Register as a Reviewer
ఇరుముడి (The Heart of Irumudi)

ఇరుముడి (The Heart of Irumudi)

Upcoming Expected Release: 2026

"ఇరుముడి" సాక్షిగా మాటిచ్చేసిన రవన్న...!

Director: Shiva Nirvana
Cast: Mass Maharaja Raviteja, Priya Bhavani Shankar, Sai Kumar, Baby Nakshathra & Others

Available in:

About This Movie

Upcoming Movie :

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా "ఇరుముడి" అనే ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్న విషయం  తెలిసిందే. ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా, ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్టైనర్ గా డివోషనల్ టచ్ తో తెరకెక్కుతుంది ఈ మూవీ. ఇక తాజాగా ఈ మూవీ నుండి ఫస్ట్ గ్లింప్స్ విడుదలయి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ గ్లింప్స్ అయితే యానానిమస్ గా సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంటుంది.

 

వీడియో చూసిన తర్వాత మాత్రం ప్రేక్షకులకు, అభిమానులకు ఇన్నాళ్లు రియల్ రవన్నలో ఏం మిస్ అయ్యారో షార్ట్ వీడియోలో చూపించారు మేకర్స్. ముఖ్యంగా టీజర్ లో కూతురుతో డిజైన్ చేసిన కొన్ని బ్యూటిఫుల్ సీన్స్ చాలా బాగున్నాయి. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజతో చిత్రీకరించిన సీన్లు చాలా సహజంగా ఉండి ఆకట్టుకోగా, ఒకప్పటి రవన్న మూవీస్ లో న్యాచురాలిటీ ఈ మూవీలో ఉండబోతుందంటూ కామెంట్స్ వస్తున్నాయి. 

 

టీజర్ చివర్లో అయ్యప్ప స్వామి మాల సన్నివేశాలతో ముగించిన షాట్స్ విజువల్స్ బాగున్నాయి. ఆ సీన్స్ చూస్తుంటే బలమైన భావోద్వేగాలతో సినిమా ఉండనుందని తెలుస్తూనే ఉంది. ఇక జీవి ప్రకాష్ కుమార్ బీజీఎమ్ చాలా అద్భుతంగా ఉంది. గత కొంతకాలంగా ప్లాప్స్ లో ఉన్న రవన్న ఈ సినిమాతో కం బ్యాక్ ఇవ్వడం పక్కా అని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పుడు విడుదలైన గ్లింప్స్ ని చూస్తుంటే ఈసారి రవన్న సూపర్ హిట్టు కొడతాడని విడియోతోనే మాటిచ్చేసారని ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్టు లో విడుదల చేయడానికి రెడీ చేస్తున్నారు. 

 

Why MRO?