Dhurandhar The Revenge (ధురంధర్ ది రివేంజ్)
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన స్పై యాక్షన్ డ్రామా ధురంధర్ సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. ఇక కొన్ని నెలల గ్యాప్ లోనే తాజాగా ఈ సినిమా సెకండ్ పార్ట్ "ధురంధర్ ది రివేంజ్" పేరిట విడుదలై థియేటర్లలో ట్రెండ్ అవుతుంది.
Available in:
Reviews
What critics and the public are saying about Dhurandhar The Revenge (ధురంధర్ ది రివేంజ్)
Media Reviews
6 Avg: 7.0/10Hit
Dhurandhar The Revenge Movie Review
రణ్వీర్ సింగ్ నటించిన ‘దురంధర్-2’ మూవీ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. శశ్వత్ సచ్ దేవ్ తన నేపథ్య సంగీతంతో ‘దురంధర్’కు మంచి ఊపు తీసుకొచ్చాడు. సినిమా మంచి ఫ్లోతో సాగేలా చేయడంలో ఆర్ఆర్ కీలక పాత్ర పోషించింది. అతడి పాటలు కూడా బాగున్నాయి. వికాస్ నౌలాఖా ఛాయాగ్రహణం కూడా అదిరిపోయింది...
రణ్వీర్ సింగ్ నటించిన ‘దురంధర్-2’ మూవీ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. శశ్వత్ సచ్ దేవ్ తన నేపథ్య సంగీతంతో ‘దురంధర్’కు మంచి ఊపు తీసుకొచ్చాడు. సినిమా మంచి ఫ్లోతో సాగేలా చేయడంలో ఆర్ఆర్ కీలక పాత్ర పోషించింది. అతడి పాటలు కూడా బాగున్నాయి. వికాస్ నౌలాఖా ఛాయాగ్రహణం కూడా అదిరిపోయింది. కెమెరా యాంగిల్స్.. టేకింగ్.. కలర్ థీమ్స్.. మొత్తంగా విజువల్స్ కట్టిపడేస్తాయి. ప్రొడక్షన్ డిజైన్ గొప్పగా అనిపిస్తుంది. నిజంగా పాకిస్థాన్లోనే ఉన్న భావన కలిగేలా ల్యారీ సిటీని క్రియేట్ చేసిన తీరు అద్భుతం. నిర్మాణ విలువలకు ఢోకా లేదు.
ఇక రైటర్ కమ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ ను ఎంత కొనియాడినా తక్కువే. ఎంతో సమాచారం సేకరించి.. దాని చుట్టూ కథాకథనాలు అల్లిన తీరు.. తెర మీద ప్రెజెంట్ చేసిన విధానం ఆశ్చర్యపరుస్తుంది. తన టేకింగ్ గురించి చాలా ఏళ్లు మాట్లాడుకుంటారనడంలో.. ‘దురంధర్’తో దర్శకుడిగా అతను చాలా ఏళ్లు గుర్తుండిపోతాడనడంలో.. ఈ చిత్ర ప్రభావం ఇండియన్ సినిమా మీద చాలా కాలం ఉంటుందనడంలో సందేహం లేదు.
Hit
Dhurandhar The Revenge Movie Review
ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ధురంధర్ ది రివెంజ్ ఆడియన్స్ నుండి యానానిమస్ గా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ పెర్ఫార్మన్స్ పరంగా అందర్నీ పూర్తిగా డామినేట్ చేశాడు. మొదటి సీన్ నుంచి చివరి వరకు హమ్జా పాత్రలో వన్ మ్యాన్ షో చూపిస్తూ ఆడియన్స్‌ని కట్టిపడేశాడు. యాక్షన్ లో ఎంత క్రూరంగా క...
ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ధురంధర్ ది రివెంజ్ ఆడియన్స్ నుండి యానానిమస్ గా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ పెర్ఫార్మన్స్ పరంగా అందర్నీ పూర్తిగా డామినేట్ చేశాడు. మొదటి సీన్ నుంచి చివరి వరకు హమ్జా పాత్రలో వన్ మ్యాన్ షో చూపిస్తూ ఆడియన్స్‌ని కట్టిపడేశాడు. యాక్షన్ లో ఎంత క్రూరంగా కనిపించాడో, ఎమోషనల్ సీన్స్‌లో అంతగా కంటతడి పెట్టించాడు.
