లూప్ హొల్స్ లో ఒక చిన్న పాయింట్ ని తీసుకొని ఈ కథ రెడీ చేసారు మేకర్స్. కానీ అసలు గేమ్ సెకండ్ హాఫ్‌ లో ఫెయిల్ అవుతుంది. స్టోరీ ఎటు వెళ్తుందో డైర...

లైక్ (LIK) సినిమా అంటే… ట్రైలర్ చూసినప్పుడు “ఏదో కొత్తగా ఉంటుందేమో!” అనిపిస్తుంది. కానీ సినిమా చూసాక మాత్రం “అదే పాత ఫీలింగ్!” అనిపిస్తుంది. ఫ్యూచర్ జెనరేషన్ లూప్ హొల్స్ లో ఒక చిన్న పాయింట్ ని తీసుకొని ఈ కథ రెడీ చేసారు మేకర్స్. కానీ అసలు గేమ్ సెకండ్ హాఫ్‌ లో ఫెయిల్ అవుతుంది. స్టోరీ ఎటు వెళ్తుందో డైరెక్టర్‌ కే క్లారిటీ లేనట్టు అనిపిస్తుంది. మంచి పాయింట్‌ ని తీసుకుని దాన్ని సరిగ్గా డెవలప్ చేయకపోవడం పెద్ద మైనస్. క్లైమాక్స్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వదు. 


హీరో హీరోయిన్స్ Pradeep Ranganathan, Krithi Shetty పెర్ఫార్మన్స్ బానే ఉన్నా, న్యాచురాలిటీ మిస్ అయింది. మ్యూజిక్, విజువల్స్—all decent. కానీ కంటెంట్ వీక్ అయితే ఏం చేయలేము. బట్ స్టోరీ పాయింట్ బాగుంది. ఆ విషయంలో సో ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. అండ్ సినిమా రెగ్యులర్ మూవీ లవర్స్ కి పెద్దగా ఎక్కకపోవచ్చు గాని, ఫ్రెష్ కాన్సెప్ట్స్ ఇష్టపడే వాళ్లకి సినిమా నచ్చుతుంది. 

Apr 10, 2026 Watch
Mahidhar Vibes
Mahidhar Vibes Youtube Channel
4

Below Average

LIK (Love Insurance Movie Review)

లైక్ (LIK) సినిమా గురించి ఓవరాల్‌గా మాట్లాడితే… ఇది ఒక మంచి కాన్సెప్ట్‌తో వచ్చిన కానీ హాఫ్‌లోనే డ్రాప్ అయిన ఫిల్మ్. ముందుగా ప్లస్ పాయింట్ ఏమిటంటే… 2040 బ్యాక్‌డ్రాప్‌లో మొబైల్‌కు దూరంగా ఉండే హీరో, యాప్స్‌ని నమ్మే హీరోయిన్ అనే ఐడియా చాలా ఇంట్రెస్టింగ్. ఫస్ట్ హాఫ్ కూడా కొంతవరకు బాగానే వర్కౌట్ అవుతుంది...

లైక్ (LIK) సినిమా గురించి ఓవరాల్‌గా మాట్లాడితే… ఇది ఒక మంచి కాన్సెప్ట్‌తో వచ్చిన కానీ హాఫ్‌లోనే డ్రాప్ అయిన ఫిల్మ్. ముందుగా ప్లస్ పాయింట్ ఏమిటంటే… 2040 బ్యాక్‌డ్రాప్‌లో మొబైల్‌కు దూరంగా ఉండే హీరో, యాప్స్‌ని నమ్మే హీరోయిన్ అనే ఐడియా చాలా ఇంట్రెస్టింగ్. ఫస్ట్ హాఫ్ కూడా కొంతవరకు బాగానే వర్కౌట్ అవుతుంది. కొన్నిచోట్ల ఫన్, కొన్నిచోట్ల కాన్సెప్ట్—all mix అయి ఓకే ఫీల్ ఇస్తుంది.

స్టోరీ ఎటు వెళ్తుందో కూడా క్లారిటీ ఉండదు. మంచి పాయింట్ ఉన్నా, దాన్ని డెవలప్ చేయడంలో డైరెక్టర్ పూర్తిగా మిస్ అయ్యాడు. క్లైమాక్స్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వదు.


ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే… Pradeep Ranganathan తన స్టైల్‌లో బాగానే చేశాడు. Krithi Shetty క్యూట్‌ గా కనిపించింది. S. J. Suryah పాత్ర మాత్రం సీరియస్‌ గా ఉండాల్సిన చోట కామెడీగా మారిపోవడం కొంచెం మైనస్. టెక్నికల్‌ గా సినిమా ఓకే—మ్యూజిక్, విజువల్స్ బాగానే ఉన్నాయి. కానీ కంటెంట్ స్ట్రాంగ్‌ గా లేకపోవడంతో అవి పూర్తిగా హెల్ప్ చేయలేకపోయాయి. “లైక్” సినిమా… ఐడియా పరంగా స్ట్రాంగ్, కానీ ఎగ్జిక్యూషన్ పరంగా వీక్. ఫస్ట్ హాఫ్ ఓకే… సెకండ్ హాఫ్ డ్రాప్… మొత్తానికి యావరేజ్ కంటే కాస్త తక్కువ అనిపించే సినిమా. ఒక ముక్కలో చెప్పాలంటే సొసైటీ లో మొబైల్ పిచ్చోళ్ళు ఉన్నారు, కానీ మొబైల్ ని ఇలా వాడేవాళ్లు లేరు కాబట్టి, LIK సినిమా కి ఇచ్చే రేటింగ్ 2.5.

Apr 10, 2026 Watch
Thyview
Thyview Youtube Channel
4

Below Average

LIK (Love Insurance Movie Review)

“లైక్ (LIK)” గురించి స్ట్రైట్‌ గా చెప్పాలంటే… ఐడియా వినడానికి చాలా ఇంట్రెస్టింగ్‌ గా ఉంటుంది, కానీ సినిమా చూసాక మాత్రం ఆ ఫీల్ అంతగా రాదు. 2040 బ్యాక్‌ డ్రాప్, హీరో మొబైల్‌ కి దూరంగా ఉండటం, హీరోయిన్ యాప్స్‌ ని నమ్మడం, వినగానే “ఇది కొత్తగా ఉంటుంది” అనిపిస్తుంది. కానీ అసలు ప్రాబ్లమ్ సెకండ్ హాఫ్‌లో స్టా...

