ఫౌజి (File no.25 : FAUZI)
File no.25 : FAUZI : నేతాజీ సేనలో 'ఫౌజి' గా రెబల్ స్టార్.. మరోసారి థౌసండ్ వాలా బ్లాస్ట్ కి రెడీ..!
About This Movie
ఎప్పుడెప్పుడా అంటూ రెబల్ ఫ్యాన్స్ ఎదురుచూసిన 'ఫౌజీ' గ్లింప్స్ ఎట్టకేలకు విడుదలైంది. విడుదలైన గంటల్లోనే నెట్టింట సాలిడ్ గా ట్రెండ్ అవుతుంది. రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేసిన ఫౌజి గ్లింప్స్ పాన్ ఇండియా వైడ్ గా మూవి లవర్స్ దృష్టిలో అంచనాలను పెంచేసింది. వివరాల్లోకి వెళితే హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడిక్ వార్ డ్రామాకి సంబంధించి 'ఫైల్ నెం.25: 'ఫౌజీ' గ్లింప్స్.. పేరుతో వీడియో విడుదల చేసారు మేకర్స్. పాన్ ఇండియా భాషల్లో విడుదలైన గ్లింప్స్ అంచనాలు స్కై లెవెల్లో పెంచేసేలా ఉంది.
ఇక టీజర్ ని చూస్తుంటే... సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో తెరకెక్కినట్టు తెలుస్తుండగా, వీడియో స్టార్టింగ్ లోనే.. హిట్లర్ - నేతాజీ సుభాష్ చంద్రబోస్ మధ్య జరిగిన సంభాషణను చూపించారు. 1942 మే 29 న బెర్లిన్ లో నేతాజీ - హిట్లర్ ను కలిసిన సన్నివేశంలో బ్రిటిష్ పాలకుల నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు జర్మనీ సైన్యం హెల్ప్ అడుగున్నట్టు చూపించారు. ఈ క్రమంలో నేతాజీ "మా భారతీయుల గురించి మీకు తెలియదు హిట్లర్.. మా దేశానికి స్వాతంత్య్రం ఎలా తీసుకురావాలో నాకు తెలుసు... మీరు సపోర్ట్ చేసినా, చేయకపోయినా స్వాతంత్య్రం తీసుకొస్తా.. నేతాజీ చెప్పే డైలాగ్ గూస్బంప్స్ తెప్పిస్తుంది. ఈ క్రమంలో ప్రభాస్ ని ఫౌజి గా.. సోల్జర్ గా.. స్ట్రాటజిస్ట్.. స్పై.. అతనే ఫౌజీ" అంటూ నేతాజీ ఇచ్చే ఎలివేషన్ గ్లింప్స్ కే హైలెట్ గా నిలిచింది.
అలాగే గ్లింప్స్ లో భగవద్గీత ఆధారంగా సీక్రెట్ కోడ్! తో సినిమాలో 'ఫౌజీ' పాత్ర కేవలం ఓ సైనికుడికి సంబంధించింది కాదని తెలుస్తుంది. పైగా సినిమాలో బ్రిటిష్ వాళ్ళే ఫౌజిగా పేరు పెట్టారని చెప్తారు. ఇక వీడియో చివరో ప్రభాస్ ని చూపించిన తీరు చూస్తే ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ మాస్ టీజర్ రాలేదని చెప్పాలి. పెద్ద గన్ మిషన్ ని ఆపరేట్ చేస్తూ స్లో మోషన్ లో ప్రభాస్ ని చూపించిన తీరు... ఆ మేకోవర్, బాడీ లాంగ్వేజ్, ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చాయి. దీనికి తోడు విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన బీజీఎమ్ సాలిడ్ హైప్ ఇస్తుంది. సుదీప్ ఛటర్జీ సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది. ఇక ప్రభాస్ కు జంటగా కొత్తమ్మాయి ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, జయప్రద కీ రోల్ లో నటించనున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాను 2027 మార్చి 19న థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాతో ప్రభాస్ మరో 1000 కోట్ల సినిమా అందుకుంటాడని, ఫ్యాన్స్ అయితే బాహుబలి 2 ని బ్రేక్ చేసే సినిమా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
You Might Also Like
హైకూ (Haiku)
2026
418 (#418)
2026