Hey Balwanth (హే బలవంత్)
టాలెంటెడ్ హీరో సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "హే బలవంత్". గోపి ఆచార దర్శకత్వం వహించిన ఈ సినిమాను బి నరేంద్ర రెడ్డి నిర్మించారు. శివాని నాగారం హీరోయిన్ గా నటించింది.
Available in:
Reviews
What critics and the public are saying about Hey Balwanth (హే బలవంత్)
Media Reviews
10 Avg: 5.4/10Above Average
Hey Balwanth movie Review
సుహాస్ నుంచి మరో న్యాచురల్ పెర్ఫార్మెన్స్ — అదే హే బల్వంత్. కామెడీ కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకుని దర్శకుడు గోపీ ఆచార తెరకెక్కించిన ఈ చిత్రం యూత్‌కు ఫుల్ కనెక్ట్ అవుతుంది. కాలేజీ బ్యాక్‌డ్రాప్, ఫ్రెండ్‌షిప్ ట్రాక్, రొమాంటిక్ సీన్స్ అన్నీ కలిపి ఒక పక్కా ఎంటర్టైనర్‌గా మలిచారు.సుహాస్ పాత్రకు పూర్తి న్యా...
సుహాస్ నుంచి మరో న్యాచురల్ పెర్ఫార్మెన్స్ — అదే హే బల్వంత్. కామెడీ కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకుని దర్శకుడు గోపీ ఆచార తెరకెక్కించిన ఈ చిత్రం యూత్‌కు ఫుల్ కనెక్ట్ అవుతుంది. కాలేజీ బ్యాక్‌డ్రాప్, ఫ్రెండ్‌షిప్ ట్రాక్, రొమాంటిక్ సీన్స్ అన్నీ కలిపి ఒక పక్కా ఎంటర్టైనర్‌గా మలిచారు.సుహాస్ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. అతడి డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ బాగా వర్క్ అయ్యాయి. శివాని నగరం పాత్ర గ్లామర్‌తో పాటు నటన పరంగా కూడా మెప్పిస్తుంది. వీరిద్దరి కెమిస్ట్రీ స్క్రీన్‌పై నేచురల్‌గా కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో లాఫింగ్ ట్రాక్ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచేస్తుంది. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఎమోషనల్ ట్విస్ట్ సినిమాకు మంచి బలం. ఎక్కడా బోర్ ఫీలింగ్ రాకుండా స్క్రీన్‌ప్లే డిజైన్ చేశారు. వివేక్ సాగర్ సంగీతం ట్రెండీగా ఉంది. పాటలు రీల్స్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. BGM సన్నివేశాలకు అదనపు ఎలివేషన్ ఇస్తుంది. మొత్తానికి హే బల్వంత్ యూత్‌కు ఫుల్ మీల్స్ లాంటి ఎంటర్టైనర్. నవ్వులు, ఎమోషన్, లవ్ — అన్నీ కలిసిన ప్యాకేజీ.
Average
Hey Balwanth movie Review
హే బల్వంత్ ఒక ఫ్రెష్ కామెడీ కాన్సెప్ట్‌తో రూపొందిన ఎంటర్టైనర్. దర్శకుడు గోపీ ఆచార కథను సింపుల్‌గా తీసుకుని, నవ్వులు పూయించే స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సుహాస్ బల్వంత్ పాత్రలో మరోసారి తన సహజ నటనతో మెప్పించారు. కామెడీ టైమింగ్, ఎమోషన్ రెండింటినీ ఈక్వెల్ ప్రదర్శించారు. శివాని నగరం పాత్ర...
