Register as a Reviewer
OM Shanti Shanti Shantihi (ఓం శాంతి శాంతి శాంతిః)

OM Shanti Shanti Shantihi (ఓం శాంతి శాంతి శాంతిః)

30 Jan 2026
Overall Rating
5.0/10
9 Reviews

దర్శక నటుడు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో, ఇషా రెబ్బ హీరోయిన్ గా నటించిన మూవీ "ఓం శాంతి శాంతి శాంతిః". ఎస్.ఆర్ సజీవ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి జె.క్రిష్ సంగీతం అందించాడు.

Director: A. R. Sajeev
Cast: Tharun Bhascker, Eesha Rebba, Brahmaji, Sivannarayana Naripeddi, Brahmanandam

Available in:

Reviews

What critics and the public are saying about OM Shanti Shanti Shantihi (ఓం శాంతి శాంతి శాంతిః)

Media Reviews

9 Avg: 5.0/10
Great Andhra
Great Andhra Website
5

Average

OM Shanti Shanti Shantihi Movie Review

రీమేక్ సినిమాలు ఈ మధ్య తెలుగు ఆడియన్స్ రిజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయినా సరే తెలుగు నేటివిటీ ఫ్లేవర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన రీమేక్ సినిమా ఓం శాంతి శాంతి శాంతిః. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ ఈ సినిమాలో భార్యాభర్తలుగా వాళ్ళ రోల్స్ లో ఇంప్రెస్ చేసారు. అలాగే ఫన్ ఎలిమెంట్స్ బాగున్నాయి. కాకపోతే స్...

రీమేక్ సినిమాలు ఈ మధ్య తెలుగు ఆడియన్స్ రిజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయినా సరే తెలుగు నేటివిటీ ఫ్లేవర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన రీమేక్ సినిమా ఓం శాంతి శాంతి శాంతిః. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ ఈ సినిమాలో భార్యాభర్తలుగా వాళ్ళ రోల్స్ లో ఇంప్రెస్ చేసారు. అలాగే ఫన్ ఎలిమెంట్స్ బాగున్నాయి. కాకపోతే స్టోరీలో కొత్తదనం లేదు కాబట్టి, ఒరిజినల్ చూసిన ఆడియన్స్ కి మళ్ళీ ఇది కనెక్ట్ అవడం కష్టమనే చెప్పొచ్చు. బట్ ఒరిజినల్ చూడని ఆడియన్స్ కి ఓ మోస్తరు నచ్చుతుంది. టెక్నికల్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. సినిమాలో గోదావరి యాసని నేటివిటీని చక్కగా చూపించడం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. బట్ ఆడియన్స్ సినిమాని థియేటర్లలో ఎంత వరకు ఆదరిస్తారనేది అసలు ప్రశ్న. ఓవరాల్ గా రెగ్యులర్ మూవీ లవర్స్ కూడా సినిమాని ఒకసారి చూడొచ్చు.

Jan 31, 2026 Watch
Thyview
Thyview Youtube Channel
5

Average

Om Shanti Shanti Shantihi Movie Review

మలయాళంలో సక్సెస్ అయిన 'జయ జయ జయ జయహే' సినిమాకి రీమేక్ గా వచ్చిన ఓం శాంతి శాంతి శాంతిః మూవీ ఒక రీమేక్ అయినా, తెలుగు నేటివిటీ కి తగ్గట్టు మార్చి ఆడియన్స్ ముందుకు తెచ్చారు కాబట్టి, ఆల్రెడీ చూసిన ఆడియన్స్ అంతగా ఈ సినిమాకు కనెక్ట్ కారని చెప్పాలి. కానీ రెగ్యులర్ మూవీ లవర్స్, టెక్నికల్ ఎలిమెంట్స్ కావాలనుకు...

