Register as a Reviewer
Home Reviews Media Reviews

Media Reviews

Reviews from top media outlets, YouTube channels, and publications

937
Total Reviews
Showing 553–564 of 937 media reviews
బ్యాండ్ మేళం (Band Melam)

Band Melam Movie Review

Gulte

By Gulte

ఈ వారం థియేటర్లలోకి వచ్చిన బ్యాండ్‌ మేళం… పేరు చూస్తే ఫుల్ ఫన్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ స్క్రీన్ మీదికి వచ్చేసరికి ఆ ఫన్ అంతగా కనబడదు. రొటీన్ లవ్-కామెడీ ఫార్ములాతో సాగిపోయే సినిమా ఇది.హర్ష రోషన్, శ్...

ఈ వారం థియేటర్లలోకి వచ్చిన బ్యాండ్‌ మేళం… పేరు చూస్తే ఫుల్ ఫన్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ స్క్రీన్ మీదికి వచ్చేసరికి ఆ ఫన్ అంతగా కనబడదు. రొటీన్ లవ్-కామెడీ ఫార్ములాతో సాగిపోయే సినిమా ఇది.


హర్ష రోషన్, శ్రీదేవి జంట ఓకే. కెమిస్ట్రీ వర్క్ అయినా… హీరో-హీరోయిన్ వైబ్ మాత్రం అంతగా రాదు. క్లైమాక్స్ దగ్గర మాత్రం ఎమోషన్స్ కొంచెం పని చేస్తాయి. కామెడీ ట్రాక్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ కావాల్సింది. కానీ అదే పెద్ద మైనస్ అయింది. చాలా సీన్లు ఫోర్స్ చేసినట్టుగా, అసహజంగా అనిపిస్తాయి. నవ్వులు రావాల్సిన చోట… చిరాకు వచ్చే పరిస్థితి.


సెకండాఫ్‌లో డ్రామా ఓవర్ డోస్. కథ ముందే ఊహించేసుకునేలా ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చే హై మోమెంట్స్ ఉన్నా… అవి మూవీని సేవ్ చేయలేవు. టెక్నికల్‌గా చూసుకుంటే సౌండ్ డిజైన్ కొంచెం లౌడ్. చివర్లో పెట్టిన ట్రెండింగ్ సాంగ్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వదు. యాక్టింగ్ కూడా కొన్ని చోట్ల ఓవర్‌గా అనిపిస్తుంది.

4.0
out of 10

Below Average

బ్యాండ్ మేళం (Band Melam)

Band Melam Movie Review

హర్ష్ రోషన్-శ్రీదేవి జంటగా నటించిన బ్యాండ్ మేళం మూవీ ఈ వారం థియేటర్లలో విడుదలై నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 'కోర్ట్' చిత్రంలో రోషన్ తన నటన సామర్థ్యాలను నిరూపించుకున్నప్పటికీ, ఇందులో గిరి పాత్రలో ప...

హర్ష్ రోషన్-శ్రీదేవి జంటగా నటించిన బ్యాండ్ మేళం మూవీ ఈ వారం థియేటర్లలో విడుదలై నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 'కోర్ట్' చిత్రంలో రోషన్ తన నటన సామర్థ్యాలను నిరూపించుకున్నప్పటికీ, ఇందులో గిరి పాత్రలో పెద్దగా మెప్పించలేదు. పాత్ర స్వభావం అలా రొటీన్ గా ఉండడం వల్లో ఏమో గాని, కొన్నిసార్లు అతని నటన హద్దులు దాటింది. రాజీ పాత్రలో శ్రీదేవి సహజంగా, పాత్రకు సరిగ్గా సరిపోయింది. కానీ సినిమా ద్వితీయార్థంలో ఆమెకు నటించే అవకాశం లభించలేదు. హీరో గ్యాంగ్‌లోని స్నేహితులందరూ కొత్త ముఖాలే మరియు వారి సన్నివేశాలు సరిగ్గా రాయబడలేదు. 