హే బల్వంత్ ఒక ఫ్రెష్ కామెడీ కాన్సెప్ట్‌తో రూపొందిన ఎంటర్టైనర్. దర్శకుడు గోపీ ఆచార కథను సింపుల్‌గా తీసుకుని, నవ్వులు పూయించే స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సుహాస్ బల్వంత్ పాత్రలో మరోసారి తన సహజ నటనతో మెప్పించారు. కామెడీ టైమింగ్, ఎమోషన్ రెండింటినీ ఈక్వెల్ ప్రదర్శించారు. శివాని నగరం పాత్ర కథకు మంచి బలాన్నిచ్చింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, ఎక్స్‌ప్రెషన్స్ ఫ్రెష్‌గా ఉన్నాయి. హీరో-హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. సెకండ్ హాఫ్‌లో ఎమోషన్‌తో పాటు మెసేజ్ కూడా బాగా వర్క్ అయ్యింది. వివేక్ సాగర్ సంగీతం సినిమాకు ప్రధాన హైలైట్. పాటలు కథలో సహజంగా మిళితమై ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు సరైన ఇంపాక్ట్ ఇచ్చింది. సినిమాటోగ్రఫీ క్లీన్‌గా ఉండగా, ఎడిటింగ్ కూడా కథా ప్రవాహాన్ని నిలబెట్టింది.మొత్తానికి హే బల్వంత్ ఒక ఫీల్ గుడ్ కామెడీ డ్రామా. కుటుంబ ప్రేక్షకులకు, యువతకు మంచి వినోదాన్ని అందించే సినిమా. నవ్వుతూ, హాయిగా థియేటర్ నుంచి బయటకు వచ్చేలా చేసే చిత్రమిది.
Average
Hey Balwanth movie Review
ఈ వారం ఆడియన్స్ ముందుకు వచ్చిన "హే బలవంత్" ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోవడంలో కాస్త తడబడిందని చెప్పాలి. కానీ దర్శకుడు తను రాసుకున్న ఇలాంటి కథను ఎటువంటి అశ్లీలత లేకుండా తెరకెక్కించడంలో అతని ప్రతిభ తెలుస్తుంది. పాటలు పర్వాలేదనిపించుకున్నా, నేపథ్య సంగీతం మాత్రం సన్నివేశాల్లో బలాన్ని నింపింది. నిర...
ఈ వారం ఆడియన్స్ ముందుకు వచ్చిన "హే బలవంత్" ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోవడంలో కాస్త తడబడిందని చెప్పాలి. కానీ దర్శకుడు తను రాసుకున్న ఇలాంటి కథను ఎటువంటి అశ్లీలత లేకుండా తెరకెక్కించడంలో అతని ప్రతిభ తెలుస్తుంది. పాటలు పర్వాలేదనిపించుకున్నా, నేపథ్య సంగీతం మాత్రం సన్నివేశాల్లో బలాన్ని నింపింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. దాంతో పాటు నటీనటులు సుహాస్, శివాని నాగారం, సహా నరేష్ పెర్ఫార్మన్స్ కూడా బాగుంటుంది. అక్కడక్కడా రచనా పరంగా లోపాలున్నా, ఎటువంటి లాజిక్‌లు ఆలోచించకపోతే వినోదాన్ని కోరుకునే వాళ్లకు 'హే బల్‌వంత్' పూర్తిస్థాయి సంతృప్తినిస్తుంది. ఈ వీకెండ్ 'హే బల్‌వంత్' మంచి టైమ్ పాస్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది.
Average
Hey Balwanth Movie Review
పూర్తిగా కామెడీ కంటెంట్ తో తెరకెక్కిన "హే బలవంత్" సినిమా ఒక డిఫరెంట్ స్టోరీ పాయింట్ తో తెరకెక్కింది. స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా దర్శకుడు కాస్త తడబడ్డాడు. ఇక టెక్నికల్ గా ‘హే బల్వంత్’ పర్వాలేదనిపిస్తుంది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం ఉత్సాహభరితంగా సాగింది. పాటలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. మహిరెడ్డి...
