Register as a Reviewer
Mass Jathara (మాస్ జాతర)

Mass Jathara (మాస్ జాతర)

31 Oct 2025
Overall Rating
4.9/10
10 Reviews

మాస్ మహారాజ్ రవితేజ తనకచ్చొచ్చిన మాస్ జోనర్ లో నటించిన చిత్రం "మాస్ జాతర". శ్రీలీల హీరోయిన్ గా నటించింది. భాను భోగవరపు డైరెక్టర్ గా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ తెరకెక్కించాడు.

Director: Bhanu Bogavarapu
Cast: Ravi Teja, Sree leela, Naveen Chandra, Rajendra Prasad

Available in:

Reviews

What critics and the public are saying about Mass Jathara (మాస్ జాతర)

Media Reviews

10 Avg: 4.9/10
Mahidhar Vibes
Mahidhar Vibes Youtube Channel
5

Average

Mass Jathara Movie Review

రవితేజ హీరోగా నటించిన "మాస్ జాతర" సినిమా భానుభోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కగా, శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. నవంబర్ లో రీలీస్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ని అంతగా ఇంప్రెస్ చేయలేదు. ఈ సినిమాతో రవన్న మాస్ కం బ్యాక్ ఇస్తాడనుకున్న ఫ్యాన్స్ ఆశలకు గండి కొట్టాడు డైరెక్టర్. సినిమా మొత్తం రవితేజకి మంచి ఎలివేషన్ల...

రవితేజ హీరోగా నటించిన "మాస్ జాతర" సినిమా భానుభోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కగా, శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. నవంబర్ లో రీలీస్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ని అంతగా ఇంప్రెస్ చేయలేదు. ఈ సినిమాతో రవన్న మాస్ కం బ్యాక్ ఇస్తాడనుకున్న ఫ్యాన్స్ ఆశలకు గండి కొట్టాడు డైరెక్టర్. సినిమా మొత్తం రవితేజకి మంచి ఎలివేషన్లు ఉంటాయి. కానీ ఎక్కడా ఆ సీన్స్ కి ఎలివేషన్లకు తగ్గ స్క్రీన్ ప్లే ఉండదు. మొత్తం రవితేజ వన్ మ్యాన్ షోగా సినిమా అనిపిస్తుంది. కానీ రవితేజ క్యారెక్టర్ గుర్తుండదు. ఎందుకంటే సినిమా చూస్తున్నంత సేపు క్రాక్ సినిమా గుర్తొస్తుంది. ప్రతి సీన్ దగ్గరా క్రాక్ సినిమా లాగే సీన్లు ఉంటాయి. ఇక శ్రీలీల సహా అందరికి బలమైన పాత్ర రాసుకోవడంలో విఫలమయ్యాడు డైరెక్టర్. భీమ్స్ తనవరకూ న్యాయం చేసినా, అది సినిమాకు అంతగా హెల్ప్ అవ్వలేదు. ఓవరాల్ గా ఫ్యాన్స్ ని మెప్పించినా, సాధారణ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

Nov 02, 2025 Watch
Thyview
Thyview Youtube Channel
5

Average

Mass Jathara Movie Review

రవితేజ హీరోగా తనకు అచ్చి వచ్చిన మాస్ జోనర్ లో అలాంటి ఒక పవర్ఫుల్ టైటిల్ తో వచ్చిన సినిమా "మాస్ జాతర". ట్రైలర్ చూసాక ఈసారి రవితేజ మాస్ కం బ్యాక్ పక్కా అని అనుకున్నారు ఫ్యాన్స్. కానీ మూవీ చూసాక ఆడియన్స్ అంచనాలు తారుమారయ్యాయి. మంచి మాస్ సీన్స్ పై ఫోకస్ పెట్టిన డైరెక్టర్ దానికంటే అవసరమైన కథ, కథనాలు రాసు...

