Register as a Reviewer
ఆదర్శ కుటుంబం - AK47 (Adarsha Kutumbam AK47)

ఆదర్శ కుటుంబం - AK47 (Adarsha Kutumbam AK47)

Upcoming Expected Release: 02 Oct 2026

Adarsha Kutumbam AK47 : ఫ్యామిలీ ఇమేజ్ వెంకీయే... కానీ సిచ్యువేషన్ డిమాండ్ చేసింది. అందుకే యాక్షన్ కూడా...

Director: Trivikram
Cast: Venkatesh Daggubati, Srinidhi Shetty, Nara Rohith, Nivetha Pethuraj, Yuvina Parthavi, Raja Prajwal and an ensemble cast.

Available in:

About This Movie

 

ఫ్యామిలీ స్టార్ విక్టరీ వెంకటేష్  "సంక్రాంతికి వస్తున్నాం" బ్లాక్ బస్టర్ తర్వాత వరుస క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. అందులో భాగంగానే విక్టరీ వెంకటేశ్ - గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌ "ఆదర్శ కుటుంబం - AK47" మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎప్పట్నించొ వీళ్ళ కాంబో గురించి ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా, ఫైనల్ గా ఇప్పుడు సెట్టయింది. గతంలో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి క్లాసిక్ మూవీస్ కి త్రివిక్రమ్ మాటలను అందించిన విషయం తెలిసిందే. 

 

ఇక ప్రస్తుతం వెంకీ - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ ఆదర్శ కుటుంబం సినిమా ఒక ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతుండగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌ అండ్ ఇంట్రో గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ రాగా, ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ గా అఫిషియల్ టీజర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఇక ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో రన్ అవుతుంది.  

 

ఇక టీజర్ విషయానికి వస్తే.. టీజర్ స్టార్టింగ్ లోనే వెంకీ చెప్పిన డైలాగ్స్ త్రివిక్రమ్ మార్క్ ని గుర్తు చేస్తున్నాయి. "డబ్బుకు సబ్బుకు ఓ పోలిక ఉంది. మొదటిది చూస్తుండగానే కరిగిపోద్ది. రెండోది ఆలోచించే లోపే అరిగిపోద్ది" అంటూ వెంకటేష్ ఎంట్రీలోనే ఉండే డైలాగ్ అదిరిపోయింది. అలాగే త్రివిక్రమ్ మార్క్ కామెడీ పంచ్ లు కూడా టీజర్ లో ఉన్నాయి. ఈ సినిమాలో వెంకటేశ్ చిట్టిబాబు పాత్రలో ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉద్యోగిగా కనిపించనున్నాడు. ఇక మిడిల్ క్లాస్ ఫామిలీ అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలిసిందేగా. అలాంటి సీన్స్ తోనే సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ జెనరేట్ చేయనున్నాడు డైరెక్టర్. 

 

ఫ్యామిలీలో భార్య, పిల్లలతో కలిసి చిన్న చిన్న సంతోషాలను షేర్ చేసుకునే వ్యక్తిగా, అదే సమయంలో కుటుంబ అవసరాలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే ఒక సగటు కుటుంబికుడిగా చూపించారు. ఇలాంటి మనిషికి అనుకోకుండా, లాటరీలో డబ్బొస్తే ఒక్కసారిగా వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ తీసుకుంటుంది. అలా అదే డబ్బు వారిని ఇబ్బందుల్లోకి ఎలా నెట్టేస్తుంది అనేది సినిమా కథ నేపథ్యంగా ఎంచుకున్నట్టు తెలుస్తుంది. 

 

ఇక ఇది కేవలం ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా కాకుండా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ని కూడా మిక్స్ చేస్తున్నట్టు టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. ఇక టీజర్ లో '"నాకు ఫ్యామిలీ ఇమేజ్ ఉందని తెలుసు. కానీ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే యాక్షన్ చేయడానికి వెనుకాడను" అంటూ వెంకీ చెప్పే డైలాగ్ టీజర్ కే హైలెట్. ఇక ఈ మూవీలో శ్రీనిధి శెట్టి వెంకటేశ్ భార్య పాత్రలో హీరోయిన్ గా కనిపించనున్నారు. ఇక నారా రోహిత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కీ రోల్ లో కనిపిస్తున్నాడు. 

ఇక ఈ సినిమాకి ఎస్. థమన్ మ్యూజిక్ అందించనుండగా, ఈ సినిమాను 2026 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాతో మరోసారి రీజనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయమని వెంకటేష్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Why MRO?