పూర్తిగా కామెడీ కంటెంట్ తో తెరకెక్కిన "హే బలవంత్" సినిమా ఒక డిఫరెంట్ స్టోరీ పాయింట్ తో తెరకెక్కింది. స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా దర్శకుడు కాస్త తడబడ్డాడు. ఇక టెక్నికల్ గా ‘హే బల్వంత్’ పర్వాలేదనిపిస్తుంది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం ఉత్సాహభరితంగా సాగింది. పాటలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. మహిరెడ్డి ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు సరిపడా స్థాయిలో ఉన్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ గోపి ఆచార కామెడీ మీద మంచి పట్టున్న సంగతి అర్థమవుతుంది. తన డెబ్యూ మూవీ కోసం అతను చాలా రిస్కీ సబ్జెక్టును ఎంచుకున్నాడు. ఆ పాయింట్ మీద సినిమాలో సస్పెన్స్ మెయింటైన్ చేసిన తీరు.. రెండు ముఖ్యమైన ట్విస్టులతో ప్రేక్షకులను ఎంగేజ్ చేసిన తీరు బాగుంది. కానీ దీని మీద ఎమోషన్లను వర్కవుట్ చేయాలనుకోవడం.. సమాజానికి ఏదో సందేశం ఇవ్వాలనుకోవడం మాత్రం మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. అక్కడే దర్శకుడు తడబడ్డాడు అనిపిస్తుంది. దర్శకుడు ఈ పాయింట్ తీసుకోవడం తప్పని అనలేం కానీ.. దాని మీద కామెడీని.. ఎమోషన్ ను కలపాలన్న ప్రయత్నమే పెద్దగా ఫలించలేదు.
Above Average
Hey Balwanth movie Review
" హే బలవంత్" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన సుహాస్ ఈ సినిమాతో ట్రాక్ ఎక్కాలని థియేటర్ల ముందుకు వచ్చాడు. సినిమా పరంగా కథ బాగున్నా, స్క్రీన్ ప్లే అంత ఇంప్రెసివ్ గా ఉండదు. కానీ డైరెక్టర్ ఆడియన్స్ ని నవ్వించడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఆ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అండ్ నటీనటులు సుహాస్...
" హే బలవంత్" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన సుహాస్ ఈ సినిమాతో ట్రాక్ ఎక్కాలని థియేటర్ల ముందుకు వచ్చాడు. సినిమా పరంగా కథ బాగున్నా, స్క్రీన్ ప్లే అంత ఇంప్రెసివ్ గా ఉండదు. కానీ డైరెక్టర్ ఆడియన్స్ ని నవ్వించడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఆ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అండ్ నటీనటులు సుహాస్, శివాని నాగారం, నరేష్ సహా అందరూ మెప్పించారు. ఇక ఆడియన్స్ కి ఓ కొత్త తరహా కామెడీని ఎంజాయ్ చేయడానికి పనికొచ్చే సినిమా ఈ హే బల్వంత్. ఇక ఫస్టాఫ్ వినోదానికి కొదవలేదు. సెకండాఫ్ లోనే కొంత భాగం కామెడీని మర్చిపోయి కుంటుపడింది. ఆ తర్వాత వేగం పుంజుకోవడం, ముగింపూ సినిమాని రక్షించాయి. దర్శకుడు గోపీ అచ్చర చేసిన ప్రయత్నం సుహాస్ కి ఎదురు చూస్తున్న విజయాన్ని అందించేలా వుంది. ప్రేక్షకులు ఓటీటీ కోసం వేచి ఉండకుండా థియేటర్ కెళ్ళి ఎంజాయ్ చేస్తే బావుంటుంది. అయితే ఫైనల్ రిసల్ట్ ఆడియన్స్ చేతుల్లోనే ఉంది.
Above Average
Hey Balwanth Movie Review
కొన్ని ప్లాప్ మూవీస్ తర్వాత " హే బలవంత్" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన సుహాస్ ఈ సినిమాతో ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తున్నాడు. బట్ అది ఆడియన్స్ చేతుల్లోనే ఉంటుంది. ఇక దర్శకుడు గోపి ఆచార స్క్రీన్ ప్లే పరంగా తడబడ్డాడు. నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. వివేక్ సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అయితే పాటల ప...