విజయ్ స్వరపరిచిన రెండు పాటలు పర్వాలేదనిపించినా, అవి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. నేపథ్య సంగీతం సగటు కంటే తక్కువగా ఉంది మరియు ఎటువంటి ప్రభావం చూపలేదు. ఈ చిత్రంలో తెలంగాణ జానపద గీతాలలోని కొన్ని ప్రముఖ బాణీలను ఉపయోగించారు. 'బ్యాండ్ మేళం' నిర్మాణ విలువలు కూడా ఆశించిన స్థాయిలో లేవు. 'బ్యాండ్ మేళం' అన్ని విభాగాల్లోనూ విఫలమైన చిత్రం, ఈ సినిమాను చూడకుండా వదిలేయవచ్చు.

4.0
out of 10

Below Average

బ్యాండ్ మేళం (Band Melam)

Band Melam Movie Review

హర్ష్ రోషన్-శ్రీదేవి జంటగా నటించిన బ్యాండ్ మేళం మూవీ ఈ వారం థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కోన వెంకట్ రచించిన ఈ సినిమా, కామెడీ ఫ్యామిలీ డ్రామా జానర్‌ లోనే సాగుతుంది. కానీ కథ, కథనం...

హర్ష్ రోషన్-శ్రీదేవి జంటగా నటించిన బ్యాండ్ మేళం మూవీ ఈ వారం థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కోన వెంకట్ రచించిన ఈ సినిమా, కామెడీ ఫ్యామిలీ డ్రామా జానర్‌ లోనే సాగుతుంది. కానీ కథ, కథనం రెండూ పాత ఫార్ములానే అనిపిస్తాయి. పాత చింతకాయ పచ్చడిలా ఉంటుంది. హీరో పేదవాడు, హీరోయిన్ ధనవంతురాలు, ప్రేమకు అడ్డంకులు-ఇలాంటి రొటీన్ అంశాలతో కథ ముందుకు సాగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో బ్యాండు మేళం సన్నివేశాలు కొంత వినోదాన్ని అందిస్తాయి. ఇంటర్వెల్ వరకు కథ ఆసక్తిగా అనిపించినా, సెకండ్ హాఫ్‌లో నెమ్మదిగా మారుతుంది. క్లైమాక్స్ కూడా ముందే ఊహించగలిగేలా ఉంటుంది.


నటీనటులు పెర్ఫార్మన్స్ పరంగా బాగానే చేసినా, కథ, కథనాలు డిస్సపాయింట్ చేయడంతో ప్రేక్షకులకు మైండ్ లోకి పాత్రలు ఎక్కవు.

టెక్నికల్‌ గా సినిమా ఓకే. విజయ్ బుల్గానిన్ సంగీతం బాగుంది. 'తిప్పుకుంటున్నవావే' పాట ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు మంచి స్థాయిలో ఉన్నాయి. మొత్తం మీద ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గలేదు. కానీ బ్యాండ్ మేళం బ్యాండ్ మోగలేదు. 


5.0
out of 10

Average

బ్యాండ్ మేళం (Band Melam)

Band Melam Movie Review

హర్ష్ రోషన్-శ్రీదేవి జంటగా నటించిన బ్యాండ్ మేళం మూవీ ఆడియన్స్ నుండి బీలో యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. పైగా వారి పాత్రల్లో డెప్త్ లేకపోగా హీరోహీరోయిన్ల ఫీల్ రాదు. సాయికుమార్ భారమైన, ఎమోషనల్ పాత్రను...

హర్ష్ రోషన్-శ్రీదేవి జంటగా నటించిన బ్యాండ్ మేళం మూవీ ఆడియన్స్ నుండి బీలో యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. పైగా వారి పాత్రల్లో డెప్త్ లేకపోగా హీరోహీరోయిన్ల ఫీల్ రాదు. సాయికుమార్ భారమైన, ఎమోషనల్ పాత్రను పండించాడు. గోపరాజు విజయ్, ఇతరులు ఫర్వాలేదనిపిస్తారు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ఎక్కువ మార్కులు కొట్టేసింది విజయ్ బుల్గానిన్ అని చెప్పుకోవాలి. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. చుట్టేసుకొంటానే పాట బ్లాక్ బస్టర్‌ ఫీల్ అందిస్తుంది. 