“లైక్ (LIK)” గురించి స్ట్రైట్‌ గా చెప్పాలంటే… ఐడియా వినడానికి చాలా ఇంట్రెస్టింగ్‌ గా ఉంటుంది, కానీ సినిమా చూసాక మాత్రం ఆ ఫీల్ అంతగా రాదు. 2040 బ్యాక్‌ డ్రాప్, హీరో మొబైల్‌ కి దూరంగా ఉండటం, హీరోయిన్ యాప్స్‌ ని నమ్మడం, వినగానే “ఇది కొత్తగా ఉంటుంది” అనిపిస్తుంది. కానీ అసలు ప్రాబ్లమ్ సెకండ్ హాఫ్‌లో స్టార్ట్ అవుతుంది. కథ ఎటు వెళ్తుందో క్లారిటీ లేకుండా సాగిపోతుంది. మంచి పాయింట్ ఉన్నా, దాన్ని డెవలప్ చేయడంలో డైరెక్టర్ పూర్తిగా మిస్ అయ్యాడు. ఎమోషన్స్ కూడా అంతగా కనెక్ట్ కావు.


Pradeep Ranganathan తన స్టైల్‌లో ఓకే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. Krithi Shetty క్యూట్‌గా కనిపిస్తుంది. S. J. Suryah పాత్ర మాత్రం సీరియస్‌గా ఉండాల్సింది. టెక్నికల్‌గా సినిమా ఓకే. మ్యూజిక్, విజువల్స్ బాగానే ఉన్నాయి. కానీ కంటెంట్ స్ట్రాంగ్‌గా లేకపోతే ఇవి పెద్దగా హెల్ప్ అవ్వవు. ఓవరాల్ గా ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ మూవీతో కం బ్యాక్ ఇవ్వాలని కోరుకోవడం తప్ప ఈ మూవీ కి న్యాయం చేయలేము. అలా న్యాయం చేద్దమని చూస్తే ప్రేక్షకుడు అన్యాయం అయిపోతాడేమో. 

Apr 10, 2026 Watch
Man of Fiction
Man of Fiction Youtube Channel
4

Below Average

LIK (Love Insurance Movie Review)

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా, ఒక మంచి ఐడియాను తీసుకుని, దాన్ని పూర్తిగా వాడుకోలేకపోయిన సినిమాగా నిలుస్తుంది. Love Insurance Kompany లో 2040 బ్యాక్‌డ్రాప్‌ లో, టెక్నాలజీకి దూరంగా ఉండే హీరో… యాప్స్‌పై పూర్తిగా ఆధారపడే హీరోయిన్‌ను ప్రేమించడం అనే లైన్ చాలా మంచి కాన్సెప్ట్. ఇ...

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా, ఒక మంచి ఐడియాను తీసుకుని, దాన్ని పూర్తిగా వాడుకోలేకపోయిన సినిమాగా నిలుస్తుంది. Love Insurance Kompany లో 2040 బ్యాక్‌డ్రాప్‌ లో, టెక్నాలజీకి దూరంగా ఉండే హీరో… యాప్స్‌పై పూర్తిగా ఆధారపడే హీరోయిన్‌ను ప్రేమించడం అనే లైన్ చాలా మంచి కాన్సెప్ట్. ఇది రెలేషన్‌షిప్స్, నమ్మకం, మానవ భావోద్వేగాలపై ఒక డీప్ కామెంటరీగా మారే అవకాశం ఉంది. కానీ సినిమా ఆ లోతులోకి వెళ్లదు. 

Pradeep Ranganathan తన పాత్రలో కంఫర్ట్‌ గా కనిపిస్తాడు. అతని పెర్ఫార్మెన్స్ సినిమాకు కొంత స్టెబిలిటీ ఇస్తుంది. Krithi Shetty రోల్ ఎందుకుందో కూడా తెలీదు. S. J. Suryah పాత్రలో కూడా కొంత మిస్‌యూజ్ అనిపిస్తుంది. 


మొత్తానికి… “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” ఒక మంచి ఐడియాతో ప్రారంభమై, మధ్యలోనే దారి తప్పిన ప్రయాణంలా అనిపిస్తుంది. LIK అని సినిమా టైటిల్ పెట్టాడు గాని, సినిమా చుస్తే లవ్ ఇన్సూరెన్స్ కంపెని లా కాదు, కొంప ముంచే కంపెనీ సినిమాలా ఉంది. 

Apr 10, 2026 Watch
Barbell Pitch Meeting
Barbell Pitch Meeting Youtube Channel
4

Below Average

LIK (Love Insurance Movie Review)

LIK సినిమా గురించి మనం మాట్లాడుకుంటే... స్టోరీ పరంగా 2040లో సెట్ చేస్తాం. హీరో మొబైల్‌ కు దూరంగా ఉంటాడు… హీరోయిన్ మాత్రం యాప్స్‌ నే నమ్ముతుంది. హీరో ఆమెను ప్రేమిస్తాడు… ఆమె యాప్‌ ని నమ్మి ‘నో’ చెబుతుంది… తర్వాత హీరో ఆమెకు ప్రేమ విలువ చెప్పడానికి ట్రై చేస్తాడు సార్!” వినడానికి చాలా కొత్తగా ఉన్నా, Lov...

LIK సినిమా గురించి మనం మాట్లాడుకుంటే... స్టోరీ పరంగా 2040లో సెట్ చేస్తాం. హీరో మొబైల్‌ కు దూరంగా ఉంటాడు… హీరోయిన్ మాత్రం యాప్స్‌ నే నమ్ముతుంది. హీరో ఆమెను ప్రేమిస్తాడు… ఆమె యాప్‌ ని నమ్మి ‘నో’ చెబుతుంది… తర్వాత హీరో ఆమెకు ప్రేమ విలువ చెప్పడానికి ట్రై చేస్తాడు సార్!” వినడానికి చాలా కొత్తగా ఉన్నా, Love Insurance Kompany చాలా ల్యాగ్ ఫీలింగ్ ఇస్తుంది. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో ఏదైనా గుడ్ ఎండింగ్ ఇస్తారనుకుంటే... మొత్తం ఆడియన్స్ ఊహించినట్టుగానే ఉంటుంది. ఇంచు మించు ఎక్కడో స్టార్ట్ అయి, ఇంకెక్కడో ఎండ్ అయినట్టు అయిపోతుంది. 


