Register as a Reviewer
గోల్డెన్ భాగ్యం (Golden Bhagyam)

గోల్డెన్ భాగ్యం (Golden Bhagyam)

Upcoming Expected Release: 2026

Golden Bhagyam : స్టార్ కమెడియన్స్ మల్టీస్టారర్.. ప్రామిసింగ్ గా గోల్డెన్ భాగ్యం టీజర్.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు..

Director: Pawan Basamsetti
Cast: Satya, Yogi Babu, Jaya Sri, Athi Raj, Vennela Kishore, Sudarshan, Rohini, Sunil Reddy, Tanikella Bharani

Available in:

About This Movie

తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలలో స్టార్ కమెడియన్లు గా రాణిస్తున్న సత్య (Satya), యోగి బాబు (yogibabu) తమదైన శైలిలో సినిమాల్లో దూసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ మెయిన్ లీడ్ గా ఓ సినిమా తెరకెక్కుతుంది. పక్కా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను రంగబలి ఫేమ్ పవన్ బాసంశెట్టి డైరెక్ట్ చేస్తున్నాడు. డ్రీమ్ మూవీ మేకర్స్, నయావాయు బ్యానర్స్ పై డాక్టర్ నాగార్జున రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి బాసిరెడ్డి, బాపిరెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు "గోల్డెన్ భాగ్యం" (Golden Bhagyam) అంటూ క్రేజీ టైటిల్‌ ను మేకర్స్ ఫిక్స్ చేయగా, ఈ మూవీ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. 

 

ఇక యూట్యూబ్ లో గోల్డెన్ భాగ్యం టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుండగా, టీజర్ మొత్తం వినోదాత్మకంగా, ఎనర్జెటిక్‌ గా ఉండి ఆకట్టుకుంటుంది. ఇక తెలుగు, తమిళ సినీ వర్గాలను కలిపే కాన్సెప్ట్‌ తో ఈ సినిమాగా, "తెలుమిల్" మూవీగా మేకర్స్ దీన్ని చేసారు. ఇక టీజర్ స్టార్టింగ్ లోనే "సాంబార్ ఇడ్లీ, బిర్యానీ కలిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తారని డైరెక్టర్ చెప్తూ.. మెల్లిగా రెండు ఇండస్ట్రీల బిగ్ హీరోస్ ని కలిపి స్టిల్స్ ని చూపిస్తూ... ఆ మధ్యలో సత్య, యోగి బాబులను ఇంట్రడ్యూస్ చేసాడు. ట్రెడిషనల్ పంచకట్టులో ఎంట్రీ ఇచ్చిన హీరోలు అదుర్స్ అనిపించేలా ఉన్నారు. 

 

 ఇక ఈ 'గోల్డెన్ భాగ్యం' సినిమాలో జయ శ్రీ, అతి రాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా వెన్నెల కిషోర్, సుదర్శన్, రోహిణి, సునీల్ రెడ్డి, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పవన్ సీహెచ్ సంగీత దర్శకుడు. అయితే ఈ సినిమాను సంక్రాంతి పండుగ సీజన్ తర్వాత విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి ఈ సినిమాతో ఇద్దరు కమెడియన్లు హీరోలుగా ఆడియన్స్ ని ఎలా అలరిస్తారో చూడాలి.

 

Why MRO?