Vishnu Vinyasam (విష్ణు విన్యాసం)

Vishnu Vinyasam (విష్ణు విన్యాసం)

2026
4.9/10
13 Reviews

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "విష్ణు విన్యాసం". కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. Cast & Crew : శ్రీ విష్ణు, నయన్ సారిక, గోపరాజు రమణ, బ్రహ్మాజీ, మురళీ శర్మ, సత్య తదితరులు Directer : ఏ. మారుతీ రావు Producer : సుమంత్ నాయుడు.జి Music : రధన్ Cinematographer : సాయి శ్రీరామ్ Editer : కార్తికేయన్ రోహిణి

Director: Gopi Atchara
Cast: Suhas, Shivani Nagaram, Naresh, Vennela Kishore, Sudarshan, Ajay Gosh, Annapurna

Available in:

Reviews

What critics and the public are saying about Vishnu Vinyasam (విష్ణు విన్యాసం)

Media Reviews

10 Avg: 4.9/10
T
T2B Live Movie Media
5

Average

Vishnu Vinyasam Movie Review

విష్ణు విన్యాసం స్టోరీ లైన్ సింపుల్ — జాతకాలపై నమ్మకం ఉన్న లెక్చరర్ హీరో, హీరోయిన్‌ను ప్రేమిస్తాడు.. కానీ ఆమె జాతకం వల్లే మెయిన్ ట్విస్ట్ వస్తుంది. పాయింట్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా, స్క్రీన్‌పై ఎగ్జిక్యూషన్ మాత్రం అంతగా ఇంప్రెస్ చేయదు. ఫస్టాఫ్‌లో కొన్ని కామెడీ సీన్స్ వర్కవుట్ అవుతూ పర్వాలేదు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో సినిమా స్లో అయి, డ్రాగ్ అయిన ఫీలింగ్ ఇస్తుంది. మెయిన్ కాన్‌ఫ్లిక్ట్ ఉన్నా, దానికి సరైన ఎమోషనల్ వెయిట్ ఇవ్వలేకపోవడంతో గ్రాఫ్ క్రమంగా పడిపోతుంది. శ్రీ విష్ణు తన కామెడీ టైమింగ్‌తో సినిమాను మోసే ప్రయత్నం చేశాడు. చాలా చోట్ల తన వన్ లైనర్స్‌తో నవ్విస్తాడు. హీరోయిన్ కూడా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. కానీ కథ చుట్టూ తిరిగే ప్రధాన అంశాన్ని బలంగా ప్రెజెంట్ చేయలేకపోవడం మైనస్. టెక్నికల్‌గా చూస్తే సాంగ్స్ ఓకే, విజువల్స్ బాగానే ఉన్నాయి. కానీ స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో లాజిక్‌లు మిస్సవడం గమనించవచ్చు. మొత్తంగా చూస్తే.. అప్ & డౌన్స్ ఉన్న ఈ సినిమా, లాజిక్స్ పక్కన పెట్టి టైంపాస్ కోసం ఒకసారి చూసేయొచ్చు.

