Register as a Reviewer
Biker (బైకర్)

Biker (బైకర్)

03 Apr 2026
Overall Rating
5.9/10
14 Reviews

శర్వానంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "బైకర్". యాక్షన్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేయగా, డా. రాజశేఖర్ ప్రత్యేక కీలక పాత్రలో నటించారు.

Director: Abhilash Reddy
Cast: Sharwanand, Malavika nair, Rajashekher, Atul kulkarni and others

Available in:

Reviews

What critics and the public are saying about Biker (బైకర్)

Media Reviews

14 Avg: 5.9/10
Thyview
Thyview Youtube Channel
7

Hit

Biker Movie Review

అంటే ఫస్ట్ క్లియర్‌ గా సినిమా గురించి చెప్పాలంటే… ‘బైకర్’ అనేది ప్యూర్ రేసింగ్ సినిమా కాదు. రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌ లో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ఇక్కడ అసలు హీరో ఎవరు అంటే… శర్వానంద్ కాదు, రాజశేఖర్. సునీల్ నారాయణ గా ఆయన ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి సినిమాకి వేరే వెయిట్ వచ్చేస్తుంది. క్లైమాక్స్‌లో వచ్...

అంటే ఫస్ట్ క్లియర్‌ గా సినిమా గురించి చెప్పాలంటే… ‘బైకర్’ అనేది ప్యూర్ రేసింగ్ సినిమా కాదు. రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌ లో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ఇక్కడ అసలు హీరో ఎవరు అంటే… శర్వానంద్ కాదు, రాజశేఖర్. సునీల్ నారాయణ గా ఆయన ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి సినిమాకి వేరే వెయిట్ వచ్చేస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే సీన్స్ సినిమాకి బిగ్గెస్ట్ బూస్టప్ నిస్తాయి. ఇక శర్వానంద్ తన రోల్ వరకు చాలా బాగా చేసాడు, కానీ వెయిట్ అంత ఎక్కువగా కనిపించలేదు. పైగా తన రోల్ కోసం ఫిజికల్ గా చాలా కష్టపడ్డట్టు ప్రతి ఫ్రేమ్ లో తెలుస్తుంది.


ఇటు మాళవిక నాయర్ కూడా జస్ట్ గ్లామర్ కోసం కాదు… సెకండాఫ్‌ లో మంచి పెర్ఫార్మన్స్ చూపించింది. విలన్‌గా అతుల్ కులకర్ణి సైలెంట్‌ గా తన పని చేసేశాడు. ఇక జిబ్రాన్ అదిరిపోయే బీజీఎమ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయింది. ఇటు విజువల్స్ కూడా నీట్ గా ఉన్నాయి. అయితే ఫస్ట్ హాఫ్ కాస్త స్లో అయింది. స్టోరీ కూడా కొత్తది కాదు, అయినా…

సెకండాఫ్ + క్లైమాక్స్ వల్ల సినిమా నిలబడింది. ఓవరాల్ గా బైకర్ ఒక డీసెంట్ స్పోర్ట్స్ డ్రామా ఫిలిం అని చెప్పొచ్చు. మరీ ఓ రేంజ్ లో ఇంప్రెస్ చేస్తుందో లేదో తెలీదు గాని, డిస్సపాయింట్ అయితే చేయలేదు. 

Apr 03, 2026 Watch
Gulte
Gulte Website
6

Above Average

Biker Movie Review

శర్వానంద్ ‘బైకర్’లో మోటోక్రాస్ రేసింగ్ అనేది ఒక లేయర్ మాత్రమే. అసలు కథ మాత్రం తండ్రి-కొడుకుల ఎమోషన్స్ చుట్టూనే తిరుగుతుంది. ఆ కోణంలో సినిమా బాగానే కనెక్ట్ అవుతుంది. రాజశేఖర్ ఈ పాత్రను చాలా ఈజ్‌ తో, అనుభవంతో క్యారీ చేశారు. హీరోగా కనిపించకపోయినా… కథలో వెయిట్ మాత్రం ఆయనే మోశారు. క్లైమాక్స్‌ లో వచ్...

శర్వానంద్ ‘బైకర్’లో మోటోక్రాస్ రేసింగ్ అనేది ఒక లేయర్ మాత్రమే. అసలు కథ మాత్రం తండ్రి-కొడుకుల ఎమోషన్స్ చుట్టూనే తిరుగుతుంది. ఆ కోణంలో సినిమా బాగానే కనెక్ట్ అవుతుంది. 

రాజశేఖర్ ఈ పాత్రను చాలా ఈజ్‌ తో, అనుభవంతో క్యారీ చేశారు. హీరోగా కనిపించకపోయినా… కథలో వెయిట్ మాత్రం ఆయనే మోశారు. క్లైమాక్స్‌ లో వచ్చే ఎమోషనల్ సీన్ సినిమాలో బెస్ట్ మోమెంట్‌ గా నిలుస్తుంది. అక్కడ ఆడియన్స్‌ని టచ్ చేసే ఎమోషన్ వర్కౌట్ అయింది. మాళవిక నాయర్ పాత్రకు మంచి స్కోప్ ఉంది. మొదట గ్లామర్ టచ్ ఇచ్చి… తర్వాత ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది.