రవితేజ హీరోగా తనకు అచ్చి వచ్చిన మాస్ జోనర్ లో అలాంటి ఒక పవర్ఫుల్ టైటిల్ తో వచ్చిన సినిమా "మాస్ జాతర". ట్రైలర్ చూసాక ఈసారి రవితేజ మాస్ కం బ్యాక్ పక్కా అని అనుకున్నారు ఫ్యాన్స్. కానీ మూవీ చూసాక ఆడియన్స్ అంచనాలు తారుమారయ్యాయి. మంచి మాస్ సీన్స్ పై ఫోకస్ పెట్టిన డైరెక్టర్ దానికంటే అవసరమైన కథ, కథనాలు రాసుకోవడంలో ఫోకస్ చేయలేదు. సినిమా మొత్తం భారి క్యాస్టింగ్ ఉన్నా, విలన్ సహా ఎవ్వరి పాత్ర కూడా బలంగా అనిపించదు. రవితేజ పాత్రపై మాత్రమే డైరెక్టర్ ఫోకస్ పెట్టాడు. కానీ మూవీ లవర్స్ కి అది సరిపోదు కదా. సినిమాని నడిపించేది కథే. అది రొటీన్ గా ఉన్నపుడు కనీసం స్క్రీన్ ప్లే పైన అయినా ఫోకస్ పెట్టాలి. కానీ దాంట్లోనే దర్శకుడు నెగ్లెట్ చేసాడు. ఓవరాల్ గా మాస్ జాతర రవితేజ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుందేమో గాని, కామన్ ఆడియన్స్ కి అంతగా ఆకట్టుకోలేదు.

Nov 02, 2025 Watch
T
5

Average

Mass Jathara Movie Review

ధమాకా తర్వాత ఆ రేంజ్ సక్సెస్ లేని రవితేజ ఈసారి మాస్ జోనర్ లోనే మాస్ జాతర తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. భ్నుభోగవరపు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అంతగా రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది. అతను రాసిన కథ, కథనాల్లో అస్సలు కొత్తదనం కనిపించదు. తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ అస్సలు క్రియేట్ చేయలేకపోయాడు డైరెక్టర...

ధమాకా తర్వాత ఆ రేంజ్ సక్సెస్ లేని రవితేజ ఈసారి మాస్ జోనర్ లోనే మాస్ జాతర తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. భ్నుభోగవరపు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అంతగా రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది. అతను రాసిన కథ, కథనాల్లో అస్సలు కొత్తదనం కనిపించదు. తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ అస్సలు క్రియేట్ చేయలేకపోయాడు డైరెక్టర్. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకూ ఏం జరుగుతుందో ప్రేక్షకులు ఇట్టే ఊహించగలరు. ఎప్పట్లాగే పాటలకు, డ్యాన్సులకు, హీరో హీరోయిన్లు మాత్రం ఎంటర్టైన్ చేసారు. అయితే టీజర్, ట్రైలర్‌లో చూపించినట్టే, పాత సినిమాల రిఫరెన్సులతో ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిపి, నవ్విద్దామని అనుకున్నాడు భాను. రాజేంద్ర ప్రసాద్, నరేష్, ప్రవీణ్ వంటి ఇతర సీనియర్ నటులు తమ నటనతో మెప్పించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్‌ రిచ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. కొన్ని ఫైట్స్ ‘క్రాక్’ మూవీని గుర్తుకు తెస్తాయి. ఓవరాల్‌గా రవితేజ‌ నుంచి రెగ్యులర మాస్ రాజా మార్క్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ‘మాస్ జాతర’.

Nov 02, 2025 Read Review
TV9 Telugu
TV9 Telugu News Channel
5

Average

Mass Jathara Movie Review

రవితేజ హీరోగా భానుభోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ జాతర మూవీ నవంబర్ లో రిలీజ్ అయింది. అయితే ఆడియన్స్ ఆశించిన రేంజ్ లో టాక్ రాలేదు. టెక్నికల్ గా సినిమాలో అడవివరం స్టేషన్‌, లొకేషన్లు, నైట్‌ షూట్‌, జాతర ఎపిసోడ్స్ ని బాగా డీల్‌ చేశారు డైరక్టర్‌. కానీ వాటి మీద ఫోకస్ పెట్టి కథ, స్క్రీన్ ప్లే విషయంలో తడ...