Feb 27, 2026 Read Review
A
ABP Desam Movie Media
5

Average

Vishnu Vinyasam Movie Review

విష్ణు విన్యాసంలో కామెడీకి మంచి పాయింట్ తీసుకున్న దర్శకుడు యదునాథ్ మారుతీ రావు, దాన్ని పూర్తిగా ఎక్స్‌ప్లోర్ చేయలేకపోయాడు. కొన్ని సన్నివేశాల్లో మాత్రమే నవ్వులు పండుతాయి. రధన్ మ్యూజిక్ పెద్దగా గుర్తుండదు, సినిమాకు మైనస్‌గా మారింది. అయితే సురేష్ బొబ్బిలి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్‌ను, ముఖ్యంగా యాక్సిడెంట్ ఎపిసోడ్‌ను ఎలివేట్ చేసింది. కెమెరా వర్క్ ఓకే, నిర్మాణ విలువలు పర్వాలేదు. పెర్ఫార్మెన్స్ విషయంలో ఇది పూర్తిగా శ్రీ విష్ణు షో. తన స్టైల్ మ్యానరిజమ్స్, వన్ లైనర్ డైలాగ్స్‌తో సినిమాను మోసే ప్రయత్నం చేశాడు. ‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ ట్యాగ్‌కు తగ్గట్టుగా నవ్వులు పంచాడు. నయన్ సారిక అందంగా కనిపిస్తూ, ఎమోషనల్ సీన్స్‌లో బాగానే చేసింది. కానీ సత్య పాత్ర మాత్రం ఆశించినంతగా వర్కవుట్ కాలేదు. మిగతా నటీనటులు తమ పాత్రలకు సరిపడా చేశారు కానీ వారికి పెద్దగా స్కోప్ దక్కలేదు. మొత్తంగా చూస్తే.. స్ట్రాంగ్ స్టోరీ, ఫుల్ లెంగ్త్ కామెడీ మిస్ అయిన ఈ సినిమా, శ్రీ విష్ణు కామెడీ కోసం అంచనాలు లేకుండా వెళితే ఒకసారి చూడదగ్గ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది

Feb 27, 2026 Read Review
C
Chitrajyothy Movie Media
5

Average

Vishnu Vinyasam movie Review

వాస్తు, జాతకాల నేపథ్యంలో వచ్చిన విష్ణు విన్యాసంలో కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉన్నా, బలమైన కథ లేకపోవడంతో సినిమా తేలిపోయింది. హీరో బలహీనతను ఉపయోగించుకునే పాత్రలు, హీరోయిన్ జాతకం చుట్టూ నడిచే డ్రామా ఉన్నప్పటికీ సన్నివేశాల్లో బలం కనిపించదు. ఇది పూర్తిగా శ్రీ విష్ణు వన్ మ్యాన్ షో. తన కామెడీ టైమింగ్‌తో సినిమాను మోసే ప్రయత్నం చేశాడు. నయన్ సారిక ఓకే అనిపించగా, సత్య తదితరులు ఉన్నా సరిగ్గా ఉపయోగించుకోలేదు. టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ బాగుంది, కానీ రధన్ మ్యూజిక్ గుర్తుండదు. రెండో భాగం రిపీట్ ఫీల్‌తో నెమ్మదిగా అనిపిస్తుంది. మొత్తంగా కథ కంటే కామెడీ కోసం చూసే వారికి, శ్రీ విష్ణు అభిమానులకు ఈ సినిమా ఓకే అనిపించవచ్చు