టెక్నికల్‌గా జిబ్రాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి బూస్ట్ ఇచ్చింది. రేసింగ్ సీన్స్‌లో ఎనర్జీ పెంచడమే కాకుండా… ఎమోషనల్ సీన్స్‌లో కూడా బాగా వర్క్ అయింది. విజువల్స్ కూడా నైస్‌గా ఉన్నాయి. డైలాగులు తక్కువగా ఉన్నా, కొన్ని లైన్స్ మాత్రం స్ట్రైట్‌గా హిట్ అవుతాయి. మొత్తానికి ‘బైకర్’ రేసింగ్ మూవీ కంటే ఎమోషనల్ డ్రామాగా బెటర్‌గా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ కాస్త స్లో అనిపించినా… సెకండాఫ్, క్లైమాక్స్ వల్ల ఓవరాల్‌గా ఓకే అనిపించే సినిమా

Apr 03, 2026 Read Review
T2B Live
T2B Live Website
6

Above Average

Biker Movie Review

బైకర్ గురించి చెప్పాలంటే... టాలీవుడ్ లో మునుపెన్నడూ రాని రేంజ్ లో అల్టిమేట్ రేసింగ్ సీన్స్ అండ్ ఎక్స్ లెంట్ విజువల్స్ తో తెరకెక్కడమే కాకుండా, ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. ఇక శర్వానంద్ మరోసారి తనదైన స్టైల్ లో అద్బుతమైన పెర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. అలాగే చాలా టైం తర్వాత తెరపై రాజశేఖర్ ని చూడటం ఆకట్...

బైకర్ గురించి చెప్పాలంటే... టాలీవుడ్ లో మునుపెన్నడూ రాని రేంజ్ లో అల్టిమేట్ రేసింగ్ సీన్స్ అండ్ ఎక్స్ లెంట్ విజువల్స్ తో తెరకెక్కడమే కాకుండా, ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. ఇక శర్వానంద్ మరోసారి తనదైన స్టైల్ లో అద్బుతమైన పెర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. అలాగే చాలా టైం తర్వాత తెరపై రాజశేఖర్ ని చూడటం ఆకట్టుకోగా అదే టైంలో తన ఎక్స్ లెంట్ స్క్రీన్ ప్రజెన్స్ అండ్ యాక్టింగ్ తో కుమ్మేశాడు. మొత్తం మీద సినిమాలో లెంగ్త్ కొంచం ఎక్కువ అవ్వడం కొంచం డ్రా బ్యాక్ అయితే కొన్ని చోట్ల డ్రాగ్ అవ్వడం లాంటివి కొంచం ఇంపాక్ట్ ను చూపించినా కూడా, ఓవరాల్ గా శర్వానంద్ అండ్ రాజశేఖర్ ల ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్ సీన్స్, అలాగే

సినిమాలో తండ్రి కొడుకుల ఎమోషనల్ సీన్స్ బాగా మెప్పించాయి. 


ఓవరాల్ గా సినిమాలో అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా టాలీవుడ్ లో ఇలాంటి డిఫెరెంట్ జానర్ మూవీని చాలా వరకు ఆడియన్స్ ను మెప్పించేలా తీర్చిదిద్ది డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. శర్వానంద్ మరోసారి ఫుల్ ఫ్లోలో తన ఫామ్ ను చూపించాడు. కొంచెం లెంగ్త్ ని తగ్గించి స్క్రీన్ ప్లే ని కొంచెం టైట్ చేసి ఉంటే మరింత బాగా ఆకట్టుకుని ఉండేది. ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైంకి ఆడియన్స్ ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే థియేటర్స్ బయటికి వస్తారు. కాకపోతే అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. 

Apr 03, 2026 Read Review
Tupaki
Tupaki Website
6

Above Average

Biker Movie Review

థియేటర్లలో తాజాగా విడుదలైన ‘బైకర్’ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కిన ఈ సినిమా కథా, కథనాల్లో ఉన్న లోపాలను కవర్ చేసే స్థాయిలో సాంకేతిక అంశాలు గొప్పగా అనిపిస్తాయి. ఇక సినిమాటోగ్రాఫర్ యువరాజ్ బైక్ రేసింగ్ సన్నివేశాలన్నీ అద్భుతంగా తీర్చిదిద్దాడు. మ...

థియేటర్లలో తాజాగా విడుదలైన ‘బైకర్’ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కిన ఈ సినిమా కథా, కథనాల్లో ఉన్న లోపాలను కవర్ చేసే స్థాయిలో సాంకేతిక అంశాలు గొప్పగా అనిపిస్తాయి. ఇక సినిమాటోగ్రాఫర్ యువరాజ్ బైక్ రేసింగ్ సన్నివేశాలన్నీ అద్భుతంగా తీర్చిదిద్దాడు. మిగతా విజువల్స్ కూడా కంటికి ఇంపుగా అనిపిస్తాయి. జిబ్రాన్ నేపథ్య సంగీతం కూడా బాగానే సాగింది. కానీ తన పాటలు మాత్రం ఆశించినంత ప్రభావవంతంగా లేవు.