కథ పూర్తిగా ట్రాక్ తప్పి, మంచి పాయింట్ ఉన్నా దాన్ని సరిగ్గా డెవలప్ చేయకుండా వదిలేశారు. మూవీ లో హీరో, హీరోయిన్ రోల్స్ బాగానే ఉన్నా, పెర్ఫార్మన్స్ పరంగా రొటీన్ గా చేసారు. కొత్తదనం లేదు,

సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే. ఎడిటింగ్, స్క్రీన్‌ప్లే ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉంటుంది… కానీ సెకండ్ హాఫ్? “ఫ్లాట్‌గా పడిపోవడం చాలా ఈజీ. ఫైనల్‌ గా మంచి కాన్సెప్ట్‌ తో స్టార్ట్ అయ్యి… సెకండ్ హాఫ్‌ లో పూర్తిగా డ్రాప్ అయింది. పైగా సినిమా మొత్తం ఫోన్ ఫోన్ ఫోన్ అదే చూపించారు గాని, నటీనటుల సైడ్ నుండి సినిమా చూసినట్టు లేదు.  

Apr 14, 2026 Watch
T2B Live
T2B Live Website
5

Average

LIK (Love Insurance Movie Review)

ముందుగా (LIK) కథ పాయింట్ విషయానికి వస్తే 2040 టైంలో మొబైల్ ఫోన్స్ కి దూరంగా బ్రతికే హీరో మొబైల్ అండ్ యాప్స్ నే నమ్మే హీరోయిన్ ని చూసి ఇష్టపడతాడు, కానీ హీరోయిన్ హీరోని నమ్మకుండా యాప్ ని నమ్మి హీరోకి నో చెబుతుంది. దాంతో హీరోయిన్ కి తన ప్రేమ విలువ తెలియడానికి హీరో ఏం చేశాడు అన్నది మిగిలిన కథ. సినిమా ఫస...

ముందుగా (LIK) కథ పాయింట్ విషయానికి వస్తే 2040 టైంలో మొబైల్ ఫోన్స్ కి దూరంగా బ్రతికే హీరో మొబైల్ అండ్ యాప్స్ నే నమ్మే హీరోయిన్ ని చూసి ఇష్టపడతాడు, కానీ హీరోయిన్ హీరోని నమ్మకుండా యాప్ ని నమ్మి హీరోకి నో చెబుతుంది. దాంతో హీరోయిన్ కి తన ప్రేమ విలువ తెలియడానికి హీరో ఏం చేశాడు అన్నది మిగిలిన కథ. సినిమా ఫస్టాఫ్ వరకు బానే ఉన్నా, సెకెండ్ ఆఫ్ దెబ్బేసింది. సినిమా ఎటు నుండి ఎటో వెళుతూ డైరెక్టర్ మంచి పాయింట్ ను ఏమాత్రం ఆకట్టుకునేలా తీర్చిదిద్డలేక పోయాడు.


ఓవరాల్ గా సినిమాలో ప్రదీప్ మరోసారి తన నటనతో మెప్పించాడు. ఇక కృతి శెట్టి కూడా క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకోగా ఎస్ జే సూర్య రోల్ మరీ కామెడీగా మారిపోయింది. సాంగ్స్ పర్వాలేదు అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఓకే అనిపించింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు బాగానే ఆకట్టుకోగా, సెకెండ్ మాత్రం కంప్లీట్ గా ఫ్లాట్ గా మారిపోయి ఏమాత్రం మెప్పించలేక పోయిందని చెప్పాలి. దాంతో ఓవరాల్ గా సినిమా ఫస్టాఫ్ వరకు బాగానే ఆకట్టుకున్నా, సెకెండ్ ఆఫ్ ను డైరెక్టర్ సరిగ్గా డీల్ చేయకపోవడంతో సినిమా ఎండ్ అయ్యే టైంకి పెద్దగా ఇంప్రెస్ అయితే చేయలేకపోయింది.



Apr 10, 2026 Read Review
Chitra Jyothy
Chitra Jyothy Website
4

Below Average

LIK (Love Insurance Movie Review)

LIK మూవీ రివ్యూ విషయానికి వస్తే... మరో పదిహేనేళ్ళ తర్వాత యూత్‌ టెక్నాలజీకి ఎంతగా బానిసలు అవుతారో చూపించిన సినిమా ఇది. స్వతహాగా పుట్టాల్సిన ప్రేమ, ఇద్దరు మనుషుల మధ్య ఏర్పడే భావోద్వేగాలను యాప్‌ కంట్రోల్ చేయడం, అదే మార్కులు వేయడం అనేది ఊహకు అందేదే. జరగబోయే పరిణామాలను గ్రహించే దర్శకుడు విఘ్నేష్‌ శివన్ ఈ...

LIK మూవీ రివ్యూ విషయానికి వస్తే... మరో పదిహేనేళ్ళ తర్వాత యూత్‌ టెక్నాలజీకి ఎంతగా బానిసలు అవుతారో చూపించిన సినిమా ఇది. స్వతహాగా పుట్టాల్సిన ప్రేమ, ఇద్దరు మనుషుల మధ్య ఏర్పడే భావోద్వేగాలను యాప్‌ కంట్రోల్ చేయడం, అదే మార్కులు వేయడం అనేది ఊహకు అందేదే. జరగబోయే పరిణామాలను గ్రహించే దర్శకుడు విఘ్నేష్‌ శివన్ ఈ కథను రాసుకున్నాడు. అయితే కథగా రాసుకున్నది బాగానే ఉన్నా... దానిని తెర మీద ప్రజెంట్‌ చేసే విషయంలో తడబడ్డాడు. పైగా ప్రదీప్‌ రంగనాథన్‌ అంటేనే నేచురల్ యాక్టర్ అని పేరు. కానీ ఇందులో అది మిస్ అయింది.