Feb 27, 2026 Read Review
O
One india Movie Media
5

Average

Vishnu vinyasam movie Review

శ్రీ విష్ణు అంటే మినిమం గ్యారెంటీ ఎంటర్‌టైన్‌మెంట్ అన్న మాట మళ్లీ విష్ణు విన్యాసంతో ప్రూవ్ చేయడానికి ప్రయత్నించాడు. వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ హీరో, ఫిబ్రవరి 27న వచ్చిన ఈ సినిమాతో మరోసారి కామెడీతో థియేటర్లలో నవ్వులు పంచాడు. కథ విషయానికి వస్తే.. జూనియర్ లెక్చరర్ విష్ణు (శ్రీ విష్ణు)కి చదువు కంటే జాతకాలు, వాస్తు, న్యూమరాలజీ అంటేనే ఎక్కువ నమ్మకం. అదే కాలేజీలో పనిచేసే మనీషా (నయన్ సారిక)తో ప్రేమలో పడతాడు. పెళ్లి దగ్గరకు వచ్చేసరికి ఆమె జాతకంలో ఉన్న దోషం బయటపడుతుంది. ఆ దోషం వల్ల వచ్చే సమస్యలు, విష్ణు తీసుకున్న నిర్ణయాలే సినిమా మెయిన్ ప్లాట్. పెర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే.. సినిమా మొత్తం శ్రీ విష్ణు వన్ మ్యాన్ షోగానే అనిపిస్తుంది. తన కామెడీ టైమింగ్, అమాయకమైన బాడీ లాంగ్వేజ్‌తో చాలా సీన్స్‌ను లిఫ్ట్ చేశాడు. నయన్ సారిక కూడా కథలో కీలక పాత్రగా బాగానే మెప్పించింది. సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి కాంబినేషన్‌లో వచ్చే కామెడీ ట్రాక్స్ సినిమాకు ప్లస్. ముఖ్యంగా సత్య - శ్రీ విష్ణు సీన్స్ నవ్విస్తాయి. టెక్నికల్‌గా దర్శకుడు యదునాథ్ మారుతీరావు లాజిక్కుల కంటే కామెడీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. సినిమా రన్‌టైమ్ 2 గంటల లోపే ఉండటం పెద్ద ప్లస్. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ విజువల్స్‌ను కలర్‌ఫుల్‌గా చూపించింది. రధన్ మ్యూజిక్ ఓకే అనిపించినా, పాటలు మాత్రం అంతగా గుర్తుండవు. ఎడిటింగ్ క్రిస్ప్‌గా ఉండటంతో సినిమా ఫాస్ట్‌గా సాగుతుంది.

Feb 27, 2026 Read Review
G
Great andhra Movie Media
4

Below Average

Vishnu Vinyasam movie Review

శ్రీ విష్ణు నటించిన విష్ణు విన్యాసం మూవీ ఎలా ఉన్నా, తన కామెడీ టైమింగ్‌తో మూవీని లాగేందుకు ప్రయత్నించాడు. ముఖ్యంగా రన్నింగ్ కామెంట్రీ స్టైల్‌లో కొన్ని చోట్ల నవ్వులు తెప్పించాడు. కానీ సినిమా మొత్తం భారం ఒక్క హీరో మీద పడిపోయిన ఫీలింగ్ వస్తుంది. హీరోయిన్ నయన్ సారిక స్క్రీన్‌పై బాగానే కనిపించినా, ఆమె పాత్రకు సరైన డెప్త్ ఇవ్వలేదు. పాత్రలో ఉన్న కాన్సెప్ట్‌ని కన్విన్సింగ్‌గా ప్రెజెంట్ చేయలేకపోయారు. సత్య తన స్థాయికి తగ్గట్టు ఫుల్‌గా ఎంటర్టైన్ చేయలేకపోయాడు. బ్రహ్మాజీ, ప్రవీణ్, గోపరాజు రమణ, మురళీ శర్మ లాంటి నటులు ఉన్నా, వారిని సరిగ్గా వాడుకోలేదు. శ్రీనివాసరెడ్డి కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తాడు. టెక్నికల్‌గా రధన్ మ్యూజిక్ నిరాశపరుస్తుంది. ఒక్క పాట కూడా గుర్తుండేలా లేదు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ మాత్రం ఓకే. ప్రొడక్షన్ విల్యూస్ కూడా సరిపడా ఉన్నాయి. దర్శకుడు మంచి కామెడీ కాన్సెప్ట్ ఎంచుకున్నా, దాన్ని కథగా మలచడంలో తడబడ్డాడు. కొన్ని వన్ లైనర్స్ పనిచేసినా, మొత్తం సినిమా లాజిక్ లేకుండా లైట్‌గా వెళ్లిపోతుంది. సన్నివేశాలు, పాత్రలు కన్విన్స్ చేసేలా లేకపోవడం వల్ల సినిమా ప్రభావం తగ్గింది. చివరికి చెప్పాలంటే.. హీరో ఒక్కరే లాగిన సినిమా ఇది. కంటెంట్ బలహీనంగా ఉండటంతో పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేయలేకపోయింది.

