జెట్లీ (Jetlee)
కమెడియన్ సత్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "జెట్లీ". మత్తు వదలరా ఫేమ్ 'రితేష్ రానా' దర్శకత్వం వహించిన ఈ సినిమా కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Available in:
Reviews
What critics and the public are saying about జెట్లీ (Jetlee)
Media Reviews
6 Avg: 4.3/10Not Good
Jetlee Movie Review
ప్రజాపతి బ్యాంక్ దివాళాతో జెట్లీ సినిమాను ఆరంభించిన దర్శకుడు రితేష్ రానా.. ప్రారంభంలో ఆసక్తికరంగా కథను చెప్పే ప్రయత్నం చేశాడనే ఫీలింగ్ కలుగుతుంది. కథ సాగుతున్న కొద్ది సన్నివేశాల్లో పసలేదనే విషయం సినిమా ఆరంభమైన కొద్ది సేపటికే అర్ధమవుతుంది. పొంతనలేని కథనం, అర్ధపర్థం లేని డైలాగ్స్, అసందర్భంగా సాగే కామె...
ప్రజాపతి బ్యాంక్ దివాళాతో జెట్లీ సినిమాను ఆరంభించిన దర్శకుడు రితేష్ రానా.. ప్రారంభంలో ఆసక్తికరంగా కథను చెప్పే ప్రయత్నం చేశాడనే ఫీలింగ్ కలుగుతుంది. కథ సాగుతున్న కొద్ది సన్నివేశాల్లో పసలేదనే విషయం సినిమా ఆరంభమైన కొద్ది సేపటికే అర్ధమవుతుంది. పొంతనలేని కథనం, అర్ధపర్థం లేని డైలాగ్స్, అసందర్భంగా సాగే కామెడీతో అనుక్షణం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా మూవీ సాగుతుంది. ఫస్టాఫ్ ముగిసే సమయానికే ఈ సినిమా గమ్యం లేని ఫ్లయిట్ దారి తప్పినట్టుగా అనిపిస్తుంది.
ఇక కథలో బలం, కథనం పేలవంగా ఉండటంతో సత్య లాంటి కమెడియన్ ఎఫర్ట్స్ కూడా వేస్ట్ అయ్యాయనేది స్పష్టంగా కనిపిస్తుంది. నాసిరకమైన స్క్రిప్టును కూడా సత్య తన పెర్ఫార్మెన్స్‌తో నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నాలు దారుణంగా విఫలమయ్యాయి. ఏ పాత్ర కూడా ఆడియెన్స్ ను కనెక్ట్ చేసే విధంగా లేకపోవడం వల్ల అజయ్, కబీర్ సింగ్, రియా సింఘా, వెన్నెల కిషోర్ లాంటి యాక్టర్ల నటన నామమాత్రంగానే మిగిలిపోయిందని చెప్పాలి. ఉన్నంతలో కాలభైరవ తన మ్యూజిక్‌తో కొంత బెటర్‌గా అనిపిస్తాడు. ఎడిటింగ్ ఇంకాస్త చేయాల్సింది. ఈ సినిమాలో థియేట్రికల్ వాల్యూ ఎక్కడా కనిపించదు. కనీసం ఓటీటీలోనైనా ప్రేక్షకులను మెప్పించే సరుకు సినిమాలో కనిపించదు. కాబట్టి ఈ సినిమా తలరాత ఏమిటో మీకే అర్ధం అయి ఉంటుందనుకొంటా.
Average
Jetlee Movie Review
జెట్‌లీ’ అనే సినిమా ఒక ప్రశ్నతో మొదలవుతుంది… “సినిమా అంటే కేవలం కథనా? లేక అనుభవమా?” దర్శకుడు Ritesh Rana ఈ చిత్రంతో కథను చెప్పడం కంటే… ఒక గందరగోళాన్ని అనుభవంగా చూపించాలని ప్రయత్నించినట్టు కనిపిస్తుంది. హీరో Satya ఎదుర్కొనే గందరగోళం… అదే ఆడియెన్స్‌కి కూడా ఫీల్ ఇస్తుంది. పైగా ఇది మాములు ప్రయోగం కాదు…...
జెట్‌లీ’ అనే సినిమా ఒక ప్రశ్నతో మొదలవుతుంది… “సినిమా అంటే కేవలం కథనా? లేక అనుభవమా?” దర్శకుడు Ritesh Rana ఈ చిత్రంతో కథను చెప్పడం కంటే… ఒక గందరగోళాన్ని అనుభవంగా చూపించాలని ప్రయత్నించినట్టు కనిపిస్తుంది. హీరో Satya ఎదుర్కొనే గందరగోళం… అదే ఆడియెన్స్‌కి కూడా ఫీల్ ఇస్తుంది. పైగా ఇది మాములు ప్రయోగం కాదు… లీనియర్ నేరేషన్‌కి విరుద్ధంగా, విభిన్నమైన నిర్మాణం. కానీ ఈ ప్రయోగం అందరికీ చేరువ అవుతుందా? అనేది ప్రశ్న.