మలయాళంలో సక్సెస్ అయిన 'జయ జయ జయ జయహే' సినిమాకి రీమేక్ గా వచ్చిన ఓం శాంతి శాంతి శాంతిః మూవీ ఒక రీమేక్ అయినా, తెలుగు నేటివిటీ కి తగ్గట్టు మార్చి ఆడియన్స్ ముందుకు తెచ్చారు కాబట్టి, ఆల్రెడీ చూసిన ఆడియన్స్ అంతగా ఈ సినిమాకు కనెక్ట్ కారని చెప్పాలి. కానీ రెగ్యులర్ మూవీ లవర్స్, టెక్నికల్ ఎలిమెంట్స్ కావాలనుకున్న ఆడియన్స్, అలాగే తెలుగు నేటివిటీ మూవీ లవర్స్ ఈ సినిమా ట్రై చేయొచ్చు. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ పెర్ఫార్మన్స్ లో నేచురాలిటీ కనిపిస్తుంది. వాళ్ళ రోల్స్ కోసం ఎఫర్ట్స్ బాగానే పెట్టారు. ఫన్ ఎలిమెంట్స్ కూడా ఇంప్రెస్ చేస్తాయి. బట్ మూవీ లో ఫ్రెష్ ఫీలింగ్ మిస్ అయింది. కొంచెం ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఓవరాల్ గా ఆడియన్స్ ఒకసారి ఫ్యామిలీతో ట్రై చేయొచ్చు. థియేటర్లలో ఈ సినిమా ఎంతవరకు నిలబడుతుందో అది ఆడియన్స్ చేతుల్లోనే ఉందని చెప్పాలి.

Jan 31, 2026 Watch
5

Average

Om Shanti Shanti Shantihi Movie Review

ఓం శాంతి శాంతి శాంతిః అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో వాళ్ళ ప్రయత్నం బాగానే ఉందని తెలుస్తుంది, కానీ దర్శకుడు ఏఆర్‌ సజీవ్‌ కథనం పరంగా హ్యాండిల్ చేయలేదని చెప్పాలి. అలాగే కామెడీని వర్కౌట్‌ చేయడంలో సక్సెస్‌ కాలేకపోయారు. సినిమా మొత్తాన్ని లైటర్‌ వేలో తీసుకె...

ఓం శాంతి శాంతి శాంతిః అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో వాళ్ళ ప్రయత్నం బాగానే ఉందని తెలుస్తుంది, కానీ దర్శకుడు ఏఆర్‌ సజీవ్‌ కథనం పరంగా హ్యాండిల్ చేయలేదని చెప్పాలి. అలాగే కామెడీని వర్కౌట్‌ చేయడంలో సక్సెస్‌ కాలేకపోయారు. సినిమా మొత్తాన్ని లైటర్‌ వేలో తీసుకెళ్లారు. ఎమోషన్స్ వర్కౌట్‌ కాలేదు. దీంతో పాటు సినిమాలో హీరోయిన్‌ పెయిన్‌ తెరపై హైలైట్‌ కాలేదు. ఫన్‌ చాలా చోట్ల తేలిపోయింది. కొన్ని చోట్ల మాత్రమే వర్కౌట్‌ అయ్యింది. అయితే అమ్మాయిల విషయంలో తాను చెప్పాలనుకున్న సందేశం బాగుంది. దాన్ని మరింత ఎఫెక్టీవ్‌గా, ఎమోషనల్‌గా చెబితే బాగా కనెక్ట్ అయ్యేది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. ఓవరాల్ గా మహిళల స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వానికి సంబంధించిన సందేశం విషయంలో సక్సెస్‌ అయిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేయడంలో, నవ్వించడంలో మాత్రం సక్సెస్‌ కాలేకపోయింది.

Jan 31, 2026 Read Review
A
AP7AM Website
5

Average

Om Shanti Shanti Shantihi movie review

ఈ మధ్య తెలుగులో రీమేక్ సినిమాలు తగ్గిపోయిన నేపథ్యంలో ఏడాది కింద అనౌన్స్ అయి తాజాగా రిలీజ్ అయిన సినిమా ఓం శాంతి శాంతి శాంతిః. అయితే ఈ సినిమా కొంచెం మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకుంది. అయితే తెలిసిన కథను మరింత ఆసక్తికరంగా వినోదాన్ని జోడించి తెరకెక్కిస్తే అలాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరించారు...

ఈ మధ్య తెలుగులో రీమేక్ సినిమాలు తగ్గిపోయిన నేపథ్యంలో ఏడాది కింద అనౌన్స్ అయి తాజాగా రిలీజ్ అయిన సినిమా ఓం శాంతి శాంతి శాంతిః. అయితే ఈ సినిమా కొంచెం మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకుంది. అయితే తెలిసిన కథను మరింత ఆసక్తికరంగా వినోదాన్ని జోడించి తెరకెక్కిస్తే అలాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరించారు. కానీ ఈ సినిమాలో రీమేక్‌ ను రీమేక్‌ గా ఆ చిత్రంలోని సహజత్వాన్ని ఆత్మను మిస్‌ అవ్వకుండా తీసినా ఆడియన్స్ కు ఆసక్తిగా అనిపించేంది. కానీ ' 'ఓం శాంతి శాంతి శాంతిః' విషయంలో ఆ ప్రయత్న లోపం కనిపించింది. అయితే ఒరిజినల్‌ వెర్షన్‌ చూడని వాళ్లకు మాత్రం ఈ సినిమా కొంత మేరకు సంతృప్తి పరుస్తుంది. కానీ పూర్తి స్థాయి సంతృప్తి, శాంతి మాత్రం కలగదు.

