Register as a Reviewer
Home Reviews Media Reviews

Media Reviews

Reviews from top media outlets, YouTube channels, and publications

1448
Total Reviews
Showing 1237–1248 of 1448 media reviews
సైక్ సిద్ధార్థ్ (Psych Siddharth)

Psych Siddharth Movie Review

O

By OK Telugu

శ్రీ నందు, యామిని భాస్కర్ హీరో, హీరోయిన్ గా నటించిన మూవీ సైక్ సిద్ధార్థ్. అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కథ కాకరకాయ లేకుండా.. జస్ట్ స్టైల్ మీద సినిమా రన్ చేసి, ప్రెజెంటేషన్ కూడా అతిగా...

శ్రీ నందు, యామిని భాస్కర్ హీరో, హీరోయిన్ గా నటించిన మూవీ సైక్ సిద్ధార్థ్. అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కథ కాకరకాయ లేకుండా.. జస్ట్ స్టైల్ మీద సినిమా రన్ చేసి, ప్రెజెంటేషన్ కూడా అతిగా ఉన్న సినిమా ఇది. ఇది డైరెక్టర్ ఛాయిస్ అయి ఉండొచ్చు. కానీ ఆ అతిగా ఉన్న నరేషనే సినిమా మీద ఇంట్రెస్ట్ ను తగ్గించేసింది. ఈ సినిమాను చూస్తే రెండు సినిమాలు గుర్తు వస్తాయి, ఒకటి అర్జున్ రెడ్డి.. రెండు డీజె టిల్లు. ఈ రెండిటిని మిక్సీలో వేసి దానికి అతి నేరేషన్ జోడించి సినిమా చేస్తే అది సైక్ సిద్దార్థ. కానీ ఆ రెండు సినిమాలలో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. మనసుకు హత్తుకునే సీన్లు ఉంటాయి. టిల్లు చెప్పే పంచులకు నవ్వలేక పొట్ట నొప్పి వస్తుంది. అవేవీ ఈ సిద్ధార్థ లో లేవు. అదే ఈ సినిమా మైనస్. ఏ పాత్ర కూడా బలంగా లేదు. రైటింగ్ వీక్ అనే చెప్పాలి. మ్యూజిక్ కూడా ఆఫ్ బీట్ గా సాగింది. గుర్తుంచుకోదగ్గ పాట ఒక్కటీ లేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్నీ ఒక ప్రయోగాత్మక సినిమా తరహాలో సాగాయి.

3.0
out of 10

Not Good

సైక్ సిద్ధార్థ్ (Psych Siddharth)

Psych Siddharth Movie Review

కొత్త తరహా పత్రాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే శ్రీ నందు ఈసారి సైక్ సిద్ధార్థ్ మూవీతో హీరోగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో ఇద్దరూ తమ తమ నటనతో ఇంప్రెస్ చేసారు. కాన...

కొత్త తరహా పత్రాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే శ్రీ నందు ఈసారి సైక్ సిద్ధార్థ్ మూవీతో హీరోగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో ఇద్దరూ తమ తమ నటనతో ఇంప్రెస్ చేసారు. కానీ ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ కాదు. సినిమా కోసం ఓ రకమైన ఫ్రస్ట్రేషనే వారిని ఈ పాత్రలు అంత బాగా చేయడానికి ప్రేరేపించి ఉండొచ్చు. ఇక సినిమాలో మిగిలిన పాత్రధారులు తెర మీద కొత్తగా కనిపించడంతో పాటు కాస్తంత భిన్నంగా నటించే ప్రయత్నం చేశారు. దర్శకుడు వరుణ్ రెడ్డి తాను తీయాలనుకున్న విధంగా సినిమాను తీసేశాడు... అంతే. స్మరణ్‌ సాయి నేపథ్య సంగీతం డిఫరెంట్ గా ఉండి, ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నా... మేకర్స్ కథ మీద ఇంకాస్తంత గట్టిగా వర్క్ చేసి ఉంటె బాగుండేది. కానీ సినిమాలో రొమాన్స్, కామెడీ పై మాత్రమే ఫోకస్ పెట్టగా, సినిమా కంటెంట్ ఆడియన్స్ కి చేరువ కాలేదు.

4.0
out of 10

Below Average

సైక్ సిద్ధార్థ్ (Psych Siddharth)

Psych Siddharth Movie Review

శ్రీ నందు హీరోగా, యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించిన మూవీ సైక్ సిద్ధార్థ్. సినిమాలో నందు తన పెర్ఫార్మన్స్ తో బాగానే ఆకట్టుకున్నాడు. అలాగే కథానాయికగా యామినీ భాస్కర్ నటన బావుంది. కానీ ఆడియన్స్ కి అంతగా...