సింపుల్ గా చెప్పాలంటే సినిమా 90 శాతం బొక్క కూడా అర్ధం కాదు అన్నట్టుంటుంది. అలాగే సత్య తన నటనతో, టైమింగ్‌తో కొన్ని క్షణాల్లో మెరిసినా… మొత్తం సినిమాను తన భుజాలపై మోసే స్థాయికి అది చేరలేదు. ఓవరాల్ గా ఎంటర్టైన్మెంట్ తో ఒకే అనిపించేలా ఉంది గాని, థియేటర్లను ఆడియన్స్ ను రప్పిస్తుందా అంటే కష్టమే అనిపిస్తుంది. ఓవరాల్ గా జెట్లీ సత్య, రితేష్ రానా మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి చూడొచ్చు. మిగతా వాళ్ళు కష్టమే.
Average
Jetlee movie Review
‘జెట్‌లీ’ సినిమా చూసాక ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే — “బాస్… మనం ఏమి చూశాం?” స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఇదొక కన్ఫ్యూజన్ రైడ్. హీరో Satya ఎలా కన్ఫ్యూజ్ అవుతాడో… ఆడియెన్స్ కూడా అలాగే ఫీలవుతారు. అసలు కథ ఏంటి? కామెడీనా? థ్రిల్లరా? లేక ఏదైనా ఎక్స్‌పెరిమెంట్ ఆ? అన్నది అర్థం కాకుండా పోతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం రకరకాల...
‘జెట్‌లీ’ సినిమా చూసాక ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే — “బాస్… మనం ఏమి చూశాం?” స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఇదొక కన్ఫ్యూజన్ రైడ్. హీరో Satya ఎలా కన్ఫ్యూజ్ అవుతాడో… ఆడియెన్స్ కూడా అలాగే ఫీలవుతారు. అసలు కథ ఏంటి? కామెడీనా? థ్రిల్లరా? లేక ఏదైనా ఎక్స్‌పెరిమెంట్ ఆ? అన్నది అర్థం కాకుండా పోతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం రకరకాల పేర్లు, ఫ్లాష్ బ్యాక్స్, సీన్స్… ఇవన్నీ కలిపి ఒక మిక్స్డ్ ప్లేటర్ లా ఉంటుంది. నవ్వాలా? సీరియస్ గా తీసుకోవాలా? అన్న డౌట్ ఆడియెన్స్ కి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఫ్లైట్ లో చిక్కుకున్నట్టు సినిమా మొత్తం థియేటర్‌లో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది.
డైరెక్టర్ Ritesh Rana కొత్త స్టైల్ లో నెరేషన్ ట్రై చేశాడు. కానీ అది స్క్రీన్‌పై వర్క్ అవ్వలేదనే ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్‌కి దగ్గరగా వచ్చాక ఇది రివేంజ్ డ్రామా అని క్లియర్ అవుతుంది… కానీ అప్పటికి ఆడియెన్స్ కనెక్షన్ మిస్ అయిపోయే ఛాన్స్ ఉంది. సత్య కామెడీ, వన్ లైనర్స్ కొన్ని చోట్ల వర్క్ అవుతాయి. కానీ ఫుల్ మూవీని మోయడానికి మాత్రం సరిపోలేదు. ఓవరాల్ గా కొంచెం కొత్తదనం ట్రై చేశారు… కానీ ఎంటర్టైన్‌మెంట్ మాత్రం మిస్సయ్యింది.
Below Average
Jetlee movie Review
‘మత్తువదలరా’తో సత్యలోని టైమింగ్‌ను రితేష్ రానా అద్భుతంగా వాడుకున్నాడు. రితేష్ రానా మేకింగ్, స్క్రీన్ ప్లే, స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే అదే రితేష్ రానా ఇప్పుడు సత్యని హీరోగా పెట్టి ‘జెట్‌లీ’ అని మూవీని తీశాడు. తాజాగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా బీలో యావరేజ్ రెస్పాన...
‘మత్తువదలరా’తో సత్యలోని టైమింగ్‌ను రితేష్ రానా అద్భుతంగా వాడుకున్నాడు. రితేష్ రానా మేకింగ్, స్క్రీన్ ప్లే, స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే అదే రితేష్ రానా ఇప్పుడు సత్యని హీరోగా పెట్టి ‘జెట్‌లీ’ అని మూవీని తీశాడు. తాజాగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. కథా కథనాల పరంగా ఈసారి దర్శకుడు రితేష్ రానా డిస్సపాయింట్ చేసారు. నటీనటులందరూ బాగానే పెర్ఫార్మ్ చేసినా, మెయిన్ కథను వదిలేసారు.