Jan 31, 2026 Read Review
N
5

Average

Om Shanti Shanti Shantihi Movie Review

కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఓం శాంతి శాంతి శాంతిః సినిమాలో చేపల వ్యాపారిగా, భార్య చేతిలో తన్నులు తినే అహంకారి అయిన భర్తగా తరుణ్ భాస్క‌ర్‌ అద్భుతమైన నటన కనబరిచారు. ఆయన కామెడీ టైమింగ్ సినిమాకు పెద్ద అసెట్ అని చెప్ప‌వ‌చ్చు. శాంతి పాత్రలో ఈషా ఒదిగిపోయారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో...

కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఓం శాంతి శాంతి శాంతిః సినిమాలో చేపల వ్యాపారిగా, భార్య చేతిలో తన్నులు తినే అహంకారి అయిన భర్తగా తరుణ్ భాస్క‌ర్‌ అద్భుతమైన నటన కనబరిచారు. ఆయన కామెడీ టైమింగ్ సినిమాకు పెద్ద అసెట్ అని చెప్ప‌వ‌చ్చు. శాంతి పాత్రలో ఈషా ఒదిగిపోయారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో ఆమె పర్ఫార్మెన్స్ సర్ ప్రైజ్ చేస్తుంది. ఇక బ్రహ్మాజీ, బ్రహ్మానందం తమ మార్కు మేనరిజమ్స్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. సాంకేతికంగా, జె క్రిష్ సంగీతం, బీజీఎమ్ కంటెంట్ కి తగ్గట్టుగా ఉంది. గోదావరి అందాలను కెమెరాలో బంధించిన తీరు బాగుంది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. అయితే ఒరిజినల్ చూడని వారికే ఇది బాగా నచ్చుతుంది. ఒరిజినల్ చూసి ఉన్నా కూడా మన నేటివిటీ కోసం ఒకసారి చూడొచ్చు.

Jan 31, 2026 Read Review
ABP Desam
ABP Desam Website
5

Average

Om Shanti Shanti Shantihi Movie Review

ఓం శాంతి శాంతి శాంతిః అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాలో గోదావరి యువకుడిగా తరుణ్ భాస్కర్ ఒదిగిపోయారు. నటనలో ఈషా రెబ్బాను తప్పు పట్టలేం. కానీ, శాంతి పాత్రకు ఆవిడ మిస్ మ్యాచ్. సెకండాఫ్ నుంచి తన ఇమేజ్ మ్యాచ్ చేసే రోల్ కావడంతో ఆయా సన్నివేశాల్లో బాగా చేశారు. బ్రహ్మజీ, బ్రహ్మానందం పాత్రలు నవ్వించాయి....

ఓం శాంతి శాంతి శాంతిః అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాలో గోదావరి యువకుడిగా తరుణ్ భాస్కర్ ఒదిగిపోయారు. నటనలో ఈషా రెబ్బాను తప్పు పట్టలేం. కానీ, శాంతి పాత్రకు ఆవిడ మిస్ మ్యాచ్. సెకండాఫ్ నుంచి తన ఇమేజ్ మ్యాచ్ చేసే రోల్ కావడంతో ఆయా సన్నివేశాల్లో బాగా చేశారు. బ్రహ్మజీ, బ్రహ్మానందం పాత్రలు నవ్వించాయి. సురభి ప్రభావతి, శివన్నారాయణ, బిందు చంద్రమౌళి తదితరులు ఓకే. పెళ్ళైన తర్వాత భర్త నుంచి భార్యలు ఏం కోరుకుంటున్నారు? సంసార జీవితం ఎలా ఉండాలని ఆశిస్తున్నారు? అనేది చెప్పే సినిమా 'ఓం శాంతి శాంతి శాంతిః'. సందేశానికి సున్నితమైన హాస్యం మేళవించి చెప్పాలని ప్రయత్నించారు. అటు సందేశం, ఇటు వినోదం... రెండింటిలోనూ ప్రేక్షకులకు చేరాల్సినంత మోతాదు లేదు. చేపల పులుసు చప్పగా సాగింది. ఒరిజినల్ చూడని ప్రేక్షకులు అసలు అంచనాలు పెట్టుకోకుండా వెళితే కాస్త ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది.