కొన్ని ప్లాప్ మూవీస్ తర్వాత " హే బలవంత్" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన సుహాస్ ఈ సినిమాతో ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తున్నాడు. బట్ అది ఆడియన్స్ చేతుల్లోనే ఉంటుంది. ఇక దర్శకుడు గోపి ఆచార స్క్రీన్ ప్లే పరంగా తడబడ్డాడు. నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. వివేక్ సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అయితే పాటల పరంగా ఇంకొంత కేర్ తీసుకోవాల్సింది. అయితే దర్శకుడు కథలో మెయిన్ పాయింట్ ని దాన్ని ఆవిష్కరించిన తీరు బాగుంది. ప్రొస్ట్రిట్యూషన్ అనే అంశాన్ని చాలా నీట్ గా, ఫన్నీగా, ఎమోషనల్‌గా డీల్ చేసిన తీరు మాత్రం సూపర్బ్. తండ్రికి సంబంధించిన ఎమోషన్స్, సెంటిమెంట్ ని కూడా చాలా బాగా చూపించాడు. డైలాగ్‌లు బాగున్నాయి. స్క్రీన్‌ప్లే బాగుంది. బాగా రాసుకున్నారు, పర్‌ఫెక్ట్ గా తెరపై ఆవిష్కరించారు. కాకపోతే కొంత డ్రామా ఎక్కువ అయ్యిందనే ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని చోట్ల కామెడీ అంతగా పండలేదు. చాలా చోట్ల లాజిక్స్ మిస్ చేశాడు. ఓవరాల్ గా 'హే బలవంత్' ఒక వర్గం ఆడియన్స్ ని అయితే మెప్పిస్తుందని చెప్పాలి.
Average
Hey Balwanth movie Review
కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన "హే బలవంత్" మూవీ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ డైరెక్టర్ స్క్రీన్ ప్లే పరంగా తడబడ్డాడు. కథ బాగానే రాసుకున్నా, సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య ఎమోషనల్ ట్రాక్ / సీన్స్ లెంగ్త్ ఎక్కువైంది. కామెడీ నుంచి ఎమోషన్ వైపు కథ టర్న్ తీసుకున్న తీరు...
కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన "హే బలవంత్" మూవీ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ డైరెక్టర్ స్క్రీన్ ప్లే పరంగా తడబడ్డాడు. కథ బాగానే రాసుకున్నా, సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య ఎమోషనల్ ట్రాక్ / సీన్స్ లెంగ్త్ ఎక్కువైంది. కామెడీ నుంచి ఎమోషన్ వైపు కథ టర్న్ తీసుకున్న తీరు ఫోర్డ్స్‌గా కాకుండా ఆర్గానిక్‌గా ఉంటే బావుండేది. వినోదాన్ని, భావోద్వేగాన్ని సరిగా మిక్స్ చేయడంలో దర్శకుడి తడబాటు కనిపించింది. కానీ చెప్పాలనుకున్న విషయం బావుంది. లాజిక్కులు పట్టుకుంటూ వెళితే చాలా కనిపిస్తాయి. కానీ కంటెంట్ పరంగా సినిమాలో లాజిక్స్ ఆలోచిస్తే చూడలేం. పైగా 'హే బల్‌వంత్' లో నవ్వులకు లోటు ఉండదు. కానీ, స్క్రీన్ మీద చూస్తే కిక్. సుదర్శన్ కామెడీ, ఆ బిజినెస్ చుట్టూ రాసుకున్న సీన్స్ వర్కవుట్ అయ్యాయి. సీనియర్ నరేష్ మరోసారి తన మార్క్ చూపించారు. ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. సుహాస్, శివానీ చక్కగా నటించారు. థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు కాసేపు నవ్వుకునే సినిమా.
Average
Hey Balwanth movie Review
సుహాస్ నటించిన "హే బలవంత్" సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో థియేటర్లకు ఆడియన్స్ ని రప్పించే సత్తా సినిమాకుంది. హీరోహీరోయిన్లు సుహాస్, శివానీ నాగారం సహా నరేష్ కూడా ఇందులో అల్టిమేట్ పాత్ర పోషించారు. అయితే డైరెక్టర్ గోపి ఆచార కథనం విషయంలో తడబడ...