Feb 27, 2026 Read Review
T
Tupaki Movie Media
5

Average

Vishnu Vinyasam movie Review

కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ అనే ట్యాగ్‌కు తగ్గట్టుగా ఈ సినిమాలో శ్రీ విష్ణు పూర్తిగా వన్ మ్యాన్ షో ఇచ్చాడు. ప్రతి సీన్‌లో తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటూ, ముఖ్యంగా తన రన్నింగ్ కామెంట్రీతో మంచి నవ్వులు పంచాడు. న్యూ జనరేషన్ ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తూ తన స్టైల్ హ్యూమర్‌తో సినిమాను మోసే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ నయన్ సారిక స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నా, ఆమె పాత్రను డైరెక్టర్ సరిగా డిజైన్ చేయలేదు. కాన్సెప్ట్ ఉన్నా, దాన్ని కన్విన్సింగ్‌గా చూపించలేకపోవడం మైనస్. సత్య కొన్ని చోట్ల నవ్వించినా, అతనివద్ద నుంచి ఇంకాస్త ఎక్స్‌పెక్ట్ చేస్తాం. బ్రహ్మాజీ, ప్రవీణ్ ప్రభావం చూపలేకపోయారు. శ్రీనివాస రెడ్డి ఓకే, గోపరాజు రమణ, మురళీ శర్మల్ని సరిగా ఉపయోగించలేదు. శ్రీకాంత్ అయ్యంగార్ పర్వాలేదు అనిపిస్తాడు. టెక్నికల్‌గా చూస్తే రధన్ మ్యూజిక్ పెద్దగా వర్కవుట్ కాలేదు. పాటలు గుర్తుండిపోయేలా లేవు, బీజీఎం కూడా కొన్ని చోట్ల లౌడ్‌గా అనిపిస్తుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఓకే. ప్రొడక్షన్ విల్యూస్ డీసెంట్‌గా ఉన్నాయి. డైరెక్టర్ యధునాథ్ మారుతీరావు మంచి కామెడీ కాన్సెప్ట్ ఎంచుకున్నా, దాన్ని స్క్రీన్‌పై పూర్తి స్థాయిలో ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. కొన్ని వన్ లైనర్స్, కామెడీ సీన్స్ పనిచేసినా, లాజిక్ లేని సన్నివేశాలు సినిమాను వీక్ చేశాయి. మొత్తంగా చూస్తే, శ్రీ విష్ణు పెర్ఫార్మెన్స్ హైలైట్ అయినా, కంటెంట్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది.

Feb 27, 2026 Read Review
G
Gulte Movie Media
5

Average

Vishnu Vinyasam movie Review

విష్ణు విన్యాసం మొదటి భాగం మాత్రం ఎలాంటి పెద్ద లోపాలు లేకుండా సాఫీగా సాగుతుంది. కామెడీ సన్నివేశాలు బాగానే వర్కవుట్ అయ్యి, ఇంటర్వెల్ బ్లాక్ కూడా ఆసక్తిని పెంచుతుంది. కానీ రెండో భాగం మొదలైన కొద్దిసేపటికే సినిమా రిపీట్ మోడ్‌లోకి వెళ్లిన ఫీలింగ్ ఇస్తుంది. డ్రామా ఉన్నప్పటికీ, ఎమోషనల్ డెప్త్ లేకపోవడం మైనస్. చివరి 30 నిమిషాలు ఉత్కంఠగా తీసే ప్రయత్నం చేసినా, అది పూర్తిగా కనెక్ట్ కాలేదు. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ముందే ఊహించదగినదిగా, త్వరగా ముగిసినట్టుగా అనిపిస్తుంది. ఇంకా కొన్ని పాత్రలు, సన్నివేశాల్లో కొత్తదనం లేకపోవడం కూడా కనిపిస్తుంది. పాటలు అయితే సినిమాకు పెద్ద మైనస్. రధన్ మ్యూజిక్ ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేదు. అయితే శ్రీ విష్ణు, సత్యల కామెడీ టైమింగ్ కొన్ని చోట్ల నవ్విస్తుంది. మొత్తం మీద మంచి కాన్సెప్ట్ ఉన్నా, సెకండాఫ్, మ్యూజిక్ బలహీనంగా ఉండటంతో సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఒకసారి చూడదగ్గ యావరేజ్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది.

