Register as a Reviewer
Kaantha Movie Review (కాంత మూవీ రివ్యూ)

Kaantha Movie Review (కాంత మూవీ రివ్యూ)

14 Nov 2025
Overall Rating
5.3/10
11 Reviews

టాలెంటెడ్ మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన మూవీ "కాంత". ఓ స్టార్ హీరో పాత్రని బేస్ చేసుకుని తెరకెక్కిన ఈ సినిమాకు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించగా, రానా ప్రత్యేక పాత్రలో నటించాడు.

Director: Selvamani Selvaraj
Cast: Dulquer Salman, P. Samuthirakani, Bhagyashri Borse, Rana Daggubati

Available in:

Reviews

What critics and the public are saying about Kaantha Movie Review (కాంత మూవీ రివ్యూ)

Media Reviews

10 Avg: 5.1/10
Ragadi
Ragadi Youtube Channel
6

Above Average

Kaantha Movie Review

దుల్కర్ సల్మాన్, భాగ్య శ్రీ బోర్సే మెయిన్ లీడ్ గా, రానా, సముద్ర ఖని కీ రోల్స్ ప్లే చేసిన మూవీ "కాంత" సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన మూవీని రానా, దుల్కర్ కలిసి ప్రొడ్యూస్ చేసారు. ఇక కాంత విషయానికి వస్తే.. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోతెరకెక్కగా, కొంతమంది ఆడియన్స్ కి ఈ సినిమా మాస్టర్ పీస్ లా అనిపిస్త...

దుల్కర్ సల్మాన్, భాగ్య శ్రీ బోర్సే మెయిన్ లీడ్ గా, రానా, సముద్ర ఖని కీ రోల్స్ ప్లే చేసిన మూవీ "కాంత" సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన మూవీని రానా, దుల్కర్ కలిసి ప్రొడ్యూస్ చేసారు. ఇక కాంత విషయానికి వస్తే.. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోతెరకెక్కగా, కొంతమంది ఆడియన్స్ కి ఈ సినిమా మాస్టర్ పీస్ లా అనిపిస్తుంది. పూర్తిగా నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమా కావడంతో ఒక వర్గం ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది. టెక్నికల్ గా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సినెమాట్రోగ్రఫీ టాప్ లో ఉంది. అలాగే నైట్ విజువల్స్ కూడా సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఆడియన్స్ 1950 లోకి వెళ్ళిపోతారు. రెగ్యులర్ మూవీ లవర్స్ కి వాళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ని బట్టి నచ్చే అవకాశం ఉంది, కానీ స్క్రీన్ ప్లే స్లో ఉండడం వల్ల మెజారిటీ ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ థియేటర్లో మస్ట్ వాచబుల్ వర్త్ మూవీ కాంత. ఒకవేళ థియేటర్లో మిస్ అయితే ఓటిటి లో అయినా చూసి తీరాల్సిందే.

Nov 14, 2025 Watch
Thyview
Thyview Youtube Channel
5

Average

Kaantha Movie Review

దుల్కర్ సల్మాన్, భాగ్య శ్రీ బోర్సే మెయిన్ లీడ్ గా నటించిన మూవీ "కాంత". రానా, దుల్కర్ సల్మాన్ కలిసి ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీలో సముద్రఖని, రానా కీ రోల్స్ లో నటించారు. ఇక సినిమా వరకు పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు కాబట్టి, డెఫినెట్ గా ఒక టైప్ అఫ్ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. మూవీ లో కథ ప్లస్...