అలాగే మూవీలో కృతి నటన సైతం తేలిపోయింది. నటిగా ఆమె తన సత్తాను చాటుకునే సన్నివేశాలే ఇందులో లేవు. బలహీనమైన కథ, కథనం కారణంగా 'లవ్‌ ఇన్యూరెన్స్ కంపెనీ' తేలిపోయింది. అనిరుధ్‌ సమకూర్చిన బాణీలు కూడా ఓ మోస్తరుగానే ఉన్నాయి. ఓవరాల్ గా కొన్ని నెలలుగా ప్రదీప్‌ రంగనాథన్‌ అభిమానులను ఊరిస్తూ వచ్చిన 'లవ్‌ ఇన్సూరెన్స్ కంపెనీ' వారి ఆశలపై నీళ్ళు చల్లింది. విఘ్నేష్‌ శివన్ మ్యాజిక్‌ వర్కౌట్‌ కాలేదు. వరుసగా వంద కోట్ల సినిమాలు మూడు చేసిన ప్రదీప్‌కు 'లవ్‌ ఇన్సూరెన్స్ కంపెనీ' సక్సెస్ విషయంలో ఎలాంటి అస్యూరెన్స్ ఇచ్చే ఛాన్స్ కనిపించడంలేదు.

Apr 10, 2026 Read Review
Venky Reviews
Venky Reviews Twitter Channel
5

Average

LIK (Love Insurance Movie Review)

LIK ఒక ఫ్యూచరిస్టిక్ రొమ్-కామ్‌గా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, సెటప్‌తో వచ్చినా… ఎగ్జిక్యూషన్ మాత్రం నిరాశపరుస్తుంది. Love Insurance Kompanyఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బిల్డింగ్. కొన్నిసార్లు అది ఓవర్‌గా అనిపించినా, ఫస్ట్ హాఫ్‌లో కొంత ఫన్ క్రియేట్ చేస్తుంది. కాన్సెప్ట్‌లో మంచి పొటెన్ష...

LIK ఒక ఫ్యూచరిస్టిక్ రొమ్-కామ్‌గా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, సెటప్‌తో వచ్చినా… ఎగ్జిక్యూషన్ మాత్రం నిరాశపరుస్తుంది. Love Insurance Kompany


ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బిల్డింగ్. కొన్నిసార్లు అది ఓవర్‌గా అనిపించినా, ఫస్ట్ హాఫ్‌లో కొంత ఫన్ క్రియేట్ చేస్తుంది. కాన్సెప్ట్‌లో మంచి పొటెన్షియల్ ఉన్నా, దాన్ని స్క్రీన్‌పై సరైన విధంగా ప్రెజెంట్ చేయలేకపోయారు.


సెకండ్ హాఫ్‌లో స్టోరీ బలహీనత బయటపడుతుంది. కథ చాలా తేలికగా అనిపిస్తూ, సినిమా ఎక్కడికీ వెళ్లకుండా లాగ్ అయిన ఫీలింగ్ ఇస్తుంది. మధ్య మధ్యలో Pradeep Ranganathan, S. J. Suryah స్టైల్‌లో వచ్చే కొన్ని ఫన్ మోమెంట్స్ మాత్రమే వర్కౌట్ అవుతాయి. కానీ అవి మొత్తం సినిమాను నిలబెట్టే స్థాయిలో ఉండవు.


ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం టాప్ నాచ్‌గా ఉన్నాయి. విజువల్స్, మేకింగ్ పరంగా మంచి క్వాలిటీ కనిపిస్తుంది. ఓవరాల్‌గా కొన్ని చోట్ల మాత్రమే ఫన్ వర్కౌట్ అయినా, మొత్తం సినిమా మాత్రం బిలో పార్‌గా అనిపిస్తుంది.


రేటింగ్: 2.25/5

Apr 10, 2026 Read Review
TV9 Telugu
TV9 Telugu News Channel
5

Average

LIK (Love Insurance Movie Review)

టెక్నాలజీతో ముడిపడి ఉన్న భవిష్యత్తులో ప్రేమ అనే కాన్సెప్ట్ వినడానికి చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంది. కానీ, దర్శకుడు దాన్ని పైపైన మాత్రమే టచ్ చేశాడు తప్ప, డెప్త్‌లోకి వెళ్లలేదు. 2040 నాటి ఫ్యూచరిస్టిక్ సెటప్ ప్రస్తుత సమాజానికే అద్దం పట్టినట్లు ఉంటుంది కానీ, భవిష్యత్తును చూస్తున్నామనే ఫీలింగ్ కలగదు. అ...

టెక్నాలజీతో ముడిపడి ఉన్న భవిష్యత్తులో ప్రేమ అనే కాన్సెప్ట్ వినడానికి చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంది. కానీ, దర్శకుడు దాన్ని పైపైన మాత్రమే టచ్ చేశాడు తప్ప, డెప్త్‌లోకి వెళ్లలేదు. 2040 నాటి ఫ్యూచరిస్టిక్ సెటప్ ప్రస్తుత సమాజానికే అద్దం పట్టినట్లు ఉంటుంది కానీ, భవిష్యత్తును చూస్తున్నామనే ఫీలింగ్ కలగదు. అలాగే ఆర్గానిక్ వరల్డ్ అనే కాన్సెప్ట్ కూడా కృత్రిమంగా అనిపిస్తుందే తప్ప కన్విన్సింగ్‌గా లేదు. లీడ్ పెయిర్ మధ్య ఎమోషనల్ కనెక్షన్, సరైన కాన్ఫ్లిక్ట్ లేకపోవడం వల్ల కథనం వీక్ అయిపోయింది. ఒక ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీకి ఎమోషనల్ డెప్త్ చాలా అవసరం.


యోగి బాబు లాంటి కమెడియన్ ఉన్నా, కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రేక్షకులను కట్టిపడేసేలా ఒక్క బలమైన సన్నివేశం కూడా లేకపోవడం, ఫీల్ గుడ్ ఎమోషన్స్ మిస్ అవ్వడం కథనంలోని అతిపెద్ద లోపం. ఇక టెక్నికల్ గా అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ పెద్దగా ఎక్కలేదు. ప్రదీప్ ఇ రాఘవ్ ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ, విజువల్స్ పర్వాలేదనిపించినా, దర్శకుడు విఘ్నేష్ శివన్ ఎంచుకున్న పాయింట్ బాగున్నా, దాన్ని ఎంగేజింగ్‌గా తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేయలేకపోయింది. ఓవరాల్ గా LIK.. నైస్ కాన్సెప్ట్.. వీక్ ఎగ్జిక్యూషన్..!