ఇక శర్వానంద్, రాజశేఖర్ సహా మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. ఇక దర్శకుడు అభిలాష్ రెడ్డి రాసుకున్న కథ సాధారణంగా అనిపించినా.. తన కథనంతో.. ముఖ్యంగా బైక్ రేసింగ్ నేపథ్యంతో మార్కులు కొట్టేశాడు. సాంకేతిక అంశాలను బాగా వాడుకున్న అతను.. ప్రధాన పాత్రధారుల నుంచి మంచి పెర్ఫామెన్స్ రాబట్టుకున్నాడు. ఎమోషన్లను బాగా పండించాడు. కథ పరంగా ఇంకొంచెం వైవిధ్యం చూపించగలిగి ఉంటే.. షాకులు ఇచ్చి ఉంటే.. ‘బైకర్’ను వేరే స్థాయిలో నిలబెట్టగలిగి ఉండేవాడు. చివరగా బైకర్ గురించి చెప్పాలంటే... ఫ్యామిలీ కథ లో స్పోర్ట్స్ డ్రామా అని చెప్పొచ్చు. స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడే ఆడియన్స్ థియేటర్లలో ఒకసారి చూసేయొచ్చు. 


Apr 03, 2026 Read Review
Great Andhra
Great Andhra Website
6

Above Average

Biker Movie Review

శర్వానంద్ నటించిన ‘బైకర్’లో అసలు హైలెట్ ఎవరంటే సందేహం లేకుండా రాజశేఖర్ అని చెప్పాలి. సునీల్ నారాయణ పాత్రలో ఆయన కనిపించిన ప్రతి సీన్ సినిమాకి వెయిట్ తీసుకొచ్చింది. హీరో కాకపోయినా… ఆ తర్వాత సెకండ్ మెయిన్ లీడ్ గా.. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ హగ్ సీన్‌లో రాజశేఖర్ నిజంగానే కంటతడి పెట్టిస్తాడు....

శర్వానంద్ నటించిన ‘బైకర్’లో అసలు హైలెట్ ఎవరంటే సందేహం లేకుండా రాజశేఖర్ అని చెప్పాలి. సునీల్ నారాయణ పాత్రలో ఆయన కనిపించిన ప్రతి సీన్ సినిమాకి వెయిట్ తీసుకొచ్చింది. హీరో కాకపోయినా… ఆ తర్వాత సెకండ్ మెయిన్ లీడ్ గా.. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ హగ్ సీన్‌లో రాజశేఖర్ నిజంగానే కంటతడి పెట్టిస్తాడు. అయితే ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక గాని కథకి సరైన రేసింగ్ ఉండదు. 


ఇక టెక్నికల్‌గా జిబ్రాన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి మెయిన్ ప్లస్. రేసింగ్ సీన్స్‌లో థ్రిల్ పెంచడమే కాదు… ఎమోషనల్ సీన్స్‌లో కూడా బలంగా వర్క్ అయింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. డైలాగులు ఎక్కువగా లేకపోయినా… ఉన్నవన్నీ స్ట్రైట్‌గా హిట్ అవుతాయి. మొత్తానికి ‘బైకర్’లో రేసింగ్ కంటే ఎమోషన్స్ బలంగా పనిచేశాయి. ఓవరాల్‌ గా బైకర్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాలు ఇష్టపడే వారికి వర్కౌట్ అయ్యే సినిమా. అయితే సాధారణ ప్రేక్షకుల్ని ఎంత వరకు మెప్పిస్తుందో డిసైడ్ చేయలేము. 

Apr 03, 2026 Read Review
Chitra Jyothy
Chitra Jyothy Website
5

Average

Biker Movie Review

ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయిన బైకర్ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే హీరోగా శర్వానంద్ రేసర్ గా నటించడానికి శారీరకంగా, మానసికంగా పడ్డ కష్టం తెరపై కనిపించింది. లుక్ పరంగా, నటన పరంగా ఎక్కడా పేరు పెట్టలేం. చాలా నాచురల్ గా కనిపించాడు. యాక్షన్ సీన్స్ లోనూ మెప్పించాడు. శర్వాకు భ...

ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయిన బైకర్ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే హీరోగా శర్వానంద్ రేసర్ గా నటించడానికి శారీరకంగా, మానసికంగా పడ్డ కష్టం తెరపై కనిపించింది. లుక్ పరంగా, నటన పరంగా ఎక్కడా పేరు పెట్టలేం. చాలా నాచురల్ గా కనిపించాడు. యాక్షన్ సీన్స్ లోనూ మెప్పించాడు. శర్వాకు భార్యగా అనన్య పాత్రలో మాళవిక నాయర్ కూడా చక్కగా నటించింది. ఇద్దరికీ కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. 