Feb 27, 2026 Read Review
1
10TV telugu Print Media
5

Average

Vishnu Vinyasam movie Review

శ్రీవిష్ణు సినిమా అంటే ఫుల్ గా నవ్విస్తారని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. విష్ణు విన్యాసం సినిమా కూడా కామెడీ ఎంటెర్టైనర్ గానే తెరకెక్కించి చివర్లో ఎమోషన్ ని పండించారు. మనీష బాధతో ఓపెన్ అయిన సినిమా ఫస్ట్ హాఫ్ అంతా శ్రీ విష్ణు వాస్తు, జాతకాల పిచ్చి, సత్య – శ్రీవిష్ణు కామెడీ, మనీష పరిచయం ఆమెతో విష్ణు ప్రేమాయణంతో మొత్తం కామెడీగానే సాగుతుంది. ఫస్ట్ హాఫ్ ఫుల్ గా నవ్వుకుంటారు. ఇంటర్వెల్ కి మనీష తన జాతక దోషం చెప్పడంతో విష్ణు షాక్ అవుతాడు. దాంతో నెక్స్ట్ విష్ణు ఏం చేస్తాడు అనే ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ లో పెళ్లి రిలేటెడ్ సీన్స్ బాగా సాగదీశారు. హీరోకి ఫ్లాష్ కట్స్ కోసం రిపీటెడ్ సీన్స్ చాలా సార్లు వాడారు. దీంతో సెకండ్ హాఫ్ కాస్త బోరింగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఊహించడం కష్టమే. వాస్తు, జాతకాలు, మూఢ నమ్మకాల విషయంలో డైరెక్ట్ గా చెప్పకపోయినా ఓ మెసేజ్ అయితే ఇచ్చారు. అలాగే సినిమా చూడ్డానికి రొటీన్ గానే ఉన్నా, బాగానే నవ్విస్తుంది. ఇక పాత పాటలు, వేరే హీరోల రిఫరెన్స్ లు బాగానే వాడారు. ఈ సినిమా నిడివి 2 గంటలే కావడం ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ విజువల్స్ అయితే కలర్ ఫుల్ గా బాగున్నాయి. పాటలు యావరేజ్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సెకండాఫ్ ని కొంత ట్రిమ్ చేయాల్సింది. పాత కథే అయినా కొత్త స్క్రీన్ ప్లేతో కామెడీ ఎంటర్టైనర్ గా నవ్వించడానికి తెరకెక్కించాడు దర్శకుడు. ఓవరాల్ గా ‘విష్ణు విన్యాసం’ సినిమా శ్రీవిష్ణు మార్క్ కామెడీతో నవ్వుకోడానికి చూసేయొచ్చు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