అలాగే సినిమాటోగ్రఫి వర్క్ బాగుంది. ఎడిటింగ్ ఈ సినిమాకు ప్రధాన లోపం. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కథ, కథనాలు గాలికి వదిలేయకుండా ఇంకాస్త బెటర్‌గా కసరత్తు చేసి మంచి పాయింట్‌ తో సినిమాను రూపొందించి ఉంటే రోషన్, శ్రీదేవీకి మంచి హిట్ పడేది. ఉయ్యాల జంపాల సినిమా చూస్తే కొంత నిరాశ కలుగుతుంది. చూడకపోతే ఏమైనా కొత్త అనుభూతి కలిగే అవకాశం ఉంది. ఈ సినిమా చూడాలా? వద్దా? అనే ప్రేక్షకుడికే వదిలేయాల్సిందే.

4.0
out of 10

Below Average

బ్యాండ్ మేళం (Band Melam)

Band Melam Movie Review

Tupaki

By Tupaki

‘బ్యాండ్‌ మేళం’ మూవీ రివ్యూ విషయానికి వస్తే... హర్ష్ రోషన్-శ్రీదేవి జంట తమ చివరి చిత్రం (కోర్ట్) ఎంతగా అలరించిందో.. ‘బ్యాండ్ మేళం’లో అంతగా అసహనం కలిగిస్తుంది. హర్ష్ చాలా హుషారుగా నటించాడు కానీ.. అతను...

‘బ్యాండ్‌ మేళం’ మూవీ రివ్యూ విషయానికి వస్తే... హర్ష్ రోషన్-శ్రీదేవి జంట తమ చివరి చిత్రం (కోర్ట్) ఎంతగా అలరించిందో.. ‘బ్యాండ్ మేళం’లో అంతగా అసహనం కలిగిస్తుంది. హర్ష్ చాలా హుషారుగా నటించాడు కానీ.. అతను చేసిన గిరి పాత్ర మామూలుగా ఫ్రస్టేట్ చేయదు. తన మ్యూజిక్ స్టూడియో ప్రారంభ వేడుకలో అతను ఇచ్చే ప్రసంగం చూశాక.. తన పాత్రతో పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోతాం. రాజి పాత్రలో శ్రీదేవి కూడా ఎలాంటి ప్రత్యేకతా చూపించలేకపోయింది. ఆ క్యారెక్టరే చాలా అయోమయంగా అనిపిస్తుంది. ఈసారి రోషన్ తో శ్రీదేవి కెమిస్ట్రీ ఏమాత్రం పండలేదు. సాయికుమార్ ను పూర్తిగా వృథా చేశారు. హీరో తల్లి పాత్రలో చేసిన నటి బాగా చేసింది. హీరో మిత్ర బృందం పర్వాలేదు. 


సాంకేతికంగా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ ‘బ్యాండ్ మేళం’తో మెప్పించలేకపోయాడు. నేపథ్య సంగీతం బాగున్నా.. విషయం లేని సన్నివేశాల వల్ల దాని ప్రయోజనం నెరవేరలేదు. సతీష్ ముత్యాల ఛాయాగ్రహణం బాగానే సాగింది. రచయిత-దర్శకుడు సతీష్ జవ్వాజి.. ఈ కథ తో అసలేం చెప్పదలుచుకున్నాడో అర్థం కాదు. మినిమం రైటింగ్ లేని.. ఫీచర్ ఫిలింకి అర్హం కాని స్క్రిప్టు ఇది. కోన వెంకట్ లాంటి పేరున్న రైటర్ ఈ స్క్రిప్టు ఎలా ఓకే చేసి సినిమాను ప్రొడ్యూస్ చేశాడన్నది అర్థం కాని విషయం. చివరగా: బ్యాండ్ మేళం.. భరించలేని సౌండు. 