ఇక రేసింగ్ కోచ్ గా సునీల్ నారాయణ్ పాత్రలో రాజశేఖర్ జీవించారు. సినిమాకు ఆయన పాత్ర కీలకం. ఇక తులసి, అతుల్ కులకర్ణి, బ్రహ్మాజీ, నవీన్ నేని, తదితరులు వారి పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. సాంకేతిక పరంగా చూస్తే జె. యువరాజ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ఎసెట్. జిబ్రాన్ పాటల్లో మెరుపులు లేవుగానీ, నేపథ్య సంగీతం బాగుంది. ప్రత్యేకించి రేసింగ్ సీన్స్ లో చాలా బావుంది. యు.వి సంస్థ రేసింగ్ కథకు తగ్గట్లు బాగా ఖర్చు పెట్టారు. అది తెరపై కనిపించింది కూడా. అంచనాలు లేకుండా వెళ్లి థియేటర్లో కూర్చుంటే ఈ రేసింగ్ మూవీని ఎంజాయ్ చేయవచ్చు. అన్ని రకాల ఆడియన్స్ ని ఆకట్టుకోవడం అయితే కష్టమే.

Apr 03, 2026 Read Review
ABP Desam
ABP Desam Website
6

Above Average

Biker Movie Review

'బైకర్' సినిమా గురించి చెప్పుకుంటే... సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్... శర్వానంద్ నటన, ఆయన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్. శర్వాతో పాటు రాజశేఖర్ సైతం సినిమాకు ప్లస్ అయ్యారు. సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చూపించారు. క్లైమాక్స్ వచ్చేసరికి డైలాగులు లేవు... తండ్రీ తనయుల మధ్య ఎమోషనల్ సన్నివేశాల్లో శర్వా, రాజశేఖర్ నట...

'బైకర్' సినిమా గురించి చెప్పుకుంటే... సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్... శర్వానంద్ నటన, ఆయన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్. శర్వాతో పాటు రాజశేఖర్ సైతం సినిమాకు ప్లస్ అయ్యారు. సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చూపించారు. క్లైమాక్స్ వచ్చేసరికి డైలాగులు లేవు... తండ్రీ తనయుల మధ్య ఎమోషనల్ సన్నివేశాల్లో శర్వా, రాజశేఖర్ నటన కంటతడి పెట్టిస్తుంది. అలాగే టెక్నికల్ గానూ 'బైకర్' బావుంది. సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్, సాంగ్స్ & ఆర్ఆర్ వంటివి అప్రిషియేట్ చేసేలా ఉన్నాయి. 


అయితే... కథలో పూర్ విలన్ ట్రాక్, స్ట్రాంగ్ కాన్‌ఫ్లిక్ట్‌ లేకపోవడం వల్ల తండ్రీ కొడుకుల ఎమోషన్ డైల్యూట్ అయ్యింది. ఎంగేజ్ చేస్తూ రేసీగా వెళ్లాల్సిన సినిమా నిదానంగా ముందుకు కదిలింది. శర్వానంద్, రాజశేఖర్ మాత్రం తమ నటనతో మెప్పించారు. స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులు ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే కాస్త శాటిస్‌ ఫై అవ్వొచ్చు. శర్వానంద్ ట్రాన్స్‌ఫర్మేషన్ మాత్రం సూపర్బ్. ఈ వారం మరీ అంచనాలు పెట్టుకోకుండా ఒక నార్మల్ స్పోర్ట్స్ డ్రామాగా బైకర్ ని చూసెయ్యచ్చు. 

Apr 03, 2026 Read Review
5

Average

Biker Movie Review

శర్వానంద్ నటించిన బైకర్ సినిమా తాజాగా థియేటర్లలో రిలీజ్ అయి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమా చూసాక రివ్యూ గురించి చెప్పాలంటే... సినిమాలో శర్వానంద్‌ తన పాత్రలో ఒదిగిపోయాడు. సినిమా కోసం బాగా కష్టపడ్డాడని రేసింగ్ సీన్లు చూస్తేనే తెలుస్తుంది. అలాగే రేసింగ్‌ ఎపిసోడ్స్ ఉత్కంఠకి గురి చేస్తాయి. దాంతో పాటు...

శర్వానంద్ నటించిన బైకర్ సినిమా తాజాగా థియేటర్లలో రిలీజ్ అయి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమా చూసాక రివ్యూ గురించి చెప్పాలంటే... సినిమాలో శర్వానంద్‌ తన పాత్రలో ఒదిగిపోయాడు. సినిమా కోసం బాగా కష్టపడ్డాడని రేసింగ్ సీన్లు చూస్తేనే తెలుస్తుంది. అలాగే రేసింగ్‌ ఎపిసోడ్స్ ఉత్కంఠకి గురి చేస్తాయి. దాంతో పాటు క్లైమాక్స్ ఎమోషనల్‌ గా ఉండి ఆకట్టుకుంది. అలాగే జిబ్రాన్ బిజిఎం కూడా బాగుంది. విజువల్స్ బాగున్నాయి. నటీనటులు బాగా చేశారు. మెయిన్‌ కాస్టింగ్‌ సినిమాకి ప్లస్‌ అయ్యారని చెప్పొచ్చు.