శ్రీ నందు హీరోగా, యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించిన మూవీ సైక్ సిద్ధార్థ్. సినిమాలో నందు తన పెర్ఫార్మన్స్ తో బాగానే ఆకట్టుకున్నాడు. అలాగే కథానాయికగా యామినీ భాస్కర్ నటన బావుంది. కానీ ఆడియన్స్ కి అంతగా రీచ్ అవలేదు. బూతులు, బోల్డ్ సీన్లు చూపిస్తే అది న్యూ ఏజ్ సినిమా అవ్వదు. ట్రైలర్లలో ఆ కంటెంట్ కొంత మందిని థియేటర్లకు రప్పిస్తుందంతే. ఒక్క విషయంలో దర్శకుడిని మెచ్చుకోవాలి... హీరోయిన్‌ గా పెళ్లి కాని అమ్మాయిని కాకుండా బిడ్డతో భర్త నుంచి వేరుపడిన మహిళతో హీరోతో ప్రేమలో పడినట్టు చూపించడం. ప్రేమ కోసం కష్టపడమని చివరిలో చెప్పిన మాటలు బావున్నాయి. అందరికీ నచ్చే సినిమా కాదిది. జెన్ జి (ఈ తరం యువత)కు అయినా సరే హీరో క్యారెక్టర్, ఆ క్యారెక్టరైజేషన్ ఒక్కటే సరిపోదు. కథ కావాలి. యామినీ భాస్కర్, నందు నటనకు పేరొస్తుంది. విజయం మాత్రం కష్టమే.

5.0
out of 10

Average

సైక్ సిద్ధార్థ్ (Psych Siddharth)

Psych Siddharth Movie Review

శ్రీ నందు హీరోగా, యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించిన మూవీ సైక్ సిద్ధార్థ్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియన్స్ నుండి నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కథ, కంటెంట్ పరంగా డైరెక్టర్ నెగ్లెట్ చేసాడని చె...

శ్రీ నందు హీరోగా, యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించిన మూవీ సైక్ సిద్ధార్థ్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియన్స్ నుండి నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కథ, కంటెంట్ పరంగా డైరెక్టర్ నెగ్లెట్ చేసాడని చెప్పొచ్చు. అయితే అనేక లోపాలు కనిపిస్తాయి గాని, వాటిని సాంకేతిక విభాగాలు సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఎడిటింగ్ విభాగాలు తమ ప్రతిభతో కప్పిపుచ్చాయి. టెక్నికల్‌గా ఈ సినిమా చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. డైలాగ్స్ బాగున్నప్పటికీ.. అవసరం లేకున్నా లౌడ్‌గా అరిచి గీపెట్టడం వల్ల సౌండ్ పొల్యూషన్ ఎక్కువగానే అయింది. ఈ సినిమాకు ప్రొడక్షన్ వాల్యూస్ స్పెషల్ ఎట్రాక్షన్. ఈ సినిమా ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా ఉండే మూవీ. కానీ ఈ కంటెంట్ పరంగా చూస్తే.. షార్ట్ ఫిలింకు ఎక్కువగా.. సినిమాకు తక్కువలా అనిపిస్తుంది. పూర్తిస్థాయి కథతో, ప్రాపర్‌గా క్యారెక్టర్ల డిజైన్ చేసి ఉంటే.. యూత్ ఫుల్, రొమాంటిక్ జోనర్‌లో డెఫినెట్‌గా ట్రెండ్ సెట్టర్ అయి ఉండేది.

4.0
out of 10

Below Average

సైక్ సిద్ధార్థ్ (Psych Siddharth)

Psych Siddharth Movie Review

నందు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సైక్ సిద్ధార్థ్. యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కథ పరంగా అంతగా మెప్పించలేదు గాని, టెక్నికల్ విషయానికి వస్తే... స్మరణ్‌ సాయి సం...