దుల్కర్ సల్మాన్, భాగ్య శ్రీ బోర్సే మెయిన్ లీడ్ గా నటించిన మూవీ "కాంత". రానా, దుల్కర్ సల్మాన్ కలిసి ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీలో సముద్రఖని, రానా కీ రోల్స్ లో నటించారు. ఇక సినిమా వరకు పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు కాబట్టి, డెఫినెట్ గా ఒక టైప్ అఫ్ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. మూవీ లో కథ ప్లస్ పాయింట్ అయినా, స్క్రీన్ ప్లే డల్ అయింది. కానీ టెక్నికల్ గా సినిమా చాలా బాగా తీశారు. డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ ని ఈ విషయంలో అభినందించాలి . అలాగే సినిమాట్రోగ్రఫీ చాలా బాగుంది. ఆ కాలానికి సంబంధించిన ఆర్ట్ సెట్స్ డిజైన్ బాగుంది. కాకపోతే రెగ్యులర్ ఆడియన్స్ కి ఈ మూవీ అంతగా ఇంప్రెస్ చేయలేకపోతోంది. క్లయిమాక్స్ ట్విస్ట్ థ్రిల్ ఫీల్ ఇస్తుంది. కానీ ఆయా పాత్రల ముగింపు అంతగా పర్ఫెక్ట్ గా లేదు. డైరెక్టర్ ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది. థియేటర్లో అంతగా ఆకట్టుకోలేకపోయినా, ఓటిటి లో ఆడియన్స్ ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు.

Nov 14, 2025 Watch
N
News18Telugu Website
5

Average

Kaantha Movie Review

సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో ఆడియన్స్ కి దగ్గరైన దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా "కాంత". సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించగా, రానా, దుల్కర్ కలిసి సినిమా నిర్మించారు. కాంత విషయానికి వస్తే.. మీకు రెగ్యులర్ మసాలా సినిమాలు బోర్ కొట్టి, ఒక మంచి రియలిస్టిక్ డ్రామా చూడాలనుకుంటే కాంత బెస...

సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో ఆడియన్స్ కి దగ్గరైన దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా "కాంత". సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించగా, రానా, దుల్కర్ కలిసి సినిమా నిర్మించారు. కాంత విషయానికి వస్తే.. మీకు రెగ్యులర్ మసాలా సినిమాలు బోర్ కొట్టి, ఒక మంచి రియలిస్టిక్ డ్రామా చూడాలనుకుంటే కాంత బెస్ట్ ఆప్షన్. నటన విషయంలో ఎవరికీ వారే పోటీ పడి మరీ అద్భుతంగా నటించారు. టెక్నికల్ గా కూడా సినిమా నెక్స్ట్ లెవెల్. నైట్ ఎఫెక్ట్‌ ని కెమెరాలో బంధించిన విధానం, సినిమాటోగ్రఫీ మూడ్ చాలా బాగుంటుంది. ఇది స్లో-బర్న్ థ్రిల్లర్ (నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లేది), కాబట్టి ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ ఆశించవద్దు. క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా, బరువుగా ఉంటుంది. కానీ థియేటర్లో మాత్రం కాంతాని ఆడియన్స్ ఆదరించలేదు. ఓటిటి లో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.

Nov 14, 2025 Read Review
4

Below Average

Kaantha Movie Review

దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన తాజా మూవీ "కాంత". భాగ్యశ్రీ బోర్సే, రానా, సముద్రఖని ముఖ్య పాత్రల్లో తెరకెక్కడం జరిగింది. ఇక దర్శకుడు సెల్వరాజ్‌ సెల్వమణి ఎంచుకున్న కథ, డ్రామా చాలా బాగుంది. ఆ డ్రామాని అంతే హృద్యంగా తెరకెక్కించాలని ప్రయత్నించారు. అందులో కొంత వరకు సక్సెస్‌ అయ్యారు. ఈ మూవీ మన తెలుగు ఆడ...

దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన తాజా మూవీ "కాంత". భాగ్యశ్రీ బోర్సే, రానా, సముద్రఖని ముఖ్య పాత్రల్లో తెరకెక్కడం జరిగింది. ఇక దర్శకుడు సెల్వరాజ్‌ సెల్వమణి ఎంచుకున్న కథ, డ్రామా చాలా బాగుంది. ఆ డ్రామాని అంతే హృద్యంగా తెరకెక్కించాలని ప్రయత్నించారు. అందులో కొంత వరకు సక్సెస్‌ అయ్యారు. ఈ మూవీ మన తెలుగు ఆడియెన్స్ కి డ్రైగా అనిపిస్తుంది. మనకు తెలియని సబ్జెక్ట్ కావడమే మైనస్‌గా చెప్పొచ్చు. కాకపోతే కథలో డెప్త్, టేకింగ్‌లో డెప్త్, రూపొందించిన తీరు, ఆర్టిస్ట్ ల నుంచి బెస్ట్ పర్‌ఫెర్మెన్స్ రాబట్టిన తీరు మాత్రం సూపర్‌. సినిమా కోసం పడ్డ కష్టం ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. ఆ విషయంలో దర్శకుడితోపాటు టీమ్‌ అందరిని అభినందించాల్సిందే. టెక్నీకల్‌గా సాలిడ్‌గా ఉండే మూవీ ఇది. ఫైనల్‌గా: `కాంత` కమర్షియల్‌ కోణంలో కాకుండా ఆర్ట్ ఫామ్‌ యాంగిల్‌లో చూస్తే ఆకట్టుకునే మూవీ అవుతుంది. తెరవెనుక విషయాలకు ప్రతిబింబంగా నిలిచే ఈ సినిమాని ఆర్టిస్ట్ ల పర్‌ఫెర్మెన్స్ కోసం చూడొచ్చు.

Nov 14, 2025 Read Review
10TV Telugu
10TV Telugu News Channel
6

Above Average

Kaantha Movie Review

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, రానా, సముద్రఖని ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘కాంత’. వేఫేర్‌ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, స్పిరిట్ మీడియా నిర్మాణంలో దుల్కర్ సల్మాన్, రానా నిర్మాణంలో సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇక సినిమా విషయానికి వస్తే.. దర్శకుడు కథ కొత్తది తీసుక...

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, రానా, సముద్రఖని ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘కాంత’. వేఫేర్‌ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, స్పిరిట్ మీడియా నిర్మాణంలో దుల్కర్ సల్మాన్, రానా నిర్మాణంలో సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇక సినిమా విషయానికి వస్తే.. దర్శకుడు కథ కొత్తది తీసుకున్నా స్క్రీన్ ప్లే మాత్రం రొటీన్ గానే రాసుకున్నారు. సెకండ్ హాఫ్ అయితే రొటీన్ సస్పెన్స్ సినిమాలు చూసినట్టు ఉంటుంది. దర్శకుడు సాంకేతకంగా మాత్రం సినిమాని చాలా ఎత్తుకు తీసుకెళ్లాడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా అప్పటి కాలంకు చెందిన సెట్స్, సెటప్ చాలా బాగా డిజైన్ చేసారు. మొత్తంగా ‘కాంత’ సినిమా ఓ హీరో – డైరెక్టర్ మధ్య ఈగో, అహంకారంతో వచ్చే సమస్యలు, వీరిద్దరి మధ్య ఓ అమ్మాయి ఎలా నలిగింది అని సస్పెన్స్ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించారు

Nov 14, 2025 Read Review
Filmi Beat
Filmi Beat Website
5

Average

Kaantha Movie Review

సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలో నటించిన సినిమా కాంత. పీరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో రానా, సముద్రఖని కీలక పాత్రలో నటించారు. ఇక కాంత సినిమా గురించి ఓవరాల్‌గా చెప్పాలంటే.. నటీనటుల అద్బుతమైన పెర్ఫార్మెన్స్, బలమైన సాంకేతిక విలువలు ఈ సినిమాకు స్పె...

సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలో నటించిన సినిమా కాంత. పీరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో రానా, సముద్రఖని కీలక పాత్రలో నటించారు. ఇక కాంత సినిమా గురించి ఓవరాల్‌గా చెప్పాలంటే.. నటీనటుల అద్బుతమైన పెర్ఫార్మెన్స్, బలమైన సాంకేతిక విలువలు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. కానీ ఈ పీరియాడిక్ డ్రామాను ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా మార్చే ప్రయత్నం పూర్తిగా బెడిసి కొట్టింది. సెకండాఫ్ బోరింగ్‌తో విసుగు పుట్టిస్తుంది. సినిమాలో ఎమోషన్స్ పూర్తి మిస్ అయ్యాయి. తెలుగు ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఒక్కటి కూడా కనిపించవు. సెకండాఫ్ అత్యంత పేలవంగా, సహనానికి పరీక్షగా సాగుతుంది. దుల్కర్ ఫ్యాన్స్‌కు మాత్రం ఫుల్ మీల్స్‌లా ఉంటుంది. సాధారణ ఆడియెన్స్‌కు మాత్రం రుచించని వంటకంలా ఉంటుంది.

