హైందవ (Haindava)
Haindava : ఈసారి పోలీస్ మాత్రమే కాదు.. దేవుణ్ణి కూడా నమ్ముకున్న బెల్లం కొండ.. కెరీర్ బెస్ట్ కొడతాడా?
Available in:
About This Movie
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) లాస్ట్ ఇయర్ కిష్కిందపురి సినిమాతో కం బ్యాక్ హిట్ కొట్టాడు. దాంతో వరుస సినిమాలు లైన్లో పెట్టాడు. ఈ క్రమంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న మూవీల్లో "హైందవ" (Haindava) ఒకటి. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీనివాస్ ఒక పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాను లూధీర్ బైరెడ్డి దర్శకత్వం వహించగా, సంయుక్త హీరోయిన్ గా నటించింది. ఇక తాజాగా మేకర్స్ హైందవ టీజర్ విడుదల చేయగా, సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.
అయితే పోస్టర్ విడుదల చేసినపుడు ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్ గా మాత్రమే తెరకెక్కుతున్నట్టు అనుకున్నారు. కానీ తాజాగా టీజర్ ద్వారా ఇందులో డివోషనల్ అండ్ మిస్టరీ టచ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. టీజర్ ఆద్యంతం దేవుళ్లు, నమ్మకాలు, ఆచార సంప్రదాయాలు మరియు విగ్రహాల మాయం వంటి మిస్టరీ అంశాలతో టీజర్ ని కట్ చేసారు. టీజర్ లో చూపించినదాన్ని బట్టి, రంగాపురం అనే గ్రామంలో దేవుని విగ్రహాలు మాయమవుతాయి. అదే సమయంలో ఊళ్ళో కొందరు హత్యకు గురవుతారు. ఈ మిస్టరీని ఛేదించే క్రమంలో ఆ ఊరికి దేవుడిపై నమ్మకం లేని పోలీస్ ఆఫీసర్ ఈ కేసులను టేకప్ చేస్తాడు. మరి ఆ కేసుల్ని హీరో ఎలా సాల్వ్ చేసాడు. దేవుడంటే నమ్మకం లేని పోలీస్ ఆఫీసర్ ఈ విగ్రహాల కేసుల ద్వారా ఏం తెలుసుకున్నాడు. టీజర్ లో చూపించినట్టు పుష్కర సమయానికి గుడిలో విగ్రహాలు ఎలా వస్తాయి? అనేది సినిమాలో చూపించనున్నారు.
ఇక సంయుక్త హీరోయిన్ గా నటించిన ఈ హైందవ సినిమాలో మహేష్ మంజ్రేకర్, జేడీ చక్రవర్తి, సౌరభ్ సచ్‌దేవా, మహేష్ మంజ్రేకర్, శివాజీ రాజా, గెటప్ శ్రీను తదితరులు కీ రోల్స్ లో నటించనున్నారు. సామ్.C.S మ్యూజిక్ అందించగా, మహేష్ చందు ఈ సినిమాను నిర్మించాడు. హైందవతో బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ బెస్ట్ కొట్టే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమాను నవంబర్ 27న విడుదల చేయనున్నారు మేకర్స్.