మాధవన్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కూల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కూడా తమ పాత్రల్లో మెప్పించారు. అలాగే నిర్మాణ విలువలు కూడా రిచ్ గా ఉన్నాయి. రెండో పార్ట్ లెంగ్త్ కాస్త ఎక్కువ ఉన్నా కూడా బోర్ కొట్టదు. దర్శకుడు ఆ రేంజ్ స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసాడు. ఇక టెక్నికల్ గా ఎడిటింగ్, కెమెరా వర్క్ అన్ని బాగా కుదిరాయి. ఓవరాల్ గా ధురంధర్ ది రివెంజ్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టడం ఖాయమనిపిస్తుంది.
Hit
Dhurandhar The Revenge Movie Review
రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమాలో నిజంగానే తన నట విశ్వరూపం చూపించాడు. హమ్జా పాత్రలో పూర్తిగా ఇమిడిపోయి, బీస్ట్ మోడ్‌లో చెలరేగిపోయాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోస్తూ వన్ మ్యాన్ షో ఇచ్చాడు. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలివేషన్స్ సహా అన్ని రణ్‌వీర్ స్క్రీన్ ప్రెజెన్స్‌ని మరో లెవెల్‌కు తీసుకె...
రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమాలో నిజంగానే తన నట విశ్వరూపం చూపించాడు. హమ్జా పాత్రలో పూర్తిగా ఇమిడిపోయి, బీస్ట్ మోడ్‌లో చెలరేగిపోయాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోస్తూ వన్ మ్యాన్ షో ఇచ్చాడు. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలివేషన్స్ సహా అన్ని రణ్‌వీర్ స్క్రీన్ ప్రెజెన్స్‌ని మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా బాగానే నిలిచింది. సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సారా అర్జున్ పాత్ర చిన్నదే అయినా ఓకే.
టెక్నికల్‌గా ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలం. లాంగ్ రన్‌టైమ్ ఉన్నా ఎక్కడా బోర్ అనిపించకుండా మేనేజ్ చేశారు. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. వీఎఫ్ఎక్స్ కొద్దిగా వీక్‌గా ఉన్నా ఓవరాల్ ఫీల్‌పై పెద్దగా ప్రభావం లేదు. దర్శకుడు అదిత్య ధార్ స్క్రీన్‌ప్లేను గ్రిప్పింగ్‌గా నడిపిస్తూ, ట్విస్ట్స్‌తో ఎంగేజ్ చేశాడు. మాస్ డైలాగ్స్, ఎలివేషన్ సీన్స్ థియేటర్లలో బాగా వర్క్ అవుతాయి. మొత్తానికి ‘ధురంధర్: ది రివెంజ్’ ఒక పవర్‌ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్. రణ్‌వీర్ సింగ్ కోసం అయినా థియేటర్‌లో చూసేయాల్సిన సినిమా.
Hit
Dhurandhar The Revenge Movie Review
ధురంధర్ ది రివెంజ్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన రణ్‌వీర్ సింగ్ ఈ సినిమాలో పూర్తిగా బీస్ట్ మోడ్‌లో చెలరేగిపోయాడు. హమ్జా పాత్రలో వన్ మ్యాన్ షోతో స్క్రీన్‌ని డామినేట్ చేస్తూ యాక్షన్, ఎమోషన్, డ్రామాను అద్భుతంగా పండించాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఎలివేషన్స్ సినిమాకు మెయిన్ హైలైట్.సంజయ్ దత్, ఆర్ మాధవన్,...
ధురంధర్ ది రివెంజ్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన రణ్‌వీర్ సింగ్ ఈ సినిమాలో పూర్తిగా బీస్ట్ మోడ్‌లో చెలరేగిపోయాడు. హమ్జా పాత్రలో వన్ మ్యాన్ షోతో స్క్రీన్‌ని డామినేట్ చేస్తూ యాక్షన్, ఎమోషన్, డ్రామాను అద్భుతంగా పండించాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఎలివేషన్స్ సినిమాకు మెయిన్ హైలైట్.
సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ తమ పాత్రల్లో బాగా మెప్పించారు. సారా అర్జున్‌కు స్కోప్ తక్కువైనా, కనిపించినంతసేపు ఓకే అనిపిస్తుంది.