3.0
out of 10

Not Good

బ్యాండ్ మేళం (Band Melam)

Band Melam Movie Review

‘బ్యాండ్‌ మేళం’ మూవీ రివ్యూ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... ఆశించిన నవ్వులు లేవు.. గోల మాత్రం ఎక్కువ.. లోతుగా వెళ్తే.. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్యాండ్‌మేళం సినిమా రొటీన్ టాక్‌ తోనే సరిపెట్టు...

‘బ్యాండ్‌ మేళం’ మూవీ రివ్యూ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... ఆశించిన నవ్వులు లేవు.. గోల మాత్రం ఎక్కువ.. లోతుగా వెళ్తే.. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్యాండ్‌మేళం సినిమా రొటీన్ టాక్‌ తోనే సరిపెట్టుకుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం… ఆశించిన స్థాయిలో నవ్వులు పండించలేకపోయింది. హర్ష రోషన్, శ్రీదేవి జంట మధ్య కెమిస్ట్రీ బాగున్నప్పటికీ… పూర్తి స్థాయిలో హీరో-హీరోయిన్ ఫీల్ ఇవ్వలేకపోయారు. క్లైమాక్స్‌లో వచ్చే లవ్ ఎమోషన్స్ మాత్రం కొంతవరకు ఆకట్టుకుంటాయి. 


ఇక సినిమాలో ప్రధానంగా మైనస్‌గా నిలిచింది కామెడీ ట్రాక్స్. చాలా చోట్ల బలవంతంగా చొప్పించినట్లుగా అనిపిస్తూ, సహజత్వం లోపించింది. సెకండాఫ్‌లో డ్రామా ఎక్కువైపోవడంతో సినిమా స్లోగా అనిపిస్తుంది. కథ కూడా ముందే ఊహించదగ్గ విధంగా సాగుతుంది.

నటీనటుల యాక్టింగ్‌లో కొన్ని సన్నివేశాల్లో ఓవర్ యాక్షన్ కనిపిస్తుంది.

మొత్తంగా చూస్తే… బ్యాండ్‌మేళం పాత ఫార్ములాతో వచ్చిన లవ్-కామెడీ ఫ్యామిలీ డ్రామాగా నిలిచింది. నవ్వుల కంటే గోల ఎక్కువగా అనిపించింది ఈ బ్యాండ్ మేళం చూస్తే...

5.0
out of 10

Average

బ్యాండ్ మేళం (Band Melam)

Band Melam Movie Review

Sakshi

By Sakshi

ఈ వీక్ రిలీజ్ అయిన బ్యాండ్‌మేళం సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను పొందుతోంది. కథ, కథనం పరంగా కొత్తదనం లేకుండా రొటీన్‌గా సాగిన ఈ చిత్రం, కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆ ప్రయత్నం పూర...

ఈ వీక్ రిలీజ్ అయిన బ్యాండ్‌మేళం సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను పొందుతోంది. కథ, కథనం పరంగా కొత్తదనం లేకుండా రొటీన్‌గా సాగిన ఈ చిత్రం, కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆ ప్రయత్నం పూర్తిగా ఫలించలేదనే చెప్పాలి. హర్ష రోషన్, శ్రీదేవి జంట మధ్య కెమిస్ట్రీ బాగున్నప్పటికీ… హీరో-హీరోయిన్ అనిపించే ఫీలింగ్ మాత్రం అంతగా రాలేదు. క్లైమాక్స్‌లో వచ్చే ప్రేమ ఎమోషన్స్ కొంతవరకు ఆకట్టుకుంటాయి. ఫ్యామిలీ సన్నివేశాలు కూడా సగటుగా అనిపిస్తాయి.


