Nari Nari Naduma Murari (నారి నారి నడుమ మురారి)
టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటించిన సినిమా "నారి నారి నడుమ మురారి". సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది.
Available in:
Reviews
What critics and the public are saying about Nari Nari Naduma Murari (నారి నారి నడుమ మురారి)
Media Reviews
10 Avg: 6.4/10Above Average
Nari Nari Naduma Murari Movie Review
మొత్తానికి సంక్రాంతికి ఐదో సినిమాగా వచ్చినా కూడా ఆడియన్స్ కి బెస్ట్ ఆప్షన్స్ లో ఒకటిగా నారీనారీ నడుమ మురారి నిలిచింది. అంచనాలు లేకుండా ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేయాలనుకునే వారు ఈ సినిమాని చూసేయొచ్చు. ఇటు శర్వానంద్ కూడా ఈ సినిమాతో మంచి సక్సెస్ దక్కించుకున్నాడు.

Hit
Nari Nari Naduma Murari Movie Review
సంక్రాంతికి చివరిగా వచ్చిన నారి నారి నడుమ మురారి సినిమా ఆడియన్స్ ని నవ్వించడంలో సక్సెస్ అయింది. పండక్కి ఫ్యామిలీస్ ని ఇంప్రెస్ చేసి మొత్తానికి శర్వానంద్ మరో సక్సెస్ అందుకున్నాడు. కానీ పండగ పోటీ వల్ల భారీ లాభాలు దక్కడం కష్టమని చెప్పాలి.

Above Average
Nari Nari Naduma Murari Movie Review
సంక్రాంతి స్పెషల్ గా వచ్చిన నారీనారీ నడుమ మురారి ఓవరాల్ గా ఫ్యామిలీస్ ని మెప్పిస్తుంది. కొత్తదనం లేకపోయినా, మంచి కామెడీతో రేసి స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని నవ్విస్తుంది. మొత్తానికి శర్వానంద్ కి మరో మంచి సక్సెస్ ని తెచ్చిపెట్టిందని చెప్పాలి.

రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన “నారీ నారీ నడుమ మురారి” ఓవరాల్ గా ఫ్యామిలీ వాల్యూస్, ఈ తరం జనరేషన్‌కు ప్రేమ, పెళ్లి విషయంలో చక్కటి సందేశంతోపాటు 100 శాతం వినోదం, కడుపుబ్బ నవ్వించే కామెడీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఎలాంటి అంచనాలతో వెళ్లినా చక్కటి అనుభూతిని అందిస్తుంది. ఈ సినిమాను తప్పకుండా థియేటర్లోనే...
రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన “నారీ నారీ నడుమ మురారి” ఓవరాల్ గా ఫ్యామిలీ వాల్యూస్, ఈ తరం జనరేషన్‌కు ప్రేమ, పెళ్లి విషయంలో చక్కటి సందేశంతోపాటు 100 శాతం వినోదం, కడుపుబ్బ నవ్వించే కామెడీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఎలాంటి అంచనాలతో వెళ్లినా చక్కటి అనుభూతిని అందిస్తుంది. ఈ సినిమాను తప్పకుండా థియేటర్లోనే చూడండి.. రెండున్నర గంటలపాటు లాఫింగ్ ట్రీట్‌మెంట్‌లా, రామ్ అబ్బరాజు కామెడీతో సర్జికల్ స్ట్రైక్‌లా ఉంటుంది.
Above Average
Nari Nari Naduma Murari Movie Review
రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన “నారీ నారీ నడుమ మురారి” ఓవరాల్ గా ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచింది. కథలో లోతు కంటే నవ్వులకే ప్రాధాన్యత ఇచ్చే వారికి ఈ సినిమా ఒక 'మిరాకిల్' అని చెప్పొచ్చు. శర్వానంద్ కెరీర్‌లో ఇది మరో సూపర్ హిట్ సినిమాగా నిలుస్తుంది.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శర్వానంద్ హీరోగా నటించిన "నారీ నారీ నడుమ మురారి" ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ప్లెజెంట్ టేకింగ్ తో రామ్ అబ్బరాజు మరోసారి మంచి మార్కులు కొట్టేశాడు. చాలా వరకు కామెడీ ప్రధానంగా సాగే ఈ కథకు ఇచ్చిన ఎమోషనల్ టచ్ కూడా ఆకట్టుకుంటుంది.

శర్వానంద్ నటించిన "నారీ నారీ నడుమ మురారి" ఓవరాల్ గా ‘మంచి ఆత్రేయపురం పూతరేకులు లాంటి సినిమా’. చివరి బంతికి సిక్స్ కొడితే భలే మజా ఉంటుంది కదా.. అలా చివరిగా విడుదలైన శర్వా సినిమా కూడా సిక్స్ బాదేసింది.

'నారీ నారీ నడుమ మురారి' సంక్రాంతికి పండక్కి అదిరిపోయే క్లైమాక్స్ పడింది. హ్యాపీ ఎండింగ్‌లా, ఈ సంక్రాంతి విన్నర్‌లో ఒకటిగా నిలుస్తుంది. ఫ్యామిలీ ఆడియెన్స్, యూత్, జెంజీ ఇలా అన్ని ఏజ్ గ్రూప్ ఆడియెన్స్ కలిసి చూసే మూవీ అవుతుంది.