Feb 27, 2026 Read Review
N
NTV Telugu Print Media
5

Average

Vishnu Vinyasam movie Review

విష్ణు విన్యాసం థియేటర్లలో మిక్స్డ్ టాక్‌తో కొనసాగుతున్నా, ఈ సినిమాను పూర్తిగా తన భుజాలపై మోసింది మాత్రం శ్రీ విష్ణు. ఇది నిజంగా ఆయన వన్ మ్యాన్ షో అని చెప్పాలి. కథ, కథనం యావరేజ్‌గా ఉన్నప్పటికీ, తన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో ప్రతి సీన్‌ను లైవ్‌గా మార్చేశాడు. ఎక్కడా కంటెంట్ తగ్గినా, తన హ్యూమర్‌తో సినిమా నిలబడేలా చేశాడు. హీరోయిన్ నయన్ సారిక స్క్రీన్‌పై ఆకట్టుకుంది. సత్య తన కామెడీతో మంచి సపోర్ట్ ఇచ్చాడు. మిగిలిన నటులు బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస రెడ్డి, గోపరాజు రమణ తమ పాత్రలకు సరిపడా నటించారు. టెక్నికల్‌గా చూస్తే రధన్ మ్యూజిక్ మాత్రం నిరాశపరిచింది. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రొటీన్‌గా ఉన్నాయి. కానీ సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ప్లస్‌గా నిలిచింది. విజువల్స్ కలర్‌ఫుల్‌గా, రిచ్‌గా కనిపిస్తాయి. ఎడిటింగ్ క్రిస్ప్‌గా ఉన్నా, కొన్ని సీన్స్ రిపీట్ ఫీల్ ఇస్తాయి. నిర్మాణ విలువలు డీసెంట్‌గా ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే, బలహీనమైన కథనాన్ని కూడా శ్రీ విష్ణు తన పెర్ఫార్మెన్స్‌తో మేనేజ్ చేసిన సినిమా ఇది. స్ట్రాంగ్ సెకండాఫ్ ఉండి ఉంటే విష్ణు విన్యాసం ఇంకో లెవెల్‌కి వెళ్లేది. ఇప్పటికైతే ఇది శ్రీ విష్ణు వన్ మ్యాన్ షోగా నిలిచిపోయింది.

Feb 27, 2026 Read Review
T
TV9 telugu Print Media
5

Average

Vishnu vinyasam movie Review

ష్ణు విన్యాసం థియేటర్లలో మిక్స్డ్ టాక్‌తో నడుస్తోంది. కథ, కథనం పరంగా సినిమా యావరేజ్‌గా అనిపించినా, మొత్తం సినిమాను తన భుజాల మీద మోసింది మాత్రం శ్రీ విష్ణు. సింపుల్ స్టోరీకి తన కామెడీ టైమింగ్‌తో మంచి ఎనర్జీ ఇచ్చాడు. కొన్ని సన్నివేశాల్లో ఆయన డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. ఎక్కడా గ్యాప్ వచ్చినా కామెడీతో కవర్ చేయడం ఆయన ప్లస్, అదే సినిమాకూ ప్లస్ అయింది. హీరోయిన్ నయన్ సారిక స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. సత్య తన కామెడీతో మరోసారి ఆకట్టుకున్నాడు. బ్రహ్మాజీ, ప్రవీణ్ ఓకే అనిపించగా, మురళీ శర్మ చిన్న పాత్రలో ఇంపాక్ట్ చూపించాడు. శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస రెడ్డి, గోపరాజు రమణ తమ పాత్రలకు సరైన న్యాయం చేశారు. టెక్నికల్‌గా చూస్తే రధన్ మ్యూజిక్ మాత్రం ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టు లేదు. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రొటీన్‌గా అనిపిస్తాయి. కానీ సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాను విజువల్‌గా ఎలివేట్ చేసింది. కలర్‌ఫుల్ ఫ్రేమ్స్ సినిమాకు మంచి ఫీల్ ఇస్తాయి. ఎడిటింగ్ క్రిస్ప్‌గా ఉన్నప్పటికీ కొన్ని సీన్స్ రిపీట్ ఫీల్ ఇస్తాయి. ప్రొడక్షన్ విల్యూస్ డీసెంట్‌గా ఉన్నాయి.మొత్తంగా చూస్తే దర్శకుడు యధునాధ్ మారుతి రావు మంచి కాన్సెప్ట్ తీసుకున్నా, దాన్ని పూర్తిగా ఎక్స్‌ప్లోర్ చేయలేకపోయాడు. ముఖ్యంగా సెకండాఫ్ స్ట్రాంగ్‌గా ఉండి ఉంటే సినిమా రేంజ్ ఇంకో లెవెల్‌కి వెళ్లేదని చెప్పాలి.