Apr 10, 2026 Read Review
One India
One India Website
5

Average

LIK (Love Insurance Movie Review)

LIK సినిమా విషయానికి వస్తే... 2040 నాటికి టెక్నాలజీ పీక్స్ లోకి వెళ్తుంది. మొబైల్ కు అడిక్ట్ అయిన ఓ అమ్మాయి.. యాప్స్ ను పిచ్చి పిచ్చిగా వాడేస్తూ ఉంటుంది. అయితే ఆ అమ్మాయిని చూసి ఓ కుర్రాడు తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. అయితే ప్రతీ ముఖ్యమైన విషయానికి ఇన్సూరెన్స్ చేసుకునే ప్రజలు.. ప్రేమకు ఇన్సూరెన్స్...

LIK సినిమా విషయానికి వస్తే... 2040 నాటికి టెక్నాలజీ పీక్స్ లోకి వెళ్తుంది. మొబైల్ కు అడిక్ట్ అయిన ఓ అమ్మాయి.. యాప్స్ ను పిచ్చి పిచ్చిగా వాడేస్తూ ఉంటుంది. అయితే ఆ అమ్మాయిని చూసి ఓ కుర్రాడు తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. అయితే ప్రతీ ముఖ్యమైన విషయానికి ఇన్సూరెన్స్ చేసుకునే ప్రజలు.. ప్రేమకు ఇన్సూరెన్స్ ఎందుకు చేసుకోరు.. ప్రేమకు కూడా ఇన్సూరెన్స్ ఉండాలని LIK అనే యాప్ ను సృష్టిస్తాడు ఓ ప్రముఖ వ్యక్తి. హీరోయిన్ కూడా ఈ యాప్ ద్వారానే హీరోతో కనెక్ట్ అవుతుంది. అయితే ఓ రోజు హీరోయిన్ కు ఈ యాప్ లో హీరో మోసం చేశాడని చూపిస్తుంది. దాంతో ఇద్దరి మధ్య బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ మూవీ స్టోరీ లైన్.


అయితే స్టోరీ లైన్ బానే ఉన్నా, స్క్రీన్ ప్లే తో ఏమాత్రం మెప్పించలేదు దర్శకుడు విగ్నేష్ శివన్. పైగా చాలా రొటీన్ సీన్లతో ఫ్రెష్ సీన్లు లేకుండా ఆడియన్స్ కి బోర్ ఫీల్ వస్తుంది. సాంగ్స్ కూడా పెద్దగా ప్రభావం చూపకపోగా, ప్రదీప్ మార్క్ సినిమా అయితే కాదని చెప్పొచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా ఒకసారి చూడాలనుకుంటే ట్రై చేయొచ్చు. లేదంటే నిరాశ తప్పదు. 

Apr 10, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
4

Below Average

LIK (Love Insurance Movie Review)

సాధారణంగా ప్రదీప్ రంగనాథన్ సినిమాలు యూత్ కి ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ‘లవ్ టుడే’ వంటి బ్లాక్ బస్టర్ చూసిన తర్వాత ‘డ్రాగన్’ చూస్తున్నామని, ఒక నిరీక్షణతో అంచనాలు పెంచుకుని ఈ సినిమా చూస్తారు. దాదాపుగా LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా కూడా అలాంటి స్టోరీనే. అయితే ఈ సినిమా కథలో ప్రదీప్ ఇన్వాల్వ్మెంట...

సాధారణంగా ప్రదీప్ రంగనాథన్ సినిమాలు యూత్ కి ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ‘లవ్ టుడే’ వంటి బ్లాక్ బస్టర్ చూసిన తర్వాత ‘డ్రాగన్’ చూస్తున్నామని, ఒక నిరీక్షణతో అంచనాలు పెంచుకుని ఈ సినిమా చూస్తారు. దాదాపుగా LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా కూడా అలాంటి స్టోరీనే. అయితే ఈ సినిమా కథలో ప్రదీప్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందో తెలియదు కానీ, విఘ్నేష్ శివన్ రాసుకున్న కథ కొంత రిలేటబుల్ గానే అనిపించింది. సినిమా మొదలు 2040లో జరుగుతున్నట్టు చూపించినా కూడా, ఇప్పటి యూత్ సమస్యలను ఎత్తి చూపించేలా ఈ కథ ఉంటుంది.


నిజానికి ఫోన్ హీరోలా నిలబడిన మనిషి అనిపించినా, అతనికి ఫోన్ తోనే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి కూడా ఉంటాయి. అలాగే ఫోన్ మనుషుల్ని కంట్రోల్ చేసే పరిస్థితులు కూడా ఈరోజుల్లో కనిపిస్తున్నాయి అని ఆలోచన ఎక్కడో ఉంటుంది, బహుశా దాన్ని ఒక ఆసక్తికరమైన లైన్ గా రాసుకున్నట్లున్నారు దర్శకుడు. ఓవరాల్ గా LIK ప్రదీప్ రంగనాథన్, విగ్నేష్ శివన్ మార్క్ సినిమా అయితే కాదు. ఎలాంటి అంచనాలు లేకుండా ఒకసారి థియేటర్లలో ట్రై చేయొచ్చు. 

Apr 10, 2026 Read Review
Great Andhra
Great Andhra Website
4

Below Average

LIK (Love Insurance Kompany)

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాన్సెప్ట్‌ కి సోషల్ మీడియా యాంగిల్ జోడిస్తూ వచ్చిన ఈ సినిమా… ఆలోచన స్థాయిలో బాగానే అనిపించినా, అమలులో మాత్రం బలహీనంగా మారింది. కథ మొదట్లో కొంత ఆసక్తి కలిగించినా, హీరో ప్రేమలో పడిన తర్వాత నరేషన్ నెమ్మదిగా సాగుతూ ఎంగేజ్ చేయలేకపోయింది. కథ పాయింట్ ని కూడా బలంగా డెవలప్ చేయకపోవడంతో సిన...

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాన్సెప్ట్‌ కి సోషల్ మీడియా యాంగిల్ జోడిస్తూ వచ్చిన ఈ సినిమా… ఆలోచన స్థాయిలో బాగానే అనిపించినా, అమలులో మాత్రం బలహీనంగా మారింది. కథ మొదట్లో కొంత ఆసక్తి కలిగించినా, హీరో ప్రేమలో పడిన తర్వాత నరేషన్ నెమ్మదిగా సాగుతూ ఎంగేజ్ చేయలేకపోయింది. కథ పాయింట్ ని కూడా బలంగా డెవలప్ చేయకపోవడంతో సినిమా మోనోటనీకి గురైంది. క్యారెక్టర్స్ డిజైన్ కూడా పూర్తిగా రొటీన్‌ గా ఉండటం ప్రధాన లోపం. పలు సన్నివేశాలు ఇప్పటికే చూసిన సినిమాలను గుర్తు చేస్తాయి.