ఇక టెక్నికల్ గా చూసుకుంటే జెట్‌లీ కి చాలా తక్కువ బడ్జెట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఆ ఫ్లైట్, వీఎఫ్ఎక్స్ ఇవన్నీ చాలా నాసిరకంగా కనిపిస్తాయి. ఆర్ఆర్ చాలా చోట్ల వర్కౌట్ అయింది. ఆర్ఆర్‌తోనే చాలా వరకు నవ్వించే ప్రయత్నం చేశారు. మాటలు చాలా వరకు మీమ్స్ రిఫరెన్స్‌లానే అనిపిస్తాయి. చాలా సినిమాల మీద కౌంటర్లు వేసినట్టుగా అనిపిస్తుంది. పెట్టిన ఖర్చుకి, తీసిన అవుట్‌పుట్‌కి వచ్చే ఫలితానికి సంబంధం ఉండకపోవచ్చేమో. సత్య, వెన్నెల కిషోర్ ఉన్నారు.. వారిద్దరూ చూసుకుంటారు.. నవ్విస్తారు.. ఎంటర్టైన్ చేస్తారు.. పైగా రితేష్ రానా.. అని ఎక్కువగా ఆశించి వస్తే మాత్రం ఆడియెన్స్ భంగపడతారు. ఓవరాల్ గా జెట్‌లీ చూస్తే థియేటర్స్‌లో ప్రేక్షకుల ఆర్తనాదాలు అని చెప్పుకోవచ్చు.
Average
Kara movie Review
కమెడియన్ సత్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "జెట్లీ". మత్తు వదలరా ఫేమ్ 'రితేష్ రానా' దర్శకత్వం వహించిన ఈ సినిమా కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆడియన్స్ నుండి బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది జెట్లీ. సినిమా కథ కథనాల పరంగా కూడా అంతగా మంచి రెస్పాన్స్ అందుకో...
కమెడియన్ సత్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "జెట్లీ". మత్తు వదలరా ఫేమ్ 'రితేష్ రానా' దర్శకత్వం వహించిన ఈ సినిమా కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆడియన్స్ నుండి బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది జెట్లీ. సినిమా కథ కథనాల పరంగా కూడా అంతగా మంచి రెస్పాన్స్ అందుకోలేకపోయింది. కాల భైరవ మ్యూజిక్ బీజీఎమ్ బాగుంది.
ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టైతే ఈ ‘జెట్ లీ’ సినిమా స్ట్రిక్ట్ గా కొన్ని చోట్ల మాత్రమే నవ్వించే కామెడీ ఫ్లిక్ అని చెప్పొచ్చు. సత్య, వెన్నెల కిషోర్ లతో రితేష్ ప్లాన్ చేసిన కామెడీ ట్రాక్స్ పర్వాలేదు అనిపిస్తాయి కానీ కథనం మాత్రం ప్యాకెడ్ గా లేదు. దర్శకుడు ఈ విషయంలో మరింత కేర్ తీసుకోవాల్సింది. సో కొన్ని చోట్ల నవ్వించినా కొన్ని చోట్ల మాత్రం బోర్ కొట్టిస్తుంది. తక్కువ అంచనాలతో చూస్తే ఒకసారి ఆడియన్స్ ని మెప్పించే అవకాశం ఉంది.
Below Average
Jetlee movie Review
సత్య మెయిన్ లీడ్ లో నటించిన ‘జెట్లీ’ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు రాగా, ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. కథా కథనాల పరంగా ఈసారి దర్శకుడు రితేష్ రానా పెద్దగా ఫోకస్ చేయలేదని తెలుస్తుంది. ఎంటర్టైన్మెంట్ పరంగా బాగానే ఉన్నా, ప్రతి ఆడియన్ ఎంతో కొంత కథను ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇందులో అంత ఏమి క...
సత్య మెయిన్ లీడ్ లో నటించిన ‘జెట్లీ’ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు రాగా, ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. కథా కథనాల పరంగా ఈసారి దర్శకుడు రితేష్ రానా పెద్దగా ఫోకస్ చేయలేదని తెలుస్తుంది. ఎంటర్టైన్మెంట్ పరంగా బాగానే ఉన్నా, ప్రతి ఆడియన్ ఎంతో కొంత కథను ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇందులో అంత ఏమి కనిపించలేదు. ఇక సాంకేతికంగా చూస్తే పాటలు లేని ఈ సినిమాలో కాలభైరవ బీజీఎమ్తో కొంత వరకు మెప్పించాడు. రితేష్ రాణా శైలికి తగ్గట్లే అతను ఆర్ఆర్ ఇచ్చాడు.