నందు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సైక్ సిద్ధార్థ్. యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కథ పరంగా అంతగా మెప్పించలేదు గాని, టెక్నికల్ విషయానికి వస్తే... స్మరణ్‌ సాయి సంగీతం బాగుంది. అయితే చాలా చోట్ల అర్జున్‌ రెడ్డి ఫ్లేవర్‌ కనిపిస్తుంది. కె ప్రకాష్‌ రెడ్డి కెమెరా వర్క్ ఫర్వాలేదు. ప్రతీక్ నూతి ఎడిటింగ్‌ ఓకే అని చెప్పొచ్చు. కంటెంట్‌ లేకపోవడంతో పదే పదే రిపీటెడ్‌ సీన్లు వేయడం చిరాకు తెప్పిస్తుంది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు. దర్శకుడు వరుణ్‌ రెడ్డి సినిమాని క్రేజీగా తీశాడు. కాకపోతే దశ దిశ లేని సినిమాని రూపొందించారు. చూస్తే చూడండి,లేకపోతే లేదు అనేలా తీశారు. చాలా నిర్లక్ష్యంతో తీసిన సినిమాగా ఇది అని చెప్పొచ్చు. అతను ప్రాపర్‌గా వర్క్ చేసి తీస్తే బాగుండేది. ఫైనల్ గా సైక్ కాదు, సైకో సిద్ధార్థ. జెంజీ కుర్రాళ్లకి కొంత వరకు నచ్చే మూవీ, కానీ కామన్‌ ఆడియెన్స్ కి మాత్రం మెంటల్‌ ఎక్కిపోద్ది.

4.0
out of 10

Below Average

సైక్ సిద్ధార్థ్ (Psych Siddharth)

Psych Siddharth Movie Review

శ్రీ నందు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సైక్ సిద్ధార్థ్. యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని వరుణ్ రెడ్డి డైరెక్ట్ చేసాడు. కథ ఓవరాల్ గా చెప్పాలంటే.. హీరో రూమ్, అతను ఉండే ప్లేస్ లో దరిద్రం చూపిం...

శ్రీ నందు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సైక్ సిద్ధార్థ్. యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని వరుణ్ రెడ్డి డైరెక్ట్ చేసాడు. కథ ఓవరాల్ గా చెప్పాలంటే.. హీరో రూమ్, అతను ఉండే ప్లేస్ లో దరిద్రం చూపించడానికి చూపించడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగానే కష్టపడినట్టు కనిపిస్తుంది. ఎడిటింగ్ ఈ సినిమాకు చాలా బాగా ప్లస్ అయింది. ఎడిటింగ్ లోనే సినిమాను కొత్తగా ప్రజెంట్ చేసారు. పాత కథ తీసుకున్నా కొత్త స్క్రీన్ ప్లేతో ఎంటర్టైనింగ్ గా సినిమాని చూపించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కూడా కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది. మొత్తంగా ‘సైక్ సిద్దార్థ’ సినిమా అన్ని కోల్పోయి సైకోగా బిహేవ్ చేసే ఓ అబ్బాయి కథ. ఫ్రెండ్స్ తో వెళ్తే ఎంజాయ్ చేస్తారు.

5.0
out of 10

Average

సైక్ సిద్ధార్థ్ (Psych Siddharth)

Psych Siddharth Movie Review

శ్రీ నందు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సైక్ సిద్ధార్థ్. యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని వరుణ్ రెడ్డి డైరెక్ట్ చేసాడు. అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని అంతగా ఆకట్...

శ్రీ నందు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సైక్ సిద్ధార్థ్. యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని వరుణ్ రెడ్డి డైరెక్ట్ చేసాడు. అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేదు. మంచి కాన్సెప్ట్ ఉన్నా, సినిమాలో అనవసరమైన సీన్స్ తో దర్శకుడు కిచిడి చేసాడు. అలాగే అడల్ట్ సన్నివేశాలు తగ్గించి ఉంటే కొంతవరకు ఫ్యామిలీస్ కి ప్లస్ అయ్యేది. ఇక మొత్తానికి "సైక్ సిద్ధార్థ" మూవీ స్టోరీ కంటే స్టైల్ మీదే ఎక్కువగా ఆధారపడిన ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పాలి. అయితే నందు నిజాయితీ తో కూడిన ప్రయత్నం, కొన్ని ఫన్నీ మూమెంట్స్ ప్లస్‌గా నిలిచినా, లైట్ కథ, అతిగా సాగే నరేషన్, రా కంటెంట్ సినిమాను పరిమితం చేశాయి. ప్రయోగాత్మక, ఆఫ్‌బీట్ సినిమాలు ఇష్టపడే యూత్‌కు ఇది కనెక్ట్ కావచ్చు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమా చూడటం కష్టమే.

5.0
out of 10

Average

కాంత మూవీ రివ్యూ (Kaantha Movie Review)

Kaantha Movie Review

Ragadi

By Ragadi

దుల్కర్ సల్మాన్, భాగ్య శ్రీ బోర్సే మెయిన్ లీడ్ గా, రానా, సముద్ర ఖని కీ రోల్స్ ప్లే చేసిన మూవీ "కాంత" సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన మూవీని రానా, దుల్కర్ కలిసి ప్రొడ్యూస్ చేసారు. ఇక కాంత విషయానికి వ...