రవితేజ హీరోగా భానుభోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ జాతర మూవీ నవంబర్ లో రిలీజ్ అయింది. అయితే ఆడియన్స్ ఆశించిన రేంజ్ లో టాక్ రాలేదు. టెక్నికల్ గా సినిమాలో అడవివరం స్టేషన్‌, లొకేషన్లు, నైట్‌ షూట్‌, జాతర ఎపిసోడ్స్ ని బాగా డీల్‌ చేశారు డైరక్టర్‌. కానీ వాటి మీద ఫోకస్ పెట్టి కథ, స్క్రీన్ ప్లే విషయంలో తడబడ్డారు. రవితేజ మార్క్ హిట్‌ సినిమాల తాలూకు స్పెషల్‌ అంశాలు చాలా చోట్ల గుర్తుకొస్తాయి. కానీ అవి కామన్ ఆడియన్స్ కి అంతగా నచ్చలేదు. పలు సన్నివేశాల్లో బలం లేకపోయినా హుషారైన నేపథ్య సంగీతంతో వాటిని రక్తికట్టించే ప్రయత్నం చేశారు భీమ్స్. యాక్షన్‌ ఎపిసోడ్స్ గగుర్పొడిచేలా ఉన్నాయి. ఫస్టాఫ్ లో ఉన్న ఫ్లో, సెకండ్‌ హాఫ్లోనూ ఉండుంటే బావుండేది. సన్నివేశాలన్నీ అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపించేసరికి కొన్ని సందర్భాల్లో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టు అయింది. మొత్తానికి మాస్‌ మహరాజ్‌ ఫ్యాన్స్ కి ట్రీట్‌ ఈ సినిమా. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద సాధారణ ప్రేక్షకులకు కనెక్ట్ అవలేదు.

Nov 02, 2025 Read Review
ABP Desam
ABP Desam Website
5

Average

Mass Jathara Movie Review

రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా నటించిన మాస్ జాతర భానుభోగవరపు దర్శకత్వంలో తెరకెక్కింది. థియేటర్లలో ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేదు. సినిమాలో రవితేజ నటన కంటే పాటల్లో గ్లామర్ హైలైట్ అయ్యేలా ఉంది. ముఖ్యంగా 'సూపర్ డూపర్ హిట్ సాంగ్' లో మరీ సన్నగా కనిపించారు. వన్ మ్యాన్ షో గా సినిమాని నడిపించార...

రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా నటించిన మాస్ జాతర భానుభోగవరపు దర్శకత్వంలో తెరకెక్కింది. థియేటర్లలో ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేదు. సినిమాలో రవితేజ నటన కంటే పాటల్లో గ్లామర్ హైలైట్ అయ్యేలా ఉంది. ముఖ్యంగా 'సూపర్ డూపర్ హిట్ సాంగ్' లో మరీ సన్నగా కనిపించారు. వన్ మ్యాన్ షో గా సినిమాని నడిపించారు మాస్ రాజా. శివుడిగా నవీన్ చంద్ర విలనిజం అతని కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్‌లలో ఒకటిగా నిలుస్తుంది. ఇటువంటి క్యారెక్టర్లు చేయడం రాజేంద్ర ప్రసాద్‌కు కొత్త కాదు. హైపర్ ఆది, వీటీవీ గణేష్, అజయ్ ఘోష్ మధ్యలో కొంత నవ్వించే ప్రయత్నం చేశారు. మురళీ శర్మ, నవ్య స్వామి, సముద్రఖని తదితరులు కనిపించారు. రవితేజ కటౌట్‌కు తగ్గ యాక్షన్ కొరియోగ్రఫీ కుదిరిన సినిమా 'మాస్ జాతర'. ఫైట్స్ ఒక్కటే చాలు, కథతో సంబంధం లేదనుకునే ప్రేక్షకులు - రవితేజ డై హార్డ్ ఫ్యాన్స్ ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా సినిమాకు వెళ్ళవచ్చు. ఇదొక రెగ్యులర్ కమర్షియల్ సినిమా అంతే.

Nov 02, 2025 Read Review
Filmi Beat
Filmi Beat Website
5

Average

Mass Jathara Movie Review

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా భానుభోగవరపు డైరెక్షన్ లో నటించిన సినిమా "మాస్ జాతర". శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి ఆశించిన రెస్పాన్స్ తెచ్చుకోలేదు. ప్రమోషన్స్ లో ఓ రేంజ్ లో ఉంటుందని మేకర్స్ చెప్పినట్టు, ఇందులో సగం కూడా ఆడియన్స్ కి ఆకట్టుకునేలా సీన్స్ లేవు. ఓవరాల్‌గా మాస్ జాతర గురించ...