సుహాస్ నటించిన "హే బలవంత్" సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో థియేటర్లకు ఆడియన్స్ ని రప్పించే సత్తా సినిమాకుంది. హీరోహీరోయిన్లు సుహాస్, శివానీ నాగారం సహా నరేష్ కూడా ఇందులో అల్టిమేట్ పాత్ర పోషించారు. అయితే డైరెక్టర్ గోపి ఆచార కథనం విషయంలో తడబడ్డాడు. కథ స్క్రీన్ ప్లే కాస్త స్ట్రాంగ్ గా రాసుకొని ఉండాల్సింది. వివేక్ సాగర్ అందించిన సాంగ్స్ పెద్దగా ఎక్కలేదు కానీ బీజీఎమ్ విషయంలో మాత్రం న్యాయం చేశారు. ఓవరాల్‌గా సినిమా అయితే ఎక్కడా నిరాశపరచలేదు. కానీ హీరో తండ్రి ఇలాంటి కాలంలో కూడా సమాజం ఒప్పుకోలేని ఒక వ్యాపారాన్ని ఎందుకు కొనసాగించాడనే ప్రశ్న మాత్రం ఆడియన్స్‌లో మిగిలిపోతుంది. దీనికి డైరెక్టర్ ఆన్సర్ ఇచ్చారు కానీ ఆడియన్స్ దానికి పూర్తిగా కనిన్స్ కాలేకపోవచ్చు. కానీ క్లైమాక్స్‌లో నరేష్, అన్నపూర్ణ పాత్రలకి సంబంధించి ఇచ్చిన చిన్న ట్విస్ట్ మాత్రం బావుంది.
Above Average
Hey Balwanth movie Review
'హే బలవంత్' మూవీ కంటెంట్ విషయానికి వస్తే... కథకుడు షణ్ముఖ ప్రశాంత్ రాసుకొన్న పాయింట్.. అందులో జొప్పించిన ట్విస్టులు, టర్నులు చాలా చక్కగా ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే.. హే బలవంత్ సినిమాను బయటి నుంచి చూస్తే.. ఫన్, కామెడీ సినిమాగానే కనిపిస్తుంది. కానీ అంతర్లీనంగా ఈ సినిమాలో తండ్రి, కొడుకుల భావోద్వేగా...
'హే బలవంత్' మూవీ కంటెంట్ విషయానికి వస్తే... కథకుడు షణ్ముఖ ప్రశాంత్ రాసుకొన్న పాయింట్.. అందులో జొప్పించిన ట్విస్టులు, టర్నులు చాలా చక్కగా ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే.. హే బలవంత్ సినిమాను బయటి నుంచి చూస్తే.. ఫన్, కామెడీ సినిమాగానే కనిపిస్తుంది. కానీ అంతర్లీనంగా ఈ సినిమాలో తండ్రి, కొడుకుల భావోద్వేగాలు హృదయానికి హత్తుకొనేలా ఉంటాయి. వీకే నరేష్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు అత్యంత బలం. సుహాస్, శివానీ కూడా మరోసారి మెచ్యుర్డ్ ఫెర్ఫార్మెన్స్ అందించారు. రైటింగ్ పరంగా, టెక్నికల్‌గా ఈ సినిమా హైలీ అప్రిషియేబుల్. కన్విన్సింగ్, కమిటెడ్‌గా కథను తెరపైకి తెచ్చారు. డైరెక్టర్ గోపి, రైటర్స్ మిథున్, షణ్ముఖ కొత్తవారైనా ప్రతీ సీన్‌లో అరిపించేశారు. ఈ సినిమా ఆద్యంతం నవ్వులతో సాగే కామెడీ సినిమా మాత్రమే కాదు.. ఓ ఎమోషనల్ జర్నీ. 100 శాతం థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమా తప్పకుండా.. సినిమా హాల్‌లోనే చూడండి.
Average
Hey Balwanth
టాలెంటెడ్ హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ “హే బలవంత్’’ (Hey Balwanth). గోపి ఆచార డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శివాని నాగారం హీరోయిన్ గా నటించింది. కామెడీ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా వచ్చిన ఈ చిత్రంలో.. మెయిన్ థీమ్, కామెడీ సన్నివేశాలు అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. సుహాస్, సీన...
