Register as a Reviewer
దాదా (DADA)

దాదా (DADA)

Upcoming Expected Release: 24 Dec 2026

DADA : ముంబై కా "దాదా" వచ్చేస్తున్నాడు.. ఈసారి లెక్కలు మారేలా ఉన్నాయి..

Director: Gopichandh Malineni
Cast: Nandamuri Balakrishna, Kajal Aggarwal , SamuthiraKani, Manchu manoj, Sarath Kumar, Abhimanyu Singh, Upendra Limaye, Manish Wadhwa, Swasika.

Available in:

About This Movie

నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీర సింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఆ మధ్య బాలకృష్ణ బర్త్ డే సందర్బంగా ఈ సినిమా టైటిల్ కూడా పెట్టకుండా NBK111 గ్లింప్స్ పేరిట రిలీజ్ చేసిన వీడియో కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

 

తాజాగా ఈ సినిమాకి "దాదా" టైటిల్ ఫిక్స్ చేసి మరో స్పెషల్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియో కి కూడా నెట్టింట సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఈ టీజర్ బాలయ్య ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇస్తుండగా, పూర్తిగా యాక్షన్ సీక్వెన్స్ తో కూడిన ఈ టీజర్ లో బాలయ్య చెప్పే డైలాగ్స్ ఎప్పట్లాగే ఫ్యాన్స్ తో విజిల్ వేయించే రేంజ్ లో ఉన్నాయి.అయితే ఈ మూవీలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్స్ ప్లే చేస్తున్నట్టు సమాచారం. ఇక టీజర్ లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన బీజీఎమ్ స్కోర్ సాలిడ్ గా ఉంది. 

 

టీజర్ లో ‘"దేఖో షేర్‌ ఆగయా.." అనే డైలాగ్‌ తో మొదలైన ఈ గ్లింప్స్‌.. ‘"నాకు గురి పెట్టడానికి ఒంట్లో పొగరు.. వేలికి ట్రిగ్గరు ఉంటే సరిపోదు. బుల్లెట్స్‌ కి బలుపుండాలి. గన్స్‌ కి గట్స్‌ ఉండాలి"... అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ సినిమాలో బిజీఎం లో వచ్చే "దాదాహుమే.." అనే బ్యాక్ గ్రౌండ్ సాంగ్.. హిందీ ఫేమస్ సాంగ్ నాయక్ నహి.. ఖల్ నాయక్ హూ మై" సాంగ్ ను రీమిక్స్ చేసినట్టు ఉండగా, ఆ సాంగ్ ను సినిమాలో రీమిక్స్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

 
ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌ గా నటిస్తుండగా, మంచు మనోజ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని ఈ ఇయర్ డిసెంబర్ 24న థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈసారి సీనియర్ హీరోల్లో బాక్స్ ఆఫీస్ లెక్కలు మార్చేది బాలయ్యే అని నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి.

Why MRO?