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా భానుభోగవరపు డైరెక్షన్ లో నటించిన సినిమా "మాస్ జాతర". శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి ఆశించిన రెస్పాన్స్ తెచ్చుకోలేదు. ప్రమోషన్స్ లో ఓ రేంజ్ లో ఉంటుందని మేకర్స్ చెప్పినట్టు, ఇందులో సగం కూడా ఆడియన్స్ కి ఆకట్టుకునేలా సీన్స్ లేవు. ఓవరాల్‌గా మాస్ జాతర గురించి చెప్పాలంటే.. రవితేజ మార్క్ మాస్, యాక్షన్ థ్రిల్లర్. మాస్ ఆడియెన్స్‌కు మాస్ మహారాజ్, శ్రీలీల కాంబో అలరించే అవకాశం ఉంది. కేవలం రవితేజ, శ్రీలీల ఫ్యాన్స్‌కు నచ్చే అంశాలతో రూపొందించిన కమర్షియల్ ఎంటర్‌టైనర్. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే టైంపాస్ చేసే సినిమా. కథ, కథనాలపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే.. ఇంకా బెటర్ రిజల్డ్ వచ్చి ఉండేదనిపిస్తుంది. రెగ్యులర్ ఆడియెన్స్ ఓ సారి ఈ సినిమాపై లుక్కేయండి.

Nov 02, 2025 Read Review
Great Andhra
Great Andhra Website
5

Average

Mass Jathara Movie Review

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా భానుభోగవరపు డైరెక్షన్ లో నటించిన సినిమా "మాస్ జాతర". నవంబర్ లో థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా ఒక పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కగా, థియేటర్లలో నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. రవితేజ వన్ మ్యాన్ షో తో ఈ సినిమాని నడిపించా...

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా భానుభోగవరపు డైరెక్షన్ లో నటించిన సినిమా "మాస్ జాతర". నవంబర్ లో థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా ఒక పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కగా, థియేటర్లలో నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. రవితేజ వన్ మ్యాన్ షో తో ఈ సినిమాని నడిపించాడు గాని, దర్శకుడు భాను భోగవరపు సరైన కథ, కథనాలు రాసుకోవడంలో విఫలమయ్యాడు. రొటీన్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ కి బోర్ కొట్టించాడు. ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుంది కానీ, కామన్ ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడుతుంది ఈ సినిమా. రొటీన్ స్టఫ్ గా ఉన్న మాస్ జాతర లో మాస్ పల్స్ ఉన్నా వాటికి బలమైన సన్నివేశాలు ఏమి కనిపించవు. థియేటర్ నుంచి బయటికి వచ్చాక రవితేజ గుర్తుంటాడు గాని, పాత్రలు అంతగా గుర్తుకు రావు. ఓవరాల్ గా మాస్ జాతర ఫ్యాన్స్ కి మాత్రమే అని చెప్పాలి.

Nov 02, 2025 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
5

Average

Mass jathara movie Review

'భానుభోగవరపు డైరెక్షన్ లో మాస్ మహారాజ్ రవితేజ నటించిన "మాస్ జాతర" సినిమా నవంబర్ లో థియేటర్లో రిలీజ్ అయింది. రవితేజ తనకు కలిసొచ్చిన మాస్ జోనర్ లో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. రవితేజ వన్ మ్యాన్ షో తో ఈ సినిమాని నడిపించాడు. మాస్ మహారాజ్ ఫ...

'భానుభోగవరపు డైరెక్షన్ లో మాస్ మహారాజ్ రవితేజ నటించిన "మాస్ జాతర" సినిమా నవంబర్ లో థియేటర్లో రిలీజ్ అయింది. రవితేజ తనకు కలిసొచ్చిన మాస్ జోనర్ లో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. రవితేజ వన్ మ్యాన్ షో తో ఈ సినిమాని నడిపించాడు. మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది ఈ సినిమా. కానీ కొత్తదనం లేని కథ, కథనాలతో డైరెక్టర్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయలేకపోయాడు. సినిమాలో భారీ కాస్టింగ్ తో నింపినా రవితేజకి మినహా ఎవరికీ బలమైన పాత్ర లభించలేదు. అన్ని సన్నివేశాలు కూడా ఊహాజనితంగా ఉండడం వల్ల సామాన్య ప్రేక్షకులకి ఎంజాయ్ చేసిన ఫీలింగ్ ఉండదు. కానీ ఓటిటి లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఓవరాల్ గా స్క్రీన్ ప్లే లోపం వల్ల, రొటీన్ కథ వల్ల అంతగా ఇంప్రెస్ చేయలేదు, కానీ రవితేజ కోసం రెగ్యులర్ ఆడియన్స్ ఒకసారి మాస్ జాతరని చూడొచ్చు.