Nov 14, 2025 Read Review
ABP Desam
ABP Desam Website
4

Below Average

Kaantha Movie Review

దుల్కర్ సల్మాన్ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన మూవీ "కాంత". రానా, సముద్రఖని కీలక పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో గురు శిష్యులుగా దుల్కర్, సముద్రఖని వాళ్ళ మధ్య సన్నివేశాల్లో ఇద్దరూ పోటాపోటీగా నటించారు. భాగ్యశ్రీ బోర్సే కూడా నటన పరంగా మెప్పించింది. అలాగే రానాకు తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్న...

దుల్కర్ సల్మాన్ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన మూవీ "కాంత". రానా, సముద్రఖని కీలక పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో గురు శిష్యులుగా దుల్కర్, సముద్రఖని వాళ్ళ మధ్య సన్నివేశాల్లో ఇద్దరూ పోటాపోటీగా నటించారు. భాగ్యశ్రీ బోర్సే కూడా నటన పరంగా మెప్పించింది. అలాగే రానాకు తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నా తన పాత్ర వరకు న్యాయం చేసాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో తెర వెనుక జరిగే సంగతులు తెలుసుకోవాలని ఎంతో మంది ఆసక్తి చూపిస్తారు. అటువంటి ప్రేక్షకులకు పర్ఫెక్ట్ సినిమా 'కాంత'. అయితే దీనిని కంప్లీట్ ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్ సినిమాగా చెప్పలేం. దీనిని ఒక్క జానర్ కింద చూడలేం. ప్రేమ కథ, ఈగో క్లాష్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్... ఒక దాని నుంచి మరొక దానికి షిఫ్ట్ అయ్యింది సినిమా. కానీ ఎంగేజ్ చేయలేదు. దుల్కర్ సల్మాన్ ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. కానీ, ఆయన ఒక్కరి ప్రయత్నం సినిమాను నిలబెట్టడానికి సరిపోలేదు. ఫస్టాఫ్ ఓకే. కానీ చివరి వరకు థియేటర్లలో కూర్చోవడానికి కాస్త ఓపిక కావాలి.

Nov 14, 2025 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
5

Average

Kaantha Movie Review

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా మరియు రానా, సముద్రఖని కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా "కాంత". సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ ట్రేడ్ విశ్లేషకులు మంచి స్పందన కనబరిచారు. కథ పరంగా దర్శకుడు బలమైన సబ్జెక్టు తీసుకోగా, అంత బలంగా ఆయ...

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా మరియు రానా, సముద్రఖని కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా "కాంత". సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ ట్రేడ్ విశ్లేషకులు మంచి స్పందన కనబరిచారు. కథ పరంగా దర్శకుడు బలమైన సబ్జెక్టు తీసుకోగా, అంత బలంగా ఆయా పాత్రధారులు అద్భుతంగా నటించారని చెప్పాలి. అయితే స్క్రీన్ ప్లే పరంగా కాస్త వీక్ అయింది. కానీ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ఆడియన్స్ ని కాంత ఇట్టే 1950 లోకి తీసుకెళ్లిపోతుందనడంలో సందేహం లేదు. కమర్షియల్ సినిమాలే కాదు, నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు, ఆడియన్స్ చూస్తారని అలాంటివాటికే మేకర్స్ కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సినిమా కథ చెప్తుంది. రెగ్యులర్ మూవీ లవర్స్ కి ఈ కథ ఇంప్రెస్ చేయలేకపోయినా, పీరియాడికల్ సినిమాలు, నటనా ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.

