Register as a Reviewer
హుషారు 2 (HUSHARU 2)

హుషారు 2 (HUSHARU 2)

Upcoming Expected Release: 2026

HUSHARU 2 : 8 ఏళ్లకు సీక్వెల్ తో మూర్తన్న తో కలిసి వస్తున్నారు..! ఈసారి అంతకు మించిన డోస్..!

Director: Sree Harsha Konuganti
Cast: Peoples Star R Narayana Murthy, Rahul Ramakrishna, Ashok Galla, Ravi Anthony, Dinesh Tej, Sasidhar Kocharlakota, Vidhi Yadhav, Abhignya Vuthuluru, Bhagwan Tiwari, Jatin Goswami, Rajai Rowan

Available in:

About This Movie

టాలీవుడ్ లో ఎనిమిదేళ్ల కింద చిన్న సినిమాగా విడుదలై పెద్ద సక్సెస్ అయిన సినిమా "హుషారు". ఇప్పటికీ బుల్లితెరపై మంచి రేటింగ్ తెచ్చుకుంటూ ఉంటుంది ఈ సినిమా. అయితే ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ గా "హుషారు 2" తెరకెక్కుతుంది. రాహుల్ రామ‌కృష్ణ‌, అశోక్ గ‌ల్లా, ర‌వి అంథోని, దినేష్ తేజ్‌, శ‌శిధ‌ర్ కోచ‌ర్ల‌కోట‌ మెయిన్ లీడ్స్ లో నటిస్తున్న ఈ సినిమాలో విధి యాద‌వ్‌, అభిజ్ఞ ఉతులూరు ఫిమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇక ఫస్ట్ పార్ట్ డైరెక్ట్ చేసిన "శ‌్రీహ‌ర్ష కొనుగంటి" ఈ సీక్వెల్ కి కూడా డైరెక్ట్ చేస్తున్నాడు.  ఇక హుషారు 2 సినిమాను కేవ్‌మ్యాన్ స్టోరీస్‌, హెచ్‌కె ఫిల్మ్స్‌, క‌లియుగ వార‌ధ క్రియేష‌న్స్‌ బ్యానర్లపై రాహుల్ వ‌ర్మ‌, కె.వీణా రాణి, కె.హ‌నుమంత్ రాజు నిర్మించగా, తాజాగా హుషారు 2 టీజర్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. 

 

 

ఇక టీజర్ ని గమనిస్తే... చిత్రగుంజ్ ప్రాంతంలో మాఫియా నేర సామ్రాజ్యాన్ని విస్తరించిన ఓ రాక్షసుడు ఓ వైపు, వాళ్ళ చేత పీడింపబడిన ప్రజల హక్కులను కాపాడేందుకు సాయధ పోరాటం చేసే నక్సలైట్ అన్న దళాలు మరో వైపు ఉండగా... అనుకోకుండా అక్కడ ఓ ఐదుగురు నిరుద్యోగులు ఆ పద్మవ్యూహంలో చిక్కుకుపోతే.. ఆ తర్వాత ఏం జరిగిందనే కాన్సెప్ట్ తో సినిమాని తెరకెక్కించారు మేకర్స్. ఇక టీజర్ ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా ఉండి ఆకట్టుకుంటుంది. 

 

 

ఇక ఈ సినిమాలో  పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి నక్సలైట్ నాయకుడిగా ఓ ప్రత్యేక పాత్రలో నటించనుండడం విశేషం. టీజర్ చివర్లో ఆయన కనిపించగా సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. టీజర్ లో సాయుధ నక్సలైట్‌ గా నారాయణ మూర్తి ఎంట్రీ ఇస్తూ 'తమ్ముళ్లు వేట మొదలెడదామా?' అంటూ చెప్పిన డైలాగ్‌ తో టీజర్ కే హైలెట్ గా నిలిచింది. ఎందుకంటే ఆయన హీరోగా చేసిన సినిమాల్లో తప్ప ఇతరుల సినిమాల్లో ఎప్పుడూ ఆయన కీ రోల్స్ లో నటించింది లేదు. అలాంటిది ఈ హుషారు 2 సినిమాలో నటించడమంటే చాలా విశేషం అని చెప్పాలి. డైరెక్టర్ ఏం చెప్పి ఒప్పించాడో తెలీదు కానీ, సినిమాకి మాత్రం ఆయన హైలెట్ అవుతాడని గ్యారెంటీ గా చెప్పొచ్చు. ఇక సినిమాను అతి త్వరలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. 

Why MRO?