దుల్కర్ సల్మాన్, భాగ్య శ్రీ బోర్సే మెయిన్ లీడ్ గా, రానా, సముద్ర ఖని కీ రోల్స్ ప్లే చేసిన మూవీ "కాంత" సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన మూవీని రానా, దుల్కర్ కలిసి ప్రొడ్యూస్ చేసారు. ఇక కాంత విషయానికి వస్తే.. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోతెరకెక్కగా, కొంతమంది ఆడియన్స్ కి ఈ సినిమా మాస్టర్ పీస్ లా అనిపిస్తుంది. పూర్తిగా నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమా కావడంతో ఒక వర్గం ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది. టెక్నికల్ గా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సినెమాట్రోగ్రఫీ టాప్ లో ఉంది. అలాగే నైట్ విజువల్స్ కూడా సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఆడియన్స్ 1950 లోకి వెళ్ళిపోతారు. రెగ్యులర్ మూవీ లవర్స్ కి వాళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ని బట్టి నచ్చే అవకాశం ఉంది, కానీ స్క్రీన్ ప్లే స్లో ఉండడం వల్ల మెజారిటీ ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ థియేటర్లో మస్ట్ వాచబుల్ వర్త్ మూవీ కాంత. ఒకవేళ థియేటర్లో మిస్ అయితే ఓటిటి లో అయినా చూసి తీరాల్సిందే.

6.0
out of 10

Above Average

కాంత మూవీ రివ్యూ (Kaantha Movie Review)

Kaantha Movie Review

Thyview

By Thyview

దుల్కర్ సల్మాన్, భాగ్య శ్రీ బోర్సే మెయిన్ లీడ్ గా నటించిన మూవీ "కాంత". రానా, దుల్కర్ సల్మాన్ కలిసి ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీలో సముద్రఖని, రానా కీ రోల్స్ లో నటించారు. ఇక సినిమా వరకు పీరియాడిక్ బ్యాక్ డ్ర...

దుల్కర్ సల్మాన్, భాగ్య శ్రీ బోర్సే మెయిన్ లీడ్ గా నటించిన మూవీ "కాంత". రానా, దుల్కర్ సల్మాన్ కలిసి ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీలో సముద్రఖని, రానా కీ రోల్స్ లో నటించారు. ఇక సినిమా వరకు పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు కాబట్టి, డెఫినెట్ గా ఒక టైప్ అఫ్ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. మూవీ లో కథ ప్లస్ పాయింట్ అయినా, స్క్రీన్ ప్లే డల్ అయింది. కానీ టెక్నికల్ గా సినిమా చాలా బాగా తీశారు. డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ ని ఈ విషయంలో అభినందించాలి . అలాగే సినిమాట్రోగ్రఫీ చాలా బాగుంది. ఆ కాలానికి సంబంధించిన ఆర్ట్ సెట్స్ డిజైన్ బాగుంది. కాకపోతే రెగ్యులర్ ఆడియన్స్ కి ఈ మూవీ అంతగా ఇంప్రెస్ చేయలేకపోతోంది. క్లయిమాక్స్ ట్విస్ట్ థ్రిల్ ఫీల్ ఇస్తుంది. కానీ ఆయా పాత్రల ముగింపు అంతగా పర్ఫెక్ట్ గా లేదు. డైరెక్టర్ ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది. థియేటర్లో అంతగా ఆకట్టుకోలేకపోయినా, ఓటిటి లో ఆడియన్స్ ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు.

5.0
out of 10

Average

కాంత మూవీ రివ్యూ (Kaantha Movie Review)

Kaantha Movie Review

సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో ఆడియన్స్ కి దగ్గరైన దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా "కాంత". సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించగా, రానా, దుల్కర్ కలిసి సినిమా నిర్మించారు. కాంత విషయానికి...

సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో ఆడియన్స్ కి దగ్గరైన దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా "కాంత". సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించగా, రానా, దుల్కర్ కలిసి సినిమా నిర్మించారు. కాంత విషయానికి వస్తే.. మీకు రెగ్యులర్ మసాలా సినిమాలు బోర్ కొట్టి, ఒక మంచి రియలిస్టిక్ డ్రామా చూడాలనుకుంటే కాంత బెస్ట్ ఆప్షన్. నటన విషయంలో ఎవరికీ వారే పోటీ పడి మరీ అద్భుతంగా నటించారు. టెక్నికల్ గా కూడా సినిమా నెక్స్ట్ లెవెల్. నైట్ ఎఫెక్ట్‌ ని కెమెరాలో బంధించిన విధానం, సినిమాటోగ్రఫీ మూడ్ చాలా బాగుంటుంది. ఇది స్లో-బర్న్ థ్రిల్లర్ (నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లేది), కాబట్టి ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ ఆశించవద్దు. క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా, బరువుగా ఉంటుంది. కానీ థియేటర్లో మాత్రం కాంతాని ఆడియన్స్ ఆదరించలేదు. ఓటిటి లో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.