అయితే మైనస్‌ లు చెప్పుకుంటే సినిమా చాలా వరకు డ్రైగా సాగింది. ఏమాత్రం హై మూమెంట్స్ లేవు. డ్రామా అంతగా పండలేదు. ఎమోషన్స్ వర్కౌట్ కాలేదు. తండ్రీకొడుకుల బాండింగ్‌కి సంబంధించిన ఎమోషన్స్ ఎలివేట్‌ కాలేదు. క్లైమాక్స్ లో తప్ప మరెక్కడా అది కనిపించలేదు. స్పోర్ట్స్ డ్రామాలో ఉండాల్సిన డ్రామా ఇందులో అంతగా లేదు. దీంతో ఓల్డ్ సినిమాలను తలపించింది. ఫ్రెష్‌ ఫీలింగ్‌ ఇవ్వలేకపోయింది. స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్‌ తప్ప మరేదీ కొత్తగా లేదనే ఫీలింగ్‌ తెప్పించింది. సినిమా స్లోగా సాగడం మరో మైనస్‌గా చెప్పొచ్చు.ఓవరాల్ గా సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే..

రేస్‌ తక్కువ, సాగదీత ఎక్కువ.. ఎమోషనల్‌ గానూ, డ్రామా పరంగానూ మెప్పించలేకపోయిన 'బైకర్‌'.

Apr 03, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
5

Average

Biker Movie Review

శర్వానంద్ నటించిన బైకర్ సినిమా గురించి ఓవరాల్‌ గా చెప్పుకోవాలంటే.. అమ్మనాన్న తమిళ అమ్మాయి, జెర్సీ తరహా సినిమాగా బైకర్ ని చూడొచ్చు. కానీ ఆ సినిమాలతో పోల్చుకొంటే ఎమోషన్స్, కమర్షియల్ అంశాలు కొన్ని మిస్ అయ్యాయి. అలాగే సెకండాఫ్‌ లో బాగా సాగదీత, అనసవరమైన సీన్లు సినిమాను ల్యాగ్‌ గా మార్చాయి. టెక్నికల్ గా స...

శర్వానంద్ నటించిన బైకర్ సినిమా గురించి ఓవరాల్‌ గా చెప్పుకోవాలంటే.. అమ్మనాన్న తమిళ అమ్మాయి, జెర్సీ తరహా సినిమాగా బైకర్ ని చూడొచ్చు. కానీ ఆ సినిమాలతో పోల్చుకొంటే ఎమోషన్స్, కమర్షియల్ అంశాలు కొన్ని మిస్ అయ్యాయి. అలాగే సెకండాఫ్‌ లో బాగా సాగదీత, అనసవరమైన సీన్లు సినిమాను ల్యాగ్‌ గా మార్చాయి. టెక్నికల్ గా సంగీతంతో పాటు, నేపథ్య సంగీతంతో జిబ్రాన్ ఎమోషనల్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేశాడు. 


నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి ఒక కొత్త పాయింట్‌తో ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేస్తూ చాలా కొత్తగా ట్రై చేశాడు. కెమెరా వర్క్ కూడా అద్భుతంగా ఉంది. ఓవరాల్ గా బి,సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అయితే ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే క్రిటిక్స్ మెచ్చిన సినిమాగా మిగిలిపోతుంది. స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడే వారికి బైకర్ సినిమా నచ్చే అవకాశం ఉంది.


Apr 03, 2026 Read Review
TV9 Telugu
TV9 Telugu News Channel
7

Hit

Biker Movie Review

తెలుగు ప్రేక్షకులకు స్పోర్ట్స్ డ్రామాలు కొత్త కాకపోయినా, ‘మోటోక్రాస్’ బ్యాక్ డ్రాప్ లో రావడం మాత్రం ఖచ్చితంగా కొత్తే. అయితే బైకర్ రెగ్యులర్‌ గా చూసే కమర్షియల్ సినిమా కాదు. దర్శకుడు అభిలాష్ రెడ్డి ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీని చాలా పక్కాగా సెటప్ చేసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ రొటీన్ గానే ఉన్నా, సెకండ్ హాఫ్ లో స...

తెలుగు ప్రేక్షకులకు స్పోర్ట్స్ డ్రామాలు కొత్త కాకపోయినా, ‘మోటోక్రాస్’ బ్యాక్ డ్రాప్ లో రావడం మాత్రం ఖచ్చితంగా కొత్తే. అయితే బైకర్ రెగ్యులర్‌ గా చూసే కమర్షియల్ సినిమా కాదు. దర్శకుడు అభిలాష్ రెడ్డి ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీని చాలా పక్కాగా సెటప్ చేసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ రొటీన్ గానే ఉన్నా, సెకండ్ హాఫ్ లో స్పీడ్ పెంచి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. దానికి తోడు జిబ్రాన్ అందించిన బీజీఎమ్ బిగ్గెస్ట్ ప్లస్ అయింది. ఈ సినిమాలో పాత్ర కోసం శర్వానంద్ తన ప్రాణం పెట్టేసాడు. పర్ఫెక్ట్ రేసర్‌ లా కనిపించడానికి అతను పడ్డ కష్టం స్క్రీన్ మీద కనిపిస్తుంది. అలాగే డా. రాజశేఖర్ పాత్ర చాలా బాగుంది. పైగా అయన కెరీర్ కి సాలిడ్ సెకండ్ ఇన్నింగ్స్ అవుతుంది. మిగిలిన పాత్రలన్నీ కథకు తగ్గట్లుగా ఉన్నాయి.