టాలెంటెడ్ హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ “హే బలవంత్’’ (Hey Balwanth). గోపి ఆచార డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శివాని నాగారం హీరోయిన్ గా నటించింది. కామెడీ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా వచ్చిన ఈ చిత్రంలో.. మెయిన్ థీమ్, కామెడీ సన్నివేశాలు అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. సుహాస్, సీనియర్ నరేశ్ నటన కూడా చాలా బాగుంది. ఐతే, కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని యూత్ ఫుల్ కామెడీ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ మాత్రమే ఆకట్టుకుంటాయి.
Public Reviews
Avg: —No public reviews yet.
About This Movie
కథ విషయానికి వస్తే... చిన్నప్పట్నుంచి కృష్ణ బలవంత్ (సుహాస్) తన తండ్రి రావు బలవంత్ (నరేష్) వ్యాపారాన్ని చేతిలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ తన తండ్రి మాత్రం ఉద్దేశపూర్వకంగా కృష్ణని తన వ్యాపారానికి దూరంగా ఉంచుతాడు. పైగా కృష్ణ కి తండ్రి వ్యాపారం ఏంటో కూడా తెలీదు. ఏమిటో కూడా కృష్ణకి తెలియదు. అయితే కొంత కాలం తర్వాత ఎంబీఏ పూర్తి చేసిన కృష్ణకి అనుకోకుండా తన తండ్రి వ్యాపారం చేతిలోకి తీసుకోవాల్సిన పని వస్తుంది. కానీ ఆ వ్యాపారం గురించి తెలిసి అసలు రహస్యం తెలుస్తుంది. ఈ క్రమంలో తప్పని పరిస్థితుల్లో కృష్ణ ఆ వ్యాపారం చుట్టూ ఎందుకు తిరగాల్సి వచ్చింది ? మధ్యలో కృష్ణ లవర్ మిత్రా (శివానీ నాగరం)ను ప్రేమకథేంటీ? కృష్ణ వ్యాపారాన్ని మానేయాలని చెప్పిన శివాని ని కృష్ణ ఎలా మేనేజ్ చేశాడనేది కథ.
Technical values :
కామెడీ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన "హే బలవంత్" సినిమాలో కృష్ణ పాత్రలో సుహాస్ బాగా మెప్పించాడని చెప్పాలి. ముఖ్యంగా నరేష్- సుహాస్ మధ్య సీన్స్ అల్టిమేట్ ఫన్ తో ఉంటాయి. అలాగే హీరోయిన్ శివానీ నాగారం రోల్ కూడా బాగుంది. హీరో, హీరోయిన్ల మధ్య ఉండే ఫ్యామిలీ డ్రామా, కొన్ని ఎమోషనల్ సీన్స్, కామెడీ సీన్స్ సినిమాకి మంచి ప్లస్ అయ్యాయి. ఇక నటన పరంగా సుహాస్, శివాని నాగరం తో పాటు, నరేష్, అజయ్ ఘోష్, సుదర్శన్, హర్షవర్ధన్ ఎవరి పాత్రల పరిధి మేరకు వారు నటించారు.
అయితే కథ పరంగా బాగానే ఉన్నా, దానికి తగ్గ స్క్రీన్ ప్లే ని ఎంటర్టైనింగ్ గా ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేయలేకపోయాడు దర్శకుడు. ముఖ్యంగా సెకండాఫ్ లో కొంచెం ల్యాగ్ ఫీల్ రాగా, ఎమోషన్స్ సీన్స్ లో దృష్టి పెట్టాల్సింది. ఇక దర్శకుడు గోపి ఆచార తన టేకింగ్ తో మెప్పించినా, సరైన స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తడబడ్డాడు. పైగా కొన్ని సీన్స్ ని ఎడిట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. వివేక్ సాగర్ సాంగ్స్ పర్లేదు.
Final Review : ఓవరాల్ గా "హే బలవంత్" మూవీ ఫన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ని కొంతవరకు మెప్పిస్తుందని చెప్పొచ్చు. కాని స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడు. థియేటర్లలో ఒకసారి చూడొచ్చు. కానీ కొత్తదనం కోరుకునే ఆడియన్స్ ని అంతగా ఇంప్రెస్ చేయదు. రెగ్యులర్ మూవీ లవర్స్ ఓ సారి ట్రై చేయొచ్చు.