టెక్నికల్‌గా ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్ నాలుగు గంటల రన్‌టైమ్ ఉన్నా ఎక్కడా ల్యాగ్ అనిపించదు. సినిమాటోగ్రఫీ బాగుంది, వీఎఫ్ఎక్స్ కొంచెం వీక్ అయినా ప్రభావం తగ్గించవు.
దర్శకుడు అదిత్య ధార్ స్క్రీన్‌ప్లే, ట్విస్ట్స్‌తో సినిమాను ఎంగేజింగ్‌గా తీర్చిదిద్దాడు. బలమైన డైలాగ్స్, మాస్ సీన్స్ థియేటర్‌లో మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తాయి. ఓవరాల్ గా సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ థియేటర్లో చూడాల్సిన సినిమాగా చెప్పొచ్చు.
Hit
Dhurandhar The Revenge Movie Review
‘ధురంధర్: ది రివేంజ్’ ఒక కమర్షియల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేసే ప్రయత్నం చేసింది. కథ పరంగా రివెంజ్ లైన్ పరిచయంగా అనిపించినప్పటికీ, దర్శకుడు దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా రణవీర్ సింగ్ తన ఎనర్జిటిక్ మరియు ఇన్‌టెన్స్ పెర్ఫార్మెన్స్‌తో సినిమాకు పెద్ద ప్లస్ అయ...
‘ధురంధర్: ది రివేంజ్’ ఒక కమర్షియల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేసే ప్రయత్నం చేసింది. కథ పరంగా రివెంజ్ లైన్ పరిచయంగా అనిపించినప్పటికీ, దర్శకుడు దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా రణవీర్ సింగ్ తన ఎనర్జిటిక్ మరియు ఇన్‌టెన్స్ పెర్ఫార్మెన్స్‌తో సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాడు. యాక్షన్ సీన్స్ బాగా డిజైన్ చేయబడగా, సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్స్, ఎమోషనల్ మూమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, తరువాత కథ పికప్ అవుతుంది. టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ ఎపిసోడ్స్‌కి మంచి ఎలివేషన్ ఇచ్చింది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్‌గా ఉండి ఉంటే ఇంకా బెటర్ అయ్యేది. మొత్తానికి ‘ధురంధర్: ది రివేంజ్’ మాస్ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిన ఎంగేజింగ్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా నిలుస్తుంది.
Hit
Dhurandhar The Revange Movie Review
‘ధురంధర్: ది రివేంజ్’ సినిమా పూర్తిగా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిన రివెంజ్ డ్రామాగా కనిపిస్తుంది. కథ, కథనాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటూ రియలిస్టిక్ గా ఆకట్టుకుంటాయి. కమర్షియల్ కి కాస్త దూరంగా, నిజ జీవిత సంఘటనలకు కథ లింక్ చేయడంతో చాలా మంది ఆడియన్స్ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. ఇక దర్శకుడు ఎమోషన్ మరి...
‘ధురంధర్: ది రివేంజ్’ సినిమా పూర్తిగా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిన రివెంజ్ డ్రామాగా కనిపిస్తుంది. కథ, కథనాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటూ రియలిస్టిక్ గా ఆకట్టుకుంటాయి. కమర్షియల్ కి కాస్త దూరంగా, నిజ జీవిత సంఘటనలకు కథ లింక్ చేయడంతో చాలా మంది ఆడియన్స్ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. ఇక దర్శకుడు ఎమోషన్ మరియు యాక్షన్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఎంగేజ్ చేయాలని బాగా ప్రయత్నించారు. ముఖ్యంగా హీరో క్యారెక్టర్‌లో ఉన్న ఆగ్రహం, బాధ, ప్రతీకారం వంటి భావాలను బాగా చూపించారు. సినిమాలో ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా సాగినప్పటికీ, సెకండాఫ్‌లో యాక్షన్ ఎపిసోడ్స్‌తో కథ వేగం పెరుగుతుంది. కొన్ని ట్విస్ట్స్, క్లైమాక్స్ భాగం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే కథనం కొన్నిచోట్ల డ్రాగ్ అయ్యిందనే ఫీలింగ్ వస్తుంది. నటీనటుల విషయానికి వస్తే హీరో రణవీర్ సింగ్ తన పాత్రలో డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. విలన్ పాత్ర కూడా కథకు సరిపడేలా ఉంది. టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఎడిటింగ్ కొంచెం టైట్‌గా ఉండాల్సింది. మొత్తంగా ‘ధురంధర్: ది రివేంజ్’ అద్భుతమైన రివెంజ్ డ్రామాగా ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించే సత్తా ఉన్న సినిమాగా ఆకట్టుకుంటుంది.