టెక్నికల్ గా సంగీతంతో పాటు, నేపథ్య సంగీతంతో జిబ్రాన్ ఎమోషనల్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేశాడు. అలాగే రేసింగ్ ట్రాక్స్, నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి ఒక కొత్త పాయింట్‌తో ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేస్తూ చాలా కొత్తగా ట్రై చేశాడు. కెమెరా వర్క్ కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా రేసింగ్ సీన్స్ అదిరిపోయేలా డిజైన్ చేసారు. ఎడిటింగ్ ఫస్టాఫ్ కాస్త ఫోకస్ చేయాల్సింది. ఓవరాల్‌ గా బైకర్.. ఎంగేజింగ్ రేసింగ్ సినిమాగా ఆడియన్స్ ని మెప్పిస్తుంది.

Apr 03, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
6

Above Average

Biker movie Review

శర్వానంద్ హీరోగా నటించిన మోటోక్రాస్ బైక్ రేసింగ్ స్పోర్ట్స్ డ్రామా తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకుంది.'బైకర్' సినిమాలో నారాయణ పాత్రలో నటించిన రాజశేఖర్ చాన్నాళ్ల తర్వాత ఒక బలమైన పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. హీరో పాత్ర కాకపోయినా… కథ మొత్తం ఆయన పాత్ర చుట్టూనే తిరిగేలా...

శర్వానంద్ హీరోగా నటించిన మోటోక్రాస్ బైక్ రేసింగ్ స్పోర్ట్స్ డ్రామా తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకుంది.

'బైకర్' సినిమాలో నారాయణ పాత్రలో నటించిన రాజశేఖర్ చాన్నాళ్ల తర్వాత ఒక బలమైన పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. హీరో పాత్ర కాకపోయినా… కథ మొత్తం ఆయన పాత్ర చుట్టూనే తిరిగేలా దర్శకుడు తీర్చిదిద్దాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్‌లో ప్రేక్షకులను కదిలించేలా నటించారు. మాళవిక నాయర్ ఫస్టాఫ్‌ లో గ్లామర్‌తో ఆకట్టుకోగా… సెకండాఫ్‌లో నటనతో మెప్పించింది. కథలో ఆమె పాత్రకు కూడా ప్రాధాన్యం ఉండటం విశేషం. విలన్‌గా అతుల్ కులకర్ణి సెటిల్డ్‌గా నటించి మెప్పించగా… అన్వర్ పాత్రలో కనిపించిన నటుడు కూడా తన పాత్రను బాగా నెరవేర్చాడు. బ్రహ్మాజీ, తులసి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.


సాంకేతికంగా చూస్తే… జిబ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. రేసింగ్ సన్నివేశాలు, భావోద్వేగ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా విజువల్‌గా ఆకట్టుకునేలా ఉంది. డైలాగులు తక్కువగానే ఉన్నప్పటికీ… ఉన్నవన్నీ కథను బలంగా ముందుకు తీసుకెళ్లేలా ఉన్నాయి. మొత్తంగా ‘బైకర్’ సినిమా ఎమోషన్స్, రేసింగ్ ఎలిమెంట్స్ కలయికతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రాజశేఖర్ నటన, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తున్నాయి

Apr 03, 2026 Read Review
Samayam Telugu
Samayam Telugu Website
6

Above Average

Biker Movie Review

శర్వానంద్ హీరోగా నటించిన మోటోక్రాస్ బైక్ రేసింగ్ స్పోర్ట్స్ డ్రామా తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకుంది. శర్వానంద్ తన పాత్రలో ఇమిడిపోయాడు. బైకర్ రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్టయ్యాడు. రాజశేఖర్ నారాయణ పాత్రలో చాన్నాళ్ల తర్వాత చాలా స్ట్రాంగ్‌గా మెప్పించారు. హీరో కాకపోయినా ఈ కథలో...

శర్వానంద్ హీరోగా నటించిన మోటోక్రాస్ బైక్ రేసింగ్ స్పోర్ట్స్ డ్రామా తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకుంది. శర్వానంద్ తన పాత్రలో ఇమిడిపోయాడు. బైకర్ రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్టయ్యాడు. రాజశేఖర్ నారాయణ పాత్రలో చాన్నాళ్ల తర్వాత చాలా స్ట్రాంగ్‌గా మెప్పించారు. హీరో కాకపోయినా ఈ కథలో ఆయనే కీలక పాత్రగా నిలిచారు. తన అనుభవంతో ఆ పాత్రను మరో స్థాయికి తీసుకెళ్లగా, ముఖ్యంగా క్లైమాక్స్‌లో శర్వానంద్‌ను హగ్ చేసే సీన్‌లో ఎమోషన్ పీక్స్‌కు చేరి ఆడియన్స్‌ను కదిలిస్తుంది.