5.0
out of 10

Average

కాంత మూవీ రివ్యూ (Kaantha Movie Review)

Kaantha Movie Review

దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన తాజా మూవీ "కాంత". భాగ్యశ్రీ బోర్సే, రానా, సముద్రఖని ముఖ్య పాత్రల్లో తెరకెక్కడం జరిగింది. ఇక దర్శకుడు సెల్వరాజ్‌ సెల్వమణి ఎంచుకున్న కథ, డ్రామా చాలా బాగుంది. ఆ డ్రామాని...

దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన తాజా మూవీ "కాంత". భాగ్యశ్రీ బోర్సే, రానా, సముద్రఖని ముఖ్య పాత్రల్లో తెరకెక్కడం జరిగింది. ఇక దర్శకుడు సెల్వరాజ్‌ సెల్వమణి ఎంచుకున్న కథ, డ్రామా చాలా బాగుంది. ఆ డ్రామాని అంతే హృద్యంగా తెరకెక్కించాలని ప్రయత్నించారు. అందులో కొంత వరకు సక్సెస్‌ అయ్యారు. ఈ మూవీ మన తెలుగు ఆడియెన్స్ కి డ్రైగా అనిపిస్తుంది. మనకు తెలియని సబ్జెక్ట్ కావడమే మైనస్‌గా చెప్పొచ్చు. కాకపోతే కథలో డెప్త్, టేకింగ్‌లో డెప్త్, రూపొందించిన తీరు, ఆర్టిస్ట్ ల నుంచి బెస్ట్ పర్‌ఫెర్మెన్స్ రాబట్టిన తీరు మాత్రం సూపర్‌. సినిమా కోసం పడ్డ కష్టం ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. ఆ విషయంలో దర్శకుడితోపాటు టీమ్‌ అందరిని అభినందించాల్సిందే. టెక్నీకల్‌గా సాలిడ్‌గా ఉండే మూవీ ఇది. ఫైనల్‌గా: `కాంత` కమర్షియల్‌ కోణంలో కాకుండా ఆర్ట్ ఫామ్‌ యాంగిల్‌లో చూస్తే ఆకట్టుకునే మూవీ అవుతుంది. తెరవెనుక విషయాలకు ప్రతిబింబంగా నిలిచే ఈ సినిమాని ఆర్టిస్ట్ ల పర్‌ఫెర్మెన్స్ కోసం చూడొచ్చు.

4.0
out of 10

Below Average

కాంత మూవీ రివ్యూ (Kaantha Movie Review)

Kaantha Movie Review

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, రానా, సముద్రఖని ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘కాంత’. వేఫేర్‌ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, స్పిరిట్ మీడియా నిర్మాణంలో దుల్కర్ సల్మాన్, రానా నిర్మాణంలో సెల్వమణి...

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, రానా, సముద్రఖని ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘కాంత’. వేఫేర్‌ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, స్పిరిట్ మీడియా నిర్మాణంలో దుల్కర్ సల్మాన్, రానా నిర్మాణంలో సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇక సినిమా విషయానికి వస్తే.. దర్శకుడు కథ కొత్తది తీసుకున్నా స్క్రీన్ ప్లే మాత్రం రొటీన్ గానే రాసుకున్నారు. సెకండ్ హాఫ్ అయితే రొటీన్ సస్పెన్స్ సినిమాలు చూసినట్టు ఉంటుంది. దర్శకుడు సాంకేతకంగా మాత్రం సినిమాని చాలా ఎత్తుకు తీసుకెళ్లాడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా అప్పటి కాలంకు చెందిన సెట్స్, సెటప్ చాలా బాగా డిజైన్ చేసారు. మొత్తంగా ‘కాంత’ సినిమా ఓ హీరో – డైరెక్టర్ మధ్య ఈగో, అహంకారంతో వచ్చే సమస్యలు, వీరిద్దరి మధ్య ఓ అమ్మాయి ఎలా నలిగింది అని సస్పెన్స్ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించారు

6.0
out of 10

Above Average

Why MRO?