Nov 14, 2025 Read Review
Samayam Telugu
Samayam Telugu Website
6

Above Average

Kaantha Movie Review

టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా రానా, సముద్రఖని ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా "కాంత". సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు. ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ క్రిటిక్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక దర్శకుడు సెల్వరాజ్ కాంత కోసం దుల్కర్, సమ...

టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా రానా, సముద్రఖని ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా "కాంత". సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు. ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ క్రిటిక్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక దర్శకుడు సెల్వరాజ్ కాంత కోసం దుల్కర్, సముద్రఖని ఇద్దరినీ మహదేవన్, అయ్య పాత్రలకి సెలక్ట్ చేసుకున్నప్పుడే సక్సెస్ అయిపోయాడు. "ఆడియన్స్ ఇవే చూస్తారు.. ఆడియన్స్‌ కోసమే ఇలాంటివి తీస్తున్నామనే సినిమాలు ఒకవైపు".. "నటుడిగా తమ ఆకలి తీర్చుకోవడానికి తీసే సినిమాలు మరోవైపు".. అయితే కాంత ఈ రెండో కోవకి చెందిన సినిమా. కాంత చూసాక చివరిగా థియేటర్ నుంచి బయటికొచ్చేటప్పుడు "మనం మాట్లాడుకోవడం మానేసాం.. మనం ఏమీ చేయక్కర్లేదు ప్రపంచం బాగుండాలి అంటే ఇద్దరు మనుషులు పక్కపక్కన కూర్చొని ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ మాట్లాడుకుంటే చాలు.." అనే త్రివిక్రమ్ మాట గుర్తుకువస్తే ఆడియన్స్ కి కాంత చాలా బాగా అర్థమవుతుంది.

Nov 14, 2025 Read Review
123telugu
123telugu Website
5

Average

Kaantha Movie Review

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, రానా, సముద్రఖని ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించగా, దుల్కర్ సల్మాన్, రానా కలిసి మూవీ నిర్మించారు. ఇక ‘కాంత’ అంటూ వచ్చిన ఈ పీరియాడికల్ ఎమోషనల్ డ్రామా ఓ వర్గం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోంది. ముఖ్యంగా దర్శకుడు సెల్వమణ...

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, రానా, సముద్రఖని ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించగా, దుల్కర్ సల్మాన్, రానా కలిసి మూవీ నిర్మించారు. ఇక ‘కాంత’ అంటూ వచ్చిన ఈ పీరియాడికల్ ఎమోషనల్ డ్రామా ఓ వర్గం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోంది. ముఖ్యంగా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ కథ, అప్పటి సినీ నేపథ్య సన్నివేశాలు, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ అలాగే టేకింగ్.. ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. అయితే, కొన్ని సీన్స్ రెగ్యులర్ గా అండ్ స్లోగా సాగడం, అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కావడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. ఓవరాల్ గా పీరియాడికల్ చిత్రాలను ఇష్టపడేవారికి మాత్రమే ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.

Nov 14, 2025 Read Review

Public Reviews

1 Avg: 7.0/10
R
Rohan Students & Youth
7

Hit

Kaantha Movie review

Movie is good. It is Supspense thriller.