కామెడీ కూడా ఎక్కువగా వర్కౌట్ కాలేదు. యోగిబాబు ఉన్నప్పటికీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ మీదే ఆధారపడటం వల్ల నవ్వులు సహజంగా రాలేదు. క్లైమాక్స్ భాగం అనవసరంగా లాగడం వల్ల సినిమా మీద ఉన్న ఆసక్తి మరింత తగ్గుతుంది. సంగీత దర్శకుడు అనిరుధ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగున్నా, మొత్తం సినిమాను నిలబెట్టే స్థాయిలో లేదు. మొత్తంగా చెప్పాలంటే, మంచి కాన్సెప్ట్‌ను రొటీన్ ట్రీట్‌మెంట్‌తో తీసిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

Apr 10, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
6

Above Average

LIK (Love Insurance Kompany) Movie Review

LIK అంటూ ఈ వారం విడుదలైన తమిళ్ డబ్బడ్ మూవీ ఆడియన్స్ నుండి బీలో యావరేజ్ పార్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమాలో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి, ఎస్‌జే సూర్య బాగా ఎంటర్టైన్ చేసారు. కథ పరంగా రొటీన్ గానే ఉండగా, దర్శకుడు విగ్నేష్ శివన్ వీలైనంత ఎంటర్తైనింగ్ గా సినిమాను తెరకెక్కించడానికి ట్రై చేసాడు. ఇక సాంకే...

LIK అంటూ ఈ వారం విడుదలైన తమిళ్ డబ్బడ్ మూవీ ఆడియన్స్ నుండి బీలో యావరేజ్ పార్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమాలో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి, ఎస్‌జే సూర్య బాగా ఎంటర్టైన్ చేసారు. కథ పరంగా రొటీన్ గానే ఉండగా, దర్శకుడు విగ్నేష్ శివన్ వీలైనంత ఎంటర్తైనింగ్ గా సినిమాను తెరకెక్కించడానికి ట్రై చేసాడు. ఇక సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ తో కొన్ని సీన్లలో కేక పెట్టించాడు. రవివర్మన్ ఫోటోగ్రఫి, ఫ్యూచర్ వరల్డ్‌ను సృష్టించిన విధానం బాగుంది. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ వర్క్ హైలెట్‌గా అనిపిస్తాయి. 


ఓవరాల్ గా మొబైల్ ఫోన్లు చేస్తున్న జీవన విధ్వంసాన్ని కథగా రూపొందించిన లవ్, రొమాంటిక్, ఫూచరిస్టిక్ సినిమా ఈ LIK. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని త్రివిక్రమ్ కొడుకు డైరెక్టర్‌గా అల్లు అర్జున్ సినిమా అంటూ.. చిరంజీవి మనవడు హీరోగా సినిమా అంటూ కొన్ని రెఫరెన్స్‌ లు తెలుగు ఆడియెన్స్‌ను కనెక్ట్ చేసేలా ఉంటాయి. సోషల్ మీడియాలో వాడే భాషను డైలాగ్స్‌ గా మలిచిన విధానం యూత్‌ఫుల్‌ గా ఉన్నాయి. మొబైల్ ఫోన్ల వాడకాన్ని వ్యతిరేకించే వారు, సోషల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటూ యాప్‌ లను వాడే యూత్‌ కు ఈ సినిమా నచ్చడానికి చాలా అంశాలు ఉన్నాయి. ప్రొడక్షన్ పరంగా రిచ్, క్లాస్, డీసెంట్ మేకింగ్ వాల్యూస్ ఉన్నాయి. ఫన్‌ తో సాగే ఈ సినిమాను చక్కగా ఎంజాయ్ చేయవచ్చు.

Apr 10, 2026 Read Review
Tupaki
Tupaki Website
5

Average

LIK (Love Insurance Kompany) Movie Review

ప్రదీప్ రంగనాథన్ మెయిన్ లీడ్ లో నటించిన LIK థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, రివ్యూ విషయానికి వస్తే... మొబైల్ యాప్ మీద ఆధారపడే ఈ కథలో హీరో హీరోయిన్ల రోల్స్ అంత సరిగా రాసుకోలేదు. వాళ్ళ పెర్ఫార్మన్స్ బాగానే ఉన్నా, మరింత బలంగా ఉండాల్సిందని అనిపిస్తుంది. విలన్ పాత్రలో ఎస్.జె.సూర్య మెప్పించాడు....

ప్రదీప్ రంగనాథన్ మెయిన్ లీడ్ లో నటించిన LIK థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, రివ్యూ విషయానికి వస్తే... మొబైల్ యాప్ మీద ఆధారపడే ఈ కథలో హీరో హీరోయిన్ల రోల్స్ అంత సరిగా రాసుకోలేదు. వాళ్ళ పెర్ఫార్మన్స్ బాగానే ఉన్నా, మరింత బలంగా ఉండాల్సిందని అనిపిస్తుంది. విలన్ పాత్రలో ఎస్.జె.సూర్య మెప్పించాడు. తన పాత్ర వినోదాత్మకంగా సాగుతుంది, మిగతా ఆర్టిస్టులు ఓకే.


 సాంకేతిక పరంగా, అనిరుధ్ రవిచందర్ తన పాటలు.. నేపథ్య సంగీతంతో సినిమాకు తన వంతుగా ఏం చెయ్యాలో అదంతా చేశాడు. రవివర్మన్ ఛాయాగ్రహణం కలర్ ఫుల్ గా సాగింది. నిర్మాణ విలువలు చాలా బావున్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్.. ఒక భిన్నమైన కథను ఎంచుకుని ప్రయోగం చేయడం వరకు బాగుంది. ఈ కొత్త ఐడియాను ఒక దశ వరకు బాగానే నడిపించాడు. కామెడీ సీన్స్ విషయంలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కానీ కాన్ఫ్లిక్ట్ తర్వాత మాత్రం సినిమాను సరిగా ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. ద్వితీయార్ధంలో ఏం చేయలేని అశక్తుడు అయిపోయాడు. సినిమాను సగం వండిన వంటకంలా తయారు చేశాడు.