Nov 02, 2025 Read Review
Samayam Telugu
Samayam Telugu Website
4

Below Average

Mass Jathara Movie Review

'మాస్ జాతర' తో హిట్టు కొడుతున్నాం.. ఫిక్స్ అయిపోండి అని చాలా కాన్ఫిడెన్స్‌గా ఫ్యాన్స్‌కి మాట ఇచ్చారు మాస్ రాజా రవితేజ. ఆయనకి పెద్దగా యాంటీ ఫ్యాన్స్ వార్ ఉండదు కాబట్టి.. సినిమా ఓ మోస్తరుగా ఉన్నా కూడా లాక్కొచ్చేస్తుంటుంది. ఈ క్రమంలో భానుభోగవరపు డైరెక్షన్ లో నటించిన రవితేజ మాస్ జాతర నవంబర్ లో రిలీజ్ ఆక...

'మాస్ జాతర' తో హిట్టు కొడుతున్నాం.. ఫిక్స్ అయిపోండి అని చాలా కాన్ఫిడెన్స్‌గా ఫ్యాన్స్‌కి మాట ఇచ్చారు మాస్ రాజా రవితేజ. ఆయనకి పెద్దగా యాంటీ ఫ్యాన్స్ వార్ ఉండదు కాబట్టి.. సినిమా ఓ మోస్తరుగా ఉన్నా కూడా లాక్కొచ్చేస్తుంటుంది. ఈ క్రమంలో భానుభోగవరపు డైరెక్షన్ లో నటించిన రవితేజ మాస్ జాతర నవంబర్ లో రిలీజ్ ఆక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయి ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఓవరాల్ గా సినిమాలో ఓ సాంగ్ లో చెప్పినట్టు.. అంటే "సూపర్ డూపర్.. సూపర్ డూపర్" హిట్ అంటూ... పాటలో ఉన్న లిరిక్స్ మాదిరే.. "అర్ధం లేదు పర్థం లేదు.. తలా తోక లేదు.. రాగం, తాళం లేదు.. రిథమ్ లేదు.. కథం లేదు, పల్లవి లేదు.. చరణం లేదు, సెన్స్ లేదు.. కామన్ సెన్స్ లేనే లేదు.. అన్నట్టు కామన్ ఆడియన్స్ కి ఈ సినిమా అలాగే అనిపిస్తుంది. కానీ ఇవన్ని లేకపోయినా మాస్ రాజా రవితేజ ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే ఎలివేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఫ్యాన్స్ ని మెప్పించొచ్చు.

Nov 02, 2025 Read Review
123telugu
123telugu Website
5

Average

Mass jathara movie Review

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన మూవీ "మాస్ జాతర". భానుభోగవరపు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఒక పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఇక ఈ సినిమాని రవితేజ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఫ్యాన్స్ ని మెప్పించాడు. అలాగే నవీన్ చంద్ర కూడా ప్రతినాయకుడిగా సినిమాకి ప్లస్ అయ్యాడు. భీమ్స్ మ్యూజిక...

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన మూవీ "మాస్ జాతర". భానుభోగవరపు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఒక పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఇక ఈ సినిమాని రవితేజ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఫ్యాన్స్ ని మెప్పించాడు. అలాగే నవీన్ చంద్ర కూడా ప్రతినాయకుడిగా సినిమాకి ప్లస్ అయ్యాడు. భీమ్స్ మ్యూజిక్ సినిమాలో సాంగ్స్ బాగుంటాయి. కానీ దర్శకుడు భాను కథ మీద పెట్టిన ఫోకస్ కథనం మీద పెట్టలేకపోయాడు. స్క్రీన్ ప్లే పరంగా చాలా స్లో గా సాగగా, సన్నివేశాలు ఊహాజనితంగా ఉండడం వల్ల ప్లస్ అవుతాయనుకున్న కొన్ని మాస్ సీన్స్ కూడా మైనస్ అయ్యాయి. సినిమాని ఇంకాస్త ఎడిట్ చేసి ఉంటె ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా ఉండేది. కానీ రవితేజ మాస్ ఫ్యాన్స్ ని మెప్పిస్తుంది. కామన్ ఆడియన్స్ రెగ్యులర్ సినిమాలు ఇష్టపడే వారు ఒకసారి చూడొచ్చు.