Feb 27, 2026 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

 

 

కథ విషయానికి వస్తే... ఒంగోలు లో కాలేజీలో జూనియర్ లెక్చరర్ గా పని చేస్తుంటాడు విష్ణు (శ్రీవిష్ణు). అయితే తన జీవితంలో జాతకం, వాస్తు లాంటి పట్టింపులు పెట్టుకొని, ఎన్నో రోజులుగా తన పెళ్లి కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ ఈ జాతకాల పిచ్చి వల్ల అన్ని సంబంధాలు చేజారిపోతుంటాయి. మరోవైపు మనీషా కి కూడా తన జాతకంలో దోషాల వల్ల తన పెళ్లి అవక పలు అవమానాలు కూడా ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో అనుకోకుండా జరిగిన విష్ణు- మనీషా ల పరిచయం ప్రేమకు దారితీస్తుంది. అయితే మనీషా కు ఉన్న దోషం వల్ల విష్ణుకు నష్టం కలిగే నష్టం ఏంటి? ఈ జాతక గండాల్ని దాటి విష్ణు - మనీషా ఒకటవుతారా? వీళ్ళ ప్రేమ కథ పెళ్లి పీటలెక్కుతుందా లేదా అనేది కథ. 

Technical values : 

ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీకి శ్రీవిష్ణు పూర్తి స్థాయిలో  బ్యాక్ బోన్ గా నిలిచాడు. తన అదిరిపోయే కామెడీ టైమింగ్ తో వన్ మ్యాన్ షో తో నడిపించాడు. అలాగే హీరోయిన్ నయన్ సారిక మంచి గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకోవడమే గాకుండా, నటన పరంగా మెప్పించింది. శ్రీవిష్ణుతో కూడా మంచి కెమిస్ట్రీ పండించింది. వీరితో పాటు కమెడియన్ సత్య, గోపరాజు రమణ రాజు, మురళీ శర్మ, బ్రహ్మాజీ, సత్యం రాజేష్ తదితరులు తమ పాత్రల్లో నవ్వించారు.

ఇక టెక్నికల్ వాల్యూస్ ని గమనిస్తే... స్టోరీ పరంగా చాలా యావరేజ్ గా ఉంటుంది. సో కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కి ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు. ముఖ్యంగా హీరోయిన్ సైడ్ నుంచి కథ చూస్తే పలు పాత సినిమాలు గుర్తు రాకమానదు. ఇక సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ అయింది. ప్రీ క్లైమాక్స్ వరకు రొటీన్ ఫీల్ వస్తుంది. దర్శకుడు కథ, కథనాల విషయంలో మరింత ఫోకస్ పెట్టాల్సింది. నిర్మాణ విలువలు పర్లేదు. రధన్ మార్క్ సంగీతం ఈసారి మిస్ అయింది. ఎడిటింగ్ కూడా  ట్రిమ్ చేయాల్సింది. అయితే డైరెక్టర్ మారుతీ రావు ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు. 

Final Review :

ఓవరాల్ గా ‘విష్ణు విన్యాసం’ మూవీలో శ్రీవిష్ణు తన సాలిడ్ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తాడు. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి ఇందులో ఢోకా ఉండదు. కాకపోతే సెకండ్ హాఫ్ లో కాస్త డిస్సపాయింట్ అవుతారు. రొటీన్ జాతకాల కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే వల్ల కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ని రెగ్యులర్ మూవీ లవర్స్ ని మెప్పించే అవకాశం ఉంది.

Review Statistics

4.9
Overall Rating
Avg. of all reviews
13
Total Reviews
From 2 Provider Types

Review Average

Media
4.9/10
Public
N/A