Register as a Reviewer
Cheekatilo (చీకటిలో)

Cheekatilo (చీకటిలో)

23 Jan 2026
Overall Rating
5.1/10
8 Reviews

టాలెంటెడ్ యాక్ట్రెస్ శోభిత ధూళిపాళ మెయిన్ లీడ్ లో నటించిన మూవీ చీకటిలో. శరణ్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేసిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో డైరెక్ట్ గా విడుదలయింది. శ్రీ చరణ్ పాకాల సంగీత దర్శకుడు.

Director: Sharan Koppishetty
Cast: Sobhitha Dhulipala,Aditi,Vadlamani Sreenivas,Esha Chawla,Vishwadev Rachakonda

Available in:

Reviews

What critics and the public are saying about Cheekatilo (చీకటిలో)

Media Reviews

8 Avg: 5.1/10
Adireddy
Adireddy Youtube Channel
5

Average

Cheekatilo Movie Review

చీకటిలో (Cheekatilo) అనే టైటిల్‌కే తగ్గట్టుగా సినిమా పూర్తిగా డార్క్ టోన్‌లో సాగుతుంది. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒక హేవీ మూడ్‌ను క్యారీ చేస్తుంది. డైరెక్టర్ Sharan Koppisetty ఈ సినిమాను కమర్షియల్ ఫార్మాట్‌లో కాకుండా కంటెంట్ డ్రివెన్ స్టైల్‌లో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మొదటి 20–30 నిమిషాలు క్యారెక్...

చీకటిలో (Cheekatilo) అనే టైటిల్‌కే తగ్గట్టుగా సినిమా పూర్తిగా డార్క్ టోన్‌లో సాగుతుంది. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒక హేవీ మూడ్‌ను క్యారీ చేస్తుంది. డైరెక్టర్ Sharan Koppisetty ఈ సినిమాను కమర్షియల్ ఫార్మాట్‌లో కాకుండా కంటెంట్ డ్రివెన్ స్టైల్‌లో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మొదటి 20–30 నిమిషాలు క్యారెక్టర్స్ సెటప్, వాతావరణ నిర్మాణం మీదే ఫోకస్ ఉంటుంది. ఈ బిల్డ్-అప్ కొంతమందికి ఆసక్తికరంగా అనిపిస్తే, మరికొంతమందికి స్లోగా అనిపించే అవకాశం ఉంది. సినిమా అసలు బలం మెయిన్ క్యారెక్టర్ చుట్టూ తిరిగే ఎమోషనల్ లేయర్స్. ఇక్కడ Sobhita Dhulipala పూర్తిగా సినిమాను మోస్తుంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా కంట్రోల్డ్, అండర్‌ప్లే స్టైల్‌లో ఉంటుంది. ఓవర్ డ్రామా లేకుండా కళ్లతోనే ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం ఆమె ప్లస్. కొన్ని సైలెంట్ సీన్స్‌లో డైలాగ్ కన్నా ఎక్స్‌ప్రెషన్ ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తుంది. టెక్నికల్‌గా చూస్తే సినిమాటోగ్రఫీ హైలైట్. లో లైటింగ్, షాడో ఫ్రేమ్స్ కథకు సరిపోయే మూడ్ క్రియేట్ చేస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సబ్టిల్‌గా ఉంటుంది కానీ స్క్రీన్‌ప్లే మరింత క్రిస్ప్‌గా ఉంటే థ్రిల్ ఫ్యాక్టర్ ఇంకాస్త పెరిగేది. క్లైమాక్స్ ఓకే — కానీ షాకింగ్ కాదు. మొత్తం మీద ఇది మాస్ థ్రిల్లర్ కాదు

Jan 24, 2026 Watch
Thyview
Thyview Youtube Channel
5

Average

Cheekatilo Movie Review

చీకటిలో (Cheekatilo) అంటేనే డార్క్ టోన్, ఇంటెన్స్ మూడ్. అదే ఫీల్‌ని మొదటి సీన్ నుంచే సెట్ చేస్తాడు డైరెక్టర్ Sharan Koppisetty. సినిమా స్లో బర్న్ థ్రిల్లర్ స్టైల్‌లో సాగుతుంది. పెద్దగా హడావుడి లేకుండా కథ క్రమంగా డెవలప్ అవుతుంది. కానీ ఇక్కడే మైనస్ కూడా ఉంది — ఎవరైనా ఫాస్ట్ పేస్ థ్రిల్లర్ ఎక్స్‌పెక్ట్...