Mar 16, 2026

About This Movie

కథ విషయానికి వస్తే... తమిళనాడు లో అయ్య (సముద్రఖని) ప్రముఖ సినిమా డైరెక్టర్.. అనుకోకుండా పరిచయం అయిన మహదేవన్ ని (దుల్కర్ సల్మాన్) ని నటనకి ఇంప్రెస్ అయి అతడ్ని హీరోని చేస్తాడు. అయితే మహదేవన్ ఒక అనాధ. మొదట అన్నీ అయ్య అనే అంటూ అతడికి నమ్మిన బంటులా ఉంటాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహదేవన్ తమిళనాడులో పెద్ద స్టార్ అవుతాడు. దీంతో అతడికి ఒక స్టార్ హీరో అన్న అహంకారం వస్తుంది. అందుకే అయ్యని పలుమార్లు పట్టించుకోడు. ఆయనకి విరుద్ధమైన పనులు చేసేవాడు. ఫైనల్ గా వారిద్దరూ ఎవరి దారి వారు చూసుకుంటారు. ఈ క్రమంలో మహదేవన్ తన గురువు అయ్య (సముద్రఖని) ఇష్టపడి రాసుకున్న "శాంత" అనే కథతో సినిమా చేయాల్సివస్తుంది. కానీ ఇద్దరి మధ్య కొన్ని ఇగోల కారణంగా ఆ సినిమా షూటింగ్ అనుకోకుండా ఆగిపోతుంది. మళ్లీ కొన్నేళ్లకు శాంత సినిమాని కాస్త "కాంత" సినిమాగా స్టార్ట్ చేస్తారు. అందులో కుమారి అనే కొత్తమ్మాయి (భాగ్యశ్రీ భోర్సే) హీరోయిన్ గా నటిస్తుంది. ఈమె వల్ల కథే మారిపోతుంది. మహదేవన్ కు అయ్యకు మరింత విరోధం వస్తుంది. మరి చివరికి కాంత సినిమా పూర్తయిందా? కుమారి ఎవరు? మధ్యలో రానా పాత్ర ఏంటి? అన్నదే కథ. 


Technical values : కాంత సినిమా 1950 వ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఓ రియల్ స్టోరీని ఆధారంగా తీసుకుని తీసిన సినిమా కాబట్టి రిలీజ్ కి ముందే అందరికి సినిమాపై బాగా ఆసక్తి వచ్చింది. కథ పరంగా చాలా బలమైన కథ. కానీ దానికి తగ్గ స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో విఫలమయ్యాడు దర్శకుడు. సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్ గా మొదలవుతుందో, ముగింపు అంత సింపుల్ గా ఉంటుంది. కానీ క్లైమాక్స్ ట్విస్ట్ పరంగా ఊహించలేదు. పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే... దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే తో పాటు కీలక పాత్రల్లో నటించిన సముద్రఖని, రానా బాగా మెప్పించారు. ముఖ్యంగా 1950 లో సినిమా ఇండస్ట్రీ గురించి, ఆనాటి వాతావరణాన్ని మేకర్స్ చక్కగా ఆవిష్కరించారు. 

అయితే కొత్త కథనాలు ఇష్టపడే ప్రేక్షకులకు కాంత కనెక్ట్ అవుతుంది. కానీ, రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి దూరంగా సాగిన ఈ మూవీ కామన్ ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేదు. సెకండ్ హాఫ్ ని సరిగా రాసుకోవడంలో డైరెక్టర్ విఫలమయ్యాడు. క్లైమాక్స్ మినహా ఏది కూడా అంతగా ఆకట్టుకోలేదు. సినిమా పూర్తయ్యాక ఆడియన్స్ ని పలు అంశాలు బాగానే ఆకట్టుకున్నా, ఏముందని ఈ సినిమాలో అన్న భావన వస్తుంది. ఇక దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ సీన్స్ పరంగా బాగానే ఆకట్టుకున్నా, సినిమాకి సరైన స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తడబడ్డాడు. సంగీత దర్శకుడు ఝాను చందర్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్. నిర్మాణ విలువులు బాగున్నాయి.

Final Review :

ద్విభాష చిత్రంగా తెరకెక్కిన "కాంత" ఆడియన్స్ లో రెగ్యులర్ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవదు. కానీ కొత్త కాన్సెప్ట్ కోరుకునే ఆడియన్స్ ని ఖచ్చితంగా మెప్పిస్తుంది. పీరియాడికల్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన కాంత ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది గాని, సినిమాలో కథనం పరంగా టేకింగ్ మాత్రం ఆకట్టుకోలేదు. నటన పరంగా నటీనటులు ఆకట్టుకున్నా, ఆడియన్స్ ని కాంత పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. కానీ పీరియాడికల్ మూవీస్ ని ఇష్టపడేవారికి కాంత కనెక్ట్ అవుతుంది.

Review Statistics

5.3
Overall Rating
Avg. of all reviews
11
Total Reviews
From 4 Provider Types

Review Average

Media
5.1/10
Public
7.0/10