స్లమ్ డాగ్ (Slum Dog 33 Temple Road)
ప్రామిసింగ్ గా స్లమ్ డాగ్ టీజర్... పక్కా "పూరి" మార్క్ తో...
About This Movie
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannath) - మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కాంబినేషన్ లో స్లమ్ డాగ్ అనే మూవీ తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. సేతుపతి - పూరి కాంబో అనగానే ఇండస్ట్రీలో క్రేజీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా టీజర్ కూడా విడుదలై యూట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. "స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్" పేరుతో విడుదలైన ఈ టీజర్ ను పక్కా పూరి మార్క్ తో స్టైలిష్ గా కట్ చేశారు.
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో విజయ్ సేతుపతి రెండు షేడ్స్ ఉన్న రోల్ లో నటించనుండగా, ఓ రోల్ లో బ్లైండ్ బెగ్గర్ గా కనిపించనున్నాడని టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. టీజర్ చూసిన తర్వాత తమ బిచ్చగాళ్ల జీవితాలను నాశనం చేయాలని చూసిన విలన్ గ్యాంగ్ పై హీరో తిరగబడే కథాంశంతో సినిమా రూపొందినట్టు తెలుస్తుంది.
టీజర్ లో కొన్ని యాక్షన్ షాట్స్ సూపర్ హైలెట్ అయ్యాయి. సినిమాలో కూడా అదే రేంజ్ కంటెంట్ స్టోరీలో కూడా ఉంటే ఈ సినిమాతోనే పూరి కమ్ బ్యాక్ ఇచ్చే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి. అండ్ టీజర్ కట్ చేసిన విధానం, వాటికి హర్ష వర్ధన్ రామేశ్వర్ ఇచ్చిన బిజిఎం అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి. ఇక పూరి కనెక్ట్స్ - జెబి మోషన్ పిక్చర్స్ బ్యానర్స్ లో పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, జెబి నారాయణరావు కొండ్రోళ్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ స్లమ్ డాగ్ మూవీలో టబు, సంయుక్త, దునియా విజయ్, బ్రహ్మాజీ, విటివి గణేష్ కీ రోల్స్ లో నటిస్తున్నారు.
అయితే టీజర్ లో సినిమా త్వరలో వస్తుందని చెప్పారు గాని ఏ నెలలో వస్తుందో హింట్ ఇవ్వలేదు.. బహుశా ఆగస్టులో పలు సినిమాల పోటీ ఉన్నందున జులై లేదా సెప్టెంబర్ లో సినిమాని ఆడియన్స్ ముందుకు తెచ్చే ఛాన్స్ ఉంది. ఇక కొన్నాళ్లుగా ఫామ్ లో లేని డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈసారి స్లమ్ డాగ్ తో 33 టెంపుల్ రోడ్ తో కమ్ బ్యాక్ ఇచ్చేలా ఉన్నాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.