చీకటిలో (Cheekatilo) అంటేనే డార్క్ టోన్, ఇంటెన్స్ మూడ్. అదే ఫీల్‌ని మొదటి సీన్ నుంచే సెట్ చేస్తాడు డైరెక్టర్ Sharan Koppisetty. సినిమా స్లో బర్న్ థ్రిల్లర్ స్టైల్‌లో సాగుతుంది. పెద్దగా హడావుడి లేకుండా కథ క్రమంగా డెవలప్ అవుతుంది. కానీ ఇక్కడే మైనస్ కూడా ఉంది — ఎవరైనా ఫాస్ట్ పేస్ థ్రిల్లర్ ఎక్స్‌పెక్ట్ చేస్తే కొంచెం బోర్ ఫీలయ్యే ఛాన్స్ ఉంది. మెయిన్ లీడ్‌గా Sobhita Dhulipala పూర్తిగా సినిమాను తన భుజాల మీద మోసింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, కూల్ కానీ ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్స్ బాగుంటాయి. కొన్ని సైలెంట్ సీన్స్‌లో ఆమె కళ్లే మాట్లాడతాయి. కానీ కథలో ఉన్న ట్విస్టులు చాలా మందికి ప్రిడిక్టబుల్‌గా అనిపించవచ్చు. టెక్నికల్‌గా మాత్రం సినిమా క్లాస్‌గా ఉంటుంది. ఓవరాల్‌గా — స్టైలిష్ కానీ పూర్తిగా థ్రిల్ ఇవ్వని క్రైమ్ డ్రామా.

Jan 24, 2026 Watch
Tupaki
Tupaki Website
5

Average

Cheekatilo movie Review

అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన చీకటిలో మూవీ లో శోభిత ధూళిపాళ మెయిన్ లీడ్ లో నటించింది. కథంతా తన చుట్టూనే తిరిగే సినిమాలో ఆమె తన నటనతో ఆకట్టుకుంది. అమ్మాయి కావడం వల్ల అనేక ఆంక్షలతో పెరిగి.. అనేక సందర్భాల్లో నోరు కట్టేసుకుని.. తన వాయిస్ బలంగా వినిపించే అవకాశం వచ్చినపుడు విజృంభించే పాత్రకు శోభిత న్యాయం...

అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన చీకటిలో మూవీ లో శోభిత ధూళిపాళ మెయిన్ లీడ్ లో నటించింది. కథంతా తన చుట్టూనే తిరిగే సినిమాలో ఆమె తన నటనతో ఆకట్టుకుంది. అమ్మాయి కావడం వల్ల అనేక ఆంక్షలతో పెరిగి.. అనేక సందర్భాల్లో నోరు కట్టేసుకుని.. తన వాయిస్ బలంగా వినిపించే అవకాశం వచ్చినపుడు విజృంభించే పాత్రకు శోభిత న్యాయం చేసింది. పాత్రకు తగ్గట్లు సింపుల్ లుక్స్.. సటిల్ యాక్టింగ్ తో శోభిత మెప్పించింది. ఆమెకు జోడీగా నటించిన విశ్వదేవ్ రాచకొండ జస్ట్ ఓకే అనిపించాడు. కృష్ణచైతన్య పోలీస్ పాత్రకు న్యాయం చేశాడు. చాన్నాళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించిన సీనయిర్ నటుడు సురేష్.. ఈషా చావ్లాల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేలా ఏమీ లేదు. వాళ్ల పాత్రలు అంతగా ఇంపాక్ట్ వేయలేకపోయాయి. రవీంద్ర విజయ్ క్యారెక్టర్ కూడా అంతే. వడ్లమాని శ్రీనివాస్ బాగా చేశాడు. అయితే ఓవరాల్ గా యావరేజ్ కంటెంట్ గా చీకటిలో ఒకసారి ట్రై చేయొచ్చు.

Jan 24, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
5

Average

Cheekatilo Movie Review

శోభిత ధూళిపాళ మెయిన్ లీడ్ గా నటించిన చీకటిలో సినిమా గురించి చెప్పాలంటే.. దర్శకుడు శరణ్ ఎంచుకొన్న పాయింట్ బాగుంది. ఇంకా బెటర్‌గా కంటెంట్‌ను డిజైన్ చేసి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఇప్పటి వరకు శోభితాను చూసిన విధానం వేరు.. ఈ సినిమాలో సంధ్య పాత్రలో ఆమె ఫుల్ మార్కులు కొట్టేసింది. సీనియర్ నటుడు సురేష్, రవీం...

