(Romanchakam Teaser)
Romanchakam : ఊహకే అందని, ఉవ్వెత్తున ఎగిసే, ఉత్తుంగ తరంగమే ఈ రోమాంచకం.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు..
Available in:
About This Movie
టాలీవుడ్ లో వైల్డ్ మూవీస్ తో ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ "సందీప్ రెడ్డి వంగ" (SandeepReddy Vanga). అయితే తాజాగా సందీప్ రెడ్డి వంగ సమర్పణలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై ప్రణయ్ రెడ్డి వంగ నిర్మిస్తున్న కొత్త సినిమా "రోమాంచకం"(Romanchakam). "మేమ్ ఫేమస్" ఫేమ్ సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas) హీరోగా నటిస్తున్న ఈ మూవీలో 8 వసంతాలు(8 Vasanthalu) సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనంతిక (Ananthika) హీరోయిన్ గా నటిస్తోంది. వేణు గోపాల్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ యొక్క గ్లింప్స్ ను తాజాగా సోషల్ మీడియాలో విడుదల చేసారు.
ఇక వినడానికి ఏదో మలయాళం మూవీలా పేరు ఉన్నా, పక్కా తెలుగు సినిమా ఇది. వంగ మార్క్ లోనే సినిమా ఉంటుందని గ్లింప్స్ చూస్తుంటే తెలిసిపోతుంది. "జానకి చెంతనే రాముని హృదయం".. అంటూ క్లాసిక్ ట్యూన్ తో మొదలైన వీడియో.. మెల్లిగా అల్ట్రా మోడ్రన్ స్టయిల్లోకి మారిపోయి, సడన్ గా హీరోహీరోయిన్లు కొట్టుకునే సీన్ తో "I Hate You" అనుకుంటూ ఎండ్ చేస్తారు. వంగ సినిమాల్లో లాగానే ఈ వీడియోలో కూడా లవ్ ట్రాక్ సీన్స్, బైక్ రైడ్స్, సముద్ర తీరంలో పరుగులు.. లాంటి సీన్స్ తో వీడియో బానే అట్రాక్ట్ చేస్తుంది. దానికి తోడు మ్యూజిక్ కూడా మంచి వైబ్ ఇస్తుంది.
ఇక లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ "రోమాంచకం" మూవీ సందీప్ రెడ్డి సమర్పణలో తెరకెక్కుతుండటం వల్ల మంచి మార్కెటింగ్, హైప్ కూడా వస్తుంది.ఇక ఈ రోమాంచకం మూవీని వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 3వ తేదీన థియేటర్లలో విడుదలచేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.