మాళవిక నాయర్ ఫస్టాఫ్‌లో గ్లామర్‌తో ఆకట్టుకుని, సెకండాఫ్‌లో నటనతో ఇంప్రెస్ చేసింది. కథలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంది. విలన్‌గా అతుల్ కులకర్ణి చాలా సెటిల్డ్‌గా నటించగా, అన్వర్ పాత్రలో నటించిన వ్యక్తి కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. బ్రహ్మాజీ, తులసి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.


టెక్నికల్‌గా చూస్తే జిబ్రాన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్. రేసింగ్ సీన్స్, ఎమోషనల్ మోమెంట్స్‌ను బాగా ఎలివేట్ చేశారు. సినిమాటోగ్రఫీ కూడా విజువల్‌గా ఆకట్టుకుంటుంది. డైలాగులు తక్కువగా ఉన్నా, ఉన్నవన్నీ ఇంపాక్ట్ ఫుల్‌గా ఉన్నాయి. మొత్తంగా, ఎమోషన్స్‌తో పాటు రేసింగ్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేస్తూ శర్వానంద్ ఈసారి మంచి హిట్ కంటెంట్ అందించాడని చెప్పొచ్చు.

Apr 03, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
5

Average

Biker movie Review

శర్వానంద్ హీరోగా తెరకెక్కిన మోటోక్రాస్ బైక్ రేసింగ్ స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. తెలుగులో ఇప్పటివరకు పెద్దగా టచ్ చేయని మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకోవడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.దర్శకుడు అభిలాష్ రెడ్డి తండ్రి-కొడు...

శర్వానంద్ హీరోగా తెరకెక్కిన మోటోక్రాస్ బైక్ రేసింగ్ స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. తెలుగులో ఇప్పటివరకు పెద్దగా టచ్ చేయని మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకోవడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

దర్శకుడు అభిలాష్ రెడ్డి తండ్రి-కొడుకుల మధ్య ఉన్న భావోద్వేగాలను స్పోర్ట్స్ డ్రామాతో కలిపి చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా శర్వానంద్ తన పాత్రలో ఇమిడిపోతూ మంచి నటన కనబరిచారు. అలాగే డా. రాజశేఖర్ రీ ఎంట్రీ తర్వాత మరోసారి స్ట్రాంగ్ రోల్‌లో కనిపిస్తూ తన అనుభవాన్ని చూపించారు. వీరిద్దరి మధ్య ఎమోషనల్ సీన్లు సినిమాకు బలం చేకూర్చాయి.


సినిమాలోని రేసింగ్ సన్నివేశాలు థ్రిల్ కలిగించేలా తెరకెక్కించబడినాయి. అయితే ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగడం, కథలో కొంత రొటీన్ అంశాలు ఉండటం వల్ల అక్కడక్కడా యావరేజ్ ఫీలింగ్ కలిగిస్తుంది. అయినప్పటికీ, సెకండాఫ్‌లో వచ్చే స్క్రీన్‌ప్లే, క్లైమాక్స్ వరకు తీసుకెళ్లే నేరేషన్ ప్రేక్షకులను థియేటర్‌లో కూర్చోబెట్టేలా చేస్తుంది.

మొత్తంగా ‘బైకర్’ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉంది. ఓవర్ ఆల్‌గా ఈ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంటోంది

Apr 03, 2026 Read Review
123telugu
123telugu Website
7

Hit

Biker movie Review

శర్వానంద్ హీరోగా నటించిన మోటోక్రాస్ బైక్ రేసింగ్ స్పోర్ట్స్ డ్రామా తాజాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. బైక్ రేసింగ్ ని మెయిన్ పాయింట్ గా ఎంచుకుని, తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్ ని అద్భుతంగా చూపించాడు దర్శకుడు అభిలాష్ రెడ్డి. ఇక తెలుగులో ఇప్పటివరకు టచ్ చేయని మోటోక్రాస్ రేసింగ...

శర్వానంద్ హీరోగా నటించిన మోటోక్రాస్ బైక్ రేసింగ్ స్పోర్ట్స్ డ్రామా తాజాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. బైక్ రేసింగ్ ని మెయిన్ పాయింట్ గా ఎంచుకుని, తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్ ని అద్భుతంగా చూపించాడు దర్శకుడు అభిలాష్ రెడ్డి. ఇక తెలుగులో ఇప్పటివరకు టచ్ చేయని మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌ ని ఎంచుకోవడం సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే శర్వానంద్, డా. రాజశేఖర్‌ల అద్భుతమైన నటన సినిమాకు హైలైట్‌ కాగా, ముఖ్యంగా రాజశేఖర్ కి రీ ఎంట్రీ తర్వాత దక్కిన స్ట్రాంగ్ రోల్ గా చెప్పొచ్చు.