ఇక కామెడీ ట్రాక్స్ విషయానికి వస్తే… చాలా చోట్ల బలవంతంగా నెట్టినట్టుగా కనిపిస్తాయి. సహజత్వం లోపించి, కొన్ని సన్నివేశాలు విసుగును కలిగిస్తాయి. సెకండాఫ్‌లో డ్రామా మోతాదుకు మించి ఉండటం కూడా మైనస్‌గా మారింది. కథ ముందే ఊహించదగ్గ విధంగా సాగుతూ ఆసక్తిని తగ్గిస్తుంది. సాంకేతికంగా చూసినా… సౌండ్ డిజైన్ కొంత లౌడ్‌గా అనిపిస్తుంది. ట్రెండింగ్ పాటను చివర్లో ఉపయోగించిన తీరు కూడా నిరాశపరుస్తుంది. నటీనటుల ప్రదర్శనలో కొన్ని చోట్ల ఓవర్ యాక్టింగ్ కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే… బ్యాండ్‌మేళం సినిమా పాత ఫార్ములా లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కలగలిపిన సాధారణ చిత్రంగా నిలిచింది. నవ్వులకంటే గోలే ఎక్కువగా అనిపించే ఈ సినిమా, అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయింది.

5.0
out of 10

Average

బ్యాండ్ మేళం (Band Melam)

Band Melam Movie Review

ఈ వారం థియేటర్లలోకి వచ్చిన బ్యాండ్‌మేళం మూవీ టాక్ పరంగా పెద్దగా కొత్తదనం చూపించలేదు. రొటీన్ కథ, ఊహించదగ్గ సన్నివేశాలతో ముందుకు సాగిపోయింది. కామెడీ ట్రాక్ ఓకే అనిపించినా… ఎక్కువ భాగం బలవంతంగా నెట్టినట్...

ఈ వారం థియేటర్లలోకి వచ్చిన బ్యాండ్‌మేళం మూవీ టాక్ పరంగా పెద్దగా కొత్తదనం చూపించలేదు. రొటీన్ కథ, ఊహించదగ్గ సన్నివేశాలతో ముందుకు సాగిపోయింది. కామెడీ ట్రాక్ ఓకే అనిపించినా… ఎక్కువ భాగం బలవంతంగా నెట్టినట్టే ఫీల్ ఇస్తుంది. హర్ష రోషన్, శ్రీదేవి జంట మధ్య కెమిస్ట్రీ బాగానే ఉన్నా… హీరో-హీరోయిన్ ఫీల్ మాత్రం అంతగా వర్కౌట్ కాలేదు. క్లైమాక్స్ దగ్గర ఎమోషనల్ టచ్ కొంత మేర మెప్పిస్తుంది. ఫ్యామిలీ సీన్స్ కూడా అప్పుడప్పుడు ఓకే అనిపిస్తాయి.


అయితే సెకండాఫ్‌లో డ్రామా డోస్ ఎక్కువైపోయింది. కామెడీ, ఎమోషన్ రెండూ ఓవర్‌గా అనిపించడం మైనస్. చాలా సన్నివేశాలు సహజంగా కాకుండా ఆర్టిఫిషియల్‌గా కనిపిస్తాయి. ముఖ్యంగా బలవంతపు కామెడీ ట్రాక్స్ అసహనం కలిగిస్తాయి. మ్యూజిక్ పరంగా చివర్లో ట్రెండింగ్ సాంగ్ వాడిన విధానం కూడా సంతృప్తి ఇవ్వదు. సౌండ్ డిజైన్ కొన్ని చోట్ల లౌడ్‌గా అనిపిస్తుంది. నటీనటుల యాక్టింగ్ కూడా కొన్ని సన్నివేశాల్లో ఓవర్‌గా కనిపిస్తుంది. ఓవరాల్ గా బలం లేని కథా, కథనాల వల్ల రెండు గంటల సినిమా కూడా నాలుగు గంటల సినిమాల పరమ బోరింగ్ అనిపించింది.


3.0
out of 10

Not Good

బ్యాండ్ మేళం (Band Melam)

Band Melam Movie Review

ఈ వారం థియేటర్లలో విడుదలైన "బ్యాండ్‌మేళం" మూవీ టాక్ పరంగా రొటీన్ టాక్ తెచ్చుకోగా, కామెడీ పరంగా పర్లేదనిపించుకుంది. హర్ష రోషన్, శ్రీదేవి జంట కెమిస్ట్రీ బాగున్నా, హీరోహీరోయిన్ల ఫీల్ రాదు. క్లైమాక్స్ లో...