Nov 02, 2025 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

కథ విషయానికి వస్తే.. లక్ష్మణ్ భేరి (రవితేజ) ఒక సిన్సియర్ అండ్ డైనమిక్ రైల్వే పోలీస్ ఆఫీసర్. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన అతను తన తాత (రాజేంద్ర ప్రసాద్) దగ్గరే పెరుగుతాడు. అయితే పవర్ ఫుల్ రైల్వే పోలీస్ అయిన లక్ష్మణ్ ని  అడవివరం అనే గ్రామానికి ట్రాన్స్ ఫర్ చేస్తారు పై ఆఫీసర్లు. అయితే ఆ ఊళ్ళో రౌడీ అయిన శివుడు (నవీన్ చంద్ర) ఆ ఊళ్ళో వాళ్ళతో గంజాయి పండిస్తూ అక్రమాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో శివుడు పండించిన గంజాయి అనుకోకుండా లక్ష్మణ్ భేరి పరిధి అయిన రేల్వే జోన్ లోకి వచ్చేస్తుంది. అప్పటినుంచి శివుడు చేసే పనులకు లక్ష్మణ్ భేరి అడ్డుకుంటాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మొదలైన వార్ ఎలా సాగింది. మధ్యలో తులసి (శ్రీలీల) తో లక్ష్మణ్ భేరి ప్రేమ ప్రయాణం ఎలా సాగింది. చివరికి శివుడు - లక్ష్మణ్ భేరిలో ఎవరు గెలిచారు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


Technical values : ఇక మాస్ జాతర సినిమాలో రవితేజ తన మాస్ పెర్ఫార్మన్స్ తో డైలాగ్ డెలివరీతో ఎనర్జిటిక్ గా నటించాడు. రవితేజ ఫ్యాన్స్ కి ఈ సినిమా బాగా నచ్చుతుంది. అలాగే హీరోయిన్ శ్రీలీల కూడా హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ తన రోల్ బాగా చేసింది. అలాగే ప్రతినాయకుడిగా నవీన్ చంద్ర సినిమాకి మంచి ప్లస్ అయ్యాడు. మిగిలిన నటీనటులు రాజేంద్ర ప్రసాద్, నరేశ్, సముద్రఖని, ప్రవీణ్, వీటీవీ గణేష్, హైపర్ ఆది తమ పాత్రల పరిధిమేరకు బాగా నటించారు. 

ఇక డైరెక్టర్ భాను భోగవరపు పనితనం విషయానికి వస్తే... కథకుడిగా తన సత్తా చాటాడు గాని, దర్శకుడిగా సినిమాకు అనుకున్న స్థాయిలో స్క్రీన్ ప్లే రాసుకోలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సినిమా మొత్తం ఊహాజనితంగా ఉండడం వల్ల ఆడియన్స్ కి ఎన్ని మంచి సీన్లు పడ్డా బోర్ ఫీలింగ్ కలుగుతుంది. హీరో – విలన్ మధ్య పవర్ ఫుల్ సీన్స్ ఉన్నా, ఆ సన్నివేశాలు పండలేదు. పైగా సినిమా చూస్తుంటే "క్రాక్" సినిమా చూస్తున్న ఫీలింగే ఆడియన్స్ కి వస్తుంది. ఇక మ్యూజిక్ పరంగా భీమ్స్ సిసిరోలియో మంచి పాటలు అందించాడు. బీజీఎమ్ కూడా ఇంప్రెస్ చేస్తుంది. ఎడిటింగ్ విషయానికి వస్తే నవీన్ నూలి సినిమాని ఇంకాస్త ట్రిమ్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నాగవంశీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మూవీ తెరకెక్కించారు. 


Final Review :

ఇక ఓవరాల్ గా చెప్పాలంటే "మాస్ జాతర" అంటూ తనకి కలిసొచ్చిన మాస్ జోనర్ లో యాక్షన్ ఎంటర్టైనర్ తో వచ్చిన రవితేజ వన్ మ్యాన్ షో తో సినిమాని నడిపించాడు. రవితేజ ఉన్న ప్రతి ఫ్రేమ్ కూడా ఫ్యాన్స్ కి కిక్కిస్తుంది. అయితే కామన్ ఆడియన్స్ కి సినిమా మెప్పించడం కష్టం. పేలవమైన స్క్రీన్ ప్లే, రొటీన్ సీన్స్ వల్ల కొత్తదనం ఆశించే ఆడియన్స్ కి నిరాశ తప్పదు. రెగ్యులర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు మాస్ జాతరను ఒకసారి చూడొచ్చు.

Review Statistics

4.9
Overall Rating
Avg. of all reviews
10
Total Reviews
From 3 Provider Types

Review Average

Media
4.9/10
Public
N/A