శోభిత ధూళిపాళ మెయిన్ లీడ్ గా నటించిన చీకటిలో సినిమా గురించి చెప్పాలంటే.. దర్శకుడు శరణ్ ఎంచుకొన్న పాయింట్ బాగుంది. ఇంకా బెటర్‌గా కంటెంట్‌ను డిజైన్ చేసి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఇప్పటి వరకు శోభితాను చూసిన విధానం వేరు.. ఈ సినిమాలో సంధ్య పాత్రలో ఆమె ఫుల్ మార్కులు కొట్టేసింది. సీనియర్ నటుడు సురేష్, రవీంద్ర విజయ్, ఆమని, ఝాన్సీ, చైతన్య లాంటి ఆర్టిస్టులు ఉన్నా కథలో వారి పాత్రలను బలంగా చూపించకలేకపోయారనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ మధ్య నడిచే ట్విస్టు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ సినిమాకు ఆ ఎపిసోడ్ కొంత మేరకు హైలెట్‌గా అనిపిస్తుంది. ఓవరాల్‌గా రెగ్యులర్ పాయింట్‌తో సాగే ఎమోషనల్ మర్డర్ మిస్టరీ అనే ఫీలింగ్ కలిగేలా చేస్తుంది.

Jan 24, 2026 Read Review
Chitra Jyothy
Chitra Jyothy Website
5

Average

Cheekatilo Movie Review

అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన 'చీకటిలో' మూవీలో శోభిత క్రైమ్ జర్నలిస్ట్ గా బాగానే చేసింది. సీఐ గా నటించిన చైతన్య కృష్ణ పాత్ర కాస్తంత బలమైంది. చాలా గ్యాప్ తర్వాత ఇషాచావ్లా మరోసారి కెమెరా ముందుకొచ్చింది. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా ఆమె నటించింది. వడ్లమాని సాయి శ్రీనివాస్ పాత్ర ఇందులో భిన్నమైంది....

అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన 'చీకటిలో' మూవీలో శోభిత క్రైమ్ జర్నలిస్ట్ గా బాగానే చేసింది. సీఐ గా నటించిన చైతన్య కృష్ణ పాత్ర కాస్తంత బలమైంది. చాలా గ్యాప్ తర్వాత ఇషాచావ్లా మరోసారి కెమెరా ముందుకొచ్చింది. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా ఆమె నటించింది. వడ్లమాని సాయి శ్రీనివాస్ పాత్ర ఇందులో భిన్నమైంది. నిజానికి ఈ సినిమాలో ప్రతిభగల నటీనటులు చాలామందే ఉన్నారు. కానీ వాళ్ళను పూర్తి స్థాయిలో దర్శకుడు శరణ్‌ కొప్పిశెట్టి ఉపయోగించుకోలేదు. శ్రీచరణ్‌ పాకాల నేపథ్య సంగీతం బాగుంది. సంభాషణలు అర్థవంతంగా ఉన్నాయి. 'తప్పు చేసి చీకట్లో దాక్కునే ఏ మృగాన్ని వదల కూడదు, మన భయం వాళ్ళకి బలంగా మారకూడదు' అనే పాయింట్ మీద తీసిన 'చీకటిలో...' మూవీ క్రైమ్, ఇన్వెస్టిగేషన్ డ్రామాస్ ను ఇష్టపడే వారికి నచ్చే ఆస్కారం ఉంది. కాకపోతే భారీ అంచనాలు మాత్రం పెట్టుకోకూడదు.

Jan 24, 2026 Read Review
N
News 18 Telugu Website
5

Average

Cheekatilo Movie Review

సినిమాల్లో, ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్లలో సత్యం కోసం వెతికే జర్నలిస్ట్ అనేది ఫెమిలియర్ క్యారక్టెర్‌. OTT ప్లాట్‌ఫామ్‌లలో ట్రూ-క్రైమ్‌ జానర్‌ని బాగా ఎక్స్‌ప్లోర్‌ చేసేసిన సమయంలో ‘చీకటిలో’ సినిమా వచ్చింది. 126 నిమిషాల క్రిస్ప్‌ రన్‌టైమ్ ఉన్నప్పటికీ, ఈ సినిమా జానర్‌కి కొత్తగా ఏం యాడ్‌ చేయలేదు. తెలిసిన క...