Nari Nari Naduma Murari
శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన "నారి నారి నడుమ మురారి" సినిమా సంక్రాంతికి ఫ్యామిలీతో చూసే చక్కగా చూడొచ్చు. కానీ మూవీలో కొన్ని సీన్స్ ఎడిట్ చేయాల్సింది, అలాగే పాటల ప్లేస్మెంట్ కూడా ఎక్కడా సెట్ అవలేదు. యనానిమస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పలేం గాని, ఓవరాల్ గా మేకర్స్ సేఫ్ అవ్వొచ్చు.
శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన "నారి నారి నడుమ మురారి" సినిమా సంక్రాంతికి ఫ్యామిలీతో చూసే చక్కగా చూడొచ్చు. కానీ మూవీలో కొన్ని సీన్స్ ఎడిట్ చేయాల్సింది, అలాగే పాటల ప్లేస్మెంట్ కూడా ఎక్కడా సెట్ అవలేదు. యనానిమస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పలేం గాని, ఓవరాల్ గా మేకర్స్ సేఫ్ అవ్వొచ్చు.
Hit
Nari Nari Naduma Murari Movie Review
మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ “నారీ నారీ నడుమ మురారి” ఒక హిలేరియోస్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. శర్వానంద్ తన రోల్ లో బాగా చేసాడు. అలాగే ఇందులో కోర్ పాయింట్ బాగుంది. దానికి అనుగుణంగా డిజైన్ చేసిన కామెడి సీన్స్ నరేష్ ఎపిసోడ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే సత్య, వెన్నెల కిషోర్ పై సన్నివేశాలు బాగున్నా...
మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ “నారీ నారీ నడుమ మురారి” ఒక హిలేరియోస్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. శర్వానంద్ తన రోల్ లో బాగా చేసాడు. అలాగే ఇందులో కోర్ పాయింట్ బాగుంది. దానికి అనుగుణంగా డిజైన్ చేసిన కామెడి సీన్స్ నరేష్ ఎపిసోడ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే సత్య, వెన్నెల కిషోర్ పై సన్నివేశాలు బాగున్నాయి. ఇలా కామెడీ ఇంకా ఎమోషన్స్ ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతాయి. సో ఈ సినిమా అలరిస్తుంది.
Public Reviews
Avg: —No public reviews yet.
About This Movie
ఇంజనీరింగ్ చదివి ఓ కంపెనీలో ఆర్కిటెక్ గా వర్క్ చేస్తున్న గౌతమ్ (శర్వానంద్) తన కంపెనీలోని వర్క్ చేస్తున్న నిత్య (సాక్షి వైద్య) ని చూసి ప్రేమలో పడతాడు. నిత్య కూడా గౌతమ్ ని ఇష్టపడి ఇద్దరూ పెళ్లిచేసుకుందాం అనుకుంటారు. అయితే నిత్య తండ్రి ప్రముఖ లాయర్ అయిన రామ లింగయ్య గౌతమ్ - నిత్య ల పెళ్ళికి ఒప్పుకున్నా, పెళ్లి మాత్రం హంగామా లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని కండిషన్ పెడతారు. ఈ క్రమంలో కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం గౌతమ్ మాజీ ప్రేయసి దియా (సంయుక్త) మళ్ళీ గౌతమ్ - నిత్య మధ్యలో ఎంట్రీ ఇస్తుంది. అందువల్ల గౌతమ్ రిజిస్టర్ పెళ్లికి తను రెడి కాలేకపోతాడు. ఈ క్రమంలో గౌతమ్ నిత్యాని పెళ్లి చేసుకున్నాడా లేదా దియాని పెళ్లి చేసుకున్నాడా? చివరికి ఏమైంది అనేదే కథ.
Technical values : కథ విషయానికి వస్తే.. చాలా సినిమాల్లో చుసిన కథే.. ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయే హీరో.. వీళ్ళ మధ్య ఫ్రస్టేషన్ తో కూడిన ఫన్. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడమే టార్గెట్ గా వచ్చిన ఈ సినిమాలో శర్వానంద్ తన కామెడీ టైమింగ్ తో బాగా ఆకట్టుకున్నాడు. అలాగే హీరోయిన్స్ సంయుక్త, సాక్షి కూడా వాళ్ళ పెర్ఫార్మన్స్ తో ఇంప్రెస్ చేసారు. వీళ్ళ మధ్య జెనరేట్ అయ్యే ఫన్ ఆ కన్ఫ్యూజన్ ఆడియన్స్ ని బాగా నవ్విస్తుంది. అలాగే నటుడు నరేష్, సుదర్శన్, సంపత్, సునీల్, వెన్నెల కిషోర్ తదితరులు వారి పరిధి మేరకు బాగా మెప్పించారు. శ్రీవిష్ణు కామియో రోల్ సినిమాకి ప్లస్ అయింది.
అయితే దర్శకుడు కథ పరంగా మెప్పించలేకపోయినా, స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాడు. కానీ ఫ్రెష్ కామెడీ మాత్రం మిస్ అయింది. తక్కువ అంచనాలతో చూస్తే సినిమా మెప్పిస్తుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాదు. కథనం మొత్తం ఊహాజనితంగా సాగుతుంది కాబట్టి, పెద్దగా ఎగ్జైటింగ్ గా అనిపించదు. కానీ నిర్మాణ విలువలు బాగున్నాయి. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ వర్క్ అంతగా మెప్పించలేదు. ఎడిటర్ కొన్ని సీన్స్ ట్రిమ్ చేయాల్సింది. దర్శకుడు రామ్ అబ్బరాజు పై ఈసారి స్క్రీన్ ప్లే పరంగా కొంతవరకు దెబ్బేసాడని చెప్పాలి.
Final Review : ఓవరాల్ గా "నారీ నారీ నడుమ మురారి" మంచి కామెడీ ఎంటర్టైనర్ గా సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తుందని చెప్పొచ్చు. ఇటు శర్వానంద్ కి కూడా మంచి సక్సెస్ తీసుకొచ్చింది.