Apr 10, 2026 Read Review
Gulte
Gulte Website
4

Below Average

LIK (Love Insurance Kompany) Movie Review

ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన LIK తాజాగా థియేటర్లలో విడుదలై బీలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ + సోషల్ మీడియా కాన్సెప్ట్‌ తో స్టార్ట్ అయిన ఈ సినిమా మొదట్లో కొంచెం ఇంట్రెస్ట్ కలిగించినా… మెల్లిగా ట్రాక్ తప్పుతుంది. ఐడియా బాగున్నా, దాన్ని స్క్రీన్‌పై చూపించిన విధానం మాత్రం చాలా వీక్‌గ...

ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన LIK తాజాగా థియేటర్లలో విడుదలై బీలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ + సోషల్ మీడియా కాన్సెప్ట్‌ తో స్టార్ట్ అయిన ఈ సినిమా మొదట్లో కొంచెం ఇంట్రెస్ట్ కలిగించినా… మెల్లిగా ట్రాక్ తప్పుతుంది. ఐడియా బాగున్నా, దాన్ని స్క్రీన్‌పై చూపించిన విధానం మాత్రం చాలా వీక్‌గా అనిపిస్తుంది. స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ నెమ్మదిగా మారి, చివరకు లాగ్ అయ్యే ఫీలింగ్ ఇస్తుంది. ప్రదీప్ రంగనాథన్ – ఎస్‌జే సూర్య మధ్య వచ్చే ఛాలెంజ్ ట్రాక్ కూడా బాగానే స్టార్ట్ అవుతుంది కానీ దాన్ని సరిగా యూజ్ చేయలేదు. మధ్యలో వచ్చే సన్నివేశాలు చాలావరకు రొటీన్‌గా, ముందే ఊహించగలిగేలా ఉంటాయి. 


కొత్త కాన్సెప్ట్ తీసుకున్నా… ప్రెజెంటేషన్ మాత్రం పాత స్టైల్‌లోనే ఉండటం పెద్ద మైనస్. కామెడీ కూడా పూర్తిగా వర్కౌట్ కాలేదు. యోగిబాబు ఉన్నా, ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ మీదే డిపెండ్ అవ్వడం వల్ల నేచురల్ ఫన్ మిస్సైంది. క్లైమాక్స్ అయితే పూర్తిగా స్ట్రెచ్ చేసి, మరింత బోర్ ఫీల్ ఇస్తుంది. పెర్ఫార్మెన్స్ పరంగా ప్రదీప్ రంగనాథన్ తన స్టైల్‌ లో చేశాడు. కానీ కథ బలహీనంగా ఉండటం వల్ల అతని ఎఫర్ట్ కూడా పెద్దగా ఉపయోగపడలేదు. కృతి శెట్టి ఓకే… ఎస్‌జే సూర్య మాత్రం మళ్లీ అదే స్టైల్‌తో రిపీట్ ఫీల్ ఇస్తాడు. అనిరుధ్ మ్యూజిక్ కొంతవరకు హెల్ప్ చేసినా… సినిమాను సేవ్ చేయలేకపోయింది. మొత్తానికి… మంచి ఐడియాను సరైన విధంగా హ్యాండిల్ చేయకపోవడం వల్ల ఈ సినిమా పూర్తిగా నిరాశపరుస్తుంది. 

Apr 10, 2026 Read Review
123telugu
123telugu Website
5

Average

Lik Love Insurance Kompany movie Review

ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన LIK (Love Insurance Kompany) లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. కథ పరంగా ఫ్యూచర్ లో నడుస్తుండగా, లవ్ ని కూడా నిజమా? ఫేక్ ఆ అని యాప్ డిసైడ్ చేస్తే ఏంటి అన్న నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ కాన్సెప్ట్ బానే ఉన్నా, స్క్రీన్ ప్ల...

ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన LIK (Love Insurance Kompany) లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. కథ పరంగా ఫ్యూచర్ లో నడుస్తుండగా, లవ్ ని కూడా నిజమా? ఫేక్ ఆ అని యాప్ డిసైడ్ చేస్తే ఏంటి అన్న నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ కాన్సెప్ట్ బానే ఉన్నా, స్క్రీన్ ప్లే అంతగా లేదు. కొన్ని సీన్స్ డల్ గా సాగుతాయి. ఎంటర్టైన్మెంట్ ఉన్నా కొత్తదనం ఉండదు.


డల్ గా సాగే ఫ్యూచరిస్టిక్ లవ్ డ్రామా అని చెప్పొచ్చు. ఇందులో మెప్పించే అంశాలు కంటే వీక్ గా అనిపించే అంశాలే ఎక్కువ కనిపిస్తాయి. దర్శకుడు ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్ ఇందులో మిస్ ఫైర్ అయ్యింది. సో ఈ లవ్ అండ్ ఇన్సూరెన్స్ సినిమా ఆడియెన్స్ ని అంతగా మెప్పించదు.



Apr 10, 2026 Read Review
ABP Desam
ABP Desam Website
4

Below Average

LIK (Love Insurance Kompany) Movie Review

ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన LIK తాజాగా థియేటర్లలో విడుదలై బీలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సినిమా గురించి సింపుల్ గా చెప్పాలంటే.. అబ్బాయికి లవ్ ఎట్ ఫస్ట్ సైట్… అమ్మాయి సోషల్ మీడియా ఎడిక్ట్ అనే పాయింట్ తో ఇంట్రెస్టింగ్‌ గా మొదలవుతుంది. అక్కడ్నుంచి హీరో హీరోయిన్ దక్కించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చ...

ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన LIK తాజాగా థియేటర్లలో విడుదలై బీలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సినిమా గురించి సింపుల్ గా చెప్పాలంటే.. అబ్బాయికి లవ్ ఎట్ ఫస్ట్ సైట్… అమ్మాయి సోషల్ మీడియా ఎడిక్ట్ అనే పాయింట్ తో ఇంట్రెస్టింగ్‌ గా మొదలవుతుంది. అక్కడ్నుంచి హీరో హీరోయిన్ దక్కించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసాడనేది కథ. కానీ ఆ ఐడియాకు తగ్గ సీన్స్ మాత్రం పడలేదు. సినిమా స్టార్ట్‌లో బాగానే పికప్ ఉన్నా, తర్వాత నెమ్మదిగా సాగుతుంది. ప్రదీప్ రంగనాథన్ – ఎస్‌జే సూర్య మధ్య ఛాలెంజ్ ట్రాక్ బాగున్నా, అక్కడి నుంచి ఎండింగ్ వరకు స్టోరీ లాగ్ అవుతుంది. కొత్త కాన్సెప్ట్ తీసుకున్నా, ట్రీట్‌మెంట్ మాత్రం ఓల్డ్ ప్యాటర్న్‌ లోనే ఉంది.