సినిమాల్లో, ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్లలో సత్యం కోసం వెతికే జర్నలిస్ట్ అనేది ఫెమిలియర్ క్యారక్టెర్‌. OTT ప్లాట్‌ఫామ్‌లలో ట్రూ-క్రైమ్‌ జానర్‌ని బాగా ఎక్స్‌ప్లోర్‌ చేసేసిన సమయంలో ‘చీకటిలో’ సినిమా వచ్చింది. 126 నిమిషాల క్రిస్ప్‌ రన్‌టైమ్ ఉన్నప్పటికీ, ఈ సినిమా జానర్‌కి కొత్తగా ఏం యాడ్‌ చేయలేదు. తెలిసిన కథనే చెబుతున్నట్లు ఉంటుంది. చాలా సీన్స్‌ని ముందే ఊహించవచ్చు. మిస్టరీ థ్రిల్లర్ మూడ్‌, టెన్షన్‌, అట్మాస్ఫియర్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇందులోని పాత్రలు, వరల్డ్‌ నేచురల్‌గా డెవలప్ అయి ఉంటే ఇంకా బాగుండేది. శ్రీచరణ్ పాకాల బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ చాలా సీన్స్‌ని ఎలివేట్‌ చేసింది. రైటింగ్‌ వీక్‌గా ఉన్న ప్రతి సీన్‌లో బలంగా పని చేసింది. అయితే కేవలం మ్యూజిక్‌ మాత్రమే సినిమాని కాపాడలేదు. శోభితా ధూళిపాల యాక్టింగ్‌, సోషల్లీ రిలవెంట్‌ ఐడియా పక్కనపెడితే ‘చీకటిలో’.. ఓ యావరేజ్‌ అనే ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది.

Jan 24, 2026 Read Review
ABP Desam
ABP Desam Website
5

Average

Cheekatilo Movie Review

సీరియల్ కిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ వచ్చిన సినిమాలు కోకొల్లలు. అయితే చాలా సినిమాల్లో హంతకుడు వరుస హత్యలు చేయడానికి గల కారణాలు అప్పటికే పలు సినిమాల్లో చూసినట్టు లేదా రొటీన్‌గా ఉన్నట్టు అనిపిస్తాయి. బట్, ఫర్ ఏ ఛేంజ్... 'చీకటిలో' సీరియల్ కిల్లర్ మోటివ్ డిఫరెంట్‌గా ఉంది. ఇన...

సీరియల్ కిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ వచ్చిన సినిమాలు కోకొల్లలు. అయితే చాలా సినిమాల్లో హంతకుడు వరుస హత్యలు చేయడానికి గల కారణాలు అప్పటికే పలు సినిమాల్లో చూసినట్టు లేదా రొటీన్‌గా ఉన్నట్టు అనిపిస్తాయి. బట్, ఫర్ ఏ ఛేంజ్... 'చీకటిలో' సీరియల్ కిల్లర్ మోటివ్ డిఫరెంట్‌గా ఉంది. ఇన్నాళ్ళూ లైంగిక వేధింపులను ఒక కోణంలో చూపించారు. ఇందులో మరో కోణం తీసుకున్నారు. సినిమాకు అది డిఫరెంట్ టచ్. 'చీకటిలో' పాయింట్ కొత్తగా ఉంది. ఎండింగ్ ఎక్స్‌పెక్ట్‌ చేయని విధంగా, ప్రతి ఒక్కరి ఊహలకు అతీతంగా వెళ్ళింది. చివరి వరకు హంతకుడు ఎవరు? అనేది ఊహించడం కష్టం. మంచి ఎండింగ్ రాసుకున్న దర్శక రచయితలు రొటీన్‌గా ఈ సినిమాను స్టార్ట్ చేయడం మైనస్ పాయింట్. శోభితా ధూళిపాళ పాత్రను, వరుస హత్యలను పరిచయం చేసిన తీరు ఎటువంటి ఉత్కంఠకు గురి చేయదు. ఏ విధమైన ఆసక్తి కలిగించదు. సింపుల్ & స్ట్రైయిట్‌గా వెళుతుంది. ఓవరాల్ గా మూవీ ఒక్కసారి చూసే విధంగా ఉంది.

Jan 24, 2026 Read Review
123telugu
123telugu Website
6

Above Average

Cheekatilo Movie Review

శోభిత ధూళిపాళ మెయిన్ లీడ్ గా నటించిన చీకటిలో మూవీ శరన్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేయగా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ గా స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే, ఈ ‘చీకటిలో’ సినిమా క్రైమ్ థ్రిల్లర్ లో సెటప్ ఒకింత కొత్తగా అనిపిస్తుంది. అలాగే అక్కడక్కడా కొన్ని మూమెంట్స్ ఇందులో మె...