Jan 31, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
5

Average

Om shanti shanti shantihi movie review

తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బ ప్రధాన పాత్రలో నటించిన సినిమా "ఓం శాంతి శాంతి శాంతిః. ఎస్. ఆర్. రాజీవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయి ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇక మూవీ విషయానికి వస్తే.. గోదావరి నేటివిటితో సాగే ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామా, గోదావరి యాస ఈ సినిమాకు అదనపు...

తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బ ప్రధాన పాత్రలో నటించిన సినిమా "ఓం శాంతి శాంతి శాంతిః. ఎస్. ఆర్. రాజీవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయి ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇక మూవీ విషయానికి వస్తే.. గోదావరి నేటివిటితో సాగే ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామా, గోదావరి యాస ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ఒరిజినల్‌గా మలయాళం సినిమా అయినప్పటికీ.. తెలుగు నెటివిటీకి అనుగుణంగా అనేక మార్పులు చేశారు. ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాలకు నచ్చుతుంది. వినోద ప్రధానంగా సాగే ఈ సినిమాలో భావోద్వేగాలు కూడా ఉన్నాయి. బీ, సీ ఆడియెన్స్‌తోపాటు మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌కు నచ్చితే.. ఈ సినిమా విజయాన్ని అందుకునే అవకాశం ఉంది. కానీ మెజారిటీ ఆడియన్స్ ఒరిజినల్ చూసేసారు కాబట్టి, ఈ సినిమాని ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.

Jan 31, 2026 Read Review
Samayam Telugu
Samayam Telugu Website
5

Average

Om Shanti shanti shantihi Movie Review

ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా 'ఓం శాంతి శాంతి శాంతిః'. తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మలయాళం సినిమాకి రీమేక్ గా తెరకెక్కగా, ఒక రీమేక్ ని దర్శకుడు బాగానే హ్యాండిల్ చేసాడని చెప్పాలి. ఒరిజినల్ చూడని ఆడియన్స్ కి బాగానే 'ఓం శాంతి శాంతి శాంతిః' నచ్చే అవకాశం ఉందని చెప్పాలి....

ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా 'ఓం శాంతి శాంతి శాంతిః'. తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మలయాళం సినిమాకి రీమేక్ గా తెరకెక్కగా, ఒక రీమేక్ ని దర్శకుడు బాగానే హ్యాండిల్ చేసాడని చెప్పాలి. ఒరిజినల్ చూడని ఆడియన్స్ కి బాగానే 'ఓం శాంతి శాంతి శాంతిః' నచ్చే అవకాశం ఉందని చెప్పాలి. సినిమా నేటివిటీతో పాటు బీజీఎమ్, మ్యూజిక్ ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది. కానీ ఒరిజినల్ చూసిన వాళ్లకి కనెక్ట్ కావడం కష్టం. సినిమాలో కొన్ని డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటాయి. సమరంతో సాధించలేనిది సరసంతో సాధించాలి, నేను అనవసరం అనుకున్న మనుషుల మధ్య నా అవసరం ఇక లేదు, ఒక భర్త దగ్గరి నుంచి భార్య కోరుకునేది స్వేచ్ఛ, స్వతంత్రం, సమానత్వం.. ఇలాంటి కొన్ని డైలాగులు కథకి తగ్గట్లుగా బాగా రాసుకున్నారు. ఓవరాల్‌గా రీమేక్ అయినా కూడా తరుణ్-ఈషా నటనతో సినిమాని నడిపించారు. కానీ ఆడియన్స్ చేతిలోనే ఫలితం ఉంటుంది.

Jan 30, 2026 Read Review
123telugu
123telugu Website
5

Average

Om Shanti shanti shantihi Movie Review

తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బ ప్రధాన పాత్రలో నటించిన 'ఓం శాంతి శాంతి శాంతిః' ఒక ఫన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కగా రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ని అంతగా మెప్పించడం లేదు. ఆల్రెడీ తెలుగులో స్ట్రీమింగ్ లో ఉన్న సినిమాకి రీమేక్ కావడంతో మెజారిటీ ఆడియన్స్ ఒరిజినల్ నే ఇష్టపడి ఈ సిని...

తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బ ప్రధాన పాత్రలో నటించిన 'ఓం శాంతి శాంతి శాంతిః' ఒక ఫన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కగా రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ని అంతగా మెప్పించడం లేదు. ఆల్రెడీ తెలుగులో స్ట్రీమింగ్ లో ఉన్న సినిమాకి రీమేక్ కావడంతో మెజారిటీ ఆడియన్స్ ఒరిజినల్ నే ఇష్టపడి ఈ సినిమాని పట్టించుకోవడం లేదు. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బాల పెర్ఫార్మన్స్ బాగున్నా, టెక్నికల్ గానూ ఇంప్రెస్ చేసినా, స్లో నేరేషన్ వల్ల ఆడియన్స్ ని ఆకట్టుకోవడం లేదు. అయితే తెలుగు నేటివిటీ ఇష్టపడే ఆడియన్స్ కి, రెగ్యులర్ సినిమాలు ఎక్కువగా చూసే ఆడియన్స్ ఈ సినిమాను ఒక్కసారి చూడొచ్చు. కానీ ఒరిజినల్ ని చూసి ఈ సినిమాని చూస్తే అసలు నచ్చకపోవచ్చు.

Jan 31, 2026 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

చేపల చెరువు బిజినెస్ చేసే ఓంకార్ నాయుడు (తరుణ్ భాస్కర్) ఒక అహంకారం కలిగిన వ్యక్తి. జీవితంలో స్థిరపడ్డాక ఒక రకమైన కోపిష్టిలా తయారవుతాడు. ఇక మరోవైపు జీవితంలో స్వేచ్ఛ లేని ప్రశాంతి (ఈషా రెబ్బా) ఎదుగుదల కోసం మంచి జీవితం కోసం ఆరాటపడుతుంది. ఈ క్రమంలో తన కలలను పక్కనపెట్టి పెద్దలు కుదిర్చిన సంబంధం ఒకే చేసి ఓంకర్ నాయుడుని పెళ్లి చేసుకుంటుంది. అయితే గర్విష్టి అయిన ఓంకార్ భార్యని పెద్దగా పట్టించుకోడు. అన్నింట్లోనూ అజమాయిషీ చలాయిస్తాడు. ఈ క్రమంలో కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఓంకార్ పెట్టే వేధింపులను తట్టుకుని ఓపిక నశించి, తన భర్త అహంకారాన్ని ప్రశాంతి ఎలా అణిచివేసి, అతనికి ఎలా బుద్ధి చెప్పింది? చివరికి వీరి వివాహబంధం నిలబడిందా లేదా? అనేది చిత్ర కథ. 

సినిమా కథ విషయానికి వస్తే... ఈ మధ్య ప్రతి ఇళ్లలో జరిగే కథే ఇది. భార్యాభర్తల మధ్య ఉండే మనస్పర్థలు, గొడవలు ఇందులో మరీ సీరియస్ గా కాకుండా కాస్త వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేసారు మేకర్స్. అలాగే సినిమాకు ఎంచుకున్న గోదావరి నేటివిటి మంచి ఫ్రెష్ ఫీల్ ని ఇస్తుంది. నటన పరంగా తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బ తమదైన శైలిలో మెప్పించారు. కీలక పాత్రల్లో నటించిన బ్రహ్మానందం, సురభి ప్రభావతి, రోహిణి నోని, బ్రహ్మాజీ వారి పాత్రల పరిధిమేరకు బాగా నటించారు.

Technical Values : అయితే మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే... ఈ సినిమా జయజయజయహే అనే మలయాళ సినిమాకి రీమేక్. లాక్ డౌన్ లో ఆ సినిమా తెలుగు వెర్షన్ ని ఓటిటి లో మెజారిటీ ఆడియన్స్ చూసేసారు. కనుక వారికి మళ్ళీ ఈ సినిమా నచ్చడం కష్టం. అలాగే ఓం శాంతి శాంతి శాంతిః కథ బాగున్నా, దానికి తగ్గ సరైన కథనాన్ని దర్శకుడు రాసుకోలేకపోయాడు. టెక్నికల్ గా చూస్తే, బీజీఎమ్, పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది, కానీ అనవసరమైన కొన్ని సన్నివేశాల్ని ఎడిట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Final Review :

ఫైనల్ గా ‘ఓం శాంతి శాంతి శాంతిః' సినిమా ఒక డీసెంట్ ఫ్యామిలీ  ఎమోషనల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ని కొంతవరకు మెప్పిస్తుందని చెప్పొచ్చు. అయితే చాలా వరకు రెగ్యులర్ సీన్స్  చూసినట్టే ఉండడంతో అవే సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఒరిజినల్ ని చూడని ఆడియన్స్ ఈ సినిమాని కొంతవరకు ఎంజాయ్ చెయ్యొచ్చు.

Review Statistics

5.0
Overall Rating
Avg. of all reviews
9
Total Reviews
From 2 Provider Types

Review Average

Media
5.0/10
Public
N/A