Register as a Reviewer
Band Melam (బ్యాండ్ మేళం)

Band Melam (బ్యాండ్ మేళం)

27 Mar 2026

ఈ వారం థియేటర్లలో విడుదలైన క్రేజీ సినిమాల్లో "బ్యాండ్ మేళం" ఒకటి. ‘కోర్ట్’ ఫేమ్ జోడి హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ లవ్ & కామెడీ ఎంటర్టైనర్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Director: Sathish Javvaji
Cast: Harsh Roshan, Sridevi, Sai Kumar, Goparaju Vijay & others

Available in:

About This Movie

కథ విషయానికి వస్తే... యాదగిరి (హర్ష్ రోషన్), రాజి (శ్రీదేవి) బావా మరదళ్లు. పుట్టుకతోనే వీళ్ల పెళ్లి నిశ్చయమైతే, కాల క్రమేణా గిరి తండ్రి సుందరయ్య (గోపరాజు విజయ్) ఆస్తులు పోగొట్టుకుంటే, రాజి తండ్రి సాయన్న (సాయికుమార్) రైస్ మిల్లుకి ఓనరయి సంపన్నుడవుతాడు. అయితే రోజులు గడిచే కొద్దీ రాజి కూడా గిరిని మర్చిపోతుంది. పైగా చదువులో రాణిస్తుంది. కాని గిరి మాత్రం చదువుకి బ్రేక్ ఇచ్చేసి బేవార్స్ గా తయారై మ్యూజిక్ పై ఇంట్రెస్ట్ తో ఫ్రెండ్స్ తో బ్యాండ్ మేళం పెడతాడు. ఈ క్రమంలో జరిగిన కోన్ నాటకీయ పరిణామాలతో రాజీ పెళ్లి వేరే వాళ్ళతో నిశ్చయమైతే పెళ్లి పందిరి నుంచి వేరే వాడితో లేచిపోతుంది. అసలు రాజీ వేరే వాళ్ళతో ఎందుకు లేచిపోయింది? మళ్ళీ గిరి ఇంట్లో ఎందుకుంటుంది? చిన్నప్పట్నుంచి రాజిని ప్రేమించిన గిరి తన  ప్రేమ విషయం చెప్పాడా? మ్యూజిక్ విషయంలో రాణించి తన ప్రేమను గెలుచుకున్నాడా? లేదా? అనేదే కథ. 

Technical values : ఇక సినిమా విషయానికి వస్తే... డైరెక్టర్ సతీష్ జవ్వాజి తీసుకుందే రొటీన్ పాత చింతకాయ పచ్చడి కథ. 80స్ లో ఎన్నో సినిమాలు ఇలాంటి ప్రేమకథల నేపథ్యంలో సినిమాలు వచ్చాయి. బ్యాండ్ మేళం సినిమా చూస్తే ఆ సినిమాలన్నీ గుర్తొస్తాయి. ఇంట్రెస్టింగ్ గా కామెడీ జోనర్ లో అయినా ఆకట్టుకున్నాడా? అంటే అది కూడా తక్కువే. అందుకే కథ, కథనాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక రచయిత కోన వెంకట్ కి సంబంధించిన కోన బ్యానర్ వల్ల ప్రమోషన్ బాగానే దక్కినా, సరైన కంటెంట్ ఉంటేనే ఆడియన్స్ చూస్తారు. దీనికి తోడు సినిమాలో జంటగా నటించిన హర్ష, శ్రీదేవి ఏ కోణంలో కూడా హీరో హీరోయిన్లలా అనిపించలేదు. ఇక సాయికుమార్ లాంటి నటులకు పెద్ద స్ట్రాంగ్ రోల్ కూడా పడలేదు.

టెక్నికల్ గా చూసుకుంటే... కథ, కామెడీ పెద్దగా హెల్ప్ అవకపోయినా...  విజయ్ బుల్గానిన్ సంగీతం కొంచెం ప్లస్ అయింది. ఎడిటింగ్ కూడా సరిగా లేదు. సినిమాటోగ్రఫీ పర్లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

Final Review : ఓవరాల్‌ గా "బ్యాండ్ మేళం" ఒక బిలో యావరేజ్ కామెడీ లవ్ ఎంటర్టైనర్ గా రెగ్యులర్ మూవీ లవర్స్ ని కొంత వరకు ఆకట్టుకునే అవకాశం ఉంది. కొత్తదనం కోరుకుంటే మాత్రం నిరాశ తప్పదు.