ఈ వారం థియేటర్లలో విడుదలైన "బ్యాండ్‌మేళం" మూవీ టాక్ పరంగా రొటీన్ టాక్ తెచ్చుకోగా, కామెడీ పరంగా పర్లేదనిపించుకుంది. హర్ష రోషన్, శ్రీదేవి జంట కెమిస్ట్రీ బాగున్నా, హీరోహీరోయిన్ల ఫీల్ రాదు. క్లైమాక్స్ లో వీరి లవ్‌ ఎమోషన్స్ కట్టిపడేస్తాయి. ఫ్యామిలీ సీన్లు ఫర్వాలేదనిపించాయి. కానీ కామెడీ డ్రామా ఓవర్‌ గా అనిపిస్తుంది. చాలా వరకు అసహజంగా అనిపిస్తుంది. బలవంతపు కామెడీ ట్రాక్‌ లు రోత పుట్టిస్తాయి.


సెకండాఫ్‌ లో డ్రామా కూడా ఓవర్‌ గా ఉంటుంది. చాలా వరకు రొటీన్‌గా, ఊహించినట్టుగానే ఉంటూ తేలిపోయింది. క్లైమాక్స్ కూడా సేమ్‌. ట్రెండింగ్‌ లో ఉన్న పాట చివర్లో రావడం, అది అలా ఇచ్చి ఇలా పోవడం నిరాశ పరుస్తుంది. ఇక సినిమాలో ఒరిజినాలిటీ కూడా మిస్‌ అయ్యింది. సౌండింగ్‌ కూడా కొంత ఇబ్బందిగా ఉంది. లౌడ్‌గా ఉంది. ఆర్టిస్ట్ ల యాక్టింగ్‌ కొన్ని చోట్ల ఓవర్‌గా అనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ బ్యాండ్ మేళంలో నవ్వులు తక్కువ, గోల ఎక్కువ. కోన వెంకట్‌ మార్క్ ఓల్డ్ ఫార్మూలా లవ్‌ కామెడీ ఫ్యామిలీ డ్రామా. 

5.0
out of 10

Average

బ్యాండ్ మేళం (Band Melam)

Band Melam Movie Review

"బ్యాండ్‌మేళం" మూవీ గురించి ఓవరాల్ గా చెప్పాలంటే.. సినిమాలో పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమి లేదని చెప్పాలి. ఎందుకంటే సినిమాకి కావాల్సినవి అన్నీ ఉన్నా, కొత్తదనం మాత్రం ఏం లేదు, కాబట్టి సగటు ప్రేక్షకుడు న...

"బ్యాండ్‌మేళం" మూవీ గురించి ఓవరాల్ గా చెప్పాలంటే.. సినిమాలో పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమి లేదని చెప్పాలి. ఎందుకంటే సినిమాకి కావాల్సినవి అన్నీ ఉన్నా, కొత్తదనం మాత్రం ఏం లేదు, కాబట్టి సగటు ప్రేక్షకుడు నిరుత్సాహపడతారు. పైగా ఒక ‘మ్యూజిక్ బ్యాండ్’ బ్యాక్‌డ్రాప్‌ లో వస్తున్న సినిమా అంటే ఆల్బమ్ చాలా స్ట్రాంగ్‌ గా ఉండాలి. కానీ విజయ్ బుల్గానిన్ సంగీతం ఏమంత ఆకట్టుకోలేదు.