సురేష్ సారంగం ఛాయాగ్రహణం బాగానే సాగింది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. ఆర్ట్ వర్క్ బాగా చేశారు. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. ఇక జయేంద్రతో కలిసి రితేష్ రాణా రాసిన కథలో పెద్దగా విషయం లేదు. స్క్రీన్ ప్లే తో మాయ చేయాలని చూసినా.. అది వర్కవుట్ కాలేదు. రితేష్ డైలాగులు మాత్రం ఆకట్టుకుంటాయి. తన రైటింగ్-టేకింగ్ లో తన సెన్సాఫ్ హ్యూమర్ కొన్ని చోట్ల కనిపించింది కానీ.. అందులో నిలకడ లేకపోయింది. సరైన కామెడీ సిచువేషన్లు క్రియేట్ చేయకపోవడంతో రితేష్ తనపై పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయాడు. ఓవరాల్ గా జెట్లీ.. అంచనాలను కుదిపేశాడు.
Public Reviews
Avg: —No public reviews yet.
About This Movie
కథ విషయానికి వస్తే... ఇండియాలో ప్రముఖ "ప్రజాపతి" బ్యాంకు యజమాని ప్రజాపతి (అజయ్) తన బ్యాంకు ద్వారా పదిహేను వేల కోట్లు దివాళా తీసి దుబాయ్ పారిపోతాడు. అయితే ఇండియా నుండి వెళ్లిన స్పెషల్ ఏజెంట్ ఆఫీసర్ శివానీ రాయ్ (రియా సింఘా) ప్రజాపతిని అరెస్ట్ చేసి ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నంలో వాళ్ళు వచ్చే ఫ్లైట్ హైజాక్ కి గురవుతుంది. నిజానికి ఇది సెంట్రల్ మినిష్టర్ మేల్కొటే (వడ్లమాని శ్రీనివాసరావు) ప్రజాపతిని చంపడానికి వేసిన హైజాక్ ప్లాన్. ఈ క్రమంలో అదే ఫ్లైట్ లో ఉన్న డాక్టర్ వేద వ్యాస్ (సత్య) కొన్ని నాటకీయ పరిణామాలతో ఈ ఆపరేషన్ లోకి ఎంటర్ అవుతాడు. మతిమరపు ఉన్న వేదవ్యాస్ ఈ ఫ్లైట్ లో ఎందుకు ఉన్నాడు? కేంద్రమంత్రికి ప్రజాపతికి ఉన్న లింక్ ఏంటి? ప్రజాపతిని తీసుకొచ్చే సీక్రెట్ మిషన్ లో వేదవ్యాస్ పాత్ర ఏంటి? అసలు జెట్లీ ఎవరు? చివరికి ప్రజాపతిని ఇండియాకి తీసుకొచ్చారా లేదా అనేది మిగిలిన స్టోరీ.
ఇక జెట్లీ సినిమా విషయానికి వస్తే... దర్శకుడు రితేష్ రానా గత సినిమాల లాగే ఈ సినిమాను ఫక్తు కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఇక కమెడియన్ కం హీరో సత్య సినిమాని వన్ మ్యాన్ షోగా నడిపించి ఎంటర్టైన్ చేశాడు. కొన్ని లెంగ్తి డైలాగ్స్ తన వరకు పూర్తి న్యాయం చేసాడు. కామెడీ కూడా రితేష్ రానా స్టయిల్లో చాలా ట్రెండీగా ఉండి ఆకట్టుకుంటుంది. అలాగే వెన్నెల కిషోర్, అజయ్, రియా వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక కథనం అంతా ఫ్లైట్ లోనే జరగ్గా, ఆ అట్మాస్పియర్ బాగా కనిపిస్తుంది.
అయితే ఇందులో ఈ సారి కథ, కథనాలపై దర్శకుడు పెద్దగా ఫోకస్ చేయలేదని అనిపిస్తుంది. ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే సరైన కథ కూడా లేదన్న భావన కలుగుతుంది. అలాగే సెకండ్ హాఫ్ ల్యాగ్ ఎక్కువైంది. అందువల్ల ఆడియన్స్ కి బోర్ ఫీల్ వచ్చేస్తుంది.
ఇక టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే... దర్శకుడు ఈసారి స్క్రీన్ ప్లే విషయంలో తడబడ్డాడు. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం రిచ్ గా ఉన్నాయి. విఎఫ్ఎక్స్ వర్క్ కూడా బాగుంది. అలాగే కాలభైరవ బీజీఎమ్ కూడా మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. అయితే ఎడిటింగ్ విషయంలో అక్కడక్కడా కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేయాల్సింది. దర్శకుడు రితేష్ రానా కామెడీ బాగున్నా, కథ బలంగా రాసుకోవాల్సింది.