Akhanda2 (అఖండ తాండవం)
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ2 సినిమాపై భారీ అంచనాలుండగా, అఖండ కి సీక్వెల్ గా తెరకెక్కిన "అఖండ తాండవం" థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
Available in:
Reviews
What critics and the public are saying about Akhanda2 (అఖండ తాండవం)
Media Reviews
10 Avg: 5.2/10Above Average
Akhanda2 Movie Review
బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ2 సీక్వెల్ హైప్ తో రాగా, ఫస్ట్ పార్ట్ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఓవరాల్ గా ఫ్యాన్స్ కి మాత్రమే కనెక్ట్ అయింది.
బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ2 సీక్వెల్ హైప్ తో రాగా, ఫస్ట్ పార్ట్ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఓవరాల్ గా ఫ్యాన్స్ కి మాత్రమే కనెక్ట్ అయింది.
Average
Akhanda2 Movie Review
సీక్వెల్ హైప్ తో వచ్చిన అఖండ2 బాలకృష్ణ అభిమానులకు బాగా నచ్చినా, కామన్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడం లో విఫలమైంది.
Below Average
Akhanda2 movie Review
అఖండ సక్సెస్ తో భారీ హైప్ తో రీసెంట్ గా వచ్చిన అఖండ2 పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవగా, ఫస్ట్ పార్ట్ రేంజ్ లో ఇంప్రెస్ చేయలేకపోయింది.
అఖండ సక్సెస్ తో భారీ హైప్ తో రీసెంట్ గా వచ్చిన అఖండ2 పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవగా, ఫస్ట్ పార్ట్ రేంజ్ లో ఇంప్రెస్ చేయలేకపోయింది.
Above Average
Akhanda2 Movie Review
బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ2 థియేటర్లలో ఆశించిన మేర రెస్పాన్స్ తెచ్చుకోలేదు. ఓవరాల్ గా బాలయ్య ఫ్యాన్స్ ని మాత్రమే మెప్పించింది.
బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ2 థియేటర్లలో ఆశించిన మేర రెస్పాన్స్ తెచ్చుకోలేదు. ఓవరాల్ గా బాలయ్య ఫ్యాన్స్ ని మాత్రమే మెప్పించింది.
Below Average
Akhanda2 movie Review
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ2 రీసెంట్ గా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకోగా, బాలయ్య ఫ్యాన్స్ కి మాత్రమే మెప్పిస్తుంది.
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ2 రీసెంట్ గా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకోగా, బాలయ్య ఫ్యాన్స్ కి మాత్రమే మెప్పిస్తుంది.
Above Average
Akhanda2 Movie Review
నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన సీక్వెల్ మూవీ అఖండ2 థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
Above Average
Akhanda2 movie Review
బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన సీక్వెల్ మూవీ అఖండ తాండవం బాలయ్య అభిమానులకు మాత్రం థియేటర్లలో రుద్రతాండవమే.
బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన సీక్వెల్ మూవీ అఖండ తాండవం బాలయ్య అభిమానులకు మాత్రం థియేటర్లలో రుద్రతాండవమే.
Below Average
Akhanda2 movie Review
అఖండ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన అఖండ తాండవం థియేటర్లలో ఆశించిన రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది.
Average
Akhanda2 Movie Review
Above Average
Akhanda2 movie Review
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ2 థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
Public Reviews
Avg: —No public reviews yet.
About This Movie
అఖండ మొదటి భాగం ఎండ్ అయ్యేటప్పుడే సీక్వెల్ కంఫర్మ్ చేసిన బోయపాటి శ్రీను, అఖండ ముగింపులో బాలయ్య కూతురు పిలిస్తే తప్పకుండా వస్తానన్న మాటతో సీక్వెల్ మొత్తాన్ని తెరకెక్కించారు. అఖండ2 లో బాలమురళీకృష్ణ (బాలయ్య) కుమార్తె అయిన జనని (హర్షాలి మల్హోత్రా) ఓ సైంటిస్ట్. తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని భారత దేశ సైనికుల కోసం తన టీమ్ తో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. ఇదే సమయంలో మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన టెర్రరిస్టులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం దేశంలో ఒక్కసారిగా ఒక అనుకోని సంఘటన కలకలం రేపుతుంది. ఆ ఘటన చాలా మంది ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. ఇలాంటి సమయంలో దేశంపై దాడికి ప్రయత్నిస్తున్న దుండగుల్ని అఖండ ఎలా అడ్డుకున్నాడు. అలాగే దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయిన ప్రజల్ని ఎలా రక్షించి దారిలో పెట్టాడు. అఖండ కన్నతల్లి కోరిక తీరిందా లేదా అన్నది అఖండ తాండవం స్టోరీ.
Technical values : సినిమాలో బాలకృష్ణ పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే మొదటి నుండే బాలయ్య ప్రధాన ఆకర్షణగా నిలిచి రెండు పాత్రల్లోనూ అదరగొట్టాడు. మిగతా పాత్రల్లో హర్షాలీ మల్హోత్రా పాత్రకి తప్ప మిగతా పత్రాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. విలన్ గా ఆది పినిశెట్టి బాగానే ఉన్నా పేలలేదు. అఖండ 1 భారీ సక్సెస్ అఖండ2 సినిమాపై భారీ హైప్ రావడానికి ప్రధాన కారణం. అందుకే పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించారు. అయితే దర్శకుడు బోయపాటి శ్రీను ఈసారి అంచనాలను అందుకోలేకపోయాడు. కథ నేపథ్యంలో డెప్త్ ఉన్నా, ఎమోషన్స్ ని పండించలేదు. యాక్షన్ సీన్స్ కొంచెం ఓవర్ అయిపోయాయి. కొని సీన్స్ మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. దీనికి తోడు VFX విజువల్స్ అంతగా ఆకట్టుకోవు. మ్యూజిక్ పరంగా థమన్ ఎస్ ఈ సినిమాకు రెండో బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పాలి. అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట ఎక్కడా తగ్గకుండా సినిమాకి పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. అయితే స్క్రీన్ ప్లే విషయంలో బోయపాటి శ్రీను కాస్త శ్రద్ధ పెట్టి ఉండాల్సింది.
Final Review : అఖండ కి సీక్వెల్ గా వచ్చిన అఖండ2 మొదటి పార్ట్ లాగానే డివోషనల్ టచ్ తో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో కూడిన ఎంటర్టైనర్ గా వచ్చింది. అయితే కథనం పరంగా స్లో అయి బోర్ కొట్టించింది. బాలయ్య ఫ్యాన్స్ మినహా సాధారణ మూవీ లవర్స్ ఈ సినిమాకి కనెక్ట్ కాలేదు. అలాగే యాక్షన్ సీన్స్ కాస్త అతి కాగా, గ్రాఫిక్స్, ఎమోషన్స్ పండకపోవడం మైనస్ అని చెప్పాలి. ఓవరాల్ గా అఖండ2 బాలయ్య అభిమానులకి మాత్రమే.