Public Reviews
Avg: —No public reviews yet.
About This Movie
Story : పాకిస్థాన్‌లో కరాచీ ప్రాంతంలో ల్యారీ పట్టణంలో ఇండియన్ ఏజెంట్ గా పనిచేసే హమ్జా ఆలీ మజారీ అలియాస్ జస్కిరాత్ సింగ్ రాంగీ (రణ్‌వీర్ సింగ్) కూలి నుండి ఎదిగి, అక్కడి డాన్ రెహ్మత్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా)ను హతమార్చి అతడి సామ్రాజ్యాన్ని చేజిక్కించుకొంటాడు. అక్కడి నుండి కరాచీ కేంద్రంగా భారత్ పై చేసే కుట్రలు విచ్చిన్నం చేస్తూ, తీవ్ర వాదులను అంతమొందిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో జస్కిరాత్ సింగ్ రాంగీ గతం ఏంటి? జస్కిరాత్ సింగ్ రాంగీ ఎందుకు హమ్జా ఆలీ మజారీగా మారాడు. ఇండియాలో హత్య కేసులో దోషిగా ఉన్న జస్కిరాత్ ను హమ్జాగా ఐబీ చీఫ్ అజయ్ సన్యాల్ (మాధవన్) ఎందుకు మార్చాడు? భారత్ లో నోట్ల రద్దు వెనుక జస్కిరాత్ సింగ్ పాత్ర ఏమిటి? కరాచీలో తలదాచుకొన్న దావూద్ ఇబ్రహీంను ఇండియన్ సీక్రెట్ ఏజెంట్స్ ఎలా శిక్షించారు? తనకు అప్పగించిన మిషన్ ను హమ్జాగా జస్కిరాత్ సింగ్ ఎలా పూర్తి చేశాడు? అనేది కథ.
Technical values : సినిమా గురించి మాట్లాడితే ముందుగా దర్శకుడు ఆదిత్య ధర్ గురించే చెప్పుకోవాలి. దాదాపు 4 గంటల నిడివి ఉన్నా కూడా కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా అద్భుతమైన స్క్రీన్ ప్లే తో సినిమాని డైరెక్ట్ చేసాడు. ప్రతి ఫ్రేమ్ లో కూడా దర్శకుడి ప్రతిభ కనబడుతుంది. సినిమాలో వచ్చే కొన్ని ట్విస్టులు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. ముఖ్యంగా దేశభక్తిని చాలా బాగా చూపించారు. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లు సినిమాకే హైలైట్ గా నిలిచాయి.
ఇక సినిమాలో రణవీర్ సింగ్ నటన పరంగా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని చెప్పాలి. తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో కట్టిపడేసాడు. అలాగే అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, సారా అర్జున్, డానిష్ పాండోర్ ఎవరి పాత్రల పరిధి మేరకు వారు పూర్తి న్యాయం చేసారు. దీంతో పాటు దావూద్ ఇబ్రహీం ఎపిసోడ్, నకిలీ కరెన్సీ, అక్రమ ఆయుధాలు, ప్రధాని మోదీ నోట్ల రద్దు వ్యవహారం కథలో కీలకంగా చూపించగా, వాటికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
టెక్నికల్ గా ఎడిటింగ్ చాలా బాగుంది. 4 గంటల నిడివి ఉన్నా కూడా ఎక్కడా పెద్దగా బోర్ కొట్టదు. బీజీఎమ్ కూడా అద్భుతంగా ఉంది. చాలా సీన్స్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ అయింది. కాకపోతే విఎఫ్ఎక్స్ మీద మరింత శ్రద్ధ పెట్టాల్సింది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.
Final Review : ఓవరాల్ గా 'ధురంధర్: ది రివెంజ్' మూవీ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో సంతృప్తి పరిచే ఒక మంచి సీక్వెల్ గా చెప్పొచ్చు. కొన్ని పొలిటికల్ ఇష్యూస్, రొటీన్ సాంగ్స్, హింసాత్మక సీన్లు పక్కన బెడితే అన్ని రకాల వర్గాల ఆడియన్స్ తప్పక చూసే మూవీగా ధురంధర్ నిలిచే అవకాశం ఉంది.