డీఓపీ సతీష్ ముత్యాల కెమెరా వర్క్ పర్లేదు. ఎడిటింగ్ అయితే వీక్.. కానీ దర్శకుడి ఛాయిస్ కాబట్టి ఎడిటర్‌ను తప్పుబట్టలేం. నిర్మాణ విలువలు బాగున్నాయి.. దర్శకుడు సతీష్ జువ్వాజీ రాసుకున్న కథే మైనస్.. చాలా ఓల్డ్ స్టోరీ ఇది.. దాంతో ఎక్కడా మనోడి దర్శకత్వ ప్రతిభ చూపించేంత సన్నివేశాలు కూడా లేవు. ఓవరాల్ గా బ్యాండ్ మేళం ని ఒకసారి చూడడమే ఎక్కువ అనే భావన వస్తుంది. 


4.0
out of 10

Below Average

బ్యాండ్ మేళం (Band Melam)

Band Melam Movie Review

"బ్యాండ్‌మేళం" మూవీ గురించి ఓవరాల్ గా చెప్పాలంటే.. సరిగా వాయించలేదని అనిపిస్తుంది. గట్టిగా మోగాల్సిన ఈ బ్యాండ్‌మేళం రొటీన్ మేళం‌ అయ్యింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ & లవ్ స్టోరీ గా తెరకెక్కిన...

"బ్యాండ్‌మేళం" మూవీ గురించి ఓవరాల్ గా చెప్పాలంటే.. సరిగా వాయించలేదని అనిపిస్తుంది. గట్టిగా మోగాల్సిన ఈ బ్యాండ్‌మేళం రొటీన్ మేళం‌ అయ్యింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ & లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా బీలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కథ, కథనాల పరంగా దర్శకుడు సతీష్ జవ్వాజి నిరాశపరిచాడు. విజయ్ బుల్గానిన్ ఉన్నంతలో మ్యూజిక్ బాగానే అందించారు. 


తెలంగాణ నేటివిటీకి తగ్గట్టుగా ఉండే ట్యూన్స్, మాస్ బీట్స్, రీమిక్స్ పాటలు ఆకట్టుకున్నాయి. ‘తిప్పుకుంటున్నావ్’ సాంగ్ థియేటర్స్‌లో దద్దరిల్లింది. అయితే మ్యూజిక్‌తో సీన్‌ లను ఎలివేట్ చేసేటంత బలమైన, భావోద్వేగమైన సీన్లు ఇందులో లేకపోవడంతో విజయ్ బుల్గానిన్‌ కి పెద్దగా పని పడలేదేమో అనిపిస్తుంది. సతీష్ ముత్యాల కెమెరా వర్క్ బావుంది. ఓవరాల్ గా కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కి బ్యాండ్ మేళం అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. 

5.0
out of 10

Average

బ్యాండ్ మేళం (Band Melam)

Band Melam Movie Review

కోర్ట్ మూవీ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవి ఆపల్ల మరో సారి స్క్రీన్ మీదకు వచ్చిన సినిమా బ్యాండ్ మేళం. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ & లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా బీలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. క...

కోర్ట్ మూవీ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవి ఆపల్ల మరో సారి స్క్రీన్ మీదకు వచ్చిన సినిమా బ్యాండ్ మేళం. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ & లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా బీలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కథ, కథనాల పరంగా దర్శకుడు సతీష్ జవ్వాజి డిస్సపాయింట్ చేసాడు. కథలో కొత్తదనం లేకపోగా, కామెడీ వరకు పర్లేదనిపించింది.


ఓవరాల్‌ గా చూస్తే.. ‘బ్యాండ్ మేళం’ ఎలాంటి కొత్తదనం లేని రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక హర్ష్ రోషన్, శ్రీదేవి ఆపల్ల తమ పాత్రల్లో బాగా నటించినా, హీరో, హీరోయిన్లలా అనిపించలేదు. ఇక విజయ్ బుల్గానిన్ సంగీతం బాగుంది. అయితే రొటీన్ స్టోరీ లైన్, ఆకట్టుకోని సెకండాఫ్ మరియు ఎమోషన్ మిస్ కావడం ఈ సినిమాకు మేజర్ డ్రాబ్యాక్స్. రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడేవారికి ఈ సినిమా అంతగా కనెక్ట్ కాకపోవచ్చు.

5.0
out of 10

Average

Why MRO?