కామెడీ విషయంలో యోగిబాబు కొన్ని చోట్ల నవ్వించినా, ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగ్స్‌పై ఆధారపడ్డారు. క్లైమాక్స్ కూడా సాగదీసిన ఫీలింగ్ ఇస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథన్ తన స్టైల్‌లో బాగానే చేశాడు. కృతి శెట్టి క్యూట్‌గా కనిపించి ఓకే అనిపించింది. ఎస్‌జే సూర్య పాత్ర మాత్రం రిపిటేటివ్‌గా అనిపిస్తుంది. అనిరుధ్ మ్యూజిక్ మాత్రం ప్లస్. ఓవరాల్‌గా “లైక్”లో కాన్సెప్ట్ బాగున్నా… ఎగ్జిక్యూషన్ వీక్. కొంత కామెడీ తప్ప సినిమా పూర్తిగా ఎంగేజ్ చేయదు. 

Apr 10, 2026 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

Story : కథ విషయానికి వస్తే... 2040 ఫ్యూచర్ లో ఈ మూవీ కథ నేపథ్యం నడుస్తుంది. సమాజంలో ఆ కాలానికి తగ్గట్టు అన్నీ అడ్వాన్స్ టెక్నాలజీస్ అందుబాటులోకి రాగా, అడ్వాన్స్డ్ జెనరేషన్ కి తగ్గట్టు, సొసైటీ లో ప్రేమ పేరుతో మోసపోయే వారికి పరిష్కారం, అలాగే ప్రేమకు కూడా ఇన్సూరెన్స్ ఉండాలనే ఉద్దేశంతో సూర్య (SJ. సూర్య) యాప్ ఆధారిత లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK) స్థాపిస్తాడు. ఈ యాప్ కి మంచి రెస్పాన్స్ వచ్చి పాపులర్ అవుతుంది. అయితే ఈ యాప్ ద్వారానే వాసు (Pradeep Ranganathan), ధీమా (KrithiShetty) కలుసుకుంటారు. అయితే ఆర్గానిక్ వరల్డ్ లో జీవించే వాసు, LIK యాప్ అడిక్ట్ అయిన ధీమా ఈ యాప్ రిజిస్టర్ చేసుకుని లవ్ లో ఉంటారు. అయితే ఈ LIK యాప్ ద్వారా సూర్య పెట్టిన లవ్ టెస్ట్ లో ఫెయిల్ అవుతారు. దాంతో ధీమా, వాసు దూరమవుతారు. ఈ క్రమంలో  తన ప్రేమను ప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి యాప్ అవసరం లేదని... LIK కంపెనీకి వ్యతిరేకంగా ఆ యాప్ డేటా అంతా తప్పు అని నిరూపించాలని ఫిక్స్ అయ్యి అదే కంపెనీలో ఉద్యోగం చేస్తాడు. మరి వాసు ధీమా దగ్గర తన ప్రేమను నిరూపించుకుని సక్సెస్ అయ్యాడా? సూర్య LIK యాప్ తప్పని నిరూపించాడా? ఫైనల్ గా వాసు - ధీమా ఒక్కటయ్యారా లేదా? అనేది కథ.

Technical values : LIK సినిమా కథ నేపథ్యం ఫ్యూచర్ నేపథ్యంలో నడుస్తుంది. అది సినిమాకు మంచి ప్లస్ అయింది. ఇక డిఫరెంట్ లవ్ స్టోరీస్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో కం డైరక్టర్ ప్రదీప్ రంగనాథన్ ఇలాంటి ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీ కథలోకి హీరోగా పూర్తిగా సెట్ అయ్యాడు. అలాగే ఫ్యూచర్ కి సంబంధించిన వాతావరణానికి తగ్గట్టు మేకర్స్ సెట్ చేసుకున్న సెట్స్ అండ్ టెక్నాలజీ కూడా బాగున్నాయి. ఇక ప్రదీప్ రంగనాథన్ తన పాత్రలో చాలా బాగా నటించాడు. ప్రేమలో నలిగిపోయే కుర్రాడిగా ఇలాంటి పాత్రలు చేయడం తనకు కొట్టిన పిండి అనొచ్చు. అలాగే కృతి శెట్టి కూడా తన రోల్ లో డీసెంట్ పెర్ఫార్మన్స్ అందించింది. అలాగే ఎస్ జే సూర్య, యోగిబాబు, గౌరీ జి కిషన్ వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించారు. 

అయితే ఈ సినిమాలో ఒక్క ఫ్యూచర్ స్టోరీ అన్న పాయింట్ తప్ప మిగతా నేపథ్యం అంతా రొటీన్ గా ఉంటుంది. అది మూవీకి మైనస్ అయింది. కాకపోతే స్క్రీన్ ప్లే పరంగా బాగా రాసుకుని ఆడియన్స్ ని బానే ఎంటర్టైన్ చేసాడు దర్శకుడు విగ్నేష్. ఎమోషన్స్ పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. అలాగే హీరో విలన్ మధ్య కొన్ని సీన్స్ చూస్తుంటే పలు సినిమా సీన్స్ గుర్తుకురాక మానదు. టెక్నికల్ గా చూసుకుంటే... ప్రొడక్షన్స్ వాల్యూస్ బాగున్నాయి. కాకపోతే తెలుగు వెర్షన్ కి సంబంధించి VFX పై మరింత ఫోకస్ పెట్టాల్సింది. అనిరుద్ సంగీతం పర్లేదు. కొన్ని సీన్స్ ఎడిట్ చేయాల్సింది. 

Final Review : ఇక ఓవరాల్ గా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK) అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ డబ్ మూవీ రొటీన్ గా లవ్ డ్రామాగా ఆడియన్స్ ని కాస్త డిస్సపాయింట్ చేస్తుంది. రెగ్యులర్ మూవీ లవర్స్ ఒకసారి ట్రై చేయొచ్చు. ఫ్రెష్ నెస్ కోరుకుంటే నిరాశ తప్పదు.

Review Statistics

4.6
Overall Rating
Avg. of all reviews
17
Total Reviews
From 4 Provider Types

Review Average

Media
4.6/10
Public
N/A