అలాగే పలు రేసింగ్ సన్నివేశాలు కూడా ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాయి. కాకపోతే, కాస్త నెమ్మదిగా సాగే ఫస్టాఫ్, రొటీన్ కథ కావడం వల్ల కాస్త యావరేజ్ ఫీల్ వచ్చినా, క్లైమాక్స్ వరకు థియేటర్లో కూర్చో బెట్టేసే స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే బైకర్ కి రాసుకున్నాడు దర్శకుడు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడే వారికి బైకర్ సినిమా ఒక మంచి ఛాయస్ గా చెప్పొచ్చు. 

Apr 03, 2026 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

Story : కథ విషయానికి వస్తే... తన ఫ్యామిలీయే ప్రపంచంగా బతికే వికాస్ నారాయణ్ (శర్వానంద్)‌ కి, తన భార్య అనన్య (మాళవిక నాయర్), కొడుకు ఇషాన్‌ లతో లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తుంటాడు. ఒకనాడు కొడుకు ఇషాన్ తన నాన్న గురించి తప్పుగా మాట్లాడారని, తోటి ఫ్రెండ్ తో గొడవపడతాడు. ఈ విషయం తెలిసి వికాస్ కూడా తన తండ్రిని గుర్తుకుచేసుకొని బాధపడతాడు. కట్ చేస్తే వికాస్ తండ్రి సునీల్ నారాయణ్ (రాజశేఖర్).. ఒక పాపులర్ మోటో క్రాస్ రేసింగ్ కోచ్. ఎన్నో రేసుల్లో ఛాంపియన్ అయిన సునీల్ సరైన ప్రోత్సాహం, ఆదరణ లేక టాప్ రేసర్ కాలేకపోయాడు.

అందుకే తన కొడుకుని ఇంటర్నేషనల్ ఛాంపియన్ గా తీర్చి దిద్దాలని వికాస్ కి కోచింగ్ ఇస్తుంటాడు. అనుకున్నట్టుగానే వికాస్ ఓ రేసులో ఛాంపియన్ అవుతాడు. కానీ ఆ తర్వాత తండ్రికి కూడా చెప్పకుండా రేసింగ్ ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అసలు విక్కీ ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది. మధ్యలో అనన్య (మాళవిక నాయర్) తో పరిచయం జీవితంలో ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది. వికాస్ తిరిగి రేసర్ అయ్యాడా లేదా? అనేది మిగిలిన కథ. 

Technical Values : తెలుగులో ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు వచ్చినా.. మోటో క్రాస్ రేసింగ్ అనే పాయింట్‌ తో ఏ సినిమా రాలేదు కాబట్టి, ఈ బైకర్ స్పోర్ట్స్ డ్రామా ఆడియన్స్ కి మంచి ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. కథ రొటీన్ గానే ఉన్నా, స్క్రీన్ ప్లే, యాక్షన్ కొరియోగ్రఫీ అదిరిపోయాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ ని ఇష్టపడే ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా ఆకట్టుకుంటుంది. అలాగే శర్వానంద్ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని ఫిట్ నెస్ తో పాటు, ఆ బైక్ రేసింగ్ సీన్లను చూస్తుంటేనే తెలుస్తుంది. అలాగే సీనియర్ హీరో రాజశేఖర్‌ కి కూడా బైక్ లో బలమైన రోల్ పడింది. రీ ఎంట్రీ తర్వాత రాజశేఖర్ కి దక్కిన అసలైన స్ట్రాంగ్ రోల్ ఇదే అని చెప్పొచ్చు.  ముఖ్యంగా శర్వా - రాజశేఖర్ మధ్య సీన్లు మంచి ఎమోషన్స్ తో  పండి  ఆకట్టుకున్నాయి. 

అయితే దర్శకుడు అభిలాష్ రెడ్డి కథ పరంగా స్పోర్ట్స్ డ్రామాల్లోని రొటీన్ కథనే ఎంచుకున్నాడు. ఒక రేసర్ ఛాంపియన్ అవడానికి, ఎదురయ్యే అవాంతరాలు ఛాలెంజ్ లు చూస్తుంటే కాస్త, రియలిస్టిక్ కి కాస్త దూరంగా ఉన్నట్టు ఉంది. అలాగే హీరోయిన్ పాత్ర కూడా స్ట్రాంగ్ గా లేదు. టెక్నికల్ గా జిబ్రాన్ అందించిన బీజీఎమ్ సినిమాకి హైలెట్ గా నిలిచింది. అలాగే సినిమాటోగ్రాఫర్ జె.యువరాజ్ రేసింగ్ సీన్స్‌ విజువల్స్ ని అద్భుతంగా కెమెరాలో బంధించారు. అయితే కొన్ని సీన్స్ ఎడిట్ చేసేయాల్సింది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా "బైకర్" యాక్షన్ స్పోర్ట్స్ డ్రామాల్లో సరికొత్త సినిమాగా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని చెప్పాలి. కాస్త రొటీన్ కథ అనే విషయం పక్కన పెడితే స్పోర్ట్స్ డ్రామాలు ఇష్టపడే అన్ని రకాల ఆడియన్స్ ఈ సినిమాని చూసేయొచ్చు.

Review Statistics

5.9
Overall Rating
Avg. of all reviews
14
Total Reviews
From 3 Provider Types

Review Average

Media
5.9/10
Public
N/A