Register as a Reviewer
జడి (Jadi)

జడి (Jadi)

Upcoming Expected Release: 2026

Jadi : రెండు దశాబ్దాల తర్వాత తెలుగులో థియేటర్లలో ఒడియా మూవీ.. క్లాసిక్ అవుతుందా? త్వరలో ప్రేక్షకుల ముందుకు...

Director: Dibya Jyoti Udaya Singh
Cast: Shailendra Samantaray, Priyambada Swain, Akash Hota, Sushant Das Mahapatra, Rabi Mishra, Balakrishna Nayak, and Krishna Rout.

Available in:

About This Movie

గత నాలుగైదేళ్ల నుండి ఇండియన్ సినిమాల్లో భాషాభేదం లేకుండా... అన్ని ఇండస్ట్రీల నుండి మంచి సినిమాలు ఇతర భాషల్లోనూ విడుదల అవుతున్నాయి. ఆ సినిమాలు కూడా కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా సక్సెస్ చేస్తుంటారు ప్రేక్షకులు. ముఖ్యంగా సౌత్ లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీల సినిమాలు అలాగే హిందీ సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా అన్ని భాషల్లో విడుదలవుతున్నాయి. ఈ మధ్య మరాఠీ నుండి కూడా పలు సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా పలు భాషల్లో విడుదల అవుతున్నాయి. కానీ చిన్న ఇండస్ట్రీలైన ఒడియా, బెంగాలీ వంటి భాషల సినిమాలు పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కావడం చాలా అరుదు. కానీ ఇప్పుడు ఒడియాలో సూపర్ హిట్ అయిన ఓ చిన్న సినిమా తెలుగులో రిలీజ్ కాబోతుంది. 

 

 


వివరాల్లోకి వెళితే ఒడియాలో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన "జడి" (The Untold Side of IF)" సినిమాను తెలుగులో మెగా ప్రొడక్షన్స్ అధినేత ఉడుగుల అశ్విని కుమార్ గౌడ్ విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను తెలుగులో విడుదల చేసారు. కామెడీ అండ్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో శైలేంద్ర సమంతరాయ్, ప్రియంబద స్వైన్, ఆకాశ్ హోతా మెయిన్ లీడ్స్ గా నటించగా, సుశాంత్ దాస్ మహాపాత్ర, రబి మిశ్రా, బాలకృష్ణ నాయక్, కృష్ణ రౌత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక శ్రీయాన్ష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై కాజల్ రే నిర్మించిన ఈ సినిమాకు దిబ్య జ్యోతి ఉదయ సింగ్ దర్శకత్వం వహించారు. 

 

 

టీజర్ ని  గమనిస్తే... విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కాలేజీ యువకుల మధ్య స్నేహం, వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ తో పాటు, ఓ మంచి లవ్ స్టోరీని కూడా సినిమాలో చూపించనున్నట్టు తెలుస్తుంది. అలాగే ప్రేమలో అపార్ధాలు, స్నేహితుల గొడవలు, ఫ్యామిలి ఎమోషన్స్ ఇవన్నీ కలగలిపి ఓ మంచి సినిమాను తెలుగు ఆడియన్స్ కి అందించబోతున్నట్టు తెలుస్తుంది. టీజర్ చూస్తుంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నటు తెలుస్తుంది. టీజర్ కట్ చేసిన విధానం ఆ బీజీఎమ్, సినిమాటోగ్రఫి వర్క్ ప్లస్ అయ్యేట్టు ఉన్నాయ్. మరి ఒడిలో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన 'జడి' సినిమాను తెలుగులో ఆడియన్స్ ఎలా ఆదరిస్తారో చూడాలి. 

 

 

ఇక ఒడియా మూవీస్ పెద్దగా ఏ భాషలో కూడా డబ్ కావు. అప్పుడెప్పుడో రెండు దశాబ్దాల కిందట "జై జగన్నాథ్" పేరుతో తెలుగులో ఓ ఒడియా సినిమా డబ్ అయింది. మళ్ళీ ఇన్నాళ్లకు ఈ జడి సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సోమేశ్ సత్పతి సంగీతం అందించారు. త్వరలోనే తెలుగులో రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నట్టు మేకర్స్ తెలిపారు. 

Why MRO?