శోభిత ధూళిపాళ మెయిన్ లీడ్ గా నటించిన చీకటిలో మూవీ శరన్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేయగా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ గా స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే, ఈ ‘చీకటిలో’ సినిమా క్రైమ్ థ్రిల్లర్ లో సెటప్ ఒకింత కొత్తగా అనిపిస్తుంది. అలాగే అక్కడక్కడా కొన్ని మూమెంట్స్ ఇందులో మెప్పిస్తాయి. సంధ్య రోల్ లో శోభిత బాగా చేశారు. అంతే కాకుండా ఇందులో అంతర్లీనంగా ఉండే సందేశం కూడా ఆలోచించేలా చేస్తుంది. కానీ ఈ క్రమంలో ఓ పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ కి కావాల్సిన మూడ్ కొంచెం మిస్ అయ్యింది. ఇంకా గ్రిప్పింగ్ అండ్ ఇంట్రెస్ట్ గా సాగే సన్నివేశాలు ఇందులో జోడించి ఉండాల్సింది. సో చీకటిలో క్రైమ్ థ్రిల్లర్ అక్కడక్కడా ఓకే అనిపిస్తుంది.

Jan 24, 2026 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

కథ విషయానికి వస్తే.. తనకంటూ కొన్ని విలువలున్న జర్నలిస్ట్ గా సంధ్య (శోభిత ధూళిపాళ) అప్పుడప్పుడు కొన్ని ఇష్టంలేని వార్తలు కూడా చదవాల్సి వస్తుందని, తన స్నేహితురాలు బాబీ (అదితి) సలహాతో జర్నలిజం మానేసి పాడ్ కాస్ట్ చేస్తుంది. అయితే అనుకోకుండా తన ఫ్రెండ్ బాబీ, ఆమె బాయ్ ఫ్రెండ్ హత్యకు గురవుతారు. ఈ క్రమంలో హంతకుడ్ని పట్టుకునే క్రమంలో జరుగుతున్న వరుస హత్యలను సంధ్య ఎలా కనిపెట్టింది. చివరకు హంతకుడ్ని పోలీసుల సాయంతో పెట్టుకున్నారా? లేదా అనేది కథ.

Technical values : మర్డర్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కాన్సెప్ట్ ఎన్నో సినిమాల్లో చూసినట్టుగానే ఉంటుంది. ఎవరో సైకో వరుస హత్యలు చేస్తాడు.. దాన్ని ఛేదించడంపైనే కథనం అల్లుకుని ఉంటుంది. చీకటిలో మూవీ కథాంశం కూడా అంతే. దర్శకుడు శరన్ ఎంచుకున్న కథ ఇంతకు ముందున్న సినిమాల్లో చూసినట్టే ఉంటుంది. అయితే దానికి తగ్గ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో కాస్త తడబడ్డాడు. ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ మాత్రమే ఆకట్టుకునేలా ఉంది. 

ఇక పెర్ఫార్మన్స్ పరంగా శోభిత తన రోల్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయింది. జర్నలిస్ట్ గా ఒక ఇన్వెస్టిగేటర్ గా మంచి నటన కనబరిచింది. కానీ ఇతర పాత్రలు స్ట్రాంగ్ గా రాసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు దర్శకుడు. వడ్లమని శ్రీనివాస్ కి కూడా ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఉన్న స్ట్రాంగ్ రోల్ దక్కింది. అయితే ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలకి థ్రిల్స్, సస్పెన్స్ చాలా ముఖ్యం. కానీ సినిమాలో అది చాలా తగ్గింది. అలాగే టెక్నికల్ గా నిర్మాణ విలువలు బాగున్నాయి. కొన్ని సెట్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి. మల్లికార్జున్ తన నైట్ విజన్ కెమెరా వర్క్ బాగుంది. అయితే కొన్ని సీన్స్ ఎడిట్ చేయాల్సింది. 

Final Review :
ఇక ఓవరాల్ గా "చీకటిలో" మూవీ డీసెంట్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ని అలరిస్తుంది. కానీ మళ్ళీ మళ్ళీ చూసేలా ఉండదు. ఎందుకంటే క్రైమ్ థ్రిల్లర్ లో ఉండాల్సిన అంశాలు అన్ని ఉన్నా, వైలెన్స్ ఎక్కువ ఉన్నా కూడా థ్రిల్ అనేది మిస్ అయింది. 

Review Statistics

5.1
Overall Rating
Avg. of all reviews
8
Total Reviews
From 2 Provider Types

Review Average

Media
5.1/10
Public
N/A